మాఘపురాణం -10వ 11వ 12వ అధ్యాయములు
MAAGHA PURANAM -- 10 మాఘపురాణం -10వ అధ్యాయము మృగశృంగుని వివాహము దిలీప మహీజునకు వశిష్ఠువారు మాఘపురాణము గురించి ఇంకా ఈ విధముగా చెప్పసాగిరి. పువ్వు వికసించగానే వాసన వేయును. అది ఒకరు నేర్పవలసిన అవసరము లేదు. అది ప్రకృతినైజము. ఆవిధముగానే మృగశృంగుడు బాల్యదశ నుండి హరినామ స్మరణయందు ఆసక్తి గలవాడు అయ్యాడు. . అతనికి ఐదు సంవత్సరములు నిండిన తరువాత గురుకులములో చదువ వేసారు. అచట సకల శాస్త్రములు అతిశ్రద్ధగా నేర్చుకొనుచు, అధ్యాపకుల మన్ననలను పొందుచు పాండిత్యము సంపాదించెను. విద్యలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల ఆనతిపై దేశాటన చేసి అనేక పుణ్యనదులలో స్నానమాచరించి మాఘమాస పలము సంపాదించియుండెను. కుమారుడు దేశాటన పూర్తిచేసి వచ్చిన తరువాత అతని తల్లిదండ్రులు కన్యను చూచి వివాహం చేయుటకు నిశ్చయించినారు. మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకొనెదనని తన మనో నిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపగా కుమారుని ఇష్టప్రకారముగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతివైభవముగా వివాహము చేసారు. సుశీల స్నేహితురాండ్రగు మిగిలిన ఇద్దరూ మృగశృంగుని చూచి “ఆర్యా! మా స్నేహితురాలగు సుశీలను పెండ్లి చేసుకొన్నట్లే మా ఇద్దరినీ కూడా ఈ శు...