ఆషాఢ అమావాస్య:
ఆషాఢ అమావాస్య: ఆషాఢ మాసపు అమావాస్యను నక్షత్ర అమావాస్య, చుక్కల అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య నాడు దేవతలను ఒక్కసారి తలచినా, పూజించినా వేయి జన్మలు విడువకుండా అర్చించిన ఫలితం లభిస్తుంది. పితృశ్రాద్ధం, దానం, హోమం చేస్తే అక్షయఫలం లభిస్తుంది. పితృదేవతలు సోమపథం అనే లోకంలో నివసిస్తుంటారు. వీరంతా మరీచి అనబడే ప్రజాపతి కుమారులు. వీరికి అగ్నిష్వాత్తులు అని పేరు. వీరి మానసపుత్రిక పేరు అచ్ఛోద. ఈమె నదీరూపంలో కూడా ప్రవహించేది. ఒకప్పుడు ఈమె వెయ్యేళ్ళు స్త్రీ రూపంలో, తానే నదీ రూపంలో ప్రవహిస్తున్న తన తీరంలో తపస్సు చేసింది. పితృదేవతలు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలో కోరుకోమన్నారు. వారంతా మారు రూపాలలో, దివ్యరూపాలలో ఉన్నారు. అందులో ఒకాయన "మావసుడు". అచ్ఛోద ఆయనను తన తండ్రిగా గుర్తించలేక భర్తవు కమ్మని వరం కోరింది. తండ్రిని కామించిన దోషంతో ఆమె మానవ స్త్రీ అయిపోయింది. కాని మావసుడు మాత్రం ఆమెను ఏమాత్రం కామించలేదు. మావస్య కాలేదు కనుక ఆమెకు అమావాస్య అని పేరు వచ్చింది. అనగా మావసునికి ప్రియురాలు కానిది అని అర్థం. ఆమె తపస్సుకు మెచ్చిన పితృదే...