🦜 'ఉడుపీ శ్రీ కృష్ణ విగ్రహ రహస్యం'🦜
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ 🦜 'ఉడుపీ శ్రీ కృష్ణ విగ్రహ రహస్యం'🦜 ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ స్వయంగా రుక్మిణీ దేవి చేయించిన 'ఉడుపీ శ్రీ కృష్ణ విగ్రహ రహస్యం'! శ్రీ కృష్ణుని ఆలయాలలో, నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇవి ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ లోని మథుర, గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక, దక్షిణ భారతదేశంలో కేరళలోని గురువాయూరు, కర్ణాటకలోని ఉడుపి. ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు, త్రిమతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యుల వారి జననం, జీవితం, ప్రసిద్ధ శ్రీ కృష్ణ క్షేత్రం, కర్ణాటకలోని ఉడుపితో ముడిపడి ఉంది. ఒక రోజు శ్రీ మధ్వాచార్యుల వారు, వేకువజామునే, సముద్ర తీరానికి వెళ్లి స్నానం చేసి, ప్రాత: సంధ్యాదికాలు ముగించుకుని, ఆ తీరంలోనే కూర్చుని, ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు. తపోదీక్షతో, ద్వాదశ స్తోత్ర రచన సాగుతోంది. ఆ రోజు పర్వదినం కావడంతో, అనేక మంది ప్రజలు కూడా వచ్చి, సముద్రస్నానం చేశారు. ప్రశాంతమైన ప్రాత: కాలం, భక్తి ప్రపత్తులు ప్రసరించడానికి అనువైన సమయం. అలాంటి నేపద్యంలో, శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటంకంగా, ద్వాదశ స్తోత్రంలోని అయిదు అధ్యాయాల రచన పూర్తి చేశారు. ఆరవ అధ్యాయం ప్...