Posts

Showing posts from May, 2020

శ్రీ శివ ప్రోక్త దశహరా గంగా స్తోత్రం

Image
శ్రీ శివ ప్రోక్త దశహరా గంగా స్తోత్రం ఓం నమః శివాయై గంగాయై శివదాయై నమో నమః! నమస్తే విష్ణురూపిణ్యై బ్రహ్మమూర్త్యై నమోస్తుతే!! నమస్తే రుద్రరూపిణ్యై శాంకర్యై తే నమోనమః! సర్వదేవ స్వరూపిణ్యై నమో భేషజమూర్తయే!! సర్వస్య సర్వవ్యాధీనాం భిషక్ శ్రేష్ఠ్యై నమోస్తుతే! స్థాస్ను జంగమ సంభూత విషహంత్ర్యై నమోస్తుతే!! సంసార విషనాశిన్యై జీవనాయై నమోస్తుతే! తాపత్రితయసంహత్ర్యై ప్రాణేశ్యైతే నమో నమః!! శాంతి సంతానకారిణ్యై నమస్తే శుద్ధమూర్తయే! సర్వస్వం శుద్ధికారిణ్యై నమః పాపారిమూర్తయే!! భుక్తిముక్తి ప్రదాయిన్యై భద్రదాయై నమోనమః! భోగోపభోగ్యదాయినై భోగవత్త్యై నమోస్తుతే!! మందాకిన్యై నమస్తేస్తు స్వర్గదాయై నమో నమః! నమస్త్రైలోక్యభూషాయై త్రిపథాయై నమో నమః!! నమ స్త్రిశుక్ల సంస్థాయై క్షమావత్యై నమో నమః! త్రిహుతాశన సంస్థాయై తేజోవత్యై నమో నమః!! నందాయై లింగధారిణ్యై సుధాధారాత్మనే నమః! నమస్తే విశ్వముఖ్యాయై రేవత్యై తే నమో నమః!! బృహత్యైతే నమస్తేస్తు లోకధాత్ర్యై నమోస్తుతే! నమస్తే విశ్వమిత్రాయై నందిన్యై తే నమో నమః!! పృథ్వ్యై శివామృతాయైచ సువృషాయై నమో నమః! పరాపరశతాధ్యాయై తారాయై తే నమో నమః!! పాశజాల నికృంతిన్యై అభిన్నాయై నమోస్తుత

సంపత్కుమార విగ్రహం

Image
(ఢిల్లీ సుల్తాను ఎత్తుకుపోయిన సంపత్కుమార విగ్రహాన్ని తిరిగితెచ్చిన భగవద్రామానుజుల వారి అద్భుతమైన వృత్తాంతం పూర్తిగా చదువ వలసిందిగా ప్రార్థన.శ్రీ వి.యస్.కరుణాకరన్ గారి పిలిచినంతనే పలికే దైవం- విష్ణు సహస్రనామావళి గాథలు ఆధారంగా)_ ఢిల్లీ సుల్తాను – తన కట్టెదుట నిలబడిన రాజసతేజో విరాజిత మూర్తి సుకుమార సుందర గంభీర విగ్రహుడు ఆజానుబాహుడు అయిన వినూత్న వ్యక్తిని ఆశ్చర్య పరవశుడై గౌరవ ప్రవత్తులతో తేరిపార జూచాడు.  *ఆ మహానుభావుని విశాల ఫాలభాగంలో తీర్చి దిద్దిన ఊర్ధ్వపుండ్ర రేఖలు మధ్యలో పసుపురంగు తిలకం. తళతళలాడే ధవళ యజ్ఞోపవీతం విశాల వక్షస్థలం నుండి జారుతోంది. మెడలో తామర పూసల దండ. తులసీ దళధామం. మొలకు కట్టి చుట్టినది చిన్న కావి కొల్లాయిగుడ్డ. తలపై చిరు పిలక జుట్టు. ఒక చేతిలో త్రిదండం, ఇంకో చేతిలో ధవళ పీతాంబర పతాకం.* సుల్తాను కొలువు కూటం అంతా ఆ మహామహుని ఆధ్యాత్మికదీధితులచే దేదీప్యమానంగా వెలుగొందుచున్నట్లు భావించాడు. ఢిల్లీ దర్బారుకు ఆవిధంగా వేంచేసినది  *శ్రీమద్రామానుజుల* వారే. ఢిల్లీ సుల్తాను - శ్రీమద్రామానుజుల కోరిన కోరిక ఈడేర్చాలనే నిర్ణయించుకున్నాడు.. “సుల్తాను వారికి ఒక విన్నపం, తమ సేనలు

నందనార్ నాయనార్: స్వయంగా నంది ప్రక్కకు తప్పుకున్న ఘట్టం

Image
నందనార్ నాయనార్: స్వయంగా నంది ప్రక్కకు తప్పుకున్న ఘట్టం 63 మంది శివ భక్తులైన నాయనార్లలో ఒకరైన నందనార్ కథని, అతనికి శివ దర్శనం కలిగించడం కోసం గుడిలోని నంది ఎలా ప్రక్కకు తప్పుకుందో సద్గురు చెబుతున్నారు. తమిళనాడులో జరిగిన ఒక అందమైన సన్నివేశం ఉంది. సమాజంలో అంటరానివాడు, ఒక కట్టుబానిస అయిన ఒకతను ఉండేవాడు. అతనికి పేరే లేదు. ఓ సమాజం ఎవరినైనా బానిసలుగా చేసుకోవాలనుకుంటే, చేసే మొట్టమొదటి పని ఏమిటంటే, వారికి పేరు అన్నది లేకుండా చెయ్యడం. ఎందుకంటే పేరు అనేది ఒక బలమైన గుర్తింపు. ముంబైని బాంబే గానూ, బెంగళూరుని బాంగ్లోర్ గానూ, తిరువనంతపురాన్ని ట్రివేండ్రం గానూ మార్చేశారు. ఈ మనిషికి పేరు లేదు. అందరూ అతనిని సాధారణంగా పాలేరు అని పిలుస్తూ ఉండేవాళ్లు. బాల్యం నుంచీ, ‘శివుడు’ అన్న ఆలోచనే ఇతనిని అబ్బురపరచేది. ఒక కట్టు బానిసగా, అతనికంటూ సొంతమైన ఆలోచనలు ఉండకూడదు. కానీ, ‘శివుడు’ అన్న ఆలోచన అతనిని ప్రజ్వలింపజేసింది. ఇతను నివసిస్తున్న ప్రదేశానికి దాదాపు పాతిక కిలోమీటర్ల దూరంలో, ఇప్పుడు గొప్ప శివాలయంగా పేరు పొందిన తిరుపొంగూర్ ఆలయం ఉంది. ఇతనికి ఎప్పుడూ ఆ ఆలయాన్ని దర్శించాలన్న కోరిక. ఇతనికి, శివుడు తనను పిలుస్తున

కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది

Image
కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది ............!! కృతయుగం నుండి  ఇప్పటివరకు శ్రీమహావిష్ణువు తొమ్మిది అవతారాలు ఎత్తడం జరిగినది.  కృష్ణావతారం తరువాత కావలసిన రావలసిన అవతారం కల్కి అవతారం దశావతారములలో ఇది ఒకటి. కల్కిఅవతారం రాలేదు కానీ వ్యాస వాక్కు ప్రమాణం.వ్యాసుడు చెప్పాడు కాబట్టి ప్రమాణం.  పదవ అవతారమైన కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో వ్యాసభగవానుడు చెప్పాడు. 1. అసలు ఎక్కడా స్వాహాకారము శత్కారము ఇవి రెండూ కనబడవు అంటే ఇక యజ్ఞ యాగములు ఉండవు. 2. గోవులు విశేషంగా వదింపబడి గో మాంసం తినడం లోకం లో ప్రారంభం అవుతుంది.  3. వివాహ వ్యవస్థ నిలబడదు 4. తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు 5. భర్తను గౌరవించే భార్య భార్యను గౌరవించే భర్తను చూసే వాళ్లు లోకంలో ఉండరు 6. పురుషుల యొక్క ఆయుర్దాయం 18 సంవత్సర ములకే పడిపోతుంది 7.స్త్రీలు కేశపాశము లు విరబోసుకుని తిరగడం లోకంలో పెద్ద విశేషం అయిపోయి జడ వేసుకునే సంప్రదాయం విచ్ఛిన్నమవుతుంది 8. పురుషులు 18 సంవత్సరముల కే మరణించడం ప్రారంభం అయిపోయి ఆయుర్థాలు క్షీణించిన తరువాత ఆ సమయంలో " శంభాలా " అనేటువంటి గ్రామంలో విష్ణు యేశుడు అనే  బ్రాహ్మణ కడుపున కల్కి పేరుతో శ్రీ మ

మహాభారతం లో కొన్ని ముఖ్య సంఘటనలు జరిగిన #తిథులు :

మహాభారతం లో కొన్ని ముఖ్య సంఘటనలు  జరిగిన #తిథులు : వింటే భారతం వినాలి తింటే గారెలే తినాలి అని ఎందుకు అంటారో తెలుస్తుంది. మహాభారతం గురించి ఎంత చదివినా ఎంత విన్నా కొత్త గానే అద్భుతం గానే వుంటుంది. అందుకే ఈ మధ్య తెలుసుకున్న కొన్ని మహాభారత విశేషాలు మీ కోసం.     సులభం గా టైపు చేయడానికి సంవత్సరాలను సం గాను , నెలలను నె గాను , రోజులను రో గాను చేయడం జరిగింది. తారీఖు లను రోజులు-నెలలు-సంవత్సరాలు గా dd-mm-yy గా భావించవలెను. ➡️ కర్ణుని జననం : మాఘ శుద్ధ పాడ్యమి. ఇతను ధర్మరాజు కంటే 16 సం పెద్దవాడు. ➡ యుధిష్టరుని జననం :  ప్రజోత్పత్తి నామ సంవత్సర జ్యేష్ఠ నక్షత్ర శుక్ల పంచమి మిట్టమధ్యాహ్నం అభిజిత్ ముహూర్తం లో Sagittarius (ధనుర్రాశి) లో. సుమారు Bc 15-8-3229.  ➡ భీముని జననం : మఖ నక్షత్ర అంగీరస బహుళ నవమి . ధర్మరాజు కన్నా 1సం 19రో చిన్నవాడు. 🏹🏹 అర్జునుని జననం: శ్రీముఖి నామ సం ఫాల్గుణ మాస ఉత్తరా నక్షత్ర శుక్ల పౌర్ణమి. భీమునికన్నా 1సం 4నె 21రో చిన్నవాడు. 🗡⚔ నకుల & సహదేవుల జననం : భవ నామ సం ఫాల్గుణ మాస అశ్విని నక్షత్ర పౌర్ణమి మిట్ట మధ్యాహ్నం. అర్జునుని కన్నా 1సం 15రో  చిన్నవాళ్ళు.  ➡ శ్రీ కృష్ణ జననం : శ్

శ్రీకృష్ణ పరమాత్మ కుమారుడగు సాంబుడు చేసిన -సూర్యనారాయణ స్తోత్రం

శ్రీకృష్ణ పరమాత్మ కుమారుడగు సాంబుడు తన కుష్ఠు వ్యాధి నివారణకై చేసిన సూర్యనారాయణ స్తోత్రం శ్రీకృష్ణ పరమాత్మ కుమారుడగు సాంబుడు తన కుష్ఠు వ్యాధి నివారణకై చేసిన సూర్యనారాయణ స్తోత్రం – ఇది వేదములలో ఉన్న సౌరమంత్రాలనుంచి గ్రహించారు. ఉద్యన్నద్యవివస్వానారోహన్నుత్తరాం దివం దేవః! హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశు నాశయతు ॥ ౧॥ నిమిషార్ధేనైకేన ద్వే చ శతే ద్వే సహస్రే ద్వే! క్రమమాణ యోజనానాం నమోఽస్తుతే నలిననాథాయ ॥ ౨॥ కర్మజ్ఞానఖదశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ! ద్వాదశధా యో విచరతి స ద్వాదశమూర్తిరస్తు మోదాయ ॥ ౩॥ త్వం హి యజూఋక్సామః త్వమాగమస్త్వం వషట్కారః! త్వం విశ్వం త్వం హంసః త్వం భానో పరమహంసశ్చ ॥ ౪॥ శివరూపాత్ జ్ఞానమహం త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్! శిఖిరూపాదైశ్వర్యం త్వత్తశ్చారోగ్యమిచ్ఛామి ॥ ౫॥ త్వచి దోషా దృశి దోషాః హృది దోషా యేఽఖిలేన్ద్రియజదోషాః! తాన్ పూషా హతదోషః కిఞ్చిద్ రోషాగ్నినా దహతు ॥ ౬॥ ధర్మార్థకామమోక్షప్రతిరోధానుగ్రతాపవేగకరాన్! బన్దీకృతేన్ద్రియగణాన్ గదాన్ విఖణ్డయతు చణ్డాంశుః ॥ ౭॥ యేన వినేదం తిమిరం జగదేత్య గ్రసతి చరమచరమఖిలమ్! ధృతబోధం తం నలినీభర్తారం హర్తారమాపదామీడే ॥ ౮॥ యస్య సహస్రాభీశోరభీశు లేశో హిమా

బభ్రువాహనుడు

Image
అర్జునుని చంపిన పుత్రుడు...  బభ్రువాహనుడు మహాభారతంలో కొన్ని కథలకి విస్తృతమైన ప్రచారం ఉంది. కొంతమంది వీరులకు అనంతమైన ఆదరణ ఉంది. కానీ పరీక్షగా చూస్తే ఆ రంగస్థలం మీదకి అడుగుపెట్టిన ప్రతి పాత్రకీ మంచో, చెడో... తనదైన వ్యక్తిత్వం ఉంది. అలాంటి ఒక పాత్రే బభ్రువాహనుడు. అర్జునుడు అరణ్యవాసం చేసే సమయంలో ఒకనాడు మణిపుర రాజ్యానికి చేరుకున్నాడు. ఇప్పటి మణిపూర్‌ రాష్ట్రమే ఆనాటి మణిపుర రాజ్యమని ఓ నమ్మకం. ఆ రాజ్యాన్ని పాలిస్తున్న చిత్రవాహనునికి ఒక్కతే కుమార్తె. ఆమే చిత్రాంగద! అర్జునుడు, చిత్రాంగద తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. పెద్దల అనుమతితో వివాహమూ చేసుకున్నారు. కానీ ఆ వివాహానికి ఓ షరతుని పెట్టాడు చిత్రవాహనుడు. తనకు మగసంతానం లేని కారణంగా తన కుమార్తెకి పుట్టబోయే కుమారుడే మణిపురానికి రాజు కావాలన్నదే చిత్రవాహనుడి అభిలాష. అందుకోసం అర్జునుడు తన భార్యాపిల్లలను తన వద్దనే వదిలి వెళ్లాలన్నదే చిత్రవాహనుడి షరతు. ప్రేమవశాన ఉన్న అర్జునుడు ఆ షరతుకి ఒప్పుకోక తప్పలేదు. కొన్నాళ్లకు వారికి ఒక సంతానం కలిగింది. షరతు ప్రకారం అర్జునుడు వారివురినీ వదిలి తనదారిన తాను హస్తినకు ప్రయాణమయ్యాడు. ఇటువైపు బభ్రువాహనుడు పెరిగి పెద్దవాడ

శ్రీ చక్ర పూజ .

Image
శ్రీ చక్ర పూజ ... శ్రీ చక్రం అనేది విశ్వానికి ప్రతి రూపం, అందులో ఉన్నది విశ్వవ్యాప్త భావనలు, శ్రీ చక్రం పూజ అంటే విశ్వాన్ని తనలో నింపుకున్న అమ్మవారిని పూజ చేయడం, వేరు వేరు శక్తులలో కూడా బాసిస్తున్న అమ్మవారిని పూజ చేయడం, . ఈ పూజను మనము మూడు రకాలుగా చెప్పచ్చు .  1.ప్రతిష్ఠ చేసి పూజించే విధానం, అంటే శ్రీశైల భ్రమరాంబిక దేవి ఎదుట ఉన్న విధంగా   2.మహమేరువు, అర్ధ మెరువు, కూర్మవృస్టమ్, భూప్రస్తారం అనే పేర్లతో, దోరికేటివి ఇంట్లో అర్చించు కోవడం..(శ్రీ చక్ర పూజ సుదీర్ఘమైనది అందులోని ప్రతి దేవతని నమస్కరించడం ,తర్పణం చేయడం తర్వాత పూజించడం..( ex:హృదయ దేవి తర్పయామి ఆలా) దీన్నే సామగ్రంగా నవర్ణావ అర్చన అంటారు. 9 ఆవరణలోని దేవతలను అర్చన చేయడం ఇది సూదీర్ఘమైనది ఇందులో కొన్ని మంత్రాల ఉపదేశము, ఆచరణ,అందులో సిద్ధి ఉన్న వారు మాత్రమే ఆచరిస్తారు.. ౩. విధానం విశ్వమంతా వ్యాపించిన అమ్మవారిని ప్రక్రుతి స్వరూపిణి అయిన జగన్మాతను శ్రీ చక్రంలో భావించడం, పూజ గదిలోని మిగతా విగ్రహాలతో సమానంగా భావించి చేసే పూజ అందులో నవర్ణావ పూజ మంత్రాలు ఉండవు, నియమాలు కూడా తక్కువగా ఉంటాయి.. (నియమాలు అన్నవి మన నిగ్రహం కొసం కానీ వి

హనుమంతుని ప్రార్థన

అమావాస్యనాడు హనుమంతుని ప్రార్థన అమోఘం అంటున్నారు పండితులు ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున హనుమంతునిని ప్రార్థిస్తే.. సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడిని సింధూరంతో అర్చించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి.  ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున నిష్టతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం. అందుచేత అమావాస్య సాయంత్రం పూట మహిళలు, పురుషులు ఆంజనేయ స్వామికి నేతితో దీపమెలిగించి.. హనుమంతుడి ఆలయాన్ని 18 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా మనోధైర్యం, సకలసంపదలు, ఉన్నత పదవులు లభిస్తాయని పండితులు అంటున్నారు. ఇంకా  "అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో " అనే మంత్రాన్ని 9 సార్లు పఠించి.. కర్పూర హారతులు సమర్పించుకున్న వారికి ఈతిబాధలు, గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు. ఆపదుద్ధారక శ్రీ హనుమత్ స్తోత్రం.. ఆపన్నాఖిలలోకార్తిహారిణే శ్రీహనూమతే । అకస్మాదాగతోత్పాతనాశనాయ నమోస్తు తే ॥ ౧॥ సీతావి

ఆంజనేయ దండకం.

శ్రీ ఆంజనేయ దండకం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీ నామసంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ చేయ నూహించి నీ మూర్తినిన్గాంచి నీసుందరం బెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నన్ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై జూచితే దాతవై బ్రోచితే దగ్గరన్ నిల్చితే తొల్లి సుగ్రీవుకున్-మంత్రివై స్వామి కార్యార్థమై యేగి శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి సర్వేశు పూజించి యబ్భానుజుం బంటు గావించి యవ్వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్ లంకిణిన్ జంపియున్ లంకయున్ గాల్చియున్ భూమిజన్ జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషనిన్జేసి సుగ్రీవుడా యంగదా జాంబవంతాది వీరాదులన్ గూడి యాసేతువున్ దాటి వానరుల్-మూకలై పెన్మూకలై దైత్యులన్ ద్రుంచగా ర

కొమర్రాజు లక్ష్మణరావు కోటిమందిపెట్టు కొమర్రాజు

Image
💐  *కోటిమందిపెట్టు  కొమర్రాజు*// (ఈ మహనీయుని పుట్టినరోజు సందర్బంగా)//  "నూటికో కోటికో ఒకరు"  అంటారు కదా!  కొమర్రాజు లక్ష్మణరావు వంటివారు కోటికొక్కరే ఉంటారు. వీరి పూర్తిపేరు కొమర్రాజు వేంకటలక్ష్మణరావు. కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో 18 వ తేదీ  మే, 1877లో  వీరు జన్మించారు. జులై 12 వ తేదీ,  1923లో మరణించారు. వీరి వంశానికి   మూలపురుషుడు కొమ్మరాజు. పెనుగంచిప్రోలు గ్రామపాలకులు వీరే. వ్యావహారికంలో కొమ్మరాజు కొమర్రాజుగా మారింది. లక్ష్మణరావు గురించి  ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనే ఒక విజ్ఞానసర్వస్వం. మునగాల, మద్రాస్, హైదరాబాద్ కార్యక్షేత్రాలుగా ఆయన ముట్టని విజ్ఞాన రంగమే లేదు. బహుభాషావేత్త, చరిత్రకారుడు, పరిశోధకుడు,  పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్త, పరిపాలకుడు, సాహిత్యపోషకుడు ఇలా ఎన్నో రంగాలతో వారి జీవితం ముడిపడి సాగింది. తెలుగుజాతిని ఆధునిక యుగంవైపు నడిపించిన వైతాళికుడు.  వారి కుటుంబమంతా ప్రతిభామూర్తులు, త్యాగకీర్తులే. కాకపోతే, లోకమే వారిని మరిచిపోయింది. ప్రభుత్వాలు వారిని తలవడం కూడా మరిచిపోయాయి. వారి స్మారకంగా ఒక్క విగ్రహం లేదు. ఒక్క ఉత్సవం లేదు. లక్ష్మణరావు స

సర్ప దోషము లేదా సర్ప శాపము:-

సర్ప దోషము లేదా సర్ప శాపము:-  (1) రాహువు 5వ యింట వుండి కుజుని చేత చూడబడినను,  (2) మేష, వృశ్ఛికములలో (కుజ క్షత్రమున) రాహువు ఉండినను, (3)పంచమాధిపతి రాహువు తో కూడినను, శని పంచమమునందు ఉన్నను, శని చంద్రునితో కూడినను, చూడబడినను, (4) పుత్ర కారకు డైన గురుడు రాహువుతో కలిసి వున్నను, (5) పంచమాధి పతి బలహీనుడైనను, లగ్నాధిపతి కుజునితో కలిసి వున్నను, (6) గురుడు కుజునితో కలసియున్నను, లగ్నములో రాహువున్నను, (7) పంచమాధిపతి దుస్థానమున, నీచ, శతృ క్షేత్రమునున్నను, (8) కుజాంశలో కుజుడున్నను, (9) పంచమాధిపతి బుధుడైనను, పంచమాధిపతితో రాహువు కలిసి వున్నను, బుధుడు చూసినను (10) లగ్నమున రాహువు, మాంది యున్నను (11) 5 వ స్థానములో రవి, శని, కుజుడు, రాహువు, గురు, బుధ లుండి పంచమ లగ్నాధిపతులు బలహీనులైనను, (12) లగ్నాధిపతి రాహువుతో కూడినను, పంచమాధిపతి కుజుడైనను, కారకుడు రాహువుతో కూడినను....సర్ప దోషముగా తెలియవలెను. ఈ దోష నివారణకై నాగ పూజ లేదా నాగ ప్రతిష్ఠ చేయవలెను. యధావిధిగా గో, భూ, తిల, హిరణ్య ములు దానమీయవలెను. దీని వలన దోషము పోయి పుత్ర సంతతి కలిగి కులాభివృద్ధి, సంపత్సమృద్ధి కలుగ గలదు. మీ మిత్రుడు యస్. నాగేశ్వర శర్మ (ప్రకాష్)

ఉమా మహేశ్వర స్తోత్రమ్ 🌼

అత్యంత శక్తివంతమైన స్తోత్రం ఇది.భార్య, భర్తల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు ఈ స్తోత్రం పఠించండి. ఆ పార్వతి,పరమేశ్వరుల అనుగ్రహం పొందండి. 🌼🌿 ఉమా మహేశ్వర స్తోత్రమ్ 🌼🌿 ( శ్రీ ఆది శంకరాచార్య విరచితం) నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం ||  నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం నమస్కృతాభీష్టవరప్రదాభ్యాం నారాయణేనార్చితపాదుకాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం ||  నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం విరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యాం విభూతిపాటీరవిలేపనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం ||  నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యాం జంభారిముఖ్యైరభివందితాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం ||  నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం పంచాక్షరీపంజరరంజితాభ్యాం ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం ||  నమః శివాభ్యామతిసుందరాభ్యాం అత్యంతమాసక్తహృదంబుజాభ్యాం అశేషలోకైకహితంకరాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం ||  నమః శివాభ్యాం కలినాశనాభ్యాం కంకాళకల్యాణవపుర్ధరాభ్యాం కైలాసశైలస్థితదేవతాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం ||  నమః శివాభ్యామశుభాపహాభ్యాం అశేషలోకైక

🥀హనుమత్ వ్రతం 🥀

Image
                                  🥀హనుమత్ వ్రతం  🥀 మార్గశీర్షే త్రయోదశ్యాం - శుక్లాయాం జనకాత్మజా |దృష్ట్యా దేవీ జగన్మాతా - మహావీరేణ ధీమతా ||     మృగశిరానక్షత్రం హనుమంతునికి ఇష్టమైనది. భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం, మార్గశిర త్రయోదశినాడు హనుమంతుని పూజించి, హనుమంతుని ఆయన శక్తిస్వరూపమైన సువర్చలాదేవిని పంపానదిని కలశంలోకి ఆవాహనచేసి పూజించి, హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకుని వ్రతం పూర్తిచేసుకుంటారు. పదమూడు ముళ్ల తోరాన్ని ధరిస్తారు. ఈవిధంగా పదమూడు సంవత్సరాలు వరుసగా చేస్తే హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం వ్రతమాచరించిన వారికి కలుగుతుంది అని శాస్త్రవచనం. హనుమంతుడు పంపాతీరంలో విహరించేవాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపానదీతీరంలోనే చేసుకోవాలి. ఇది అందరికీ అసాధ్యం కనుక పంపాతీరానికి బదులు పంపాకలశం ఏర్పాటు చేసి దాని పక్కనే శ్రీ హనుమద్ర్వతం ఆచరిస్తే హనుమంతుడు పంపాతీరంలో వ్రతం ఆచరించినట్లు సంతోషించి అనుగ్రహిస్తాడు.               పంపాకలశ ప్రతిష్ఠా          ఆచమ్య, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీసువర

రంభ-ఊర్వశి-మేనక-తిలోత్తమ

#రంభ-ఊర్వశి-మేనక-తిలోత్తమ      అందానికి అప్సరస అంటారు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి అందరూ అప్సరసలే! అసలు అప్సరసల పుట్టుక వెనుక కూడా ఒక కథ ఉంది. బ్రహ్మ పిరుదులనుండి పుట్టిన రాక్షసులు వెంటపడితే విష్ణుమూర్తి ఊపాయంతో బ్రహ్మ తన శరీరాన్ని విడిచి పెట్టాడట. అప్పుడే తన చేతిని సంతోషంతో వాసన చూసుకున్నాడట. అప్పుడు గంధర్వులూ అప్సరసలూ పుట్టారట. అలాగే క్షీర సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు అప్సరసలు పుట్టారని కూడా చెపుతారు! ఈ అప్సరసలందరూ దేవలోకంలో ఇంద్రుని కొలువులో ఉండి ఆడిపాడి దేవతలకు ఆనందాన్ని అందించేవారు. ఎవరు తపస్సు చేసినా ఎసరు తన సింహాసనానికి వస్తుందేమోనని భయపడి అప్సరసలను ఆటంకపరచమని పంపేవాడు ఇంద్రుడు. వీరంతా పెళ్ళికాని వారే. దేవకన్యలే! రంభ: అప్సరసల్లో ఒక అప్సరస. రంభకు నలకుభేరుడంటే మక్కువ ఎక్కువ. అతని అంతఃపురానికి వెళ్తూవుంటే రావణుడు చూసాడు. ఆపాడు. బలాత్కారం చేయబోతే తప్పించుకుంది. నలకుభేరునికి చెప్పింది. అతడు రావణుని శపించాడు. పర స్త్రీలను బలాత్కరిస్తే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అన్నాడు. అయితే రంభ ఆ తరువాత అంతకన్నా పెద్ద ప్రమాదంలో ఇరుక్కుంది. ఇంద్రుని ఆనతి మీద విశ్వామిత్రుని తపోభంగం చెయ్యాలని

శ్రీ వేంకటేశం శిరసా నమామి।

మకుటరత్నకాంతి మథిత మిశ్రమం శ్రీ వేంకటేశం శిరసా నమామి। అరుణోదయరుచి రాననకమలం శ్రీ వేంకటేశం శిరసా నమామి। స్వర్ణపింగళ భాస్వర నేత్రయుగళం శ్రీ వేంకటేశం శిరసా నమామి।  చలితమకరకుండల గండభాగం శ్రీ వేంకటేశం శిరసా నమామి। నవమణిమయ రసనామధ్యభాగం శ్రీ వేంకటేశం శిరసా నమామి। తరుణరుచిర శుభతరవరహారం శ్రీ వేంకటేశం శిరసా నమామి। సమలంకృతదివ్య స్వర్ణోపవీతం శ్రీ వేంకటేశం శిరసా నమామి। కటితట విలసిత కాంచన చేలం శ్రీ వేంకటేశం శిరసా నమామి।  మంజుమంజీర మహితపదాబ్జం శ్రీ వేంకటేశం శిరసా నమామి।

మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి

మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి *_మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు... అంటే ఠ‌క్కున చెప్పేస్తారు. కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే చెప్ప‌లేరు. అందుకే మీ కోసం ఆ తెలుగు సంవ‌త్స‌రాలు ఇస్తున్నాను..మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి._* _*Know the Telugu Year you born*_ *( 1867, 1927,1987,)*: ప్రభవ *(1868,1928,1988)*: విభవ *(1869,1929,1989)*: శుక్ల *(1870,1930,1990)*: ప్రమోదూత *(1871,1931,1991)*: ప్రజోత్పత్తి *(1872,1932,1992)*: అంగీరస *(1873,1933,1993)*శ్రీముఖ *(1874,1934,1994)*: భావ *(1875,1935,1995)*: యువ *(1876,1936,1996)*: ధాత *(1877,1937,1997)*:  ఈశ్వర *(1878,1938,1998)*: బహుధాన్య *(1879,1939,1999)*: ప్రమాది *(1880,1940,2000)*: విక్రమ *(1881,1941,2001)*: వృష *(1882,1942,2002)*: చిత్రభాను *(1883,1943,2003)*: స్వభాను *(1884,1944,2004)*: తారణ *(1885,1945,2005)*: పార్థివ *(1886,1946,2006)*:  వ్యయ *(1887,1947,2007)*: సర్వజిత్ *(1888,1948,2008)*: సర్వదారి *(1889,1949,2009)*: విరోది *(1890,1950,2010)*: వికృతి *(1891,1951,2011)*: ఖర *(1892,1952,2012)*:  నందన *(

గ్రహాల సంచారం తెలుసుకో....!

Image
గ్రహాల సంచారం తెలుసుకో....! గ్రహావస్థలు గ్రహావస్థలు పది రకాలు. (1) స్వస్థము, (2) దీప్తము, (3) ముదితము, (4) శాంతము, (5) శక్తము, (6) పీడితము, (7) దీనము, (8) వికలము, (9) ఖల, (10) భీతము అనేవి ఆ అవస్థలు. స్వస్థము: స్వక్షేత్ర మందున్న గ్రహము స్వప్నావస్తను పొందును. దీప్తము: ఉచ్ఛక్షేత్ర మందున్న గ్రహము దీప్తావస్త నందుండును. ముదితము: మిత్ర క్షేత్ర మందున్న గ్రహము ముదితావస్తను పొందును. శాంతము: సమ క్షేత్ర మందున్న గ్రహము శాంతావస్తను పొందును. శక్తము: వక్రించి యున్న గ్రహము శక్త్యావస్తను పొందును. పీడితము: రాశి అంతమున 9 సక్షత్ర పాదములలో చివరి పాదము నందున్న గ్రహము పీడావస్థను పొందును. దీనము: శత్రు క్షేత్ర మందున్న గ్రహము దీనావస్థను పొందును. వికలము: అస్తంగత మయిన గ్రహము వికలావస్థను పొందును. ఖల: నీచ యందున్న గ్రహము ఖలావస్థను పొందును. భీతము: అతిచారము యందున్న గ్రహము భీత్యావస్థను పొందును. ఉచ్ఛ స్థానమున ఉన్న దీప్తుడు, స్వక్షేత్రమున ఉన్న స్వస్థుడు, మిత్రక్షేత్రమున ఉన్న ముదితుడు, శుభవర్గమున ఉన్న శాంతుడు, సూర్యునకు దూరమున ఉన్న శక్తుడు, అస్తంగతుడైన వికలుడు, యుద్ధమున పరాజితుడైన పీడితుడు, పాప వర్గమున ఉన్న ఖలుడు, నీచ అందు

నూతన గృహరంభ గృహప్రవేశ విషయమై శుభాశుభములు

Image
నూతన గృహరంభ గృహప్రవేశ విషయమై శుభాశుభములు గృహప్రవేశమునకు శుభాశుభములు శుభ తిథులు : శుక్ల పక్షమున తదియ,పంచమి,సప్తమి,దశమి,ఏకాదశి,త్రయెాదశి,పూర్ణిమ తిథులును,బహుళపక్షమున పాడ్యమి,విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి,తిథులు. శుభ వారములు: సోమ,బుధ,గురు,శుక్రవారములు. శుభ నక్షత్రములు:రోహిణి,మృగశిర,ఉత్తర,ఉత్తరాషాఢ,చిత్త,అనూరాధ,ధనిష్ఠ,శతభిషం,రేవతి. శుభ లగ్నములు:వృషభ,మిథున,సింహ,కన్య,వృశ్చిక,ధనస్సు,కుంభం,మీనం. విశేషములు అష్టమశుద్ది,చతుర్దశుద్ది,కలిశ చక్రశుద్ది కలిగియుండ వలయును.వృషభచక్ర శుద్ది కూడా చూచుట మంచిది. నూతన గృహరంభ గృహప్రవేశ విషయమై వృషభచక్రశుద్ధి రవి యున్న నక్షత్రాదిగా ఫలితములు చూచుకోవాలి.రవి అనూరాధ నక్షత్రములో యున్న అనూరాధ  మెుదలు 3 నక్షత్రములు  అంటే 1.అనూరాధ 2.జ్యేష్ఠ,3.మూల నక్షత్రములలో ఒకటి అయిన దుర్దశగను,తరువాత 4 పూర్వాషాఢ,5.ఉత్తరాషాఢ,6.శ్రవణ,7.ధనిష్ఠ నక్షత్రములైన దురవస్తగా స్వీకరించాలి.కానీ పాఠకులు ఈ శ్రమకు వెనుతగ్గి గృహస్థులకు తగిన న్యాయము జరుపుట లేనందున పాఠకులకు ఇసుమంత శ్రమలేకుండా రవియున్న నక్షత్రమున కెదురు వృషభచక్రశుద్ధి కలిగిన నక్షత్రముల పట్టిక తెలుపుచున్నాను.ముఖ్యము గృహారంభమునకు వృహభచక్రశుద్

వివాహ విషయంలో సప్తమ స్ధానం ప్రాముఖ్యత

వివాహ విషయంలో సప్తమ స్ధానం ప్రాముఖ్యత భారతీయ సాంప్రదాయంలో వివాహం జీవితంలో ఒకే ఒకసారి జరిగే అతి ముఖ్యమైన అంశం. వివాహం అనంతరం భార్యా భర్తలు జీవితాంతం కలసి ఉండే విధంగా జాతకాదులు పరిశీలించాలి. వివాహ విషయంలో కేవలం వధూవరుల గుణమేళన పట్టికలోని గుణాలను మాత్రమే పరిశీలించటమే కాకుండా, మిగతా అంశాలైన సప్తమ స్ధానం, పంచమ స్ధానం, వివాహానంతర దశలు మొదలగు అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవలెను. ప్రస్తుతం వధూవరుల నిర్ణయ విషయంలో ఉభయులకు విద్య, వృత్తి, సంపాదన, ఆస్తి, అందం, రంగు, పొడవు, ఎత్తు, లావు, సన్నం అనే విషయాలపై శ్రద్ధ వహిస్తూ ఇద్దరి మధ్య సామరస్యానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఇద్దరి మద్య సఖ్యత లోపించినప్పుడు పై అంశాలు అన్ని నిరర్ధకం అని తెలుసుకోవాలి.          యుక్త వయస్సు దాటి ఆలస్యమవుతుందని ఆరాట్మ్లో ఏదో ఒక సంబందాన్ని కుదుర్చుకోవాలనే ఆతృత కంటే వధూవరుల శాశ్వత సౌఖ్యానికి అధిక ప్రాదాన్యమిచ్చి ఆలస్యమైనా సరైన సంబంధం నిర్ణయించటం సముచితం.       ప్రస్తుత సమాజంలో మహిళలు విద్య, వివిధ రంగాలలో ఉత్సాహం చూపిస్తూ స్వతంత్ర భావాలు, స్వాభిమానం, ధైర్యం పెంపోందించుకుంటున్నారు. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలు నిర్వహిస్తూ స్వయంగా సంప

అసలు కుజదోషం అంటే ఏంటో తెలుసుకుందామా?

అసలు కుజదోషం అంటే ఏంటో తెలుసుకుందామా? మనలో ప్రతి ఒక్కరూ సహజంగా వివాహ సమయంలో జాతకాలు చూసేటప్పుడు కుజదోషం అనే పదాన్ని వింటూనే ఉంటాం. కుజదోష నిర్ధారణ విషయంలో ఒక్కో పండితుడు ఒక్కోరకంగా నిర్ధారిస్తారు. అసలు కుజదోషం అంటే ఏంటో తెలుసుకుందామా? నవగ్రహాలలో కుజుడిది మూడో స్థానం. కుజుడికి మంగళుడని, అంగారకుడని పేర్లు కూడా కలవు. మేష, వృశ్చిక రాశులకు ఈయన అధిపతి. మకరం ఉచ్చస్థానం, కర్కాటకం ఇతనికి నీచస్థానం. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలకు అధిపతి కుజుడు. మార్గాలు.. వాటి సంగతి పక్కన పెడితే దోష స్థానంలో ఉన్న కుజునికి బుధ గురు గ్రహముల వీక్షణ కలిగినట్లైతే దోషం పరిహారమతుందనీ, అదే విధంగా దోష స్థానంలో ఉన్న కుజునితో గురువుగానీ చంద్రుడు గానీ కలిసి ఉన్నట్లైతే దోషపరిహారం కుజుడు కోప స్వభా వం కలిగినవాడు కావడంతో కుజుడి ఆధిపత్య కాలంలో సోదరుల మధ్య వివాదాలు, రుణబాధలు, భూవివాదాలు తలెత్తుతాయి. . అయితే... ఒకరి జాతకంలో మాత్రమే కుజదోషం ఉంటే కష్టనష్టాలు కలుగుతాయి. ఇందులో భాగంగా... పురుషులకు 2, 12 స్థానాల్లోనూ, స్త్రీలకు 4, 7 స్థానాల్లోనూ... ఒకవేళ ఇద్దరికీ ఎనిమిదో స్థానంలో కుజుడు ఆధిపత్యం వహించినట్లైతే కుజదోషం తప్పకుండా ఉంటుందన