Posts

💠 స్వాహాదేవి, స్వధాదేవి చరిత్రలు💠

Image
         💠  స్వాహాదేవి, స్వధాదేవి చరిత్రలు💠 బ్రహ్మ దేవుని యొక్క పెద్దకుమారుడు అగ్ని అని విష్ణు పురాణంలో చెప్పబడి ఉన్నది. అగ్ని దేవుని భార్య పేరు స్వాహా. హోమాలు చేస్తూ లేదా పూజలు చేస్తూ మంత్రాలు చదివేటప్పుడు చివరిలో "స్వాహా " అనడం జరుగుతుంది. ఈ స్వాహా అన్న పదాన్ని ఉచ్చరించేటప్పుడు మనిషి చేసే పూజలు ప్రార్ధనలు, మంత్రాలు అగ్ని దేవునికి చేరుతాయి. అగ్ని దేవునికి 2 తలలు, తలపైన 2 + 2 కొమ్ములు, 7 నాలుకలు, 7 చేతులు, 3 కాళ్ళు ఉంటాయి. ఈయనకి దక్షిణంలో భార్య స్వదా దేవి, ఎడమ వైపున స్వాహ దేవి ఉంటుంది. దైవ కార్యాల్లో ఈయనకు సమర్పించిన ఆజ్యం హవిస్సు అన్నిటిని స్వాహా దేవి స్వీకరించి ఏ దైవం నిమిత్తం మనం ఆ హోమం చేస్తున్నామో దైవానికి అందిస్తుంది. అదే విధంగా పితృ కార్యాల్లో స్వదాదేవి తన పాత్ర పోషిస్తుంది. స్వధాదేవి ధ్యానము, స్తోత్రము వేదములలో చెప్పబడినది.  శరదృతువులోని అశ్వయుజ కృష్ణ త్రయోదశినాడు, లేక మఖా నక్షత్రము నాడు, కానిచో శ్రాద్ద  దినమున స్వధాదేవిని పూజించి శ్రాద్దము నాచరింపవలెను. ఈవిధముగా స్వధాదేవిని రమ్యమైన కలశమున, లేక సాలగ్రామశిల యందు ఆవాహనము చేసికొని ధ్యాన...

💎💎 సద్బోధ 💎💎

Image
.       💎💎 సద్బోధ 💎💎 ✨✨✨💎💎💎✨✨✨ జీవితంలో   ఓడిపోవడం - మోసపోవడం -  చెడిపోవడం - పడిపోవడం -                  అంటూ ఏం ఉండవు.  కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు. ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు. మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడలో అని నేర్చుకుంటారు.  ఇంకా మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. జీవితం అనేది ఒక పాఠశాల ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది ✨✨✨💎💎💎✨✨✨

🌸 శరభేశ్వర స్వామి 🌸

Image
          🌸    శరభేశ్వర స్వామి 🌸 ప్ర: తమిళనాడు ప్రాంతాల్లో శరభేశ్వరుడనే పేరుతో శివుని పూజిస్తున్నారు. అసలు పురాణాల్లో ఈ కథ ఉందా? నరసింహస్వామి ప్రతాపాన్ని నిగ్రహించడానికి ఈ స్వరూపం వచ్చిందని అంటారు. ఆయన పాదాల క్రింద నరసింహ రూపం కూడా ఉంది? ఎవరు ఇందులో ఎక్కువ? జ: ఇందులో ఎక్కువ తక్కువలు లేవు. ఇది మంత్ర శాస్త్రపరమైన ఉపాసనా విషయం. అనేక కల్పాలలో అనేక మార్లు నృసింహావతారాలు జరిగాయి. శివస్వరూపుడైన వీరభద్రుని తేజమే శరభుడు. ఈ శరభేశ్వరునికి సంబంధించే మంత్రం, అనుష్ఠాన విధానం ఉన్నాయి. శత్రు సంహారకం, గ్రహదోషనివారకం, అభీష్ట సిద్ధిదాయకం అయిన స్వరూపమిది. ఒక కల్పంలో - నృసింహుని ఉగ్రత తగ్గకపోయేసరికి - దేవతల ప్రార్థన మేరకు శివుడు శరభాకృతి ధరించి ఆ ఉగ్రతని ఉపసంహరించినట్లుగా పురాణ కథ. శివ, స్కందాది పురాణాల్లో చెప్పబడినది. "శరభోపనిషత్" పేరుతో ఒక ఉపాసనాపరమైన ఉపనిషత్తు ఉంది. శైవంలో "శరభ శరభ దశ్శరభ" అని ఘోషించి, 'వీరభద్ర పళ్లెం' వంటివి జరిపే సంప్రదాయాలు ఇప్పటికీ ఉన్నాయి. కథ ప్రకారం - ఆ సందర్భం వరకే గ్రహించాలి. అంత మాత్రాన ఎక్కువ తక్కువల చర్చ చేయరాదు...

🌻 ఆయురారోగ్య మంత్ర జపం.🌻

Image
 🌻 ఆయురారోగ్య మంత్ర జపం.🌻 సోమనాధం వైద్యనాధం ధన్వంతరి మధాశ్వినౌ ! ఏతాన్ సంస్మరతః ప్రాతః వ్యాధి  స్తస్య నవిద్యతే!! సోమనాధం వైద్యనాధం ధన్వంతరి మధాశ్వినౌ ! ఏతాన్ సంస్మరతః ప్రాతః వ్యాధి  స్తస్య నవిద్యతే!! సోమనాధం వైద్యనాధం ధన్వంతరి మధాశ్వినౌ ! ఏతాన్ సంస్మరతః ప్రాతః వ్యాధి  స్తస్య నవిద్యతే!! సోమనాధం వైద్యనాధం ధన్వంతరి మధాశ్వినౌ ! ఏతాన్ సంస్మరతః ప్రాతః వ్యాధి  స్తస్య నవిద్యతే!! సోమనాధం వైద్యనాధం ధన్వంతరి మధాశ్వినౌ ! ఏతాన్ సంస్మరతః ప్రాతః వ్యాధి  స్తస్య నవిద్యతే!! సోమనాధం వైద్యనాధం ధన్వంతరి మధాశ్వినౌ ! ఏతాన్ సంస్మరతః ప్రాతః వ్యాధి  స్తస్య నవిద్యతే!! సోమనాధం వైద్యనాధం ధన్వంతరి మధాశ్వినౌ ! ఏతాన్ సంస్మరతః ప్రాతః వ్యాధి  స్తస్య నవిద్యతే!! సోమనాధం వైద్యనాధం ధన్వంతరి మధాశ్వినౌ ! ఏతాన్ సంస్మరతః ప్రాతః వ్యాధి  స్తస్య నవిద్యతే!! సోమనాధం వైద్యనాధం ధన్వంతరి మధాశ్వినౌ ! ఏతాన్ సంస్మరతః ప్రాతః వ్యాధి  స్తస్య నవిద్యతే!! సోమనాధం వైద్యనాధం ధన్వంతరి మధాశ్వినౌ ! ఏతాన్ సంస్మరతః ప్రాతః వ్యాధి  స్తస్య నవిద్యతే!! సోమనాధం వైద్యనాధం ధన్వంతరి ...

🌸 దైవ - మానవ - రాక్షస గుణములు🌸

Image
🌸   దైవ - మానవ - రాక్షస గుణములు🌸 మానవునికి మూడు రకాలైన  గుణములు ఉంటాయి.  దైవ మానవ రాక్షస శ్రీకృష్ణ భగవానుడు ఒక విషయాన్ని సష్టంగా చెప్తాడు. శమదమాదులు కలిగినటువంటి వారి చేతిలో వృద్ధి చెందుతుంది అని. ఇలాంటి వారికి ఏదైనా ఇచ్చిన, చెప్పిన, అది అభివృద్ధి పథంలో ఉంటుంది. వీరి దగ్గర నుంచి అడిగిన ప్రశ్నకు సమాధానం వస్తుంది. దానం అనేటువంటిది చేసేవారి వలన వారు ఉన్నంతవరకు ఉదరపోషణం జరుగుతుంది. వీరికి ఏదైనా ఇస్తే అభివృద్ధి చెందదు, నాశనం కూడా జరగదు. ఉన్నది ఉన్నట్లుగానే ఉంటుంది. కాని చేతులు మారడం అనేది సహజంగా జరుగుతుంది. వీరికి ప్రశ్న వేస్తే తనకు తెలిసింది చెప్తూ తన దగ్గర ఉన్నది ఇస్తారు.  దయ కలిగి ఉండవలసినటువంటి వారు దయ లేకుండా ప్రవర్తించినప్పుడు క్షీణ దశ ఏర్పడుతుంది. వీరికి ఇచ్చింది ఏదైనా  క్షీణించిపోతుంది నశించిపోతుంది. వీరి దగ్గర అభివృద్ధి చెందాలంటే వారికి దయ ఉండాలి. తమకు పనికిరాని ఏదైనా దాచుకోవడం వీరి లక్షణం. వారు వాడు కోరు ఇంకొకరికి ఉపయోగపడరు. తన చేతిలో ఉన్న దాన్ని నాశనం చేసేదాకా చేస్తారు. యుద్ధాలకు కూడా దిగుతారు. ఆర్భాటాలకు పోతారు. వీరి దగ్గర నుంచి ప్రశ్నకు సమాధానం రా...

💠 నదీ నదములు 💠

💠    నదీ నదములు 💠 మనకి సనాతన ధర్మంలో నదులకు అత్యంత ప్రముఖమైన విశేషము ఉంది.  మనం ఏదైనా పూజ చేయాలంటే మొదట "కలశారాధన" పేరుతో పుణ్యనదులను నీటిలోకి ఆవాహన చేస్తాము.  గంగా, యమునా, నర్మద, గోదావరి, కృష్ణ...   ఇలా పంచ నదీమ తల్లులను మంత్ర పూర్వకముగా ఆవాహనచేసి, స్థల శుద్ధి, పాత్రశుద్ధి, శారీరక శుద్ధి...చేసి ఏ పూజ నైనా ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. పవిత్ర నదీ జలాలకు అంతటి ప్రాధాన్యత కలిగించారు..  ఆ ఆవాహన చేసిన నదీ జలాలను ఆరాధించే మూర్తి మీదే కాకుండా అందరిపై ప్రోక్షణ చేస్తారు.  సనాతన ధర్మంలో నదులకు ఉన్నంత గౌరవం, వాటికి చేసే పూజ, వాటి వైశిష్ట్యం విశేషంగా ఉంటుంది..  ప్రతి నదికి ఒక అనుష్టాన దేవత ఉంటుంది..  అది కేవలం నీటినుండి ఉత్పన్నమైన శక్తి కాదు.  ఒక్కొక్క నదీ అనుష్టాన దేవత ప్రజలను ఒక్కొక్క రకంగా అనుగ్రహిస్తూ ఉంటుంది..  నదులున్న చోటనే నాగరికతలు వెలిశాయి..  ఎన్నో ప్రఖ్యాతి గాంచిన పుణ్య క్షేత్రాలు వీటి తీరాలలో వెలిశాయి.. 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన నదులకు "పుష్కరోత్సవాలు" జరుగుతాయి..  నదులకు ఉన్న అధిష్టాన దేవతలు ప్రార్థన చేసిన భక...

💠 వృక్షాలు 💠

💠     వృక్షాలు 💠 అశ్విని ముసిడి వృక్షం భరణి డసిడి వృక్షం కృత్తిక అత్తి వృక్షం రోహిణి నేరేడు వృక్షం మృగశిర కదిరి వృక్షం ఆరుద్ర గుమ్మిడి వృక్షం పునర్వసు వెదురు వృక్షం పుష్యమి అశ్వద్ద వృక్షం ఆశ్రేష నాగకేసరి వృక్షం మఖ మఱ్ఱి వృక్షం పుబ్బ మోదుగ వృక్షం ఉత్తర జువ్వి వృక్షం హస్త కొండమా వృక్షం చిత్త మారేడు వృక్షం స్వాతి మద్ది వృక్షం విశాఖ వెలగ వృక్షం అనూరాధ పొగడ వృక్షం జ్యేష్ఠ తెల్ల లొద్ది వృక్షం మూల తెల్ల గుగ్గిల వృక్షం పూర్వాషాఢ కర్పా వృక్షం ఉత్తరాషాడ పనస వృక్షం శ్రవణం తెల్ల జిల్లేడు వృక్షం ధనిష్ఠ జమ్మి వృక్షం శతభిషం కదంబ వృక్షం పూర్వాభాద్ర మామిడి వృక్షం ఉత్తరాభాద్ర వేప వృక్షం రేవతి విప్ప వృక్షం వీటిలో నవగ్రహాల నక్షత్రాలు వేరు చేస్తే అవే గ్రహాల వృక్షాలు