Posts

చందమామ కథలు*

*చందమామ కథలు*  🍃🌹🦜🍃🌹🦚 14-9-2020 *మహేంద్రపురి రాజ్యంలో, సర్పవరం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సాంబన్న అనే పాములు పట్టేవాడుండేవాడు. పాముకాటుకు చికిత్స చేయడంలో కూడా అతడికి మంచి పేరుండేది. సాంబన్నకు లేకలేక ఒక కొడుకు పుట్టాడు. సాంబన్న వాడికి నాగరాజు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు. సాంబన్న భార్యకు మహా జాతకాలపిచ్చి.* *ఆమె ఒకసారి కొడుకు జాతకం, ఆ గ్రామంలో పేరుమోసిన ఒక జ్యోతిష్కుడికి చూపించింది. ఆ జాతకాన్ని ఒకటికి రెండు సార్లు పరీక్షించి చూసిన జ్యోతిష్కుడు సంభ్రమాశ్చర్యాలతో సాంబన్న దంపతులకు, ‘‘ఔరా, ఏమిటీ వింత! మీ కొడుక్కు రాజయోగం ఉంది,'' అని చెప్పాడు. ‘‘రాజయోగమా! హాస్యాలు మాని అసలు సంగతి చెప్పండి, సాములూ,'' అన్నాడు సాంబన్న. ‘‘హాస్యం కాదురా, సాంబూ.* *నిజమే చెబుతున్నాను. నీ కొడుకు రాజయ్యూక, నన్ను మరిచిపోకు,'' అన్నాడు జ్యోతిష్కుడు, జాతక పత్రాన్ని కళ్ళకద్దుకుని సాంబన్న చేతికిస్తూ. ఆ మాటలతో సాంబన్నకు, కొడుకు రాజయోగం పట్ల కొంత నమ్మకం కలిగింది. జ్యోతిష్కుడు చెప్పినట్లు కొడుకు రాజైతే, చదువు రాకపోవడం బాగుండదని, నాగరాజును బడిలో చేర్పించాడు.* *నాగరాజు పదేళ్ళ వయ...

శిలాదమహర్షి

పర్వతలింగం ************ పాల్కురికి సోమనాథుడు శ్రీశైల మహాత్మ్యమును "పండితారాధ్య చరిత్ర" పర్వతప్రకరణంలో శిలాదమహర్షియొక్క కఠోరమైన తపస్సుకు మెచ్చి శివుడు అతనికి ముగ్గురు పుత్రులను ప్రసాదించినట్టుగా చెపుతాడు. మొదటివాడు నందీశ్వరుడు. ఇతడు ఎన్నో వేల ఏండ్లు తపస్సు చేసి, శివుణ్ణి మెప్పించి శివుడికి వాహనత్వాన్ని, ప్రమథాధిపత్యాన్ని పొందాడు. రెండవవాడు పర్వతుడు. ఇతడు కఠోరమైన తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి "పర్వతుడను పేరు గల నేను మహాపర్వతాకారాన్ని ధరించి స్థిరంగా నెలకొంటాను. నీవు నా ఉత్తమాంగం(శిరస్సు) పై అధివసించి పూజలు గైకొనుము" అని వేడుకుంటాడు. శివుడు "తథాస్తు" అంటాడు. మూడవవాడు భృంగీశ్వరుడు. ఇతడు కూడా కఠోరమైన తపస్సు చేసి, శివుణ్ణి మెప్పించి, "శివైకనిష్ఠాభక్తుడిగా, శివసభలో విదూషకుడిగా, నాట్యాచార్యుడిగా" ప్రసిద్ధికెక్కాడు. ఈ విషయం స్కాందపురాణంలో కూడా ఉన్నది. 🔹ఇది శ్రీశైల ఆలయ ప్రాకారం పైన గల శిల్పం. కుడి వైపు శిలాదుడు తపస్సు చేస్తున్న దృశ్యం. శివుడు అతణ్ణి అనుగ్రహిస్తున్న దృశ్యం. ఎడమ వైపు శిలాదుని ముగ్గురు పుత్రులు నందీశ్వరుడు, పర్వతుడు, భృంగీశ్వరుడు ఒకే చోట ఉన...

మహాసర్పం వాసుకి.

పరమేశ్వరుని మెడలో నాగాభరణమై వున్న మహాసర్పం వాసుకి. అన్ని వేళల స్వామి సేవలో ఆ నాగరాజు తరిస్తాడు.కశ్యప ప్రజాపతికి గల 14 పత్నుల్లో వినత, కద్రువలు వున్నారు. వినతకు గరుత్మంతుడు, అనూరుడు ఇద్దరు కుమారులు. వీరిలో అనూరుడు సూర్యుని రథసారథిగా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. కద్రువకు వెయ్యిమంది సర్పాలు సంతానం. వీరిలో పెద్దవాడు ఆదిశేషువు. పాలసముద్రం సమీపంలోని ఉచ్చైశ్రవాన్ని దూరం నుంచి చూసిన కద్రువ తన సోదరి వినతతో దాని తోక నల్లగా వుందని చెబుతుంది. అయితే వినత అంగీకరించకుండా తోక కూడా తెల్లగానే వుంటుందని పేర్కొంటుంది. తోక నల్లగా వుంటే అక్క తన దగ్గర వేయి సంవత్సరాలు పరిచారికగా వుండాలని ఒక వేళ తోక తెల్లగానే వుంటే తానే వినత దగ్గర వేయి సంవత్సరాలు బానిసగా వుంటానని కద్రువ పందం కాస్తుంది. ఇంతలో రాత్రి కావడంతో పొద్దున వచ్చి పరీక్షిస్తామని వెళ్లిపోతారు. గుర్రం తోక తెల్లగానే వుంది ఈ పందెంలో ఎలా నెగ్గాలా అన్న సంశయంలో కద్రువ వుంటుంది. హఠాత్తుగా ఆమెకో ఆలోచన వస్తుంది. తన కుమారులను పిలిచి నల్లగా వున్న వారు వెళ్లి గుర్రం తోకను చుట్టుకోవాలని కోరుతుంది. దీన్ని వారు అంగీకరించరు. ఇది ధర్మసమ్మతం కాదని వారు వాదిస్తారు. వారి వాదన...

నవగ్రహాల శక్తి

నవగ్రహాల శక్తి గురించి మీకు తెలుసా?   గ్రహానికి శాంతి చేయించుకోమని జ్యోతిష్యులు చెప్పారా? గ్రహానికి శాంతి చేయించుకుంటే ఎలాంటి ఫలితం చేకూరుతుంది అని తెలుసుకోవాలా? అయితే ఈ స్టోరీ చదవండి. మనకు నవగ్రహాలున్నాయి. నవగ్రహాల్లో అగ్రజుడు సూర్యుడు బుద్ధిని వికసింపజేస్తాడు. మనస్సును స్థిరపరుస్తాడు. ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. ఇక కుజుడికి మనస్తాపం కలిగించే లక్షణాలున్నాయి. ఈయన్ని ప్రార్థిస్తే మనస్తాపానికి గల కారకాలను దూరం చేస్తాడు. ప్రశాంతతను ఇస్తాడు. నవగ్రహాల్లో మూడోవాడైన రాహువు కంటి బలాన్ని తగ్గిస్తాడు. శరీరంలోని మాంసంలో దోషాన్ని ఏర్పరుస్తాడు. ఈయన్ని పూజిస్తే కంటికి బలాన్ని కలుగజేస్తాడు. శరీర మాంసంలోని దోషాలను నివృత్తి చేస్తాడు.    గురువును ఆరాధిస్తే.. బృహస్పతిగా పిలువబడే ఆయనను ప్రార్థిస్తే.. వృత్తి, ఉద్యోగాల్లో నైపుణ్యతను ప్రసాదిస్తాడు. మెదడును చురుకుగా ఉంచుతాడు. ఇక శనిగ్రహం గురించి తెలుసుకుందాం.. శని ఉత్తముడు. ఆయన జీవితంలో మనకు ఎన్నో పాఠాలను నేర్పుతాడు. ఆయన్ని పూజిస్తే.. ఇలా చేయొద్దు.. ఇలా చేయమని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. సరైన మార్గాన్ని అనుసరించమంటాడు. ఆ మార్గాన్ని చూపెడతాడు....

ఆర్యభట్ట

ఆర్యభట్ట '0' ని కనుక్కున్నాడని చెప్తారు కదా మరి ఆయన కలియుగంలో కనుక్కున్నాడు కదా అలాంటప్పుడు పూర్వ యుగాలలో కౌరవులు 100 అని రావణుడికి 10 తలలు అని ఎలా లెక్కపెట్టారు అని ఒక విద్యార్ధి అడగగా, ఆ టీచర్ రాజీనామా చేసి అన్వేషిస్తూ, అన్వేషిస్తూ వేదిక్ స్కూల్ లో చేరాడు. పైన చెప్పింది హాస్యంగా అనిపించినా కానీ అందులో ముఖ్య విషయం వుంది. ఒక పండితుడు ఐన వేదాంతీకుడి మాటలలో   నేను మీకు వేదాల నుండి ఒకటి పురాణాల నుండి ఒకటి చొప్పున ఆధారం ఇస్తున్నాను. 1)వేదాల నుండి యజుర్వేదం ప్రకారం మేధాతిథి మహర్షి ఒక యజ్ఞం చేయటానికి ఇటుకలు పేరుస్తూ అగ్నికి ఈ విధంగా ప్రార్ధించాడు. ఇమం మే ఆగ్నా ఇష్టక దేనవ, సంత్వేక కా, దశ కా, శతం కా, సహస్రం కా, యుతం కా, నియుతం కా, ప్రయుతం కా, అర్బుదం కా, న్యార్బుదం కా, సముద్రం కా,మధ్యం కా, అంతం కా, పరార్ధం కా, ఇత మే అగ్నా ఇష్టక దేనవ సంత్వాముత్రం ముష్మిన్లోకే. అగ్ని ప్రతిష్టకు అర్చకులు ఈ మంత్రాన్ని మొదటగా చదువుతున్నారు. అంటే, ఓ అగ్ని దేవా! ఈ ఇటుకలే నాకు పాలిచ్చే ఆవులుగా మారాలి అలా నాకు వరం ఇవ్వండి అవి ఒకటి, పది, వంద, వేయి, పది వేలు, లక్ష, పది లక్షలు, కోటి, పది కోట్లు, వంద కోట్లు, వేయి ...

హనుమాన్‌ చాలీసా*

🪔🕉 *హనుమాన్‌ చాలీసా* 🕉🪔 *శ్రీ గురుచరణ సరోజరజనిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమల యశ జో ధాయక ఫల చారీ బుద్ధిహీన తను జానికే సుమిరైపవన కుమార్‌ బల బుద్ధి విద్యా దేహు మొహి హరము కలేశ వికార్‌* 1. జయహనుమాన జ్ఞాన గుణసాగర | జయ కపీశ తిహులోక ఉ జాగర 2. రామదూత అతులిత బలధామా | అంజని పుత్ర పవన సుత నామా|| 3. మహావీర విక్రమ బజ రంగీ | కుమతి నివార సుమతికేసంగీ 4. కంచన వరణ విరాజ సువేశా | కానన కుండల కుంచిత కేశా || 5. హాథ వజ్ర ఔధ్యజావిరాజై | కాంథే మూంజ జనేపూసాజై 6. శంకర సువన కేసరీ నందన | తేజ ప్రతాప మహాజగ వందన || 7. విద్యావాన గుణీ అతి చాతుర | రామకాజ కరివేకో ఆతుర || 8. ప్రభు చరిత్రసునివేకో రసియా | రమ లఖన సీతా మనబసియా || 9. సూక్ష్మరూప ధరి సియహి దిఖవా | వికటరూప దరి లంకజరావా || 10. భీమ రూప ధరి అసుర సంహారే | రామచంద్రకే కాజ సవారే || 11. లాయ సజీవన లఖన జియాయై | శ్రీ రఘువీర హరషి ఉరలాయే || 12. రఘుపతి కిన్హిబహుత బఢాయీ | తమ్మమప్రియభరతహి సమభాయీ || 13. సహస్ర వదన తువ్హురో యశగావై | అసకహి శ్రీపతికంఠలగావై || 14. సనకాదిన బ్రహ్మాది మునీశా | నారద శారద సహిత ఆహీశా || 15. యమ కుబేర దిగపా జహాతే | కవి కోవిద కహిసకేకహాతే || 16. తుమ ఉపకార ...

గాయత్రీ దేవి

గాయత్రీ దేవి పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండే వాడు. అతడు దేవతలను ద్వేషించేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగాతీరంలో నిరాహార దీక్షతో గాయత్రీ జపపరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు. తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది. ఆ వేడిమికి లోకాలన్నీ తపించిపోయాయి. దేవతలు కలతచెంది. బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై 'వరం కోరుకో' అన్నాడు. అతడు తనకు మృత్యువులేని జీవనం కావాలన్నాడు. ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు. 'మరేదైనా వరం కోరుకో' అన్నాడు. అంతట, ఆ రాక్షసుడు "చతురాననా! మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కాని , శస్త్రాస్త్రాలచేత కాని, స్త్రీ పురుషులలో ఎవ్వరిచేత కాని, రెండు కాళ్ళు గల ప్రాణిచేత గాని, నాలుగు కాళ్ళ గల జంతువు చేతగాని, పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేతగాని మరణం లేకుండా వరమి"మ్మని కోరాడు. బ్రహ్మ "తథాస్తు" అన్నాడు. బ్రహ్మ దత్త వరగర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు. ముందుగా ఒక దూడను ఇంద్రుని...