విశాల విశ్వంలో
విశాల విశ్వంలో... ఎన్నో ఎన్నో గెలాక్సీ లలో... ఒకానొక పాలపుంతలోని సూర్య మండలంలో భూగ్రహంలో... . సర్వ సృష్టిని సృష్టించిన ఆ పరబ్రహ్మము సాకార రూపం గా ఆవిర్భవించిన అరుణాచల క్షేత్రములో... _శక్తివంతమైన అరుణాచల గిరిప్రదక్షిణ సహిత మంత్రజప సాధన :-_ తిరుఅణ్ణామలైలో సాక్షాత్తు పరమశివుడే పూర్ణ యోగ సిద్ధలింగ కొండ రూపములో దర్శనమివ్వడంవలన కొండను చుట్టు ప్రదక్షిణం చేయుటయే అతి గొప్ప పూజా విధానమయినది. ఈ నాటికీ కోట్లాది సిద్ధపురుషులు, మహానుభావులు, యోగపురుషులు ప్రతి రోజూ తిరుఅణ్ణామలైని గిరిప్రదక్షిణం చేస్తూనే ఉన్నారు. ఈ భూలోకములో అనేక ప్రదేశములలో గిరి ప్రదక్షిణ విధానము ఉన్ననూ రెండు ప్రదేశములలోని గిరి ప్రదక్షిణములు మాత్రమే అత్యంత దైవత్వ ఆకర్షణ కలిగినవిగ ప్రాముఖ్యం పొందెను. ఒకటి హిమాలయాలయందు కైలాస గిరి ప్రదక్షిణము; మరొకటి తిరుఅణ్ణామలై గిరి ప్రదక్షిణం. టిబెట్ దేశమునందు దైవదత్తమైన మహోన్నత జీవితం గడుపుచున్న ‘లామాలు’ (అనబడు గొప్ప యోగులు సిద్ధులు నేటికీ భౌతిక శరీరముతో శ్రీ కైలాస పర్వత ప్రదక్షిణము చేయుచున్ననూ, ఆధ్యాత్మిక సూక్స్మ శరీరముతో తిరుఅణ్ణామలై ప్రదక్షిణముకూడ చేస్తున్నారు. ఆయా వారానికి సంబంధ...