శక్తి స్వరూపిణి... త్రైలోక్య సంచారిణి...
శక్తి స్వరూపిణి... త్రైలోక్య సంచారిణి... వేదమాత... అమ్మలగన్నయమ్మ... ముగ్గురమ్మల మూలపుటమ్మ... అఖిలాండకోటి బ్రహ్మాండనాయకైన శ్రీ జగదాంబ సృష్టి, స్థితి, లయల కొరకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను తన ఆధీనం చేసుకుంటూ షోడశాదశ మంత్రానికి అధిష్టాన దేవతగా, శ్రీ చక్ర నీరాజనాలందుకునే ఏకాదశ శక్తుల సంగ్రహంగా, అపరాజితగా కొలువులందుకునే తల్లి, పరాశక్తి, మంత్రశక్తి, ప్రాణశక్తి, కళాశక్తి, విశ్వశక్తి, విద్యాశక్తి, వాగ్ వైభవశక్తి, సంహారశక్తి, ఆదిపరాశక్తి, ధార్మిక శక్తి, విజయశక్తులు దేవిలో నిండి నిబిడీకృతమై ఉండే దేవతే గాయత్రీమాత🙏🏻 దసరా మూడవ రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియ నాడు, ఇంద్రకీలాద్రిలో అమ్మవారిని శ్రీగాయత్రీదేవిగా అలంకరిస్తారు. సకల మంత్రాలకూ మూలశక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీదేవి, ముక్తావిద్రుమహేమ నీలధవళ కాంతులతో ప్రకాశిస్తూ, పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠానదేవత. గాయత్రీదేవి మంత్రప్రభావం ఎంతో గొప్పది. గాయత్రీమంత్రం రెండు విధాలు. ఒకటి లఘు గాయత్రీ మంత్రం, రెండవది బృహద్గాయత్రీ మంత్రం. ప్రతి రోజూ త్రికాలసంధ్యావందనం చేసి, ఆ గాయత్రీదేవి మంత్రాన్ని వేయి సార్లు ధ్యానిస్తే, ఆ తల్లి అనుగ్రహంతో...