Posts

మూలాది దుష్ట నక్షత్రాలు - అపవాదులు

Image
మూలాది దుష్ట నక్షత్రాలు - అపవాదులు శ్వశ్రూవినాశ మహిజౌ సుతరాం విధత్తః కన్యాసుతే నిరృతిజౌ శ్వశురం హతశ్చ జ్యేష్ఠా భజాత తనయా స్వధవాగ్రజంచ శక్రాగ్ని జా భ్వతి దేవర నాశకర్త్రీ   - ముహూర్త చింతామణి. మూలలో జన్మించిన కన్య, సుతుడు మామగార్కి దోషాన్ని కలిగిస్తాడు. ఆశ్లేష జన్మించిన కన్య, సుతుడు అత్తగారికి దోషాన్ని కలిగిస్తాడు. జ్యేష్ఠా నక్షత్రంలో జన్మించిన స్త్రీ భర్త యొక్క అన్న గారికి దోషకారి అవుతుంది. విశాఖ నక్షత్రంలో జన్మించిన స్త్రీ భర్త యొక్క తమ్మునికి దోషకారి అవుతుంది.    అపవాదులు ద్వీశాద్యపాద త్రయజా కన్యా దేవర సౌఖ్యదా మూలాంత్య పాద సార్పాద్య పాద జాతో తయోః శుభౌ - ముహూర్త చింతామణి. విశాఖ 1, 2, 3 పాదాలలో జన్మించిన స్త్రీ మరిదికి మేలు చేస్తుంది. మూల చివరి పాదంలోను, ఆశ్లేష 1 వ పాదంలోను జన్మించిన స్త్రీ మామ గారికి అత్త గారికి శుభం చేస్తుంది.  సుతః సుతావానియతం శ్వశురం హంతిమూలజః తదంత్య పాదజోనైవ తధాశ్లేషాద్య పాదజః వత్సరాత్పితరం హంతి మాతరం తు త్రివర్షతః ద్యుమ్నం వర్షాద్వయేనైవ శ్వశురం నవ వర్షతః జాతం బాలం వత్సరేణ వర్షైః పంచభిరగ్రజం శ్యాలకం చాష్టభి ర్వర్షైః అనుక్తాన్ హం...

నటరాజు

Image
"నృత్తావసానే నటరాజరాజో ననాద ఢక్కాం నవపంచవారం ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాదినేతత్‌ విమర్శే శివసూత్ర జాలం" "అచలుడై శివుడు మౌనంగా ఉంటాడు. నృత్యానంతరం శివుడు తన డమరుకాన్ని మ్రోగించినప్పుడు భాషాశాస్త్రం పుట్టింది ఈ శ్లోక తాత్పర్యమిది. నటరాజు నృత్యమాడుతున్నప్పుడు సనకసనందనాదులు, పతంజలి వ్యాఘ్రపాదుడు వంటి ఋషులు తన్మయతతో తిలకిస్తూంటారు. వారు మహర్షులవటం వల్ల సామాన్యులు చూడలేని, ఆ నర్తనని చూడగలుగుతారు. నటరాజుని నర్తనం చూడటానికి దివ్యచక్షువులు కావాలి కదా! దేవతలు, బుుషులు, యోగులు తమ తపశ్శక్తి వల్ల నటరాజు నర్తనాన్ని చూచే శక్తిని సంపాదించారు. దేవుడ్ని చూడటానికి కావలసిన సామర్థ్యాన్ని "దివ్యదృష్టి అంటారు. దీనినే భగవద్గీతలో ""దివ్య చక్షు" వన్నారు. సనకసనందనాది ఋషులు నటరాజు నర్తనాన్ని తమ కళ్లతోనే చూస్తూ ఆనందిస్తున్నారు. పెద్ద డోలుని విష్ణువు వాయిస్తూంటే, బ్రహ్మ తాళం వేస్తున్నాడు. నర్తనం పూర్తి కావస్తున్న సమయానికి ఢక్క నుండి, పధ్నాలుగు దరువులున్న ""చోపు వస్తుంది. పై శ్లోకంలోని ""నవపంచవారం. అన్న పదం ఈ పధ్నాలుగు (తొమ్మిదికి అయిదు కలిపితే వచ్చే...

ఆత్మ పరమాత్మ

Image
ఆత్మను గురించి ఏం ఆలోచించగలం?  ఏం చెప్పగలం?  ఆలోచన మనస్సు పరిధిలోది. 'ఆత్మ' మనస్సు దాటిన తర్వాత కలిగే అనుభూతి. ఆత్మ ఉండీ లేనట్లు, లేకపోయినా ఉన్నట్లు అనిపిస్తుంది. అనుభూతికి మాత్రం అందుతుంది. ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ అనేవి మూడూ ఒక్కటే.  రూపగుణాలు ఒక్కటే. అవధులు మాత్రం వేర్వేరు. ఒక్కటే అయిన ఆత్మ అవసరానికి 'అంతరాత్మ' అనిపిస్తుంది. పైకి వెళ్లాక 'పరమాత్మ'గా వ్యవహరిస్తుంది. ఆ రహస్యం తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. అసలు ఆత్మను తెలుసుకోవడమే జ్ఞానం. ఆత్మను గురించి మరింతగా తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. ఇక్కడ తెలుసుకునేది మనస్సుతో కాదు. అత్మతో - అది ప్రజ్ఞా విశేషం. అయితే 'ఆత్మ' వివేకం ముందు కలగాలి.  వివేకానికి జిజ్ఞాస జతపడాలి. అప్పుడు ప్రజ్ఞ బయటకొచ్చి ఆత్మజ్ఞానానికి తుదిమెరుగులు దిద్దుతుంది. 'ఆత్మ'ను గురించిన కనీస అవగాహన ఏర్పడితే అటువైపు దృష్టి సారించవచ్చు. మామూలు దృష్టికి ఆత్మ కనిపించదు. అందుకు అంతర్దృష్టి ఏర్పడాలి. మనస్సును నిద్రపుచ్చి లేదా శూన్యంచేసి ఆలోచనలు తలఎత్తకుండా చేసినప్పుడు ఆత్మ అనుభూతికి అందుతుంది. నిజానికి ఆత్మసహకారం లేనిది 'ఆత్మజ్ఞానం' కల...

గ్రహ గతులు:

*వక్రం* ప్రతి గ్రహం వాటి వాటి కక్ష్యలలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భూమి కూడా తన కక్ష్యలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి వాస్తవంలో ఏ గ్రహానికి వక్రగతి గానీ ఇతర గతులుగాని ఉండవు. కాని భూమి మీద నున్న పరిశీలకుడు ఒక గ్రహాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ గ్రహం ముందుకు వెళ్లినట్లు, ఒక్కొక్కసారి వెనుకకు వెళ్లినట్లు, ఒక్కొక్కసారి కదలకుండా ఉన్నట్లు కనిపిస్తుంది. ఒక గ్రహం ముందుకు వెళ్లినట్లు కనిపించే స్థితినే *ఋజుగతి* అంటారు. ఒక గ్రహం వెనుకకు వెళ్లినట్లు కనిపించే స్థితినే *వక్రం* లేదా *వక్రగతి* అంటారు. ఒక గ్రహం వక్రగతిలో ఉన్నదంటే అది భూమి కంటే వెనుక ప్రయాణిస్తుందన్న మాట. ఇంకో విధంగా చెప్పాలంటే గ్రహం తానున్న రాశి నుండి గాని, నక్షత్ర పాదం నుండి వెనుకకు పోవటాన్ని *వక్రం* అంటారు.  *అతిచారం* గ్రహం వేగంగా ముందుకు వెళ్లినట్లు కనిపించే స్థితినే *అతిచారం* అంటారు. ఇంకోవిధంగా చెప్పాలంటే ఒక గ్రహం ఒక రాశిలో ఉండవలసిన కాలం కంటే ముందుగానే వేరొక రాశిలో ప్రవేశించడం. ఒక గ్రహం అతిచారంలో ఉన్నదంటే ఆ గ్రహం భూమి కన్నా ముందుకు వెళ్తున్నదన్నమాట.  *స్తంభన* : గ్రహం కదలకుండా ఉన్నట్లు కనిపించ...

రాహుకాలం, గుళిక కాలం, యమగండకాలం

Image
వర్జ్యం, దుర్ముహూర్తం చూస్తాము సరే ఈ రాహుకాలం, గుళిక కాలం, యమగండకాలం అంటే ఏమిటి? ఇతఃపూర్వం కాలం గురించి సమయాల్లో శుభ అశుభ సమయాలేమిటి? కాలగణనలో మరికొన్ని కాలాలు చెబుతున్నారు. వాటి ప్రాముఖ్యత ఏమిటి అని ఒకరు ప్రశ్నించారు. విశదీకరించడానికి ప్రయత్నిస్తాను.  మన వాంగ్మయంలో హోరా అని చెప్పబడి వుంది. ఆ హోరాను ప్రామాణికముగా తీసుకుని ఇంగ్లీష్ లో hour అని పేరు వచ్చింది. సూర్యోదయానికి ఏ హోరా నడుస్తుందో ఆ పేరున ఆ రోజు పేరు నిర్ణయించబడింది. ఉదాహరణకు సూర్యోదయానికి సూర్య హోరా నడుస్తుంది కనుక భాను వారము, ఆదిత్యవారము, ఆదివారము అని దానికి పేరు. అలాగే మిగిలిన వారాల పేర్లు కూడా. ఈ హోరా ఒక రౌండ్ రాబిన్ పద్ధతి ప్రకారం నడుస్తుంది. వాటి క్రమం  సూర్య  శుక్ర  బుధ  చంద్ర  శని  గురు  కుజ  ( మరల) సూర్య.....  ఇలా గంటను బట్టి ఆయా గ్రహాల ఆధిపత్యం నడుస్తూ వుంటుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించి వుంటారు. కేవలం 7 గ్రహాల క్రమం వివరింపబడి వుంది. మిగిలినవి రెండూ ఛాయా గ్రహాలు కావున వాటికి హోరా ఉండదు. కానీ కొన్ని పద్ధతులలో కొన్ని నిషిద్ధాలు పాటిస్తారు.  1. రాహుకాలం :...

ఉద్ధవ గీత

ఉద్ధవ గీత ఉద్ధవుడు శ్రీకృష్ణుని ప్రియ మిత్రుడు. రూపు రేఖలు, వేష ధారణ కూడా కృష్ణుని వలే ఉంటాయి. నిర్మలమైన భక్తి అంటే ఏమిటో మనకు తెలుసుకోవాలంటే, ఉద్దవుని గురించి తెలుసుకుంటేనే గాని అర్ధం కాదు. భక్తిలో పరాకాష్టకు చేరినవారు భగవంతుని తమలోనే దర్శించుకుంటారు. శ్రీ భాగవతంలోని గోపికల ద్వారా భక్తి అంటే ఏమిటో శ్రీ వ్యాస భగవానుడు తెలియచేశారు. ఉద్ధవ గీత అనేది శ్రీకృష్ణుడు ఉద్దవునికి చేసిన ఉపదేశం అనే దానికన్నా, ఆచరించవలసిన ఆదేశం అని చెప్పటం బాగుంటుందేమోనని నా అభిప్రాయం. ఈ "ఉద్ధవ గీత" అనేది శ్రీ భాగవతంలోని ఏకాదశ స్కంధంలోని, ఆరవ అధ్యాయం, నలుబదవ శ్లోకం నుండి ప్రారంభం అవుతుంది. ఇరువది తొమ్మిదవ అధ్యాయంతో ముగుస్తుంది. ఈ మొత్తం"ఉద్ధవ గీత"లో వెయ్యికి పైగా శ్లోకాలు ఉన్నాయి. ఉద్ధవుడు యదుకుల శ్రేష్ఠుడు, మహాజ్ఞాని. శ్రీకృష్ణ, ఉద్ధవుల సంవాదమే ఉద్ధవ గీతగా ప్రసిద్ధిగాంచింది. శ్రీ కృష్ణుడు చివరిసారిగా చేసిన బోధ ఇదే. ఒక విధంగా చెప్పాలంటే "ఉద్ధవ గీత" భగవంతుడైన శ్రీ కృష్ణ పరమాత్మ మనకిచ్చే వీడ్కోలు సందేశం అని చెప్పవచ్చు. భగవద్గీత చదివిన "విద్యార్ధులకు" ఇది ఒక పునశ్చరణ కూడా!పరమాత్...

మానవ శరీరం

మానవ శరీరం 1 గుండే   రక్తన్ని శుద్దిచేస్తుంది. 2  వాయువును    ఉపిరి తిత్తులు శుద్ధిచేస్తుంది. 3  కిడ్నిలు  నీటిని శుద్దిచేస్తున్నాయి  4  రోగన్ని రానివ్వకుండ రోగనిరోదక శక్తి శుద్ది చేస్తున్నాయి మీకోరకు రోజులకోద్దియుద్దలు చేస్తున్నాయి 5  తీసుకున్న ఆహారాన్ని జఠరాగ్ని పక్వంచేస్తుంది . ( మనిషి ) లో శక్తులు 1. జీవశక్తి  అంతఃర్గత  నాడిమంలాల్లో ఉంటుంది. . 2, ఓజో శక్తి ఇది కండరలల్లో ఉన్న శక్తి ఇది బ్రహ్మచర్యం వల్ల మనస్సు ఇంద్రియంల ద్వారా క్రియలు నిరోదించడం వల్ల వస్తుంది. . 3. కుండలీని శక్తి ఇది మూలాదారం నందలి బ్రహ్మమార్గం  ఇడనాడీ పింగల నాడీ  సుషుమ్నానాడీ రంద్రంనకు తన ముఖం అడ్డుపేట్టి నిద్రిస్తు ఉంటుంది . మానవ దేహ తత్వం ) 5 ఙ్ఞానింద్రియంలు . 1 శబ్ద 2 స్పర్ష 3 రూప 4 రస 5 గంధంలు. . 5 ( పంచ తన్మాత్రలు ) . 1 చెవులు 2 చర్మం 3 కండ్లు 4 నాలుక 5 ముక్కు . 5 ( పంచ ప్రాణాలు ) , 1 అపాన 2 సామనా 3 ప్రాణ 4 ఉదాన 5 వ్యాన . 5 ( అంతఃర ఇంద్రియాలు ) 5 ( కర్మఇంద్రియాలు ) , 1 మనస్సు 3 బుద్ది 3 చిత్తం 4 జ్ఞానం 5 ఆహంకారం . 1 వాక్కు 2 పాని 3 పాదం 4 గుహ్...