శ్రీ వారాహి దేవి - సర్వ శత్రు వినాశని - కవచం
🌹 శ్రీ వారాహి దేవి - సర్వ శత్రు వినాశని - కవచ🌹 *దేవీభాగవతం ప్రకారం చండీమాత రక్తబీజుని సంహరించేటపుడు వారాహీ మాతృకను సృష్టించెనట ...* దేవీపురాణంలో వారాహిదేవిని వరహాజనని , క్రితంత తనుసంభవ(మృత్యుసమయములో వచ్చేశక్తి అంటే యమశక్తి ) గా కూడా వర్ణించేరు ... వారాహి దేవి వాహనం యెనుము , పాశం ధరించి వుండడం కూడా పై వాదనను బలపరుస్తుంది. ఈమెను కైవల్యరూపిణి ,వైవస్వతి అని కూడా అంటారు. ఈమెను వాగ్ధేవి రూపిణిగా కూడా వర్ణిస్తారు .. వారాహి దేవి వరాహముఖం అనగా పంది ముఖం కలిగి , చక్రం ,కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తోంది. లలితాసహస్రనామాలలో ఈ వారాహి దేవి నామం వుండడం కనిపిస్తుంది. వారాహి దేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపడం సర్వసాధారణం. ప్రతీ మనిషిలోనూ వారాహీశక్తి నాభి ప్రాంతంలో వుండి మణిపూర, స్వాధిష్ఠాన ,మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది .. ! *వారాహి దేవి కవచం పారాయణం చేయిస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైన త్వరగా పూర్తి అవుతాయి.* అస్య శ్రీ కిరాత వారాహీ స్తోత్ర మహామంత్రస్య – దూర్వాసో భగవాన్ ఋషిః –అనుష్టుప్ ఛందః శ్రీ కిరాతవారాహీ ముద్రారూపిణీ దేవతా – హుం బీజం –...