Posts

Showing posts from October, 2018

12. Pavan. 2019 కాలండర్ .💐భగవద్గీత

వివాహ నిశ్చయ సమయ నిర్ణయం. వధూవరుల - జననకాల  గ్రహస్థితి,   గురు శుక్ర స్థితి, దృష్టి  రీత్యా వధూవరుల  వివాహ నిశ్చయ సమయ నిర్ణయం. *** *1.వధూవు/వరుని జన్మలగ్న పత్రికలోని -గోచార వశాత్తు -  గురుస్థిత రాశిలో - గురు సంచారము జరుగుచున్న కాలమందు గానీ, కళత్రకారకుడగు శుక్ర సంచారము జరుగుచున్న కాలమందు గాని, అదేవిధంగా - *2. కళత్రకారకుడగు శుక్రస్థితరాశిలో -గోచార వశాత్తు గురు సంచారము జరుగుచున్న కాలమందు గానీ, శుక్రుని మీద గరు దృష్టి పడుచున్న కాలమందు గానీ వివాహ నిశ్చచయ సమయముగా గుర్తించవలెను.                     .*** ॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰ యుక్తవయస్సు  జీవితంలో కీలకమైన దశ. స్వతహాగా కలిగే నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలి. వేడి రక్తం ఉరకలు వేసే వయస్సు. గుండెనిండా ఆవేశం.. సమాజంలో మార్పుకు బాటలు పరిచేది.  చుట్టుపక్కల పరిస్థితులకు, కలిసే మనుషలకు స్పందిస్తుంది ఉంటుంది.స్పష్టమైన భావాలు ఏర్పాడుతూఉంటయి. సహాధ్యాయులు, స్నేహితులు, సన్నిహితులను కలవటం. పరస్పరం అభిప్రాయాలు పంచుకోవటం. ప్రపంచాన్ని తెలుసుకోవటం సర్వసాధారణం. చక్కగా మట్లడటం, ఎదుటివారిని కలవటం, తమనుతాము పరిచయంచేసుకోవటం. తమకు కలిగిన 

సంస్కృతి - సాంప్రదాయం - భక్తి

‘జ్యోతి' పదం నుండి ‘జ్యోతిషం' ఆవిర్భవించింది. ‘జ్యోతి' అంటే ప్రకాశం, వెలుగు అర్థం. జ్యోతిషం ఒక వైజ్ఞానిక శాస్త్రం. జ్యోతిషాం సూర్యాదిగ్రహాణాం బోధకం శాస్త్రం! సూర్యాది గ్రహాలూ, కాలం గురించి తెలిపే శాస్రమే జ్యోతిషం. గగనమండలంలోని ప్రధానగ్రహాలు, నక్షత్రాలు భూమిపై ఉండే ప్రాణులకు వెలుగునిస్తాయి. ఆకాశంలోని ఈ గ్రహాల నుండి ప్రసరించే జ్యోతికిరణాలు తమ తమ బలం, దూరాన్ని అనుసరించి భూమిపై ఉన్న ప్రాణులను ప్రభావితం చేస్తాయి. వాస్తవానికి ఒక వ్యక్తి జనన సమయంలోని జ్యోతికిరణాలు అతని స్వభావానికి కారణమౌతాయి. మానవుని జీవితంపై, అతని జీవితంలోని వివిధ కోణాలపై ఈ జ్యోతికిరణాల ప్రభావాన్ని విశ్లేషించే శాస్త్రమే ‘జ్యోతిర్విజ్ఞానం’ లేదా ‘జ్యోతిష విజ్ఞానం’ అని పిలవబడుతుంది. శిక్ష, కల్పం (సూత్రాలు), వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం వేదాలకు ఆరు అంగాలు. అందుచేత వేదాలను 'షడంగ వేదాలు' అంటారు. 'వేదస్య నిర్మలం చక్షుర్జ్యోతి శాస్త్రమనుత్తమం' అని నారదసంహితలో జ్యోతిషశాస్త్రాన్ని వేదాలకు నేత్రంగా చెప్పారు. ఋగ్వేదంలోని మొదటి శ్లోకం - 'విఫలాన్యన్యాశాస్త్రాణి వివాద స్తేషు కేవలమ్| సఫలం జ్యో

ధర్మాచరణ, ధర్మ ప్రచారం, ధర్మ రక్షణ, దేశరక్షణ

*నేను సౌదీ అరేబియా లో ఉన్నపుడు.* *ఒక సౌదీ employee   నా దగ్గరకు వచ్చి ఇలా అడిగాడు: "భారత దేశంలో ఇంకా 80% హిందువులు ఎలా ఉన్నారు?*    *"నేను"  అన్నాను " మీరు అడగదలుచుకున్నది ఏమిటి?* *ఆ సౌదీ వ్యక్తి ఈ విధంగా చెప్పాడు:-* *"రియాద్" లో మా ఇస్లామిక్ విశ్వవిద్యాలయం లో జరిగిన పరిశోధనలో"*   *ఎక్కడ ఇస్లాం ప్రవేశిస్తే ఆ దేశం 100% ఇస్లామిక్ దేశంగా మారిపోతుంది అని తెలుసుకున్నాను.*   *ఉదా:-*  *ఇరాన్ ఒక జొరాస్ట్రియన్ ( ఇది ఒక మతం) దేశం, కాని ఇస్లామిక్ దండయాత్ర జరిగిన తరువాత అక్కడ జనాభ మొత్తం 100% ఇస్లాం లోకి మారిపోయారు, కేవలం 17 సంవత్సరాలలో ఇరాక్ కూడా ఇస్లామిక్ దేశం గా మారిపోయింది.* *21 సంవత్సరాలలో ఈజిప్ట్ కూడా ఇస్లామిక్ దేశంగా మారిపోయింది.* *అలాగే క్రైస్తవ మతం కూడా ఐరోపాలో 50 సంవత్సరాలలో వ్యాపించింది.*   *కాని భారత దేశం మాత్రం 800 సంవత్సరాలు ముస్లిం పాలనలో, 200 సంవత్సరాలు బ్రిటీషు(క్రైస్తవ) పాలనలో ఉంది.*   *కాని ఇంకా భారత దేశం లో 80% హిందువులు ఎలా ఉన్నారు???*  *నా సమాధానం:-*   *మా దేశం పై దండ యాత్ర చేసిన విదేశీయులతో  ఎన్నో యుధ్ధాలలో ఓడిపోయి ఉండొచ్చు. కానీ మ

Pavan. 12-3. 2019 ఫలితాలు రాజకీయం

రాజకీయం ఇపుడు మనం అమృతతుల్యమైన అధికారం కోసం ఎందరితో జతకడితే మాత్రం తప్పేంటి? ఈ కాలంలో అధికారం కోసం ఏం చేసినా ఆక్షేపణీయం కాదు. కాలోచితంగా స్ట్రేటజీ మార్చనివాడు పాలిటిక్స్‌లో షైన్‌ కాజాలడు. ఒంటరిగా ఓటమిని భరించడం కంటే నలుగురితో పంచుకోవడం తేలిక. అవినీతి పాలన, కుటుంబ పాలన, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు – ఈ కలయికలు, పొత్తులు అన్నీ యుగాలుగా ఉన్నవే. *** అచ్చమైన నేత ముందస్తు ఎన్నికలు రావడం వేరు, నాయకుడే కోరి తెప్పించుకోవడం వేరు. దీనికి తెగువ, తెగింపు కావాలి. అమీ తుమీ తేల్చుకోవడానికి సిద్ధపడాలి. తెలంగాణ ముఖ్యమంత్రిది నిజంగానే గొప్ప సాహసం... కాదంటే ఆత్మ విశ్వాసం. సర్వే రిపోర్ట్‌లన్నీ ‘సరిలేరు నీకెవ్వరూ’ అని ముక్త కంఠంతో చెప్పాయనీ, కనుక కేసీఆర్‌ ఈ రద్దుని దుస్సాహసంగా భావించడం లేదనీ దగ్గరివారను కుంటున్నారు. తిరిగి మళ్లీ అంతా వాళ్లే. ఎమ్‌ఐఎమ్‌ వాళ్ల పేర్లు కూడా అవే వుండచ్చు. సేమ్‌ గవర్నర్‌! ప్రజలకి అసలేం తేడా పడదు. కేసీఆర్‌ ఉద్యమంలోంచి ఉద్భవించిన నేతగా జ్ఞాని కనుకనే సీట్ల గురించిన కసరత్తులు చేయకుండా ఒక్క నిమిషంలో తేల్చి పడేశాడు. ఆయనకి స్పష్టంగా తెలుసు, ఎవరైనా ఒకటేనని! సాహసాన్ని ప్రదర్శించి

2019 12-10 Pavan కాలండర్ - మృత్యు రహస్యము

2019  12-10 Pavan కాలండర్  -  మృత్యు రహస్యము మృత్యు రహస్యము శ్లో||  ఓం త్య్రంబకం, యజామహే | సుగంథిం పుష్టి వర్ధనం | ఉర్వారుక మివ బంధనాత్‌ | మృత్యోర్ముక్షీయ మామృతాత్‌ || మృత్యువు : ఆత్మ పరమాత్మ తత్త్వజ్ఞాన శూన్యతను మృత్యువు అందురు. మృత్యుజయము : పరమాత్మ తత్త్వజ్ఞానము వలన శరీర పతనమును తన మరణమనే భావన లేకుండుట. ఇది ఆత్మ విజయము. ఆత్మహత్య : ఆత్మహత్య జీవుల యొక్క పరిణామమునకు అవరోధము కలిగించును. ఆత్మహత్య ఫలితమును అనుభవించుటకు జీవుడు అనేక జన్మలను అదనముగా తీసుకొనవలసి యుండును. ఆత్మహత్య వలన కష్టములు తీరకపోగా, అనేక రెట్లు ఎక్కువగా కష్టములననుభవించవలసి వచ్చును. కనుక ఆత్మహత్య చేసుకొనరాదు. పునర్జన్మ రహస్యము : మరణించిన వారికి వారు మరల జన్మించే ముందు వారియొక్క రాబోవు జన్మయొక్క రూపురేఖలు తన కల్పనలో గీయబడును. అవి స్వప్నతుల్యముగా, అస్పష్టముగా మెరిసి, పిదప పుట్టబోయే స్థలము,  తల్లిదండ్రులు, ధరించబోవు శరీరముయొక్క చలన చిత్రమువలె పునర్జన్మ యొక్క రూపురేఖలు స్పష్టమగును. స్వర్గ నరకములు : పాప పరిమాణము తక్కువగా ఉన్నవారు ముందుగా నరకమును అనుభవించి, తరువాత స్వర్గముననుభవించెదరు. పుణ్య పరిమాణము తక్కువగా ఉన్నవారు