Posts

planets position and favour

*When Jupiter is in 5th house from Sun, Native gets favouring Boss or Blessed Guru in life.*   *2nd Lord When Connected with Moon native likes to Travel a lot.*   *Rahu in 12th house to 9th Lord native has Great Luck and fortune. Native gains a lot in dasha of Mercury.*   *Mercury in 9th house to Female planets, native gets blessed with multiple Intelligent friends.*

*91 నాడీ రాశ్యాధివివరములు*

*91 నాడీ రాశ్యాధివివరములు*  శ్లో:- నాడీరాశి తదీశయోనివనితా దీర్ఘా గణశ్చాపిష         డ్వర్గా ముఖ్యతరా వివాహసమయే శేషాస్తుమథ్యాస్తతః         మహేంద్రో గణితాయవశ్యదివసావర్ణోడువిద్థాండజా         రజ్జుర్యోగినిలింగభూతశశియుగ్గోత్రాహ్వయా వింశతిః *తాత్పర్యము*:- వివాహ విషయములో నాడీకూటము, రాశి, వర, గ్రహ, మిత్రత్వ, యోని, స్త్రీ దీర్ఘవర్గులు విశేషప్రభావములుగలయవి. వాటిని జాగ్రత్తగా పరిశీలించవలయును. మహేంద్ర గణిత వర్గులు, ఆయనదినవర్గులు, జాతివేధకూటములు, పక్షి, రజ్జు కూటములు, యోగిని, లింగ, భూకూటములు, చంద్రయోగ కూటములు, గోత్రవర్గములు మధ్యమములు. ఇంకను పరిశీలించవలసినవి ముందు చెప్పబడుచున్నవి.  శ్లో:- యాతస్యాస్తు కరగ్రహే యది చతుస్త్రిద్వ్యం ఘ్రిథిష్ణోద్థితా         దస్రర్షాత్త్రిషు వహ్ని భాద్యది చతుర్ష్వేవేంధుభాత్పంచసు        నాడీపర్వసు తత్క్రమాచ్చ గణనాభిన్నాంగుళిస్థాశుభా        నాడిశుద్ధిరిహైవ భాగ్యజననీ మాంగళ్యసూత్రంతుసా *తాత్పర్యము*:- 4 పాదములుగల నక్షత్ర నందు పుట్టిన స్త్రీకి అశ్వని ...

రహస్య త్రయం‎*

*రహస్య త్రయం‎* *సుభాల ఉపనిషత్ ఇచ్చే ప్రమాణం* ఈ ఉపనిషత్ చాలా విచిత్రమైన విషయాలను తెలుపుతుంది. మన శరీరంలో గుండే, వివిద నాడులు ఎట్లా ఉంటాయి. జీవుడు ఆయా నాడుల్లో ఎట్లా సంచరిస్తాడో చెబుతుంది. అట్లా సంచరిస్తే ఏమి దర్శిస్తాడో తెలుపుతుంది. మనకు వచ్చే కలలు ఎట్లా వస్తాయి, జీవుడు ఏఏ నాడుల్లో సంచరిస్తే ఎట్లాంటి కలలు వస్తాయో చెబుతుంది. మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, అహంకారం, బుద్ది, ఆత్మ ఇలా పదహారింటికీ మన దేహంలో రకరకాల గతులు ఉంటాయి. మామూలుగా మనం ఒక ప్రదేశాన్ని చూసినట్లు కల వస్తే, ఎప్పుడో మనం ఆ ప్రదేశాన్ని చూసి ఉంటాం. మనం ఒక్కో ప్రదేశాన్ని చూడాలంటే ఆయా రోడ్డు మార్గంలోనే వెళ్తాం, అట్లానే మనం చూసే కల కూడా జీవుడు నడిచే నాడిని బట్టి అని చెబుతుంది. వేదాల్లో ఇలా మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. సాధన చేసిన యోగులు వారు కోరిన మార్గాల్లో ఇంద్రియాలని నడిపి లోని ప్రపంచాన్ని చూడగలరు. ఆ సాధన ఎట్లా చేయాలో కూడా ఈ ఉపనిషత్ చెబుతుంది.      ఈ ఉపనిషత్ మరో విషయం చెప్పింది. మన శరీరంలో ఒక్కో భాగం తీసుకొని ఆయా భగం ఎట్లా ఈ రూపు దిద్దుకుంది అనేది తెలుపుతుంది. కన్ను లేక చక్షువు ఉంది, దానికి ఆ చ...

లలితాసహస్రనామ స్తోత్రం - నామ విభజన పట్టిక

లలితాసహస్రనామ స్తోత్రం - నామ విభజన పట్టిక శరన్నవరాత్రుల లో లలితా సహస్రనామ పారాయణం చేస్తారు చాలా మంది. ఐతే, ఈ శ్లోకాల్లో, నామవిభజన ఎక్కడెక్కడ జరుగుతుందో చాలా మందికి సరిగా తెలియదు. అందుచేత తప్పులు దొర్లుతాయి పారాయణంలో. ఈ లలితా సహస్ర నామ స్తోత్రంలో, కొన్ని నామాలు చాలా దీర్ఘంగా ఒక పాదం అంతా ఆక్రమించి ఉంటాయి. మరి కొన్ని నామాల విభజనలు, సంస్కృత భాషాపరిజ్ఞానం ఉన్న వాళ్ళకూ కొంచెం ఆశ్చర్యం‌ కలిగిస్తాయి. సాధారణంగా చాలా మందికి ఇటువంటి అనుష్టుప్ ఛందస్సులో ఉన్న శ్లోకాలు చదవటం గురించి మంచి అలవాటు ఉంటుంది.  కాని, సాధారణ ధోరణికి చాలా భిన్నంగా లలితా సహస్రంలో నామాల ఆద్యంతాలు కనబడుతాయి.  అందువలనే చదవటంలో ఎక్కువ తప్పులు దొర్లేది. ఈ క్రింద పట్టికలో శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలోని శ్లోకాలను నామవిభజనతో పొందుపరుస్తున్నాను దీనివల్ల  నామ పారాయణం చేసే సమయంలో దొర్లే తప్పులు సవరించుకో వచ్చును. నామసంఖ్య...  నామం.... 1 శ్రీమాతా।    2 శ్రీమహారాజ్ఞీ।   3 శ్రీమత్సింహాసనేశ్వరీ।  4చిదగ్నికుండసంభూతా।                 5దేవకార్యసముద్యతా।...

గోధూళికా ముహూర్తము

🎻🌹🙏గోధూళికా ముహూర్తము  🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌸సూర్యుడున్న ముహూర్తమునుండి ఏడవది గోధూలికా ముహూర్తమని అనబడును.విపులంగా చెప్పాలి అని అంటే పూర్వము పశువులు ఎక్కువగా ఉండేవి. 🌿ఉదయాన్నే  ఊరి బయటకు మేత కొరకుపశువులనుతోలుకుపోయేవారు.తిరిగిసాయంకాలముసూర్యాస్తమయమునకు ముందుగా ఇంటికి తోలుకు వచ్చేవారు.  🌸అలా వచ్చే సమయములో పశువుల మంద వచ్చేటప్పుడు ధూళి రేగేది.అలాంటిసమయమునుగోధూలికా ముహూర్తముగా వివరించారు.  🌿క్లుప్తంగా చెప్పాలంటే సాయంకాలం 4.30 నిమిషముల నుండి సుమారు 6 గంటల వరకు ఈసమయముఉండును. దీనినే గోధూలికా ముహూర్తము అని అంటారు. 🌸ఈ ముహూర్తమును సకల శుభాలకు ఉపయోగించ వచ్చును. వర్జ్యముదుర్ముహూర్తములతోపనిలేదు. హిందువుల దైనిక ఆచారాలలో సాయంసంధ్యకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది.  🌿దీనిని "గోధూళి వేళ" అని, "అసుర సంధ్యఅనికూడావ్యవహరిస్తారు.పగటికి రాత్రికి సంధి కాలమే సంధ్యా సమయం. 🌸సూర్యాస్తమయం తర్వాత రమారమి 45 నిమిషాలు అసురసంధ్య ఈ సమయంలో శుచి,శుభ్రతలతో భగవంతుడిని ప్రార్ధించాలి. 🌿భోజనం చేయడం,నిద్రపోవడం లాంటి పనులు చేయరాదు. ఈ సమయంలో పరమశివుడు పార్వతీ సమేతంగా కైలాసంలో తాండవం చేస్తాడు. 🌸కైలాస...

శ్రీపతంజలి కృత శంభు నటన స్తోత్రం..

శ్రీపతంజలి కృత శంభు నటన స్తోత్రం.. 1)సదంచితం ఉదంచిత నికుంచిత పదం ఝలఝలం చలిత మంజు కటకం పదంజలి దృగంజన అనంజనం అచంచల పదం జనన భంజనకరం!! 2)కదంబ రుచిం అంబరవసం పరమం అంబుద కదంబక విడంబక గళం చిదంబుధిమణిం బుధ హృదంభుజ రవిం పర చిదంబర నటం హృది భజే!! 3)హరం త్రిపుర భంజనం అనంత కృతకంకణం అఖండదయం అంత రహితం విరించి సురసంహతి పురంధర విచింతిత పదం తరుణ చంద్ర మకుటం పరం పద విఖండిత యమం భసిత మండిత తనుం మదన వంచన పరం చిరంతనం అముం ప్రణవ సంచిత నిధిం పర చిదంబర నటం హృది భజే!! 4)అనంత అఖిలం జగత్ అభంగ గుణ తుంగం అమతం ధృత విధుం సురసరిత్ తరంగ నికురుంబ ధృతి లంపట జటం సమనఢంబ శుహరం భవహరం శివం దశ దిగంతుర విజృంభితి కరం కరలసం మృగశిశుం పశుపతిం హరం శశి ధనంజయ పతంగ నయనం పర చిదంబర నటం హృది భజే!! 5)అనంత నవరత్న విలసత్కటక కింకిణీ ఝలం ఝల ఝలం ఝలరవం ముకుంద విధి హస్తగత మద్దళల యధ్వని ధిమిధ్ధిమిత నర్తన పదం శకుంతరత బర్హిరథ నందిముఖ దంతిముఖ భృంగిరిటి సంగ నికటం సనంద సనక ప్రముఖ వందిత పదం పర చిదంబర నటం హృది భజే!! 6)ఇతి స్తవం అముం భుజగ పుంగవ కృతిం ప్రతి దినం పఠతి యః కృత ముఖా సదః ప్రభు పదద్వితయ దర్శనపదం సులలితం చరణ శృంగ రహితం సరః ప్రభవ సంభవ హరిత్పతి హరి ప...

గాజులు అలంకరణ

గాజులు మనకు అలంకరణ వస్తువులుగా, ఆభరణాలుగా మాత్రమే తెలుసు. రంగు, రంగు గాజులను ధరించి ఫ్యాషనబుల్గా కనిపించడానికి ప్రయత్నిస్తాం. అలాగే చేతినిండా బంగారు గాజులు ధరించి, వాటిని ఆస్తిగా పరిగణిస్తాం. అయితే గాజులు ధరించడం అనే ఆచారం ఎందుకు వచ్చిందో తెలుసా? గర్భాశయ నాడులను ఉద్దీపనం చేయడానికి ఉద్దేశించినవే గాజులు. మహిళలకు మణికట్టుకు ముంజేతికి మధ్య ఉండే నాడులు గర్భాశయ నాడులతో అనుసంధానమై ఉంటాయి. మణికట్టు నాడులు స్వల్పంగా ఒత్తిడికి లోనవుతుంటే, గర్భాశయ నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజితమవుతాయి. దాంతో గర్భాశయం పనితీరు, కండరాల కదలికలు సవ్యంగా జరుగుతుంటాయి. ఇందుకు తప్పనిసరిగా గాజులనే ధరించాలా? ప్రత్యామ్నాయం లేదా అంటే.. ఉంది. రోజూ కొంతసేపు మణికట్టు-ముంజేతి మధ్య చేత్తో నొక్కుకొవచ్చు. అలాగని మర్దన చేసినంత ఒత్తిడి పడకూడదు. కాబట్టి ఒకరకంగా అలంకరణకు గాను, ఆరోగ్య సాధనంగాను ఉపకరించే విధంగా డిజైన్ అయినవే ఈ గాజులు. స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి? చేతికి గాజులందము...చెంపకు సిగ్గులందము’ అన్నాడో సినీ కవి. నిజమే...లేత తామరతూడులాంటి కన్నెపిల్ల చేతికి గాజులిచ్చే అందము మరేది ఇవ్వదు. కేవలం అందం కోసమే గాజులయొక్క ప్రయోజ...