Posts

Showing posts from August, 2017

❤❤ ❤ ❤❤❤❤❤ ❤❤

☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘ 🕉🕉🕉🕉 🕉🕉 🕉🕉 🕉🕉🕉🕉🕉🕉 🕉🕉 🕉 🕉 💜💜💜💜 💜💜 💜💜 💜💜💜💜💜 💜💜 💜💜 💜 💙💙💙💙 💙💙 💙💙 💙💙💙💙💙 💙💙 💙💙 💙 ❤❤❤❤❤ ❤❤ ❤ ❤❤❤❤❤ ❤❤ ❤ ❤ 💚💚💚💚💚 💚💚 💚 💚💚💚💚💚 💚💚 💚 💚 💜💜💜💜 💜💜 💜💜 💜💜💜💜 💜💜 💜💜 💜 💙💙💙 💙💙 💙💙 💙💙💙 💙💙 💙💙 💙💙 💛💛💛 💛💛 💛💛 💛💛💛💛 💛💛 💛💛 💛💛 ❤❤❤ ❤❤ ❤❤ ❤❤❤❤❤ ❤❤ ❤❤ ❤❤ 💜💜💜 💜💜 💜💜 💜💜💜💜 💜💜 💜💜 💜💜 💚💚💚💚💚 💚💚 💚 💚💚💚💚💚 💚💚 💚 💚 💙💙💙💙 💙💙 💙💙 💙💙💙💙 💙💙 💙💙 💙 ☸☸☸ ☸☸ ☸☸ ☸☸☸☸☸ ☸☸ ☸☸ ☸☸ 🕉🕉🕉 🕉🕉 🕉🕉 🕉🕉🙏 🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱 🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱     🔱                 🔱 🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱                  🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵 🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵 🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵 🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵 * 🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵 🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵 🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵 🌺🌺🌺🌺☘☘☘☘ 💞💙💚❤💗 💗💔💛💜💞 💚 💚 💞💙💚❤💗💗💔💛💜💞* 💜 💜 💚 💚 💛 💛 💜 💜 💚 💚 💛 💛 💜 💜 💚

శాంతి మంత్రములు

ఓం ఆప్యాయంతు మమాంగాని, వాక్ ప్రాణ చక్షుః శ్రోత్ర మథో బల మింద్రియాణి చ సర్వాణి , సర్వం బ్రహ్మౌపనిషదం మాఽహం బ్రహ్మ నిరాకుర్యాం మా మా బ్రహ్మ నిరాకరో దనిరాకరణమ స్త్వనిరా కరణం మే ఽస్తు, తథాత్మని నిరతే య ఉపనిషత్స ధర్మాస్తే మయి సన్తుతే మయి సన్తు.

నిత్యపూజ మంత్రములు

శాంతి మంత్రము ఓం శన్నోమిత్రః శం వరుణః శన్నో భవత్వర్యమాః  శన్నో ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణు రురుక్రమః  నమో బ్రహ్మణే నమస్తే వాయుః త్వమేవ ప్రత్యక్షం  బ్రహ్మవి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మవదిష్యామి  ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు  తద్వాక్తార మవతు అవతుమాం అవతు వక్త్తారం  ఓం శాంతిః శాంతిః శాంతిః

మూల మంత్రాలు

Image
గణపతి మంత్రం : "ఓం గం గణపతయే నమః " సర్వ శుభములకు మూల మంత్రములు సంపదకు ఈ క్రింది మంత్రాన్ని పటించినచో అమ్మవారి అనుగ్రహము మీకు ఎల్లప్పుడూ సర్వాభీష్ట  దాయకముగా వుంటుంది . శ్రీనిదిహి శ్రీవరః శ్రగ్వి శ్రీలక్ష్మీకర పూజితః ! శ్రీరధః శ్రీవిభుహు సింధు కన్యపతి రదోక్షజః !! ---------------------------------------------------------------------  అదృష్టమునకు  ఈ క్రింది మంత్రాన్ని పటించండి (చదవండి) . భాగ్యప్రదో మహాసత్వో విశ్వాత్మ విగతజ్వరః! సురచార్యర్చితో వస్యో వాసుదేవో వసుప్రదః!!  ---------------------------------------------------------------------- పాపవిముక్తికై : ప్రణతార్ది హరిశ్రేష్ఠ  శరణ్యః పాపనాశనః! పావకో వారనాద్రిశో వైకుంటో వీత కల్మషః !! --------------------------------------------------------------------------     విద్య, తెలివితేటలకు : ఉద్గీత ప్రణవోద్గీత సర్వ వాగేశ్వరేశ్వర! సర్వ వేదామయ ,సర్వవేదామయ చింత్య సర్వం భోధయ భోధయ!! --------------------------------------------------------------------------- వివాహమునకు, దాంపత్యం, కుటుంబ అన్యోన్యతకు: ఓం హరివల్లభాయై విశ్నుమనోనుకూలాయి! దివ్యాయై స

పరీక్షల సమయంలో పఠించవలసిన మంత్రములు

పరీక్షల సమయంలో పఠించవలసిన మంత్రములు పరీక్షల సమయంలో గణపతి, సరస్వతి, హయగ్రీవ మంత్రాలను పఠించడం ద్వారా అనవసర భయం, ఆందోళన లేకుండా మంచి జ్ఞాపక శక్తి కలిగి, పరీక్షలలో ఉత్తమమైన ప్రతిభను కనబరచి అఖండమైన వి జయాన్ని సాధించవచ్చు. గణపతి స్తుతి:- ఓం గణానాం త్వా గణపతిహిం హవామహే కవిం కవీనా ముపమశ్ర వస్తమం జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పత ఆ న: శృణ్వనూతభి: స్సీదసాదనం ఓం శ్రీ మహా గణాధిపతయే నమ: ||   సరస్వతీ స్తుతి:- సర స్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి  విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా | ఓం ప్రణో దేవీ సర్వస్వతీ వాజేభిర్వాజనీ వతీ దీనా మవిత్రియవతు ఓం శ్రీ సరస్వత్యై నమ: || హయగ్రీవ స్తుతి:- జ్ఞానానంద మయం నిర్మల స్ఫటికాకృతిమ్‌ ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే |  ఉద్గ్ర ప్రణవోప్రణ వోద్గీత సర్వ వాగీశ్వరేశ్వరా  సర్వ వేద వయాచింత్య సర్వం బోధయ బోధయా ||

నవగ్రహ జపం

నవగ్రహ జపం విద్య, ఉద్యోగం, పెళ్లి, సంతానం, ఇల్లు సమస్య ఏదైనా దానికి సత్వరం చక్కని పరిష్కారం దొరకాలంటే మీరు నవగ్రహాలను శరణు వేడ వలసినదే. దానికి చక్కని మార్గం నవగ్రహ జపం. ఇది సాధారణంగా స్వయంగా చేసుకోవాలి. కానీ దానికి గట్టినమ్మకం, సంకల్పం కావాలి. సంఖ్య ఎక్కువ ఉంటుంది కనుక చాలా మంది పూర్తి చేయలేరు. అటువంటి వారు బ్రాహ్మణులను పెట్టుకుని జపం చేయించుకోవాలి. బ్రహ్మణులను పెట్టుకుని జపం చేయించుకుంటే వారు వేద ప్రోక్తమైన మంత్రాలను జపం చేస్తారు. స్వయంగా చేసుకునే జపమే ఉత్తమం. స్వయంగా చేసే వారు " నవగ్రహ శ్లోకాలను" జపం చేయాలి.  ఈ నవగ్రహ శ్లోకాలు మీ కష్టాలను/ ఈతిబాధలను తొలగించి, కోరిన కోరికలను తీర్చడంలో అద్భుతంగా పనిచేస్తాయి. దారిద్ర్య దుఃఖ బాధలు, శారీరక మానసిక రోగ రుగ్మతలు తొలగుతాయి. సర్వ కార్య విజయాలు, విద్యా ఉద్యోగ వ్యాపారాది లాభాలు, మనోవాంఛలు తీరును. ప్రతీ గ్రహము ఒక్కో ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది. అలాగే మీ జాతక చక్ర రీత్యా ఒక్కో ఫలితాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు: నవ గ్రహ శ్లోకం : ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః రవి: 6000 సా

కావేరి పుష్కరాలు

కావేరి అనగానే తమిళనాడు, కర్ణాటకల మధ్య ఉన్న నదీజలాల వివాదమే గుర్తుకువస్తుంది. కానీ వేల సంవత్సరాలుగా ఇలాంటి వివాదాలకు అతీతంగా గుంభనంగా సాగిపోతోంది ఆ నదీమతల్లి. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఆ కావేరికి పుష్కరాలు వస్తున్నాయి. ఆ సందర్భంగా కావేరి గురించి కొన్ని విశేషాలు…   మన దేశంలోని ముఖ్య నదులన్నింటి జననం వెనుకా ఏదో ఒక చరిత్ర కనిపిస్తుంది. అలాగే కావేరీనదికి కూడా ఒక వృత్తాంతం ఉంది. పూర్వం కావేరుడనే రుషి ఉండేవాడట. తనకు సంతానం లేకపోవడంతో... ఒక కుమార్తెని అందించమంటూ ఆయన బ్రహ్మను వేడుకున్నాడు. అంతట బ్రహ్మ తన దగ్గర ఉన్న లోపాముద్ర అనే బాలికను, కావేరునికి అందించాడు. కావేరుడు పెంచుకున్నాడు కనుక లోపాముద్రని కావేరిగా పిలవసాగారు.   యుక్తవయసు రాగానే కావేరిని అగస్త్య మహామునికి ఇచ్చి వివాహం జరిపించారు. అయితే వివాహసమయంలో కావేరి ఒక షరతుని విధించింది. అగస్త్యుడు తనని ఒంటరిగా వదిలి ఎక్కువసేపు ఉంటే... తన దారిని తను చూసుకుంటానన్నదే ఆ షరతు. అగస్త్యుడు చాలాకాలం ఆ షరతుకి లోబడే ప్రవర్తించాడు. కానీ ఒకరోజు తన శిష్యులకి ఏదో బోధిస్తూ కాలాన్ని గమనించుకోలేదు. కాలాతీతం కావడంతో కావేరి అలిగి నదిగా మారిపోయింది.   మర

జాతకచక్రంలో “విదేశీయానం

జాతకచక్రంలో “విదేశీయానం” సమగ్ర పరిశీలన  సాప్ట్ వేర్  రంగం పుణ్యమా అని భారతదేశంలో నేటి యువతరం ఆకాశం అంచులను తాకుతుంది. ఒక తరం క్రిందటి వరకు ఎవరూ ఊహించని, ఊహించలేని ఉద్యోగ అవకాశాలు, ఉపాది అవకాశాలు వారిని వెతుక్కుంటూ వచ్చాయి. ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలనే కోరిక ప్రతి ఒక్కరులోను ఉంది. దీనికి తగ్గట్టే ఉపాదికి తగ్గ  విద్యను ఇక్కడే ఆర్జిస్తున్నారు. ఉద్యోగం కాకపోయిన విద్యా కోసమైన విదేశాలకు వెళ్ళాలని ఆశించేవారు ప్రతి ఇద్దరులోను ఒకరు ఖచ్చితంగా ఉన్నారు. అయితే అందరు వెళ్ళగలుగుతున్నారా, అందరికి అలాంటి అవకాశాలు లభిస్తున్నాయా లేదా అనేది ఆయా జాతకాలను బట్టి ఉంటుంది. ఏయే గ్రహాలు మనల్ని విదేశీయానం వైపుకి తీసుకుపోతాయో పరిశీలిద్దాం. పూర్వకాలంలో ప్రజలు అధికంగా జలయానమే చేసేవారు. అప్పట్లో విమానయానం లేదు కాబట్టి. జలయానం చేయాలంటే జల రాశులైన కర్కాటకం, మీనం, వృశ్చిక రాశులతో పాటు చంద్రబలం కూడా ఉండితీరాలి. ఇప్పుడు విమాన ప్రయాణాలు పెరిగాయి. దీనికి వాయుతత్వ రాశులైన మిధున, కుంభ, తుల రాశుల యొక్క ప్రభావం అధికమని చెప్పవచ్చును. దీనితో పాటు ఆకాశతత్వ ప్రభావాన్ని కలిగి ఉండే గురుగ్రహాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రాసులు త