Posts

కేదార్‌నాథ్ ఆలయం రహాస్యం.

కేదార్‌నాథ్ ఆలయం అనేది అంతుచిక్కని రహాస్యం. కేదార్‌నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దాని గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి.   పాండవుల నుండి ఆదిశంకరాచార్యుల వరకు కూడా కానీ మనము దానిలోకి వెళ్లాలనుకోవడం లేదు. కేదార్‌నాథ్ ఆలయం బహుశా 8వ శతాబ్దంలో నిర్మించబడిందని నేటి శాస్త్రం సూచిస్తుంది.  అంటే ఈ ఆలయం కనీసం 1200 సంవత్సరాల నుండి ఉంది. కేదార్‌నాథ్ ఉన్న భూమి అప్పుడే కాదు ఇప్పటికీ 21వ శతాబ్దంలో కూడా చాలా ప్రతికూలమైనది.  ఒకవైపు 22,000 అడుగుల ఎత్తులో కేదార్‌నాథ్ కొండ, మరోవైపు 21,600 అడుగుల ఎత్తులో కరచ్‌కుండ్ మరియు మూడో వైపు *22,700 అడుగుల ఎత్తులో భరత్‌కుండ్* ఉన్నాయి. ఈ మూడు పర్వతాల గుండా ప్రవహించే ఐదు నదులు మందాకిని, మధుగంగ, చిర్గంగ, సరస్వతి మరియు స్వరందరి. వీటిలో కొన్ని మన పురాణాలలో వ్రాయబడ్డాయి.  ఈ ప్రాంతం " మందాకినీ నది" యొక్క ప్రారంభ ప్రాంతం.  చలికాలంలో విపరీతమైన మంచు కురిసే చోటు, వర్షాకాలంలో నీరు అతి వేగంతో ప్రవహించే ప్రదేశం, ఇలాంటి ప్రదేశంలో ఇంతటి కళాఖండాన్ని రూపొందించడం ఎంతో ప్రయాసతో కూడిన అద్భుతమైన విషయం. నేటికీ,  "కేదార్‌నాథ్ ఆలయం"  ఉన్న ప్రదేశానికి ...

కుమారసంభవం

శివ పురాణంలో చెప్పబడిన శ్రీ సుబ్రహ్మణ్యుని జన్మ వృత్తాంతం స్కందోత్పత్తి కుమారసంభవం సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే చదువుతారో వారి పిల్లలు ఆపదల నుంచి రక్షింపబడతారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే స్కందోత్పత్తి చదువుతారో వారి పిల్లలు ఆపదల నుంచి రక్షింపబడతారు. మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి. ఆయనకు దక్షప్రజాపతి కుమార్తెలు పదమూడు మంది ఆయనకు భార్యలు. కశ్యప ప్రజాపతి భార్యలలో దితి - అదితికి ఉన్నంత ప్రాశస్త్యం మిగిలిన భార్యలకు కనపడదు. దితి భావనలు శ్రీమన్నారాయణుని దుష్టశిక్షణకు అనేకమయిన అవతారములు తీసుకునేటట్లుగా చేసాయి. దితియందు మార్పురాలేదు. క్షేత్రమునందే తేడా ఉన్నది. కశ్యపప్రజాపతిని ‘నాకు ఇంద్రుడిని చంపే పిల్లవాడు కావాలని అడిగితే అపుడు ప్రజాపతి నవ్వి ‘నీ కోరిక తీర్చగలిగిన వాడిని నేను కాదు ఈశ్వరుని సేవించు. నీవొక గొప్ప తపస్సు చెయ్యి తపస్సు చేస్తున్నప్పుడు ధర్మంలో లోపం రాకూడదు. నీకు బిడ్డ పుట్టేవరకూ అలా ఉండగలిగితే నీకు ఇంద్రుడిని సంహరించగలిగిన కుమారుడు పుడతాడు’ అని చెప్పాడు. ఆవిడ లోపలి కశ్యప ప్రజాపతి తేజము ప్రవేశించింది. ఆవిడ గర్భిణి అయింది. లోపల గర్భం పెరుగుతోంది. ఇది ఇంద్రుడికి తెలిసి ఆవిడ దగ్గర...

సూతకం {మైల} ఎప్పుడు ఎలా..?💐💐

💐💐సూతకం {మైల} ఎప్పుడు ఎలా..?💐💐 మైల, సూతకం అనే విషయాలు ధర్మసింధు అనే గ్రంథంలో వివరించబడ్డాయి. తాశౌచ(పురుడు) మ్రుతాశౌచ(మైల) కాలాలో అందరూ, రజోదర్శన కాలంలో(ముట్టు) స్త్రీలు అస్ప్రుశ్యులుగా భావించబడతారు.  సూతకం రెండు రకాలు.. జాతాశౌచం, మృతాశౌచం. షోడశ సంస్కారాల్లో ఒకటి అశౌచం. చావు సంభవించిన ఇంటిలో నివాసముండడం మంచిది కాదనే నమ్మకంతో సంవత్సరకాలం ఆ ఇంటిని ఖాళీగా ఉంచుతారు. దీన్ని సూతకమని అంటారు. సూతకం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు? ఎవరి ఇంట్లో శిశువు జన్మించింది? ఎవరి ఇంట్లో మరణం సంభవించింది? ఆయా ఇళ్ళల్లో నివసించే వారందరికీ మాత్రమే వర్తిస్తుంది. జాతికి, వంశానికి, గోత్రానికి సంబంధం లేదు. వారితో కలిసి కాక దూరంగా ఉండేవారికి వర్తించదు.   కొత్తగా పెళ్లయిన అమ్మాయికి మేనమామ చనిపోతే మూడు రోజుల పాటు మైల ఉంటుంది. అయితే, అమ్మాయి భర్తకు ఉండదు. ఇది 12 రోజుల లోపు తెలిస్తే ఒక రోజు మైల ఉండును.  మన తెలుగు సంప్రదాయం ప్రకారం బ్రహ్మణ, క్షత్రియ, వైశులకు, మాత్రం తప్పనిసరిగా సంవత్సరికం వరకు గృహప్రవేశాదులు, దైవరాధానులు కూడా నిషిద్ధం. సంవత్సర సూతకం దాటిన తరువాతే వీటిని నిర్వహించే అధికారం ఉంది. ద్వెజీ...

గోపికా వస్త్రాపహరణం :

భాగవతం 115వ భాగం గోపికా వస్త్రాపహరణం : భగవానుడు కృష్ణుడిగా అవతరించిన తరువాత చేసిన లీలలు అనేకము ఉన్నాయి. అందులో గోపికా వస్త్రాపహరణ ఘట్టము పరమ ప్రామాణికమయినది. ఆ ఘట్టములో మనం తెలుసుకోవలసిన గొప్ప రహస్యం ఒకటి ఉన్నది. అది తెలుసుకుంటే మనం ప్రతినిత్యము చేసే కర్మ అనగా పూజాదికములలో పొరపాట్లనుండి ఎలా గట్టెక్కగలమో ఒక అద్భుతమయిన మార్గమును చూపించగలిగిన లీల. బృందావనంలో వుండే గోపకాంతలు అందరూ కూడా కృష్ణ భగవానుడినే పతిగా పొందాలని నిర్ణయం చేసుకున్నారు. అది ఒక విచిత్రమయిన విషయం. ఒక చిన్న ఊరిలో ఒక యోగ్యుడయిన వరుడు ఒక యింట్లో ఉన్నాడనుకొండి ఆ ఊళ్ళో ఉన్న కన్యలందరూ ఎక్కడయినా అతనిని భర్తగా పొందాలని సామూహిక పూజ చేస్తారా? చేయరు.  కానీ ఇక్కడ గోపకాంతలు అటువంటి పూజనొక దానిని చేశారు. వారు కృష్ణుడిని భర్తగా పొందడానికి కృష్ణుడి వ్రతం చేయలేదు. ఇది వ్యాసుని సర్వోత్క్రుష్టమయిన ప్రతిపాదన.  వారు మార్గశీర్ష మాసములో ఒక వ్రతము చేశారు. యథార్థమునకు భాగవతంలో గోపకాంతలు మార్గశీర్ష మాసంలో చేసిన వ్రతం కాత్యాయనీ వ్రతం. వీరందరూ కలిసి కాత్యాయనీ దేవిని ఉపాసన చేశారు. కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మించి ఆయనను ఉద్ధరించింది కాబట్టి...

కాళియ మర్దనము:

భాగవతం 113వ భాగం కాళియ మర్దనము: ఒకనాడు కృష్ణభగవానుడు గోపబాలురతో ఒక సరస్సు ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాడు. ఆ నాడు బలరాముడు కృష్ణుడితో రాలేదు. దానిని కాళింది మడుగు అంటారు. అది యమునానదిలో అంతర్భాగం. ఈ పిల్లలందరికీ దాహం వేసింది. అపుడు వారు కాళిందిలో వున్న నీరు త్రాగారు. వెంటనే వారందరూ మరణించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ మరణించాయి. వెంటనే పరమాత్మ కరుణా దృష్టితో చూశాడు. అపుడు ఈ పిల్లలందరూ నిద్రపోయిన వాళ్ళు లేచినట్లుగా లేచారు. ఆ నీళ్ళలోంచి ఎప్పుడూ బుడగలు వస్తుంటాయి. ఆ నీళ్లు ఉడికిపోతున్నట్లుగా ఉంటాయి. ఆ నీటినుంచి పైకి లేచిన గాలి పీల్చినంత మాత్రం చేత పైన ఎగురుతున్న పక్షులు మరణించి ఆ చెరువులో పడిపోతూ ఉంటాయి. ‘ఈ నీళ్ళు ఎందుకు యిలా వున్నాయి?’ అని వాళ్ళని అడిగాడు. డానికి కారణం – ఎప్పటినుంచో ఆ మడుగులో కాళియుడు అనబడే నూరు తలలు కలిగిన పెద్ద నల్లత్రాచు ఒకటి ఆ మడుగులో పడుకుని ఉంటుంది. దానికి అనేక భార్యలు. ఎందఱో బిడ్డలు. అది ప్రాణులను పట్టుకుని హింసించి తింటూ ఉంటుంది. తన విషమునంతటినీ ఆ నీటిలోకి వదులుతూ ఉంటుంది. అందువలన ఆ నీరంతా విషపూరితం అయింది అని తెలుసుకున్నాడు. కృష్ణుడు ‘మీరు అందరూ మరణించడానికి యిది ...

పురాతన_భారతీయ_గణితం

# పురాతన_భారతీయ_గణితం భారతదేశంలో చాలా ప్రాచీన కాలంలోనే చాలా ఆధునిక గణిత ఆవిష్కరణలు జరిగాయి. ప్రారంభ కాలం నుండి అనగా (సా.శ.పూ1000 ఏండ్ల కి ముందు అనగా 3000ఏండ్ల క్రితం)10నుండి  వంద , పది ట్రిలియన్ల వరకు పది కి సంఖ్యలుగా పిలుస్తాయి మరియు అదనంగా, సంకలనం  వ్యవకలనం, గుణకారం,  భిన్నాలు,  చతురస్రాలు,  ఘనాల మరియు  మూలాలు వంటి అంకగణిత కార్యకలాపాల వాడకానికి ఆధారాలను అందిస్తాయి. 4 వ శతాబ్దం AD సంస్కృత వచనం ప్రకారం బుద్ధుడు 1053 వరకు సంఖ్యలను లెక్కించడాన్ని, అలాగే వీటిపై మరియు అంతకంటే ఎక్కువ ఆరు సంఖ్యల వ్యవస్థలను వివరిస్తూ 10421 కు సమానమైన సంఖ్యకు దారితీస్తుంది. మొత్తం విశ్వంలో 108 అణువుల అంచనా ప్రకారం, ఇది పురాతన ప్రపంచంలో అనంతానికి దగ్గరగా ఉంది. ఇది ఒక అణువు యొక్క పరిమాణాన్ని ప్రదర్శించడానికి, పరిమాణాన్ని తగ్గించే పునరావృత శ్రేణులను కూడా వివరిస్తుంది, ఇది కార్బన్ అణువు యొక్క వాస్తవ పరిమాణానికి (మీటరుకు సుమారు 70 ట్రిలియన్లు) దగ్గరగా వస్తుంది. సా.శ.పూర్వం 8 వ శతాబ్దం నాటికి, # పైథాగరస్ కు చాలా ముందు, “# శుల్బ_సూత్రాలు” (లేదా “సుల్వా సూత్రాలు”) అని పిలువబడే ఒక వచనం అ...

లలితా నామాలతో కార్య సాధన.

లలితా నామాలతో కార్య సాధన. మంత్రతుల్యం అయిన శ్రీ లలితా సహస్రనామాలతో సామాన్య అవసరాలను సాధించే పద్ధతులు ఉన్నాయి. ఇవి అన్ని అనుభవంలో చేసి సరిచూసిన విధానాలు. ఆయా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు చెప్పుకునే నామ వాక్యాలను ప్రతీ పర్యాయం పఠిస్తూ లలితా నామ స్తోత్రం లోని 365 పంక్తులు ప్రతీ రోజూ పారాయణ చేయాలి. నిస్సందేహంగా కార్య సిద్ది పొందగలరు. సాధన కాలం 40 రోజుల నుంచి 60 వరకూ చేయండి. సూచన :- ఇప్పుడు చెప్పబడే సాధన పద్దతులను అనుభవం ఉన్న పండితుల వద్ద గానీ, గురువు గారి వద్ద గానీ మెలకూవలు తెలుసుకుని సాధన చేస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని విషయాలు ఇక్కడే చెప్పడం భావ్యం కాదు. ఇవి లలితా దేవి భక్తులకు, శ్రీవిద్య ఉపాసకులకు ఉపయోగపడుతుంది. ఇక్కడ తెలిపిన ప్రతీ పద్దతికి సమయం, కట్టుకోవాల్సిన వస్త్రం, చేయవలసిన దీపారాధన, జప సంఖ్య, కూర్చోవాల్సిన దిశ, సంపుటీకరణ వగైరా లాంటి విషయాలు గురువు వద్ద తెలుసుకొని చేయడం మరింత ఉత్తమంగా ఉంటుంది.  🌷 భర్తృవశీకరణ ( అనుకూలత) :-  లలితా నామం :-  మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా | అనే ఈ వాక్య నామాన్ని లలితా నామ స్తోత్రంలోని ప్రతి పంక్తికి అనుసంధానం చేసి పఠించ...