ఆలస్య వివాహానికి కొన్ని జ్యోతిష్య సూత్రాలు
శాస్త్రం-94 ఆలస్య వివాహానికి కొన్ని జ్యోతిష్య సూత్రాలు పూర్వం బాల్య వివాహాలు జరిగేవి. అప్పటి సమాజ పరిస్ధితులను బట్టి రజస్వల కాకుండానే పెత్తందార్లకు బలికాకూడదని తల్లిదండ్రులు వివాహాం చేసేవారు. ఇప్పటి సామాజిక పరిస్ధితులలో మనిషికి స్వేచ్చా స్వాతంత్ర్యాలు రావటం, బాలికల రక్షణ ఏర్పడిన తరువాత రజస్వల అయిన తరువాత వివాహం చేయటం మొదలుపెట్టారు. ఈ రోజుల్లో తన కాళ్ళ మీద తాను నిలబడటానికి సమాజానికి వీరి వలన ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండటానికి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళి చదువుకోవటం వల్ల కొంత వివాహ ఆలస్యం అవుతుంది. సాధారణంగా చట్టరీత్యా బాలికలకు 18 సంవత్సరాలు, బాలురకు 21 సంవత్సరాలు నిండిన తరువాత వివాహ అనుమతి ఉంది. చదువు పూర్తయ్యేవరకు 23 సంవత్సరాలు పడుతుంది. ఉద్యోగం దొరికే సరికి 2 సంవత్సరాలు పడుతుంది. 25 సంవత్సరాలు అనుకుంటే 25 సంవత్సరాలు దాటినవన్నీ ఆలస్య వివాహాలే అనవచ్చును. సమాజంలో వస్తున్న నూతన పోకడలు, సినిమాల ప్రభావం, శారీరక, మానసిక వ్యాధుల ప్రభావం, అధికమైన, ఇష్టమైన మరియు నియంత్రణలేని ఆహార పదార్ధాలు తీసుకోవటం వలన సరియైన వ్యాయామం లేక శరీర అవయ...