"కుండలీలో ఉన్న భూతత్వ రాశులు -వాటి అధిపతులు - ఫలిత సూచనలు"💥
🌷ఓం శ్రీ గణేశ శారద గురుభ్యో నమః🌷 🌷మాతపితృభ్యో నమః🌷 🌷శ్రీ మాత్రే నమః🌷 🌷సభాయై నమః🌷 💥"కుండలీలో ఉన్న భూతత్వ రాశులు - వాటి అధిపతులు - ఫలిత సూచనలు"💥 మన మహార్షులు రాశిచక్రంలో వృషభ, కన్య, మకర రాశులను భూతత్వరాశులుగా నిర్ణయించారు. భూతత్వం అనగానే శబ్ద, రూప, స్పర్శ, రస, గంధం వంటి పంచ భూతత్వ గుణాలు కలిసి భూమికి ఉన్నాయి అని తెలుస్తుంది. భూమిని చూడాగనే చైతన్యం, ఉన్నతం, స్థిరత్వములకు ప్రతీకగా కనిపిస్తుంది. ఇంకా క్షమగుణం, ఓర్పు, సహనం, మమకారం, మాతృత్వం, మానవత్వం, కరుణ, కష్టపడి పనిచేసే తత్వం, గాంభీర్యం వంటి లక్షణాలు కనిపిస్తాయి. భూతత్వ రాశులలో ఎక్కువ గ్రహాలు ఉండగా జన్మించినవారు శరీరబలము, భోజనప్రీతి, ప్రారంభించిన పనిని పూర్తిగా చేయడం, సంపాదానాభిలాష మొదలైన లక్షణాలు కలిగి ఉంటారు. ఇంకా సహనం, ఓర్పు ఎక్కువ, సంతాన ఆపేక్ష, ఏదైనా సంతోషంగా అనుభవిస్తారు. అణిగిమణిగి వారి పరిధిలో వారు ఉండడం మరియు భరించేది భూమి అన్నట్లుగానే ఉంటుంటారు. వృషభరాశి :- స్థిరరాశి, శుక్రుడు అధిపతి. వైశ్యజాతి, రజోగుణ ప్రధానమైనది. వృషభము అనగా ఎద్దు. గ్రామములు, వ్యవసాయ క్షేత్రములందు సంచరించునది. గాంభీర్యత, నిండైన వ్యక్తిత్వర...