Posts

Showing posts from April, 2023

కరివెన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రాల ఫోన్ నెంబర్

పుణ్యక్షేత్రాలలో కరివెన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రాల ఫోన్ నెంబర్  లు అచ్చటికి వెళ్లేవాళ్ల కి వసతి, భోజన సౌకర్యాల నిమిత్తం ఉపయోగపడతాయి.  క్షేత్రం పేరు మేనేజర్ ఫోన్ నెంబర్  1.శ్రీశైలం 8333907784 2.మహానంది 8333907803 3.భద్రాచలం 8333907796 4.అలంపూర్ 8333907806 5.షిర్డీ 8333907800                     & 7675012727 6.కర్నూలు 8333907808 7.యాదాద్రి 8333907815 8.వారణాసి 8333907790 & 4సత్రాలు ఉన్నాయి8333907791 9.రామేశ్వరం 8333907793 10.త్రిపురాంతకం 8333907794                  & 9493772068 11.విజయవాడ 8333907807 (వృద్ధాశ్రమం) & 9292805204 సూచన: ఈ విలువైన సమాచారం ను మీకు తెలిసిన గ్రూప్లలలో పెట్టి  యాత్రికులకు సహకరించండి. 🙏🏿

అరుంధతి నక్షత్రం..*

*అరుంధతి నక్షత్రం..* *అరుంధతి...వశిష్ఠ మహర్షి ధర్మపత్ని*.  మహా పతివ్రత అని ఆకాశం వంక పెళ్లిసమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు.  అలా చేస్తే మీ సంసారిక జీవనం నల్లేరు మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరులకు చెబుతారు. మాఘమాసాది పంచ మాసాల కాలమందు తప్ప  ఈ నక్షత్రం సాయంత్రం వేళ కానరాదు. రాత్రిపూట చంద్రుడ్ని, నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల  కంటి శక్తి మరింత పెరుగుతుంది.  అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం.                     శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్థరాత్రి లేదా  దాటిన తర్వాత తెల్లవారుఝామున కనిపిస్తుంది. అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి. '?' మార్కు ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి.  ఖచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలో ఉంటుంది.  చిన్న పిల్లాడిని ? మార్కు గీయమంటే ఎలా గీస్తాడో అలా ఉండే సప్తర్షి మండలంలో పక్కపక్కనే ఉండే నక్షత్రాలే అరుంధతి, వశిష్ఠులవారివి.  అరు...

శని గ్రహ స్థిత ఫలితాలు

శని ఒక గ్రహం. దీన్నినపుంసక గ్రహంగా భావిస్తారు. వర్ణం నలుపు, నీలం సూచిస్తాడు. శని సూర్యుడి పుత్రుడు. అధిదేవత యముడు. శని మకర రాశి, కుంభరాశులకు అధిపతి. తులారాశిలో ఉచ్ఛస్థితిని, మేషరాశిలో నీచ స్థితిని పొందుతాడు. పుష్యమి, అనూరాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. మిత్రులు బుధుడు, శుక్రుడు, శత్రువులు రవి, చంద్ర, కుజులు, సముడు గురువు. ముసలి వారిని, సన్నని పొడగరులను సూచిస్తాడు. తత్వం వాయుతత్వం, దిక్కు పడమర, ఋతువు శిశిరం, జాతి శూద్ర, లోహము ఇనుము, ఉక్కు, రత్నములలో నీలం, గ్రహసంఖ్య ఎనిమిది, దిక్బలం సప్తమ స్థానం, గుణము తమోగుణము, ప్రదేశము హిమాలయాలలోని గంగా పరీవాహక ప్రాంతాన్ని సూచిస్తాడు. శరీర అవయవములలో ఎముకలు, క్లోమము, విసర్జకావయములను సూచిస్తాడు. విశేషాలు ఆకారం: ప్రాచీన జ్యోతిష గ్రంధాలలో శని ముసలి వాడుగా వర్ణించబడ్డాడు. అంటే 90 సంవత్సరాల వృద్దుడు. రంగు నలుపు. నపుంసక గ్రహంగా శని వర్ణించబడ్డాడు. సన్నగా, పొడవుగా ఎముకల గుట్టగా నరాల పోగుగా ఉంటాడు. నూనెపూసిన శరీరం, ఇనుప కిరీటం, ఇనుప ఆభరణాలు, చేతిలో చీపురు ఉంటుంది. వాహనం: కాకి. ఋతువు: శిశిరం. రుచి: వగరు. నివాసస్థలం: అత్యంత మురికైన ప్రదేశాలు, శిథిల...

రాహువు కేతువు

రాహువు కేతువు రాహువు కేతువు జ్యోతిషంలో ఇవి చాయా గ్రహాలు. ఇవి అపసవ్యమార్గంలో ప్రయాణిస్తాయి. రాహువు దశాకాలం జాతకంలో పద్దెనిమిది సంవత్సరాలు కేతువు దశాకాలం జాతకంలో ఏడు సవత్సరాలకాలం. రాహువు విషం, విషజ్వరాలు మొదలైన వాటికి కారకుడు. కేతువు రణములకు కారకుడు. జాతక చక్రంలో రాహుకేతువులకు ఇల్లు లేదు. రాహువు సూర్యచంద్రులతో కలిసినప్పుడు సూర్యగ్రహణం. కేతువు సూర్య చంద్రులతో కలసినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడతాయి. రాహుగ్రహ నక్షత్రాలు ఆర్ధ్ర, స్వాతి, శతభిష ఈ నక్షత్రజాతకులకు రాహుదశా శేషంతో జన్మిస్తారు. కేతువు నక్షత్రాలు అశ్విని, మఖ, మూల నక్షత్రాలలో జన్మించిన వారు కేతుదశా శేషంతో జన్మిస్తారు. రాహువు కేతువు నక్షత్రాలైన అశ్విని, మఖ, మూల నక్షత్రాలలో సంచరిస్తున్నప్పుడు దారుణమైన దుర్ఘటనలు సంభవిస్తాయి. రాహువు ఆర్ధ్ర మూడు, నాలుగవ పాదాలలో సంచరించే సమయాన ఆరోగ్య సమస్యలు, చెడు అలవాట్లు ఉత్పన్నమౌతాయి. స్వాతి నాలుగు పాదాల సంచారం ఆరోగ్య సమస్యలు సృష్టిస్తాయి. శతభిష రెండవ పాదసంచారంలో కోపం, మూడవ పాద సంచారం కాలేయ సమస్యలు ఉత్పన్నమౌతాయి. కేతువు అశ్విని మూడవ పాదంలో, మఖ ఒకటి, రెండు, మూడు పాదాలలో, మూల ఒకటి రెండు పాదాలలో ఉన్నప్పుడు ఆరోగ...

లగ్నం

లగ్నం ::- జ్యోతిష శాస్త్రంలో లగ్నం ప్రధాన మైనది. లగ్నం శిశువు పుట్టిన సమయాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయించ బడుతుంది.  ఒక రాత్రి ఒక పగటి సమయంలో మొత్తం పన్నెండు లగ్నాలు ఆవృత్తం ఔతాయి.  సాధారణంగా సూర్యుడు మేషరాశి ప్రవేశ కాలం అయిన మేష సంక్రాంతి నుండి ఉదయకాలమున మేష లగ్నంతో ప్రారంభం ఔతాయి.  ఒక లగ్న కాలం రెండున్నర ఘడియలు.  ప్రస్తుత కాలంలో రెండు గంటల సమయం. అంటే నూట ఇరవై నిముషాలు.  ఒక రోజు అనగా సూర్యోదయము మొదలు మరల సూర్యోదయము వరకు గల కాలము. ఒక రోజుకు 24 గంటలు లేదా 60 ఘడియలు.  ఒక్కోరోజుకు ఈ లగ్నం నాలుగు నిముషాలు వెనుకకు జరిగి తిరిగి ఒక మాస కాలానికి వృషభ సంక్రాంతి నాటికి వృషభ లగ్నంతో మొదలౌతుంది.  దానికి కారణము ప్రతి దేశ అక్షాంశముల సహాయముతో మేషాది సాయన లగ్న ప్రమాణములు తెలుసుకొనవచ్చును.  ఈ సాయన లగ్న ప్రమాణములు యెన్ని యుగములు అయిననూ ఏ విదమైన మార్పు చెందవు.  ఒక భూప్రదిక్షిణ కాలానికి పన్నెండు లగ్నాల ఆవృత్తం పూర్తి ఔతుంది. పన్నెండు లగ్నాలకు పన్నెండు రాశులు అధిపత్యం వహిస్తాయి.  ఒక రోజు 12 రాశులు లేదా లగ్నములు వలన యేర్పడినది. అందువలన ఒక రోజునకు 24 గంట...

మహా ప్రదోష పూజా మహిమ

మహా ప్రదోష పూజా మహిమ  సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలం అని కొందరు, సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు "ప్రదోషోరజనీముఖమ్" రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు. ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రదోషమంటే అది ఒక కాల విశేషము. ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థము. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము. అనగా, చంద్రుడి గతి వలన, ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే, అప్పుడు ప్రదోషము అంటారు. కాబట్టి ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే, అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది. త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని ’మహా ప్రదోషం’ అంటారు.  మనము రోజూ ఎన్నో పాపకర్మలు చేస్తుంటాము. వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకుని, మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము. మన పాపకర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే, దానికి తగ్గ పుణ్య కర్మలు చేయాలి. ఈ త్రయోదశీ ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి రెండవ భాగమున పరమేశ్వరరూపంగా "అర్థనా...

స్త్రీలు చేయకూడని పనులు

స్త్రీలు చేయకూడని పనులు గ్రహణ సమయమందు భూమ్యాకర్షణ శక్తి మార్పు చెందుతుంది. దాని పరిమాణము మనపై చాల ఉంటుంది. ముఖ్యముగా మన కడుపులో ఆహార పదార్థములు జీర్ణమవ్వడానికి కావలసిన ఆమ్లములు ఉండవు. అందువల్ల జీర్ణము కాదు. ఈ కారణముగానే గ్రహణ సమయమునకు ముందుగ మూడు గంటలకు పూర్వమే మన కడుపులో ఏమి ఉండకూడదు అంటారు. మీ భర్త పిల్లలు మంగళ వారము నాడు క్షవరము గడ్డము గీసుకోవడము చేయనీయ వద్దు. ఈ ప్రక్రియ దరిద్రాన్ని సంభవింప చేయును. మంచి పనులను శుక్ల పక్షము నందే అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయ వలెను. మీరు మీ పిల్లలు దిండు పైన కూర్చో వద్దు ఐతే ఈ కాలములో అందరూ దీనిని తప్పక చేస్తుంటారు. స్త్రీలు రాత్రి సమయమున గాజులు కమ్మలు తీయరాదు. దుఃఖము విచారణ చేయ వచ్చిన వారిని ఆహ్వానించ కూడదు. అలాగే వారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్ప కూడదు. ఈ మధ్య కాలంలో దుఃఖము విచారించ వచ్చిన వారిని రండి రండి అంటూ సాదరముగా ఆహ్వానించి స్థలము ఇచ్చి కూర్చోపెట్టి కాఫీలు ఇచ్చి చాల అతిథి మర్యాదలు చేస్తారు. అపరోక్షముగా మనము అశుభములను కోరుకోవడానికి ఇది నాంది అవుతుంది. కొత్త వస్త్రములను ధరించే ముందు దానికి కొంత పసుపు ఏదైనా ఒక మూల రాయాలి. పసుపు క్రిమ...

శ్రీ గణేశ స్తోత్రం

*🕉️శ్రీ గణేశ స్తోత్రం🕉️*                                     *(సామవేదోక్తం)* 1) ఖర్వం లంబోదరం స్ఠూలం జ్వలంతం బ్రహ్మతేజసా |   గజవక్త్రం మహానిర్వాణ  మేకదంతమనంతకం || 2) సిద్ధానాం యోగినామేవ జ్ఞానినాంచ గురోర్గురుం |    ధ్యాతం మునీంద్రైర్దేవేంద్రైఃబ్రహ్మేసాశేషసమ్జకైః || 3) సిద్ధేంద్రైర్మునిభిః సద్భిర్భగవంతం సనాతనం |    బ్రహ్మస్వరూపం పరమం మఙ్గలం మఙ్గలాలయం || 4) సర్వవిఘ్నహరం శాంతం దాతారం సర్వసంపదాం |    భవాబ్ధిమాయా పోతేవ కర్ణధారంచ  కర్మిణాం || 5) శరణాగత దీనార్త పరిత్రాణాయ పరాయణం |   ధ్యాయేద్ధ్యానాత్మకం సాధ్యం భక్తేశం భక్తవత్సలం || 6) పరంధామ పరంబ్రహ్మ పరేశం పరమేశ్వరం |    విఘ్ననిఘ్నకరం శాంతం పుష్టం కాంతమనంతకం || 7) సురాసురేంద్రైః సిద్ధేంద్రైః స్తుతం స్తౌమి పరాత్పరం |    సురపద్మదినేశం చ గణేశం మఙ్గలాలయం || 8) ఇదం స్తోత్రం మహాపుణ్యం విఘ్నశోకహరంపరం |    యః పఠేత్ప్రాతరుద్థాయ సర్వవిఘ్నాత్ప్రముచ్యతే || *🕉️నమో విగ్నేశ్వరా నమోనమః🕉️...

వైద్య విద్య

వైద్య విద్య (రవి, రాహు, కుజ, శని లు కారకులవుతారు) (1) రవి కుజుల సంబంధం...శస్త్ర చికిత్స వైద్యుడుగాను. (2) రవి గురుల సంబంధం వలన ఆయుర్వేద వైద్యుడుగాను (3) రవి శనితో సంబంధం వలన శస్త్రచికిత్స లో అనస్తీసియా వైద్యుడుగాను (4) రవి చంద్ర శుక్రులతో సంబంధం ఉన్న గర్భాశయమునకు సంబంధించిన వైద్య నిపుణుడిగాను (5) రవి శని వలన ఎముకల వైద్యుడుగాను (6) రవి శుక్రులతో సంబంధం వలన నేత్ర వైద్యుడుగాను (7) రవి బుధునితో సంబంధం వలన నరముల స్పెషలిస్ట్ గాను మరియు కర్ణ వైద్య నిపుణులు గాను తయారగుదురు. మరియు విద్యార్థి విద్యాభ్యాససమయమునకు రాహు, రవి, కుజ, శని, మహాదశ లేదా అంతర్దశలు జరుగుచున్నప్పుడు వైద్య విద్యను అభ్యసించుటకు అవకాశం మెండుగా ఉన్నవి.

గ్రహ స్థితులు - డాక్టర్స్ ఇంజనీర్స్

సూర్యగ్రహముతో Technical planets తో significations ఉండి, 5 ,10 స్థానాలతో significations ఉంటే డాక్టర్స్ ఇంజనీర్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సంబంధించిన విద్యాభ్యాసం చేస్తారు.  సూర్యునితో రాహువు గాని, కేతువు గాని వారి డిగ్రీలు దగ్గరగా ఉన్న, చంద్ర, కుజ గ్రహాల యొక్క డిగ్రీలు దగ్గరగా ఉన్నా మెడిసిన్ చదువుతారు. 9 11 స్థానాలతో సిగ్నిఫికేషన్ ఉంటే ఇంకా మంచిది. 12 వ స్థానం - Hospitol ; సింహారాశి - Medical field.  సూర్య నక్షత్రంలో కేతు స్థితి అయితే మెడిసిన్ చదివి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సూర్య నక్షత్రంలో రాహువు స్థితి అయితే ఆయుర్వేదం చదువుతారు.  రాసి చక్రంలో రాహు కేతు గ్రహాలు సూర్య గ్రహానికి 3 డిగ్రీలలోపు ఉంటే వైద్య రంగానికి సంబంధించిన విద్య ఉంటుంది.  Technical planets:- రవి, కుజుడు, శని, రాహువు, కేతువు. బీటెక్ ఇంజనీరింగ్ చేయడానికి సూత్రాలు:- 1. కుజ గ్రహముతో టెక్నికల్ గ్రహాలతో ఐదవ స్థానం లేదా 10వ స్థానంతో significations ఉన్నా( లేక) శని గ్రహంతో టెక్నికల్ , సెమి టెక్నికల్ గ్రహాలతో ఐదు లేక తొమ్మిదవ స్థానంతో significations ఉన్న (లేక) కుజుడు, శని, బుధ గ్రహాలతో ఒకరికొకరికి significations ఉ...

Recover your lost article

Any asset like a vehicle, jewelry, or any expensive article, got through pains taking hard work when is lost results in great mental tensions. To recover your lost article or person, you need to know the exact time of the theft/losing. Approximate time can only work in predictions if the nakshatras are not changing between the actual time and the approximate time related. The position of the moon in nakshatras presiding at the time of losing, that determine whether the article or person will be found or not.    Finding is easy and possible in some nakshatras and difficult or impossible in some. When the moon is in a certain nakshatra, the effects of that nakshatra dominate. Hence, the time of losing is important because it helps in determining the position of the moon and the governing nakshatra.   For prediction of the recovery of lost things, the nakshatras have been divided into 4 categories. If the nakshatra in which an item was lost is known, the category in which th...

సనాతన ధర్మంలో విడాకులు

సనాతన ధర్మంలో విడాకులు లేవు అని ఎవరు చెప్పారు .. సంప్రదాయములో లేక పోవచ్చు కానీ .. ధర్మము లో ఉంది.. కాలానుగుణంగా పరాశర మహర్షి తన స్మృతి లో నారద, గరుడ, అగ్ని, వసిష్ఠ, మను ఎన్నో మార్పులు చేసుకుంటూ వచ్చారు.  *పరాశర స్మృతి 4. 28* ఎప్పుడైతే ఆడదాని భర్త చనిపోతాడో, కనపడకుండా పోతాడో, లేదా ఏదన్నా పాపం చేయడం వలన చండాలుడిగా మారతాడో, సన్యాసము పుచ్చుకుంటాడో, నపుంసకుడు అవుతాడో .. ఆ భార్య ఇంకో వివాహము చేసుకోవచ్చు .. అంటే భర్త బ్రతికుండగా కూడా అతన్ని వదిలి ఇంకొకరిని వివాహం చేసుకోవచ్చు.  *నారద స్మృతి 12. 97* ఎవరి భర్త అయితే చనిపోతాడో, కనపడకుండా పోతాడో, సన్యాసము పుచ్చుకుంటాడో, వర్ణ బహిష్కారణకు గురి అవుతాడో .. అలాంటి వాడిని భార్య వదిలేసి .. ఇంకొకరిని వివాహమాడొచ్చు  *గరుడ స్మృతి 1.107.28:* ఎవరి భర్త అయితే చనిపోతాడో, కనపడకుండా పోతాడో, సన్యాసము పుచ్చుకుంటాడో, వర్ణ బహిష్కారణకు గురి అవుతాడో .. అలాంటి వాడిని భార్య వదిలేసి .. ఇంకొకరిని వివాహమాడొచ్చు  *అగ్ని స్మృతి:* ఆడవారు పునర్వీవాహం చేసుకోటానికి 5 కారణాల్లో ఒకటి చాలు - భర్త చనిపోతే, సన్యాసము తీసుకుంటే, నపుంసకుడు అయితే, విలువల పరంగా పడిపోతే, ...

పరీక్షిత్తు

పరీక్షిత్తు పాండవుల తరువాత భారతదేశాన్ని పరిపాలించిన మహారాజు. ఇతను అర్జునుడి మనవడు, అభిమన్యుని కుమారుడు. ఇతని తల్లి ఉత్తర. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ ఇతనిపై బ్రహ్మ శిరోనామకాస్త్రము ప్రయోగించెను. దాని మూలంగా కలిగిన బాధనోర్వలేక ఉత్తర శ్రీకృష్ణుని ప్రార్థించెను. ఆతని కరుణ వలన బాధ నివారణమై శిశువుగా ఉన్న పరీక్షిత్తు బ్రతికెను. ఇతడు ఉత్తరుని కూతురు ఇరావతిని వివాహము చేసుకొనెను. ఇతని కుమారుడు జనమేజయుడు. ముని సుదేవునితో పరీక్షిత్తు అవి మహాభారతము యుద్ధము చివరి రోజు, దుర్యోధనుడు కూడా నేలకొరిగినాడు. అశ్వద్దామ, అర్జునుడు ఇద్దరూ పరస్పరము బ్రహ్మాస్త్రాలు ప్రయోగించుకున్నారు. కానీ పెద్దల జోక్యముతో చివరకు అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకొనగా అశ్వద్దామ మాత్రం ఉపసంహరణవిధ్య తెలియక "అపాండవగుగాక" అని మరలించాడు, అనగా పాండవుల వారసులు అందరూ మరణించుగాక అని ప్రయోగించాడు. అప్పుడు కృష్ణుడు ఒక్కరిని కాపాడతాను అని మాట ఇచ్చి తల్లి కడుపులో ఉన్న పరీక్షిత్తుని తన యోగ మాయా శక్తి తో, చిన్న రూపుడై చతుర్భుజములతో, శంఖచక్రగదాకౌముదీ మొదలగు అస్త్రాలు ధరించి పిండరూపుడై ఉన్న బాలుని చుట్టూ తిరిగి కాపాడతాడు!...

శ్రీ భువనేశ్వరి దేవి మంత్ర జప సాధన

శ్రీ భువనేశ్వరి దేవి మంత్ర జప సాధన మన ఇష్టదైవం నామాన్ని కానీ, మంత్రాన్ని కానీ, ఒక క్రమపద్ధతిలో భక్తిగా జపించే విధానమే జపం. జపంలో జ కారం మరో జన్మ లేకుండా (జన్మవిచ్ఛేదన) చేస్తుంది. ప కారం పాపాలను నశింప చేస్తుంది. పలికిన వెంటనే ఫలితం ఇస్తుంది కాబట్టి పూజ కన్నా జపానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. లింగ పురాణం ప్రకారం జపం చేయడం వల్ల యక్ష రాక్షస పిశాచాది భయంకర గ్రహాల బాధలు తొలిగిపోయి సుఖశాంతులు కలుగుతాయి. జపం చేయడం వల్ల మానసిక ఉత్తేజం కలుగుతుంది. జపం మూడు రకాలుగా చేస్తారు. మొదటిది వాచికం అంటే సమీపంలోని వారికి వినపడేటట్లు జపించడం. రెండోది ఉపాంశువు అంటే పెదవులను కదిలిస్తూ ఎవ్వరికీ వినపడకుండా చేయడం, మూడోది మానసికం అంటే మనసులో జపించడం. మూడో పద్ధతిలో చేసే జపం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మంత్ర మహార్ణవం, మంత్రమహోదధి వంటి గ్రంథాలలో వివిధ దేవతా మంత్రాలని ఏ విధంగా జపం చేయాలి? ఏ మాల ఉపయోగించాలి? ఏ ఆసనం మీద కూర్చోవాలి? ఏ సమయంలో చేయాలి? ఎలాంటి వస్త్రాల్ని ధరించాలి? పురశ్చరణ ఎలా చేయాలి? అనే విషయాలు వివరించాయి. ఆ గ్రంథాలలో చెప్పిన విధంగా మనం కూడా శ్రీ భువనేశ్వరీ మంత్రాన్ని పురశ్చరణా పూర్...

గ్రహములు కారకత్వములు

*గ్రహములు కారకత్వములు*   *రవి:* తండ్రి, ఆత్మ, ఇతరులకు అపకారం కోరని మనస్తత్వం, శక్తి, పితృచింత, ఆత్మాభిమానం, శివోపాసన, ధైర్యం, బుద్ధి, ఆరోగ్యం, పిత్తము, కార్యనిర్వహణాశక్తి, బుద్ధిబలం, దుర్వ్యయము, యజ్ఞము, దినబలము, సౌమ్యత, రాగి, దేవాలయము, గిరిగమనం, కీర్తి, అధికారం, ఎముక, స్వల్పకేశము, శిరోవ్యాధి, ప్రవర్తన, క్షత్రియ, పాషాణము, భూషణము, వ్యవహారము, లావునడుము, రక్తవర్ణము, రాజసము, రోషము, కారము, పొట్టి, తూర్పుదిశ, జ్ఞానోదయము, ప్రవాళము, రాజ్యము, స్వస్థల స్వాధికారలాభము, పరాక్రమమునకు ఘనత, జనవిరోధం, శతృభయం, యుద్ధం, ఉద్యోగం, వైద్యం, సౌఖ్యం, భార్యాబిడ్డల హాని, పితృభృత్యాది విరోధం, ఆత్మజ్ఞానం, వీపుపై భాగం, పక్కలు, హృదయము, స్త్రీల యందు ఎడమకన్ను, పురుషులయందు కుడికన్ను పై ప్రభావం, ఆరోగ్యము, ప్రాణధాతువులు, గౌరవమైన పదవులు, బిరుదులు, అభివృద్ధి, రాజకీయములు, పరిపాలనాధికారులు మొదలైనవి రవి కారకత్వములు.  *చంద్రుడు*: తల్లి, మనస్సు, ప్రసాదగుణం, మాతృచింత, పుష్పములు, సుగంధం, రూపం, సుఖభోజనం, సముద్రస్నానం, వెండి, తీపి, పాలు, వస్త్రం, నీరు, ముత్యం, ఆవులు, కంచు, పండ్లు, అపస్మారకం, గుల్మము, యశస్స్సు, పట్టువస్...

మంత్ర శక్తి

🌹మంత్ర శక్తి మనసును ప్రక్షాళనం చేసి, నైర్మల్యం కలిగించే ముఖ్య పరికరాలు.. మంత్రాలు. జన్మ....గత వాసనలతో, మనలను కట్టి పడవేసి, అచేతన, సుప్తచేతన ఆలోచనల, కోరికలను చేధించడానికి మంత్రం సహాయపడుతుంది. మంత్రం మన మనసు పొరల్లో దాగియున్న పలురకాలైన ఆలోచనలను దూరం చేస్తుంది. సక్రమంగా, మనస్సాక్షిగా, ధ్యానం చేయబడిన మంత్రాలు సత్ఫలితాలను ఇస్తాయి. మన మనసులోని వ్యతిరేక భావాలను దూరం చేస్తాయి.  *ఉదాహరణకు* .. ‘హుం’ కారం మనలోని భయాన్ని పారద్రోలుతుంది. ‘రం’ కారం మనకు శాంతిని కలుగచేస్తుంది. మంత్రంలో ‘మ’కారం అంటే మననం, మననం అంటే పదేపదే ఉచ్ఛరించడం. ‘త్రం’కారం అంటే త్రాణం, త్రాణం అంటే రక్షించేదని అర్థం, కాబట్టి ‘మంత్రం’ అంటే ఏకాగ్రచిత్తంతో పదేపదే ఉచ్ఛరించే వానిని రక్షించేదని అర్థం. మననం చేయువానిని రక్షించేది మంత్రమని అర్థం. మంత్రం అనేది నిర్గుణ బ్రహ్మస్వరూపం. ఒక బీజం (విత్తనం) పెద్దచెట్టుగా వృద్ధిచెందినట్లు, నిర్గుణ బ్రహ్మమే మంత్రంగా సూచించబడింది.  *మంత్ర వివరణపై అనేక నిర్వచనాలు కనిపిస్తున్నాయి.*  తన హృదయం నుండి అవగతమయ్యే శక్తే మంత్రమనీ, దేవతాధిష్టితమైన ఒకానొక అక్షర రచనా విశేషమే మంత్రమనీ, దేవతా స్...

నక్షత్రాలు ప్రయోజనాలు🌟

మానవ జీవితంలో మానవ జీవితంలో నక్షత్రాలు ప్రయోజనాలు 🌟 దృవ నక్షత్రాలు:- ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, రోహిణి నక్షత్రాలు. స్ధిరమైన పనులు చేయుటకు పనికి వస్తాయి. నూతన కార్యములు కాకుండా ఉన్నవి. ఉదా:-గృహ నిర్మాణం, ఉద్యోగం. ⚡️ చర నక్షత్రాలు:- స్వాతి, పునర్వసు, శ్రవణం, ధనిష్ఠ, శతభిష నక్షత్రాలు చర నక్షత్రాలు. ఈ నక్షత్రాలలో యాత్రలు, విద్యా, వాహన చోదనం, గృహారంభం, నూతన కార్యములు. 💫 ఉగ్ర నక్షత్రాలు:- భరణి, మఖ, పుబ్బ, పూర్వాషాడ, పూర్వాభాద్ర నక్షత్రాలు ఉగ్ర నక్షత్రాలు. ఈ నక్షత్రాలు శుభ కార్యాలకు మంచిది కాదు. ఆయుధాల ప్రయోగానికి, మందులు తయారు చేయటానికి పనికి వస్తాయి. ✨ మిశ్రమ నక్షత్రాలు:- విశాఖ, కృత్తిక నక్షత్రాలు. ఇవి మిశ్రమ నక్షత్రాలు. ఇవి యజ్ఞ క్రియలు, దేవాలయ కార్యములు చేయుటకు మంచివి. నిప్పు, బాంబులు, పేలుడు పదార్ధాలు చేయుటకు మంచిది. 🌟 క్షిప్ర నక్షత్రాలు:- అశ్విని, హస్త, పుష్యమి, అభిజిత్ నక్షత్రాలు క్షిప్ర నక్షత్రాలు. విద్యారంభానికి, అమ్మకాలకి, ఔషదాలు తీసుకొనుటకు, పనిలో సత్ఫలితాలు ఇచ్చే వాటికి, వెంటనే జరిగే పనులకు ఈ నక్షత్రాలు మంచివి. ✨ మృదు నక్షత్రాలు:- మృగశిర, రేవతి, చిత్త, అనురాధ నక్షత్రాలు మృద...

ద్వాదశ ఆదిత్యులు

🚩🔆🚩🔆🚩🔆🚩🔆🚩 *మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం*...*మొత్తం* *12 మంది సూర్యులు*.......!! *ఏడాదిలోని ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు*.  1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు ధాత’. 2. వైశాఖంలో అర్యముడు, 3. జ్యేష్టమాసంలో మిత్రుడు, 4. ఆషాఢంలో వరుణుడు, 5. శ్రావణంలో ఇంద్రుడు, 6. భాద్రపదంలో వివస్వంతుడు, 7. ఆశ్వయులో త్వష్ణ, 8. కార్తీకంలో విష్ణువు, 9. మార్గశిరంలో అంశుమంతుడు, 10. పుష్యంలో భగుడు, 11. మాఘంలో పూషుడు, 12. ఫాల్గుణంలో పర్జజన్యుడు. ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు.  భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం.. ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు.  అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని  8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళశాస్త్రవేత్తలు. బాల్యంలో హనుమంతుడు సూర్యుణ్ణి.. పండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట.  అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని.. ‘యుగ సహస్ర యోజన పరాభాను’ అని తులసీదాస్‌ హనుమాన్‌ చాలీసాలో చెబుతారు. దీన్ని లెక్క కడితే... ‘ యుగం.. 12000 ఏళ్లు,  సహస్రం.. 1000,  యోజనం....

శ్రీసూర్యనారాయణస్వామి ఆలయం, అరసవిల్లి

Image
శ్రీకాకుళం జిల్లా : అరసవిల్లి శ్రీసూర్యనారాయణస్వామి ఆలయం                శ్రీ సూర్యనారాయణ దేవాలయాలు భారతదేశంలో అరుదుగా వున్నాయి. ఒరిస్సాలోని పూరీకి సమీపంలో కోణార్క్ సూర్యదేవాలయం వుంది. శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లిలో శ్రీ ఉషా పద్మినీ ఛాయా సమేత శ్రీ సూర్య నారాయణస్వామి దేవాలయం వుంది. ఇది గొప్ప సూర్యక్షేత్రం. ’ఓం ఆదిత్యాయ నమః..’ అంటూ భక్తులు వేనోళ్ల పొగిడే దివ్య ఆదిత్య క్షేత్రం.. శ్రీకాకుళం సమీపంలోని అరసవల్లి సూర్యక్షేత్రం! భక్తులు సూర్యభగవానుని శరణుజొచ్చి, పూజలు, అభిషేకాలు సూర్య నమస్కారాలు జరిపి తమ కోర్కెలు ఫలించడంతో హర్షభరితులై తమ ఇండ్లకు వెళతారు. అందుకే ఈ క్షేత్రానికి హర్షవల్లి అనే పేరు వచ్చిందని, అదే వాడుకలో అరసవిల్లి అయిందని అంటారు. ఈ క్షేత్ర స్వామి గ్రహాధిపతి కావడం వల్ల దర్శన మాత్రముననే సర్వగ్రహారిష్ట శాంతి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్యకిరణాలు ఉదయసంధ్యలో మూలవిరాట్టు పాదాలకు సోకేలా ఈ దేవాలయం నిర్మించబడింది. దేవాలయ వాస్తులో యిదో ప్రత్యేకత. కంచిలోని ఏకాంబరే...