Posts

Showing posts from September, 2022

కేదార్‌నాథ్ ఆలయం అనేది పరిష్కరించని రహాస్యం

కేదార్‌నాథ్ ఆలయం అనేది పరిష్కరించని రహాస్యం కేదార్‌నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దాని గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి.   పాండవుల నుండి ఆదిశంకరాచార్యుల వరకు కూడా కానీ  మనము దానిలోకి వెళ్లాలనుకోవడం లేదు. కేదార్‌నాథ్ ఆలయం బహుశా 8వ శతాబ్దంలో నిర్మించబడిందని  నేటి శాస్త్రం సూచిస్తుంది.  అంటే ఈ ఆలయం కనీసం 1200 సంవత్సరాల నుండి ఉంది. కేదార్‌నాథ్ ఉన్న భూమి అప్పుడే కాదు ఇప్పటికీ 21వ శతాబ్దంలో కూడా చాలా ప్రతికూలమైనది.   ఒకవైపు 22,000 అడుగుల ఎత్తులో కేదార్‌నాథ్ కొండ, మరోవైపు 21,600 అడుగుల ఎత్తులో కరచ్‌కుండ్ మరియు మూడో వైపు *22,700 అడుగుల ఎత్తులో భరత్‌కుండ్* ఉన్నాయి. ఈ మూడు పర్వతాల గుండా ప్రవహించే ఐదు నదులు మందాకిని, మధుగంగ, చిర్గంగ, సరస్వతి మరియు స్వరందరి .  వీటిలో కొన్ని మన పురాణాలలో వ్రాయబడ్డాయి.  ఈ ప్రాంతం " మందాకినీ నది" యొక్క ప్రారంభ ప్రాంతం.   చలికాలంలో విపరీతమైన మంచు కురిసే చోటు, వర్షాకాలంలో నీరు అతి వేగంతో ప్రవహించే ప్రదేశం, ఇలాంటి ప్రదేశంలో ఇంతటి కళాఖండాన్ని రూపొందించడం ఎంతో ప్రయాసతో కూడిన అద్భుతమైన విషయం.  నేటికీ,  "కేదార్‌నాథ్ ఆలయం"  ఉన్న ప్రదేశానికి మీరు వాహనాలత

దసరా నాల్గవరోజు కూష్మాండా దుర్గ

దసరా నాల్గవరోజు శుభాకాంక్షలు  నాల్గవ రోజు నైవేద్యము చిల్లులులేని "అల్లం గారెలు" ఆశ్వయుజ శుద్ధ చవితి దుర్గామాత నాల్గవ స్వరూపము  కూష్మాండా దుర్గా 4వరోజు 29 సెప్టెంబర్ 2022 : నాలుగో రోజు, గురువారం రోజున కుష్మాండ పూజ కూష్మాండ దుర్గ ( మహాలక్ష్మి)                                 ( కూష్మాండ దుర్గ ) మహాలక్ష్మి పూజావిధానము  హరిః ಓమ్, ఓం శ్రీ మహాగణాధిపతయేనమః                         ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం దీపారాధనం కృత్వా --       ఓం ఉద్దీప్య స్వజాత వేదోపఘ్నం నిఋతిం మమ ।       పశూగ్ శ్చ మహ్య మావహ జీవనం చ దిశోదిశ॥                                            (అని దీపమును వెలిగింౘవలెను) శ్లో॥ భో దీప బ్రహ్మ రూపేణ సర్వేషాం హృది సంస్థితః।              అతస్త్వాం స్థాపయామ్యద్య మదఙ్ఞానముపాకురు ॥ శ్లో॥ భో దీప బ్రహ్మ రూపోసి అంధకార నివారక ।            మయాకృత మిదం స్తోత్రం గృష్ణీష్వ వరదోభవ ॥                        (అని దీపమునకు కుంకుమ పుష్పాక్షతలుంచి నమస్కరింౘవలెను) శ్లో॥ ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతో√పి వా ।            యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యం

ఇంద్రుడు కర్ణుని కవచకుండలములు కోరుట:

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 130.                శ్రీ మహాభారతం                   ➖➖➖✍️                  130 వ భాగము  ఇంద్రుడు కర్ణుని కవచకుండలములు కోరుట:                       ▪️〰️▪️ ఒక రోజు బ్రాహ్మణ వేషధారియై ఇంద్రుడు కర్ణుని వద్దకు వచ్చాడు. ఆ సమయంలో కర్ణుడు సూర్యోపాసన చేసి బ్రాహ్మణులకు దానధర్మాలు చేస్తున్నాడు.  అప్పుడు ఇంద్రుడు ‘బిక్షాందేహి’ అన్నాడు.  కర్ణుడు… “మీకు ఏమి కావాలో కోరుకోండి!” అని అడిగాడు. ఇంద్రుడు… “నాకు నీ కవచ కుండలాలు కావాలి, ఇమ్ము!” అన్నాడు. కర్ణునికి విషయం అర్ధం అయింది. కర్ణుడు… “బ్రాహ్మణోత్తమా! ఎందుకూ పనికి రాని ఈ కవచకుండలాలు నీ కెందుకు వాటికి బదులుగా ధనం, బంగారం, మణి మాణిక్యాలు కోరుకో!”అన్నాడు. ఇంద్రుడు తనకు కవచ కుండలాలు మాత్రమే కావాలని పట్టుబట్టాడు. కర్ణుడు… “బ్రాహ్మణోత్తమా! పోనీ నా అంగ రాజ్యాన్ని నీకు ఇస్తాను తీసుకో!” అన్నాడు. అందుకు దేవేంద్రుడు అంగీకరించ లేదు. కర్ణుడు… “దేవా! నిన్ను నేను గుర్తుపట్టాను. నీవు దేవేంద్రుడవు మేము దేవతలైన మిమ్ము వరం అడగాలి కాని మీరు వచ్చి నన్ను యాచించటం తగునా? వింతగా ఉందే” అన్నాడు. దేవేంద్రుడు… “కర్ణా! నీకు నీ తండ్రి సూర్యుడు అన్ని విషయములు

యక్ష ప్రశ్నలు - ధర్మరాజు సమాధానాలు

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀132.               *శ్రీ మహాభారతం*                   ➖➖➖✍️                 132 వ భాగము   శ్రీ మహాభారతంలో చిన్ని కథలు: కొంగరూపములోని యక్షునితో మాట్లాడుచున్న యుధిష్టురుడు:                  ▪️〰️▪️ ఆ కొంగ ధర్మరాజుతో… ”వాస్తవానికి నేను కొంగను కాను, యక్షుడను. నీ తమ్ములు నన్ను అవమానించి పడి పోయారు.” అంటూ ధర్మరాజు ముందు నిలబడ్డాడు. “నా అనుమతి లేకుండా నీరు త్రాగితే ఎవరైనా ఇలా పడిపోతారు. నీవు తెలివి కలవాడవు కనుక నీరు త్రాగలేదు. కనుక నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు!” అన్నాడు. ధర్మరాజు… “అయ్యా! నీ వంటి వారికి సమాధానం చెప్పటం నా తరమా?అయినను నాకు తెలిసిన విధంగా సమాధానాలు చెప్తాను,” అన్నాడు. యక్షుడు:- ”సూర్యుని ఎవరు నడుపుతున్నారు? సూర్యుని ఎవరు కొలుస్తున్నారు? సూర్యుడు అస్తమించడం అంటే ఏమిటి? సూర్యునికి ఆధారభూతం ఏమిటి?” ధర్మరాజు:-  ”సూర్యుని బ్రహ్మం నడుపుతుంది. దేవతలు సూర్యుని కొలుస్తారు. సూర్యుడు ధర్మంచే అస్తమిస్తాడు. సూర్యునికి సత్యమే ఆధారం.” యక్షుడు:-  ”శ్రోత్రియుడు ఎలా ఔతాడు? పురుషునికి మహిమలు ఎలా సిద్ధిస్తాయి? పురుషునికి సాయం ఎవరు? పురుషుడు బుద్ధిమంతుడు ఎలా ఔతాడు?” ధర్మర

అష్ట భైరవులు

అష్ట భైరవులు అసితాంగో రురుశ్చండహ్ క్రొధశ్ఛోన్మత్త భైరవ/ కపాలీ భీషణశ్చైవ సంహారశ్చాష్టభైరవాహ్// 1.అసితాంగ భైరవుడు, 2.రురు భైరవడు, 3.చండ భైరవుడు, 4.క్రోధ భైరవుడు, 5.ఉన్మత్త భైరవుడు, 6.కపాల భైరవుడు, 7.భీషణ భైరవుడు, 8.సంహార భైరవుడు.      మనుషులుగా ఈ భూమ్మీద జన్మించి కష్టాలు, దుఖాలు అనుభవిస్తున్న జీవులు తమ దుఖాలను నివృత్తం చేసుకోవడం కోసం భైరవుడిని సేవించాలి. సతీదేవి శరీరత్యాగం చేసిన కారణంతో శివుడు దుఖాన్ని తట్టుకోలేక భైరవ రూపాన్ని ఆశ్రయించాడు. కనుక భైరవుడిని సేవిస్తే శివుణ్ణి సేవించినట్లే. "నేను భైరవ రూపంలో లోకానికి సుఖం చేకూర్చూతాను." అని సదాశివుడి వాక్యం. 1.అసితాంగ భైరవుడు:        ఈయన నల్లని శరీరఛాయలో, శాంతి రూపంలో, దిగంబర శరీరంతో, మూడూ కళ్ళతో, బ్రహ్మీ శక్తితో కూడి నాలుగు చేతులతో ఉంటాడు. అక్షమాల, ఖడ్గం, కమండలం, పానపాత్ర. నాలుగు చేతులలో ధరిస్తాడు. ఈయన హంసవాహనుడు. వరాలనిస్తాడు భూషణాధికారి. సరస్వతి ఉపాసకులు అసితాంగ భైరవుని అర్చించి సిద్ది పొందాలి. ఆ తరువాతే సరస్వతీ ఉపాసన సిద్దిస్తుంది. ఈయన బ్రహ్మ స్వరూపుడు. మహా సరస్వతికి క్షేత్రపాలకుడు. ఈయన తూర్పు దిశకు అధిపతి. 2.రురు భైరవుడు: ఈయన స

రామాయణ నీతి

   🕉️రామాయణ నీతి!🕉️                    ఆడపిల్ల ఉన్న తండ్రి అంటే ఏమిటో అద్భుతంగా చెప్పిన దశరథుడు… దశరథ మహారాజు తన నలుగురు కొడుకులతో కూడిన వివాహ శోభాయాత్రను తీసుకుని, జనక మహారాజు ద్వారం వద్దకు వెళ్ళాడు. అప్పుడు జనక మహారాజు, వారి వివాహ శోభాయాత్రకు సాధరపూర్వక స్వాగతం చెప్పాడు. వెంటనే దశరథ మహారాజు ముందుకు వెళ్లి, జనక మహారాజుకు పాదాభివందనం చేశాడు. అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజు యొక్క భుజం తట్టి పైకి లేపి సంతోషంతో కౌగలించుకుని… “రాజా! మీరు పెద్దవారు.. పైగా వరుని పక్షంవారు..! ఇలా మీరు నాకు పాదాభివందనం చేయడం ఏమిటి? గంగానది వెనక్కు ప్రవహించడం లేదు కదా?” అని అన్నాడు.. అప్పుడు దశరథ మహారాజు అద్భుతమైన, సుందరమైన జవాబు చెప్పాడు.. ”మహారాజా, మీరు దాతలు.. కన్యదానం చేస్తున్నారు.. నేనైతే యాచకుణ్ణి.. మీ ద్వారా కన్యను పొందాలని వచ్చాను.. ఇప్పుడు చెప్పండి.. దాత మరియు యాచకులలో ఎవరు పెద్ద? ఎవరు గొప్ప?” అని అన్నాడు. ఆ మాటలను విన్న జనక మహారాజు కళ్ళల్లోంచి ఆనందభాష్పాలు రాలుస్తూ.. ఇలా అన్నాడు.. “ఏ గృహంలో అయితే కూతుళ్లు ఉంటారో.. వాళ్ళు భాగ్యవంతులు. ప్రతీ కూతురు అదృష్టంలో తండ్రి ఉంటాడు.” ఇదీ భారతీయత.. ఇదీ సనాతన స

అష్టాదశ శక్తిపీఠాలు........!!*

*అష్టాదశ శక్తిపీఠాలు........!!* *లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే* *ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే* *అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా* *కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా* *ఉజ్జయిన్యాం మహాకాళీ,* *పీఠిక్యాం పురుహూతికా* *ఓఢ్యాయాం గిరిజాదేవి,* *మాణిక్యా దక్షవాటికే* *హరిక్షేత్రే కామరూపా,* *ప్రయాగే మాధవేశ్వరీ* *జ్వాలాయాం వైష్ణవీదేవీ,* *గయా మాంగళ్యగౌరికా* *వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ* *అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్* *సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్* *సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్* అంటూ ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి.  వీటిలో నాలుగు శక్తిపీఠాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి, అవి శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం. మిగిలిన వాటిలో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా దేశం వెలుపల కూడా మరో రెండు శక్తిపీఠాలున్నాయి. అందులో ఒకటి శ్రీలంకలోనూ మరొకటి ప్రస్తుత పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోన

Srimadhandhra Bhagavatham -- 24, 25

Srimadhandhra Bhagavatham -- 24, 25 పరీక్షిత్తు వేటకి వెళ్ళి వేటాడాడు. దప్పిక, ఆకలి కలిగింది. ఆకలి దప్పిక కలిగినప్పుడు అవి పోగొట్టుకునేందుకు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. పరీక్షిత్తుకి బుద్ధి భ్రంశము అవుతున్నది. అతడు దగ్గరలో ఉన్న మహర్షి ఆశ్రమమునకు వెళ్ళాడు. దాహార్తి తీర్చమని అక్కడ ఆశ్రమములో సంచరిస్తున్న స్త్రీ పురుషులనెవరినయినా అడగాలి. కానీ పరీక్షిత్తు వారినెవరినీ అడగలేదు. అతనిలో అహంకారము ప్రవేశించింది. నేరుగా తపోదీక్షలో ఉన్న శమీకమహర్షి దగ్గరకు వెళ్ళాడు. ఆయన స్థాణువయి ధ్యానము నందు తపస్సునందు చాలా మగ్నుడయి బ్రహ్మమునందు రమిస్తు ఏమాత్రం కదలిక లేకుండా ఉన్నాడు. ప్రాణాయామము చేత ప్రాణమును నియంత్రించి కుంభకము చేత వాయువును పూరించి ఆపుచేసాడు. మనస్సు ఊపిరిమీద ఆధారపడుతుంది. మనస్సు ఇప్పుడు కదలడం లేదు. మనస్సు కదలకపోవడం వల్ల బుద్ధి కదలడం లేదు. బుద్ధి కదలకపోవడం వల్ల ఇంద్రియములు కదలడం లేదు. బయట విషయమును కన్ను చూడదు, చెవులు వినబడవు. స్పర్శేంద్రియములు బాహ్యజ్ఞానము తెలియదు. జాగ్రదాది మూడు అవస్థలను దాటిపోయి చివరకు తురీయమనే స్థాయికి చేరిపోయి, తాను సాక్షాత్తు ఆత్మగా సాక్షీభూతుడై శరీరమును చూస్తూ బ్రహ్