చందమామ కథలు*
*చందమామ కథలు* 🍃🌹🦜🍃🌹🦚 14-9-2020 *మహేంద్రపురి రాజ్యంలో, సర్పవరం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సాంబన్న అనే పాములు పట్టేవాడుండేవాడు. పాముకాటుకు చికిత్స చేయడంలో కూడా అతడికి మంచి పేరుండేది. సాంబన్నకు లేకలేక ఒక కొడుకు పుట్టాడు. సాంబన్న వాడికి నాగరాజు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు. సాంబన్న భార్యకు మహా జాతకాలపిచ్చి.* *ఆమె ఒకసారి కొడుకు జాతకం, ఆ గ్రామంలో పేరుమోసిన ఒక జ్యోతిష్కుడికి చూపించింది. ఆ జాతకాన్ని ఒకటికి రెండు సార్లు పరీక్షించి చూసిన జ్యోతిష్కుడు సంభ్రమాశ్చర్యాలతో సాంబన్న దంపతులకు, ‘‘ఔరా, ఏమిటీ వింత! మీ కొడుక్కు రాజయోగం ఉంది,'' అని చెప్పాడు. ‘‘రాజయోగమా! హాస్యాలు మాని అసలు సంగతి చెప్పండి, సాములూ,'' అన్నాడు సాంబన్న. ‘‘హాస్యం కాదురా, సాంబూ.* *నిజమే చెబుతున్నాను. నీ కొడుకు రాజయ్యూక, నన్ను మరిచిపోకు,'' అన్నాడు జ్యోతిష్కుడు, జాతక పత్రాన్ని కళ్ళకద్దుకుని సాంబన్న చేతికిస్తూ. ఆ మాటలతో సాంబన్నకు, కొడుకు రాజయోగం పట్ల కొంత నమ్మకం కలిగింది. జ్యోతిష్కుడు చెప్పినట్లు కొడుకు రాజైతే, చదువు రాకపోవడం బాగుండదని, నాగరాజును బడిలో చేర్పించాడు.* *నాగరాజు పదేళ్ళ వయ...