క్రియాయోగులు
క్రియాయోగులు Share ఎందరో మహానుభావుల పుట్టినిల్లు మన భారతదేశం. యోగిపుంగవులు హిమాలయాలయ పర్వత గుహల్లో తపస్సు చేసుకొని ముక్తి మార్గంలో ముందుకు సాగారు. దేవతలు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు ఈ హిమాలయ సొగసులను క్రీడావనంగా చేసుకున్నారు. దేవతలంతా పున్నమి నాడు జ్యోతి స్వరూపంలో వచ్చి స్నానమాడి పునీతులయ్యే సుందర ప్రదేశమే మానససరోవరం. ఎందరో మహనీయులకు ఇది ఆవాసం, మహిమలకు నిలయం హిమాలయం. ఇచ్చోటనే కదా ఈశుని శిరమున జారిన జాహ్నవి, చేరి భూమికి, ఇచ్చోటనే కదా హిమగిరి పుత్రిక వలపుల తేలించె పరమశివుని ఇచ్చోటనే కదా ఇక్షు బాణము వాని ఇల్లాలి మాంగల్యమేటకలసె ఇచ్చోటనే కదా పిచ్చి ప్రవరాఖ్యుండు కామించు వనితను కాదుయనెను. మానససరోవరాంర మధురపవన హతులనూగెడి హిమగిరి వావ్యభూమి సర్వఔషధుల నెలవు సాధుమునుల మాన్య జనులకు వాసంబు మంచు కొండ దక్షయజ్ఞంలో పరమేశుని అర్ధాంగి సతీదేవి ఆహుతైపోగా వైరాగ్యంతో మహేశుడు తీవ్ర తపోదీక్షలో ఉన్నాడు. ఆ సతీదేవి సాంబశివుడినే కోరి హిమవంతుని పుత్రికయై పార్వతి అనే పేరుతో పుట్టింది. దేవతలు...