Posts

"కుండలీలో ఉన్న భూతత్వ రాశులు -వాటి అధిపతులు - ఫలిత సూచనలు"💥

Image
🌷ఓం శ్రీ గణేశ శారద గురుభ్యో నమః🌷 🌷మాతపితృభ్యో నమః🌷 🌷శ్రీ మాత్రే నమః🌷 🌷సభాయై నమః🌷 💥"కుండలీలో ఉన్న భూతత్వ రాశులు - వాటి అధిపతులు - ఫలిత సూచనలు"💥  మన మహార్షులు రాశిచక్రంలో వృషభ, కన్య, మకర రాశులను భూతత్వరాశులుగా నిర్ణయించారు. భూతత్వం అనగానే శబ్ద, రూప, స్పర్శ, రస, గంధం వంటి పంచ భూతత్వ గుణాలు కలిసి భూమికి ఉన్నాయి అని తెలుస్తుంది. భూమిని చూడాగనే చైతన్యం, ఉన్నతం, స్థిరత్వములకు ప్రతీకగా కనిపిస్తుంది. ఇంకా క్షమగుణం, ఓర్పు, సహనం, మమకారం, మాతృత్వం, మానవత్వం, కరుణ, కష్టపడి పనిచేసే తత్వం, గాంభీర్యం వంటి లక్షణాలు కనిపిస్తాయి. భూతత్వ రాశులలో ఎక్కువ గ్రహాలు ఉండగా జన్మించినవారు శరీరబలము, భోజనప్రీతి, ప్రారంభించిన పనిని పూర్తిగా చేయడం, సంపాదానాభిలాష మొదలైన లక్షణాలు కలిగి ఉంటారు. ఇంకా సహనం, ఓర్పు ఎక్కువ, సంతాన ఆపేక్ష, ఏదైనా సంతోషంగా అనుభవిస్తారు. అణిగిమణిగి వారి పరిధిలో వారు ఉండడం మరియు భరించేది భూమి అన్నట్లుగానే ఉంటుంటారు. వృషభరాశి :- స్థిరరాశి, శుక్రుడు అధిపతి. వైశ్యజాతి, రజోగుణ ప్రధానమైనది. వృషభము అనగా ఎద్దు. గ్రామములు, వ్యవసాయ క్షేత్రములందు సంచరించునది. గాంభీర్యత, నిండైన వ్యక్తిత్వర...

జ్యోతిషం - కాలజ్ఞానం

Image
ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం వం అమృతవర్షిణ్యై నమః జ్యోతిషం - కాలజ్ఞానం నేను వాతవరణ పంచాంగంపై పరిశోధన మొదలుపెట్టినప్పుడు కొన్ని సందేహాలు వచ్చాయి. అందులో కాలం ఏమిటి? ఋతువులు ఏమిటి? వాతావరణం ఏమిటి? వర్షాలు.... చలి... ప్రకృతిలో జరుగుతున్న మార్పులు ఏమిటి? అని తెలుసుకోవడానికి పరిశోధన చేసినపుడు, కాలం యొక్క ప్రాధాన్యత తెలిసింది. కాలానికి జ్యోతిషానికి సంబంధం ఏమిటి అని డటా కలెక్ట్ చేసినపుడు కొన్ని విషయాలు తెలుసుకొని ఆశ్చర్య పోయాను. ఈ బ్రహ్మండం కాలానుగుణంగా ఒక నియమం ప్రకారం సంచరిస్తుంది. ప్రకృతిలోని మార్పులు కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. ప్రకృతిపైన, ప్రకృతిలోని జీవులపైన ఏ యే కాలాల్లో ఎటువంటి ప్రభావలుంటాయో తెలుసుకొనేది కాలజ్ఞానం. ప్రతి విషయంలో రెండో కాలాలు ఉంటాయి. అవి మంచి చెడు కాలాలు. శుభాశుభ కాలాలు. ప్రకృతిపై వేరువేరు కాంతులు మంచి ప్రభావం కలిగించే కాలాన్ని శుభాకాలమనీ, చెడు ప్రభావం కలిగించే కాలాన్ని అశుభ కాలమనీ అంటారు. ఏ కాలం శుభమౌతుందో ఏది ఆశుభామౌతుందో తెలుసుకొని మసలుకోవడం కాలజ్ఞానం. ఈ కాలజ్ఞానం అంతా జ్యోతిస్సులపైన, జ్యోతిషశాస్త్రం ద్వారా తెలియజేసే సూత్రలపైన ఆధా...

మానవ శరీరం గురించి ఎన్నో విశేషాలు 💫

💫 ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన మానవ శరీరం గురించి ఎన్నో విశేషాలు 💫 1: ఎముకల సంఖ్య: 206 2: కండరాల సంఖ్య: 639 3: మూత్రపిండాల సంఖ్య: 2 4: పాల దంతాల సంఖ్య: 20 5: పక్కటెముకల సంఖ్య: 24 (12 జత) 6: గుండె గది సంఖ్య: 4 7: అతిపెద్ద ధమని: బృహద్ధమని 8: సాధారణ రక్తపోటు: 120/80 Mmhg 9: బ్లడ్ Ph: 7.4 10: వెన్నెముకలోని వెన్నుపూసల సంఖ్య: 33 11: మెడలోని వెన్నుపూసల సంఖ్య: 7 12: మధ్య చెవిలో ఎముకల సంఖ్య: 6 13: ముఖంలోని ఎముకల సంఖ్య: 14 14: పుర్రెలోని ఎముకల సంఖ్య: 22 15: ఛాతీలోని ఎముకల సంఖ్య: 25 16: చేతుల్లో ఎముకల సంఖ్య: 6 17: మానవ చేతిలో కండరాల సంఖ్య: 72 18: గుండెలోని పంపుల సంఖ్య: 2 19: అతిపెద్ద అవయవం: చర్మం 20: అతిపెద్ద గ్రంథి: కాలేయం 21: అతిపెద్ద కణం: ఆడ అండం 22: అతి చిన్న కణం: స్పెర్మ్ 23: అతిచిన్న ఎముక: మధ్య చెవికి స్టెప్స్  24: మొదటి మార్పిడి చేసిన అవయవం: కిడ్నీ 25: చిన్న ప్రేగు యొక్క సగటు పొడవు: 7 మీ 26: పెద్దపేగు సగటు పొడవు: 1.5 మీ 27: నవజాత శిశువు యొక్క సగటు బరువు: 3 కిలోలు 28: ఒక నిమిషంలో పల్స్ రేటు: 72 సార్లు 29: సాధారణ శరీర ఉష్ణోగ్రత: 37 C ° (98.4 f °) 30: సగటు రక్త పరిమాణం: 4 నుండి 5 లీటర్లు...

శంబల - కైలాస పర్వతం

శంబల - కైలాస పర్వతం - ఒక వైజ్ఞానిక & సమగ్ర వివరన హేతువాదులు &  నాస్తికులు కూడా కచ్చితంగా నమ్మాల్సిన వివరణ  సాగరతలానికి 6718 మీటర్ల ఎత్తు గల కైలాస శిఖరం కేవలం హిందువులకే కాక బౌద్ధులకీ జైనులకీ కూడా పరమ పవిత్రమైన ప్రాంతం.దాదాపు హిందువుల ఆలయాలు సమస్తం మూలవిరాట్, గర్భగృహం, విమానశిఖరం, ముఖమండపం, ధ్వజస్తంభం, ఆవరణ, ప్రాకారం, రాజగోపురం అనే అంశాలతో కూడి ఉంటాయి.ఇందులోని ప్రతి అంశానికి సంబంధంచి పొడుగు, వెడల్పు, ఎత్తు, అలంకరణ వంటి విషయాలలో ఎంతో శ్రద్ధని కనబరుస్తారు స్థపతులూ శిల్పులూ. కాని ఇక్కడ అవన్నీ ఒక పర్వతశిఖరంలోనే ఇమిడిపోయాయి!మానససరోవరం అనే పుష్కరిణి కూడా అమిరిపోయింది - పూజారులూ. మంత్రోచ్చాటనలూ, కానుకలూ, ప్రసాదాలూ అనే తంతులు ఏవీ లేని మనలో ఉన్న నిజమైన భక్తిని ప్రదర్శించడమే పూజావిధానమైన ఆలయం ఇది ఒక్కటే!      హేతువాదులు కూడా నమ్మి తీరాల్సిన హేతువుకి అందని విషయాలు ఎన్నో కైలాసశిఖరం చుట్టూ పెనవేసుకుని ఉన్నాయి.వాటిలో ఒకటి ఎంత గొప్ప పర్వతారోహకుడైనా శిఖరం వరకు ఎక్కలేకపోవటం.ఇప్పుడు దీని చుట్టూ మూడు మతాల వారిలో ఉన్న నమ్మకాలను గమనించి చైనా ప్రభుత్వం అనుమతి నిషేధించింది గానీ...

కోడలు పెట్టే దీపానికి ప్రాధాన్యత

కొడుకు పెట్టె పిండాలకన్నా.... కోడలు పెట్టే దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అది....కోడలి గొప్పతనం....     కూతురా కోడలా ఎవరు ప్రధానం...??? అనే ప్రశ్నకు 'కోడలే' అని సమాధానం చెపుతుంది భారతీయ ధర్మం...—ఎందుకోతెలుసా...!!! చీర మార్చుకున్నంత సులవుగా ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ 'త్యాగశీలి' కోడలు...!! కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యున్నతిని అత్తవారింట్లో వెతుక్కునే 'గుణశీలి' కోడలు..!! తండ్రికి పంచభక్ష్యాలు పెట్టగలిగే స్తోమత ఉన్నా భర్త పెట్టే పచ్చడిమెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుక్కోగల 'భాగ్యశీలి' కోడలు...!! తాను మెట్టినింటి పట్టపురాణి. అయినా సరే అందరికీ సేవచేసి అలసిపోయి మంచానికి ఒరిగి కష్టాన్ని మరచి మరునాడు ఉదయమే గృహ సేవకు సిద్ధమయ్యే 'శ్రమజీవి' కోడలు...!! కుడికాలు పెట్టి కోడలు తన ఇంటిలోకి రాగానే, అమ్మ కోసం బెంగపెట్టుకున్న పసివాడిలా ఎగిరి గంతులేస్తాడు ఆ కోడలి మామ గారు. ఎందుకోతెలుసా రేపట్నుంచి అందరికీ అన్నం పెట్టే అమ్మే కదా! కోడలు..!! కొడుకు పెళ్ళికోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృదేవతల కోసం 'నాంది శ్రాద్ధం' పెట్టి, మన వంశాన్ని ఉద్ధర...

Bhav for Lawyer and Judiciary Service

Responsible House / Bhav for Lawyer and Judiciary Service First House The first house denotes physical and mental aptitude and inclination toward the profession and other things. Second House 2nd house is the house of communication and speech and it is very essential for all judge and lawyer because the lawyer needs to have a strong and influential speech or voice in the time of argument. Third House The third house in the birth chart considers books and files related to accounts, records, old scriptures etc. The relationship of the third house with the tenth house will give auspicious results. Therefore, this house is always in an auspicious position in the birth-chart of lawyers. Sixth House The sixth house is the house of litigation so this house must be strong in the horoscope. The relationship between the sixth and tenth house is very necessary for success in Judiciary services. The success of a person in Lawyer and judiciary services depends upon the strong placement of these hou...

తద్దినం ఎందుకు?

◆ ◆ ◆ ◆ ◆ ★తద్దినం ఎందుకు?★        ◆ ◆ ◆ ◆ ◆       మహాభారతంలో ఒక కధ ఉంది... కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి రేవతి అనే అందమైన కూతురు ఉండేది. అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మ లోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మ లోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపు వేచి ఉన్నాడు. ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో గాని పక్క రాజ్యంలో గానీ ఉంటే చెప్పమని ప్రార్ధిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది అన్నాడు. అదేంటి అని అడిగాడు రాజు. నీకు తెలియదా భూమిపై సమయానికి, బ్రహ్మ లోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని. నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమి పై 27 చతుర్యుగాలు గడిచి పోయాయి. ఇప్పుడు అక్కడ నీ వారు గానీ, నీ రాజ్యం గానీ లేదు అన్నాడు. దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకుని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవియ్యమన్నాడు. అప్పుడు...