మూలాది దుష్ట నక్షత్రాలు - అపవాదులు
మూలాది దుష్ట నక్షత్రాలు - అపవాదులు శ్వశ్రూవినాశ మహిజౌ సుతరాం విధత్తః కన్యాసుతే నిరృతిజౌ శ్వశురం హతశ్చ జ్యేష్ఠా భజాత తనయా స్వధవాగ్రజంచ శక్రాగ్ని జా భ్వతి దేవర నాశకర్త్రీ - ముహూర్త చింతామణి. మూలలో జన్మించిన కన్య, సుతుడు మామగార్కి దోషాన్ని కలిగిస్తాడు. ఆశ్లేష జన్మించిన కన్య, సుతుడు అత్తగారికి దోషాన్ని కలిగిస్తాడు. జ్యేష్ఠా నక్షత్రంలో జన్మించిన స్త్రీ భర్త యొక్క అన్న గారికి దోషకారి అవుతుంది. విశాఖ నక్షత్రంలో జన్మించిన స్త్రీ భర్త యొక్క తమ్మునికి దోషకారి అవుతుంది. అపవాదులు ద్వీశాద్యపాద త్రయజా కన్యా దేవర సౌఖ్యదా మూలాంత్య పాద సార్పాద్య పాద జాతో తయోః శుభౌ - ముహూర్త చింతామణి. విశాఖ 1, 2, 3 పాదాలలో జన్మించిన స్త్రీ మరిదికి మేలు చేస్తుంది. మూల చివరి పాదంలోను, ఆశ్లేష 1 వ పాదంలోను జన్మించిన స్త్రీ మామ గారికి అత్త గారికి శుభం చేస్తుంది. సుతః సుతావానియతం శ్వశురం హంతిమూలజః తదంత్య పాదజోనైవ తధాశ్లేషాద్య పాదజః వత్సరాత్పితరం హంతి మాతరం తు త్రివర్షతః ద్యుమ్నం వర్షాద్వయేనైవ శ్వశురం నవ వర్షతః జాతం బాలం వత్సరేణ వర్షైః పంచభిరగ్రజం శ్యాలకం చాష్టభి ర్వర్షైః అనుక్తాన్ హం...