గ్రహాలకు మిత్ర, శతృ, సమత్వాల పరిశీలన శుభ్ర గ్రహములు : గురువు, శుక్రుడు , పూర్ణ చంద్రుడు, బుధుడు(శుభులతో కలసిన శుభుడు) పాప గ్రహములు: రవి, కుజ, శని, రాహు, కేతువు, క్షీణ చంద్రుడు, బుధుడు(పాపులతో కలసిన పాపి). 1) రవికి - చం, కు, గురువులు మిత్రులు : బుధుడు సముడు : శని, శుక్రులు శత్రువులు. 2) చంద్రునకు - రవి, బుధులు మిత్రులు : మిగిలిన వారు బుధ, గురువు, శని, శుక్రులు సములు, శత్రువులు లేరు. 3) కుజునకు - రవి, చంద్ర, గురువులు మిత్రులు : బుధుడు శత్రువు: శని, శుక్రులు సములు. 4) బుధునకు - రవి, శుక్రులు మిత్రులు : చంద్రుడు శత్రువు: కుజ, గురు, శనులు సములు. 5) గురునకు - రవి, చంద్ర కుజులు మిత్రులు : శుక్ర, బుధులు శత్రువులు : శని సముడు. 6) శుక్రునకు - శని, బుధులు మిత్రులు : కుజ, గురులు సములు: రవి, చంద్రుడు శత్రువులు. 7) శనినకు: శుక్ర, బుధులు మిత్రులు : రవి, చంద్ర, కుజులు శత్రువులు : గురుడు సముడు. చంద్రుడికి శత్రువులు లేరు. గురువు ఎవరికి శత్రువు కాదు. కొన్ని అనుమానాలు 1) రవికి - చం, కు, గురువులు మిత్రులు : బుధుడు సముడు : శని, శుక్రులు శత్రువులు. * రవి, శనులు పాపులు కదా పాపులు శత్రువులు ఎలా అయ్యారు? * బ...