పదవి వచ్చేదన
పదవి వచ్చేదన మత్-మనాః — సదా నన్నే స్మరించుము; భవ — ఉండుము; మత్ — నా యొక్క; భక్తః — భక్తుడు; మత్ యాజీ — నన్ను పూజించు వాడవు; మామ్ నమస్కురు — నాకు నమస్కరింపుము; మాం ఏవ — నన్నే ఖచ్చితముగా; ఏష్యసి — చేరుకుందువు; యుక్త్వా — నాతోనే ఏకమై; ఏవం — ఈ విధంగా; ఆత్మానం — నీ మనస్సు మరియు శరీరము; మత్-పరాయణః — నాకే అర్పితమై ఉండి. అర్థ వివరణ. BG 9.34: ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను ఆరాధించుము, మరియు నాకు ప్రణామములు అర్పించుము. నీ మనస్సు మరియు శరీరము నాకు సమర్పించుటచే నీవు నా వద్దకు నిస్సందేహముగా వచ్చెదవు. విపుళీకరణ: ఈ అధ్యాయంలో మొత్తం, భక్తి మార్గము యొక్క మహత్వం చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడు ఇప్పుడు అర్జునుడిని తన భక్తుడిగా అవ్వమని ప్రార్థించటం ద్వారా ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. తనను పూజించటం ద్వారా, తన దివ్య మంగళ స్వరూపముపై మనస్సుతో ధ్యానం చేయటం ద్వారా, స్వచ్ఛమైన వినయవిధేయతలతో తనకు నమస్కరించటం ద్వారా, తన మనస్సుతో నిజమైన యోగములో భగవంతునితో ఏకమై ఉండమని అర్జునుడికి చెప్తున్నాడు. ‘నమస్కురు’ (వినయంతో ప్రణమిల్లటం) అనేది, భక్తి ఆచరణలో అహంకార లక్షణములు ఏవైనా జనిస్తే, వాటిని నిర్మూలి...