Posts

సాలిగ్రామం ఎలా పుట్టింది ?

సాలిగ్రామం ఎలా పుట్టింది ? సాలిగ్రామం .......? విష్ణు చిహ్నంగల శిలనే సాలిగ్రామం అంటారు. అలాంటి సాలిగ్రామాలు ఒకటి కాదు రెండు కాదు వందలూ వేలు కాదు, లెక్కకు మిక్కిలిగా ఆ ఒక్క నదిలోనే పుడతాయి. మరెక్కడా దొరకవవి. ఆనది పేరు గండకీ. చిన్నగా పెద్దగా రకరకాల పరిమాణాల్లో ఉంటాయి. గండకీ నదిలోనే దొరుకుతాయి. గుండ్రని రాళ్ళలా ఉన్నా – తాబేలు నోరు తెరచుకున్నట్టు ఉండి లోపల శ్రీ మహా విష్ణువే శేషసాయిగా ఉండి దర్శన మిస్తాడంటారు. పూజిస్తుంటారు. మరి గండకీ నదిలోనే ఈ సాలిగ్రామాలు పుట్టడానికి వెనుక ఒక కథ ఉంది! గండకీ నది నదిగా మారడానికి ముందు ఒక స్త్రీ, గండకీ పేరుతోనే శ్రావస్తి నగరంలో ఉండేది. ఆమె అందాల వేశ్య. ఆమె అనుగ్రహం కోరి ధనవంతులు కూడా పరితపిస్తూవుండేవారు. గండకీ అందరినీ అంగీకరించేది కాదు. ప్రతి రోజూ ముందొచ్చిన బేరం ఒప్పుకొనేది. ఆరోజుకి అతనే భర్త. రెండో మనిషికీ రెండో బేరానికి ఒప్పుకొనేది కాదు. ధనం ఆశ చూపినా దరి చేరనిచ్చేది కాదు. ఆమె తల్లి గండకిని మార్చాలని ఎన్నోవిధాల ప్రయత్నించి విఫలమైంది. సాక్షాత్తూ నారాయణుడికే గండకిని పరీక్షించాలని కోరిక పుట్టింది. ఒక రోజు పరివారంతో పొద్దున్నే వచ్చిన ధనవంతుడు బేరం చేసుకొని కాన...

సరస్వతీ నది

బద్రీనాథ్ ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న " మానా " అనే గ్రామం లోని " సరస్వతి నది " ప్రవాహం ఇది... చైనా/టిబెట్ బోర్డర్ కి దగ్గరగా ఉన్న ఈ ఊరు భారతదేశపు చివరి గ్రామం... సరస్వతీ నది ఇక్కడ కొండలలోంచే పుడుతుంది... ఇక్కడ వినాయకుడి గుహ, వ్యాస గుహల్ని దర్శించుకోవచ్చు ... వ్యాసగుహలో వ్యాసుడు కూర్చొని మహాభారత కధ చెప్పగా, వినాయకుడు గణేశ గుహలో కూర్చొని ఆ గ్రంధాన్ని ఇక్కడే రచించాడని ప్రతీతి... ఈ వ్యాసగుహకు కొద్ది దూరంలో భీంపుల్ దగ్గర ఉదృతంగా ప్రవహించే సరస్వతీ నది కొద్ది అడుగుల దూరంలో అంతర్వాహిని అయిపోతుంది... _పెద్ద శబ్దంతో ప్రవహిస్తూ తన మహాభారత రచనకు ఆటంకం కలిగిస్తున్న సరస్వతిని హోరు తగ్గించుకోనమని వ్యాసుడు కోరగా సరస్వతి నది వ్యాసుని మాట పెడ చెవిన పెట్టడంతో వ్యాసుడు ఆ నదిని అంతర్వాహిని కమ్మని శాపమిస్తాడు. అంచేతే అంత ఉదృతమైన నదీ ఇక్కడ అంతర్వాహిని అయ్యి తిరిగి అలహాబాద్ లో పైకి వచ్చి గంగా, యమునలతో సంగమిస్తుంది...

గ్రహణం రోజు శ్రాద్ధ విధులు

యది!సూర్యస్యగ్రస్తాస్తమయః. తదా! శాస్త్రతోముక్తింవిజ్ఞాయ. స్నాత్వా.... " రాత్రౌఏవ శ్రాధ్ధంకుర్యాత్"  రాత్రియందు శ్రాద్ధం ఆచరించడం విశేష పుణ్యం అని కొందరు ఋషులు చెప్పియున్నారు.... చంద్రసూర్యగ్రహేయస్తు శ్రాద్ధం విధివదాచరేత్ !  తేనైవ సకలా పృథ్వీ దత్తా విప్రస్య వైకరే !!  (ఋష్యశృంగ వాక్యం)  గ్రహణం రోజు గనుక శ్రాద్ధం వస్తే ఆరోజే ఆ సమయంలో ఆచరిస్తే బ్రాహ్మణుడికి భూమి మొత్తం దానం చేసిన ఫలితం కర్తకి వస్తుంది అని అన్నాడు....  ఇలా చాలామంది అన్నారు....  అపరార్కుడు, సుమంతుడు, విజ్ఞానేశ్వరుడు, వ్యాఘ్రపాదుడు మొదలగు పండితోత్తములు మరియు మదన పారిజాతం, వాయుపురాణం, వృద్ధ వసిష్టోక్తి, కాలాదర్శం లాంటి పురాణ గ్రంధాలలో కూడా చెప్పియున్నారు....  ✔️ *ఆపస్తంబుడు మాత్రం శ్రాద్ధ భోక్తకి భోజనం చేయడం దోషం అని, అలా చేస్తే మళ్లీ పురుషజన్మ ఎత్తడు అని చెప్పాడు....  కర్తకి దోషంలేదు.... సూతకే మృతకే భుంక్తే గృహీతే శశిభాస్కరే ! ఛాయాయాం హస్తినశ్చైవ న భూయ: పురుషో భవేత్ !! ======================= మనము ఏవిషయం తీసుకున్నా.... రెండుమూడు రకాలుగా ప్రమాణాలు దొరుకుతాయి.... అవి అవగాహన.... పూర్వపు...

గృహగతిస్వరూపంబు

శీఘ్రగతి, మూఁటిలో సమగతి, 4లో మందగతి, ౫ లో స్తబ్ధగతి, ౬లో వక్రయ 7లో వక్రము 8లో అతివక్రము 9లో ఋజు గతి, ౧౦ లో కుటిలగతి ౧౧ లో శీఘ్రగతి 12 లో అతిశీఘ్రగతి - ఈప్రకారం గృహగతిస్వరూపంబు ననుసరించి ఫలము జెప్పవలెను, కించః ఫలగ్రంథే ॥శ్లో॥ వక్రాతిచారయుక్తానాం పూర్వరాశిగతం ఫలు | బృహస్ప తేస్తుతన్నా స్తి యుక్త రాశిగతంఫలమ్ ॥ తా || వక్రము అతిచారముతోఁ గూడిన సప్త గ్రహములకును పూర్వరాశిస్థిత ఫలమే చెప్పవలెను. గురుశుక్రులకుమాత్రం. యేరాశియం దుండునో ఆరాశిఫలమే చెప్పవలయును. కించః ఫలసారే శ్లో || ఆదిత్యాది గ్రహా స్సర్వే లగ్నేవా గోచ రేపివా | సప్తవింశతి భాగోర్థ మేష్య రాశిగతంఫలమ్ || కించః శ్లో॥ శుభై శ్శుభం వినిర్గశ్య మశుభైరశుభం సదా | మిశ్రే మిశ్రంవిజానీయా దితిశాస్త్రవిదోవిదుః||

పరాశర జ్యోతిషం లో 8 మూల స్తంభాలు

పరాశర జ్యోతిషం లో 8 మూల స్తంభాలు  1. ఆధిపత్య శుభులు పాపుల నిర్ణయం. 2. గ్రహ స్థితి యుతి వీక్షణ ద్వారా గ్రహలు ఏ భావాన్ని ఎన్ని డిగ్రీలు శుభంగా అశుభంభంగా బలపరచారు అన్న వివరణ. 3. పరాశరా మహర్షి నిర్ణయం ప్రకారం గ్రహ భావ కారకత్వాలు. 4. పూర్వ పరాశర లోని 30 వశ్లోకం ప్రకారం వింశోత్తరీ దశావిధానం. 5. లగ్న గోచార విధానంలో గురు శని కుజ చారలతో ద్వాదశ లగ్నములకు ఫల నిర్ణయం. 6. పూర్వ పరాశరా పద్దతిలో కుజ శుక్ర దోష విచారణ. సప్తమ అష్టమ భావ విచారణ రీత్యా వధూవర జాతక పరిశీలన. 7. పూర్వ పరాశరా సిద్ధాంత రీత్యా తారాబలం రవి చంద్ర బలరీత్యా ముహూర్త నిర్ణయం. 8. పరాశర మహర్షి నిర్ణయనుసారం పాప గ్రములకు శాంతులు, శుభగ్రహ ఆధిపత్య దేవతలకు అనుగ్రహార్థం పూజలు, రక్షా బంధన శుభ రత్న ధారణ విధానాలు.

అట్లతద్దె వ్రత కథ-మహిమ:

అట్లతద్దె వ్రత కథ-మహిమ: పూర్వం ఒక మహారాజుకు లావణ్యవంతమైన కుమార్తె ఉండేది. ఆమె పేరు కావేరి. తన తల్లి ద్వారా అట్లతద్దె వ్రత మహిమను తెలుసుకున్న కావేరి తన రాజ్యంలో కల తన స్నేహితురాళ్లు మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురుతో కలిసి  ఈ  చంద్రోదయ ఉమావ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించింది. అనంతరం మంత్రి, సేనాపతి, పురోహితుని కూతుళ్లకు యుక్త వయసు రాగానే నవయవ్వనులైన అందమైన భర్తలతో వివాహం జరిగింది. మహారాజు తన కుమార్తెకు వివాహప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాడు. అయితే కావేరీకి వృద్ధులైన వారు మాత్రమే పెండ్లి కుమారులుగా రాసాగారు. తన తండ్రి మహారాజు చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడం చూచిన రాకుమార్తె కావేరి ఎంతో కలతచెంది. రాజ్యాన్ని వదిలి సమీప అరణ్యంలో ఘోర తపస్సు చేసింది. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు కావేరికి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమనగా..! కావేరి తన అట్లతద్దె వ్రతాచరణ చేసినా ఫలితం దక్కలేదని, నా వ్రతములో ఏదైనా దోషమేమిటని? ప్రశ్నిస్తూ.. దుఃఖించసాగింది. అప్పుడు పార్వతీపరమేశ్వరులు ఓ సౌభాగ్యవతి.. ఇందులో  నీ దోషం లేదు.. అయితే నీవు ఆ అట్లతద్దె నోచే సమయంలో ఉపవాసదీక్షకు తట్టుకోలేక స...

గ్రహణం జాగ్రత్తలు

గ్రహణం జాగ్రత్తలు సూర్యగ్రహణానికి 12 గంటల ముందు నుంచి, చంద్రగ్రహణానికి 9 గంటల ముందు నుంచి ఆహారం తినకూడదు. చిన్నపిల్లలు, ముసలివారు, రోగులకు సడలింపు. వారు మాత్రం గంట ముందు నుంచి ఆహారం తినడం నిషిద్ధం. త్వరగా జీర్ణమయ్యే ఆహారం తినాలి.. తేలికైన ఆహారం తీసుకోవడం మంచిది. గ్రహణసమయానికి ఆహారం అరిగిపోవాలి/ జీర్ణమవ్వాలి, కడపు ఖాళీగా ఉండాలి. 1980-83 మధ్య కాలంలో భారతదేశంలో గ్రహణసమయంలో పాటించే ఆచారాల మీద పరిశోధన చేశారు విదేశీయులు. ఆ తర్వాత ఆ ఫలితాలు పత్రికల్లో ప్రచురించబడ్డాయి. వారి పరిశోధనలో తేలిందేమిటంటే హిందువులు గ్రహణ సమయంలో పాటించే ఆచారాలు ఎంతో శాస్త్రీయమైనవి, ఆరోగ్యప్రదమైనవి. గ్రహణ సమయంలో వచ్చే అతినీలలోహిత కిరణాలు మానవులకు చేటు చేస్తాయి. ఆహారపదార్ధాలను విషతుల్యం చేస్తాయి. అటువంటి ఆహారపదార్ధాలను స్వీకరించడం వలన దీర్ఘకాలంలో దుష్ఫలితాలుంటాయి. గ్రహణ కిరణాలు సోకకుండా ఉండేందుకు భారతీయులు వాడే ధర్భ ఎంతో శక్తివంతమైనది. అది భూమికి నిటారుగా నిలబడి పెరుగుతుంది. సూర్యశక్తిని అధికశాతం గ్రహిస్తుంది. గ్రహణ సమయంలో ఈ దర్బలను ఆహారపదార్ధాల మీద, ఊరగాయలున్న జాడీలలోను, నీరున్న బిందెలలోను వేయడం వలన గ్రహణ కిరణాల దుష్ప్...