మనస్యేకం🙊వచస్యేకం🙉కర్మణ్యేకం👣
🌼ll Il🌼 ☣️┄┅═══❁❁✿🏵✿❁❁═══┅┄☣️ 🙈మనస్యేకం🙊వచస్యేకం🙉కర్మణ్యేకం👣 పర అంటే ఏమిటి? వేదాంతము:- వేదాంతము అనగా అతి ఉత్కృష్ఠ జ్ఞానం అయిన బ్రహ్మమును తెలుసుకోవటం కొరకు నిర్దేశించడిన ఆధ్యాత్మిక గ్రంథముల చివరి భాగములు. వీటినే ఉపనిషత్తులు అని పిలుస్తారు. వేదాంతమునకు అర్ధం అంత్యజ్ఞానం. వేదములు అనేవి ఏ ఒక్క గ్రంథము నుండో గ్రహించినవి కావు. అవి స్వతస్సిద్ధములు, అపౌ రుషేయములు. వ్రాయబడినవి కావు. వేదాంత మును 'ఉత్తర మీమాంస'అని కూడా చెప్పబడింది. అనగ తరువాతి విచారణ లేదా అధికోన్నత విచారణ అని అర్ధం. ఈ నామం'పూర్వ మీమాంస' యజ్ఞ, యాగాదులు, ఉపాసనలకు సంబంధించిన మంత్రముల సముదాయము. (వేదాలలోని సంహిత భాగం). వేదములే మన మనుగడకు ఆధారము.bఇది అందరకు తెలిసిన విషయము. కొద్ది మందికి మాత్రమే తెలిసిన లోతైన విషయమును, నలుగురికి తెలియచేసే అవకాశము కల్పించిన వారికి ధన్యవాదములు. నాల్గు వేదములలో, ప్రతి వేదమును రెండుభాగములుగా విభజించవచ్చు మొదటి భాగము కర్మ ఖాండ కాగా, రెండవది లేక చివరి భాగము అయినవి వేదాంతములు అని చెప్తారు. వీటినే పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అని కూడా తెలుసుకొనవచ్చు. ప్రతి వేదములోని...