Posts

Showing posts from November, 2021

శ్రీ లలితా త్రిశతి స్తోత్రరత్నమ్.

శ్రీ లలితా త్రిశతి స్తోత్రరత్నమ్. శ్లో సకుంకుమ విలేపనా మళిక చుమ్బి కస్తూరికాం  సమన్దహసితేక్షణాం సశరచాప పాశాంకుశాం  అశేషజనమోహినీ మరుణమాల్యభూషాంబరాం  జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదమ్బికాం  అస్య శ్రీ లలితా త్రిశతి స్తోత్ర మహామంత్రస్య భగవాన్ హయగ్రీవ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ లలితా త్రిపురసుందరీ దేవతా ఐం బీజం; క్లీం శక్తిః; సౌః కీలకం మమ సకలచింతిత ఫలవ్యాప్యర్థే (మమ చతుర్విధ ఫలపురుషార్థ సిద్యర్థే జపే వినియోగః)  ఐమిత్యాదభి రంగన్యాస కరన్యాసాః కుర్యాత్……. ధ్యానమ్  అతి మధుర చాప హస్తా మపరిమితామోదబాణ సౌభాగ్యాం అరుణా మతిశయ కరుణా మభినవకుల సుందరీం వందే  శ్రీ హయగ్రీవ ఉవాచ  కకార రూపా కల్యాణీ కల్యాణ గుణశాలినీ  కల్యాణశైలనిలయా కమనీయా కళావతీ 1 కమలాక్షీ కల్మషఘ్నీ కరుణామృతసాగరాః  కదంబకాననావాసా కదంబకుసుమ ప్రియా 2 కందర్ప విద్యా కందర్ప జనకాపాంగవీక్షణా  కర్పూరవీటి సౌరభ్య కల్లోలిత కకుప్తటా 3 కలిదోషహరా కంజలోచనా కమ్రవిగ్రహా  కర్మాదిసాక్షిణీ కారయిత్రీ కర్మఫలప్రదా 4 ఏకారరూపా చైకాక్షర్యేకా నేకాక్షరాకృతిః  ఏతతత్తాదిత్య నిర్దేశ్యా చైకానంద చిదాకృతిః 5 ఏవమిత్యాగ...

తల విలువ నోరు చెబుతుంది.

తల విలువ నోరు చెబుతుంది.  పూర్వం ఒక దేశ మహారాజ, తన మంత్రిగారి తో, భటుడితో అరణ్యంలోకి వెళ్ళాడు వేటకోసము.  కొంత సమయానికి రాజుగారికి దాహం వేసి త్రాగే నీరు కావాల్సి వచ్చింది. వెంటనే భటుడిని పంపాడు.  కొంచం దూరంలో ఒక కళ్ళు లేని అంధ ముని తప్పస్సు చేసుకొంటున్నారు. ఈ భటుడు, "ఇక్కడ మంచి నీళ్ళు ఎక్కడ ఉన్నాయిరా" అని అడిగాడు, "ఆ పక్కన ఉన్నాయి పోరా" అన్నాడు ముని.  భటుడు నీళ్లు తీసుకొని రాని కారణంగా మంత్రి గారు వెళ్లారు. మంత్రి గారు, "ఓ ముని ఇక్కడ నీటి ఏర్పాటు లేదా" అని అడిగితే, "ఆ పక్కన ఏర్పాటు చేశారు" అని సమాధానం వచ్చింది.  అలస్య కారణంగా, విపరీత దాహ కారణంగా రాజుగారు స్వయంగా ముని దగ్గరకు వచ్చి "మహాత్మా ఇక్కడ త్రాగే నీరు ఉందా" అని అడిగేతే, ముని లేచి నుంచొని నమస్కారం చేసి "మహారాజ నీటి కోసం మీరే రావాలా" అని అడిగాడు. ఇంతకు ముందు ఇద్దరు వచ్చారుగా, నేనె మహారాజుని అని ఎలా తెలిసింది అని రాజు అడిగితే ముని, "తల విలువ నోరు చెబుతుంది" అని అన్నాడు. కొంత మంది ఎదుటివారు తమకంటే తక్కువ వారు అని "గదమాయించి" మాట్లాడుతారు.  ఇంకొంతమంది...

రామరాజ్యంలో ఓ కుక్క కథ★

★రామరాజ్యంలో ఓ కుక్క కథ★ రామరావణ యుద్ధం ముగిసింది. రాముడు పట్టాభిషిక్తుడు అయ్యాడు. ఆయన పాలనలో ధర్మం నాలుగు పాదాలా నడుస్తోందన్న కీర్తి ముల్లోకాలకీ వ్యాపించింది. అలాంటి సందర్భంలో ఓ రోజున... రాముడు తన దర్బారులో కొలువై ఉన్నాడు. అతని చుట్టూ మంత్రులు పరివేష్టించి ఉన్నారు. కశ్యపుడు, వశిష్టుని వంటి రుషివర్యులు ఉచితాసనాలని అలంకరించారు. అలాంటి నిండుసభలో రాముల వారు లక్ష్మణుని వంక చూస్తూ ఎవరన్నా పౌరులు కార్యార్థులై, తన సభకు చేరుకున్నారా అని అడిగాడు. సుభిక్షమైన రాముని పాలనలో... ప్రత్యేకించి విన్నవించుకునేందుకు ఎవరికీ ఏ సమస్యా, అవసరమూ లేవని బదులిచ్చాడు లక్ష్మణుడు. పోనీ రాజద్వారం దగ్గర ఎవరన్నా సమస్యలతో నిలబడి ఉన్నారేమో చూసి రమ్మని పంపాడు రాముడు.   రాముని ఆజ్ఞ మేరకు రాజద్వారాన్ని చేరుకున్న లక్ష్మణుడికి అక్కడ ఓ గాయపడిన కుక్క కనిపించింది. ‘ఓ శునకమా! నీకేం ఆపద వచ్చింది? ఎలాంటి సంకోచమూ లేకుండా నీకు వచ్చిన సమస్యని చెప్పుకో!’ అంటూ అభయమిచ్చాడు లక్ష్మణుడు. దానికి ఆ కుక్క తన సమస్యని రామునికే విన్నవించుకుంటానని పట్టుపట్టింది. దాంతో దానిని రాముని సమక్షానికి తోడుకుపోక తప్పలేదు లక్ష్మణునికి   తనకి వచ...

సౌభాగ్య లక్ష్మి రావమ్మా

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ సౌభాగ్య లక్ష్మి రావమ్మా ( 2 ) నుదిటి కుంకుమ రవి బింబముగా  కన్నులు నిండుగా కాటుక వెలుగా ( (2 ) కాంచన హారము గళమున మెరియగా  పీతాంబరముల శోభలు నిండగా (2 ) సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ  సౌభాగ్య లక్ష్మి రావమ్మా (2 ) నిండుగా కరముల బంగరు గాజులు ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు (2 ) గల గల గలమని సవ్వడి చేయగా  సౌభాగ్య వతుల సేవలు నందగా (2 ) సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ  సౌభాగ్య లక్ష్మి రావమ్మా (2 ) నిత్య సుమంగళి ,నిత్య కళ్యాణి  భక్త జనుల మా కల్పవల్లివై (2) కమలాసనావై కరుణ నిండగా  కనక వృష్టి కరుణించే తల్లి (2) సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మ  సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మ (2) జనక రాజుని ముద్దుల కొమరిత రవికుల సోముని రమణి మణివై (2) సాధు సజ్జనుల పూజలందుకొని  శుభములు కలిగెడి దీవెనలు ఇయ్యగా (2) సౌభాగ్యా లక్ష్మి రావమ్మా అమ్మ  సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మ (2) కుంకుమ శోభిత పంకజ లోచని  వెంకట రామణుని పట్టపు రాణి (2) పుష్కలముగా పుణ్యములిచ్చే   పుణ్యమూర్తి మా ఇంట వెలసిన (2) సౌభాగ్య లక్ష్మి రావమ్మ అమ్మ  సౌ...

శాంతాకారం భుజగ శయనం

శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాఙ్గమ్‌| లక్ష్మీకాంతం కమల నయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాధమ్‌|| భావం : శాంత స్వరూపుడు, శేషశయనుడు, పద్మనాభుడు, దేవదేవుడు, సృష్టికి ఆధారమైనవాడు, ఆకాశం వలె అనంతుడు, మేఘకాంతితో సుందర దేహము కలవాడు, లక్ష్మీదేవికి భర్త, పద్మములవంటి కన్నులవాడు, ధ్యానస్ధితిలో యోగుల హృదయంలో గోచరించువాడు, సంసార భయమును పారద్రోలువాడు, సర్వలోకాలకు ప్రభువుయైన విష్ణుమూర్తికి నమస్కారములు.

కృష్ణాష్టకం

  కృష్ణాష్టకం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ | దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ || ౧ || అతసీపుష్పసంకాశం హారనూపురశోభితమ్ | రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ || ౨ || కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననమ్ | విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుమ్ || ౩ || మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ | బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ || ౪ || ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభమ్ | యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ || ౫ || రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబరసుశోభితమ్ | అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుమ్ || ౬ || గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసమ్ | శ్రీ నికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ || ౭ || శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితమ్ | శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ || ౮ || కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ | కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి || 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🌼🔯🏵🌼🔯🏵🔯🌼  *కృష్ణాష్టమి నాడు* *చేయవలసిన స్తోత్రం*  అనంతం వామనం శౌరిం వైకుంఠం పురుషోత్తమం! వాసుదేవం హృషీకేశం మాధవం మధుసూదనం!! వరాహం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం! దామోదర...

మాయ - మర్మం

మాయ - మర్మం 'జాతస్య హి ధ్రువో మృత్యుః' అంటుంది మన భగవద్గీత.  “ జాతస్య హి ధ్రువో మృత్యుః  ధ్రువం జన్మ మృతస్య చ | తస్మాదపరిహార్యే உర్థేన త్వం  శోచితుమర్హసి || ” “ పుట్టినవానికి మరణం తప్పదు; మరణించినవానికి పుట్టుక తప్పదు; తప్పించుకోవడానికి  వీలులేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు. ” పుట్టినవాడు గిట్టక తప్పదని దీని సారాంశం. మరి మన తలరాత ఎలా ఉందో చూద్దాం. పుట్టటం నుంచి గిట్టడం దాకా ఈ 'మాయ' మర్మాన్ని కొద్దిగా తెలుసుకుందాం. ఈ విశ్వాన్ని ఇంగ్లీషులో యూనివర్స్‌ అంటున్నాం. యూని అంటే ఒకటి, వర్స్‌ అంటే అనేకం. ఏకం, అనేకం కలిసి యూనివర్స్‌ అయింది. అనేక రూపాలలో కనిపించేదంతా ఒక్కటే అని ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ బ్రహ్మాండానికీ పిండాండానికీ తేడా ఏమీ లేదు. మనం పిండాండం నుంచి వచ్చాం కాబట్టి దీని గురించి తెలుసుకుందాం. మనిషి శరీరంలో 72 శాతం నీరు ఉంది. వెన్నెముక నుంచి అన్ని వైపులకూ 72 వేల నాడులు ఉన్నాయి. వీటిలో 14 నాడులను ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ 14 నాడులకూ పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఉన్న 14 తిథులకూ సంబంధముంది. తిథి అంటే నక్షత్రంలో సగం. శుక్ల పక్షంలోని 14 తిథులు, కృష్ణ పక్ష...

లగ్నం కొన్ని విశేషాలు.

లగ్నం కొన్ని విశేషాలు. లగ్నం నుండి 1,5,9 కోణస్థానములు. 5, 9 స్థానములను త్రికోణ స్థానములని అంటాము. లగ్నం నుండి 1, 4, 7, 10 స్థానములు కేంద్ర స్థానములు. వీటిని కంటక స్థానములు, చతుష్టయములు అంటారు. కేంద్రములో ఉన్న గ్రహములు బలమైనవి. లగ్నంలో ఉన్న గ్రహం కంటే, 4 వ స్థానంలో ఉన్న గ్రహం బలమైనది. 4 స్థానంలో ఉన్న గ్రహం కంటే 7 వ స్థానంలో ఉన్న గ్రహం బలమైంది. 7 వ స్థానంలో ఉన్న గ్రహం కంటే 10 వ స్థానంలో ఉన్న గ్రహం బలమైంది. చంద్రుడి నుండి 3, 6, 10, 11 స్థానాలు ఉపజయ స్థానాలు. 1,2,4,5,7,8,9,12 స్థానములు అనుపజయ స్థానములు. లగ్నము కంటే పంచమ స్థానం పంచమ స్థానం కంటే నవమ స్థానం బలమైనది. 2, 5, 8, 11 స్థానములు పణపర స్థానములు. ఇవి పూర్వ జన్మలో చేసిన పుణ్యకార్యములు తెలియజేస్తాయి. 3, 6, 9, 12 స్థానములు అపోక్లిమ స్థానములు. ఇవి విచక్షణ, హేతు బుద్ధిని తెలియజేస్తుంది. 6, 8, 12 స్థానములు మరుగు స్థానములు దుస్థానములు. 3, 6, 12 స్థానాధిపతులు త్రిషడాయన స్థానములు అంటారు. వీటి అధిపతులు శుభగ్రహాలే అయినా అశుభమే చేస్తారు. 1, 2, 4, 5, 7, 9, 10, 11 శుభ స్థానములు. ఈ స్థానములో ఉన్న గ్రహాలు శుభఫలితాలు ఇస్తాడు. ఈ స్థానాధి పతులు శుభం కలిగ...

Dagdha Rashi

What is Dagdha Rashi? How do the lords behave in different Bhavas? *Dagdha Rashi* is the result of the combination of Day, Tithi( lunar day) and Nakshaktra(constellation). It’s also called Burnt sign. Out of these Tithi, is most important in predictive astrology. Tithi assumes an extremely distinctive part in astrology though the majority of the Vedic astrologer overlooks 'its significance while making forecasts. We have 14 Tithis of Shukla Paksha(waxing Moon period) and 14 of Krishna Paksha,(waning Moon period) in this way making the aggregate of 28. Since one Tithi contains Poornima (Full moon) and one Amavasya (New moon) it an aggregate 30 Tithis and these 30 Tithis make one lunar month. To start with Tithi is known as Pratipada( 1st) and the last one is Chaturdashi,(14th) barring Poornima and Amavasya. Each native is born on some Tithi from Pratipada to Chaturdashi and obviously on Poornima and Amavasya also. Presently on each Tithi two Rashis (signs) are given the name of Dagd...

బళ్లో పడెయ్యడం అను అక్షరాభ్యాసం కథ

సంస్కృతి : సంప్రదాయం బళ్లో పడెయ్యడం అను అక్షరాభ్యాసం కథ  ఇప్పుడంటే బిడ్డ తల్లి కడుపులో ఎదుగుతుండగానే.. కన్నవాళ్లు యమకంగారుగా ఏ కాన్వెంటులో సీటు దొరుకుతుందా అని వేట మొదలుపెడుతున్నారు. అర్థశతాబ్దం కిందట పిల్లల చదువులకు తల్లిదండ్రులు మరీ ఇంతలా తల్లడిల్లడం కనిపించదు.  బిడ్డను అయిదేళ్ల వరకు ఇంటా బయటా హాయిగా ఆడుకోనిచ్చేవాళ్లు. నడుముకు నిక్కరు గుండీలు సొంతంగా పెట్టుకునే అయిదేళ్ళ వరకు ఆగి ఆ నిక్కరు బిగించే చేతికే పలకా బలపం ఇచ్చి బళ్లో కుదేసివచ్చేవాళ్లు. సామాన్యులు ఇంత సాధారణంగా జరుపుకునే పిల్లల అక్షరాభ్యాస కార్యక్రమం కలిగినవాళ్ల ఇళ్లల్లో ఇంకాస్త ఆర్భాటంగా చేయడం రివాజు. డబ్బుండి చేసినా, లేకుండా చేసినా ఇద్దరూ నిర్వహించేదీ ఒకే కార్యకలాపం. దాని పేరే అక్షరాభ్యాసం. గతంలో మన తెలుగునాట పిల్లలను పాఠశాలలో ఎట్లా వేసేవారో.. ఆ తతంగం, దానికి వెనుక ఉన్న ఆధ్యాత్మిక సంప్రదాయం .. వాటిని గురించి సూక్ష్మంగా తెలుసుకొనేందుకే ఇక్కడ ఈ వ్యాసం.    ధర్మశాస్త్రాలు బిడ్డకు అక్షరాలు దిద్దబెట్టే ఈ తతంగానికి రకరకాల పేర్లు నిర్దేశించాయి. తెలుగువాళ్ల మూలరుషిగా భావించే విశ్వామిత్రుడు బిడ్డను బళ్లోవేసే...

తల్లీ కొడుకుల సంభాషణ

ఒక తల్లి తన నిత్యపూజ అయిన తర్వాత విదేశాల్లో వుండే తన కుమారునికి వీడియో చాట్ చేసి తన కుమారునికి ఖాళీగా ఉన్నాడా లేడా అని కనుక్కుని తన వీడియో చాట్ లో జరిగిన సంభాషణలు. మీ మన కోసం.      తల్లి...నాయనా. పూజా పునస్కారాలు ఐనాయా? కుమారుడు...ఇలా చెప్పారు. అమ్మా! నేను ఒక జీవ శాస్త్రవేత్తని. అది కూడా అమెరికాలో మానవ వికాసానికి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నాను. మీరు డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని వినే వుంటారు. అలాంటి నేను  పూజలు అవి ఏం బాగోదు.    తల్లి మందహాసంతో కన్నా! నాకు కూడా డార్విన్ గురించి కొద్దిగా తెలుసు కన్నా. కానీ అతను కనిపెట్టినవి అన్నీ మన పురాతన ధర్మంలో ఉన్నవేకదా నాన్నా.....అన్నది. కొడుకు వ్యంగ్యంగా అలాగా అమ్మ నాకు తెలీదే అని అన్నాడు. అపుడు ఆ తల్లి నీకు అంత ఆసక్తిగా వుంటే చెపుతా విను అని కొంచెం మృదువుగా తన సంభాషణ కొనసాగించింది.  నీకు దశావతరాలు - అదే మహా విష్ణువు యొక్క దశావతారాల గురించి తెలుసు కదా..... కొడుకు ఆసక్తిగా అవును తెలుసు. దానికి ఈ జీవ పరిణామానికి ఏమిటీ సంభంధం అని ప్రశ్నించాడు.  అప్పుడు ఆ తల్లి...హా సంభంధం ఉంది. ఇంకా నువు నీ డార్విన్ తెలుస...

పిప్పలాదుడు

Image
#పిప్పలాదుడు #ప్రశ్న_ఉపనిషత్తును రచించిన జ్ఞాని!! జన్మించిన 5ఏండ్ల వరకూ శని ప్రభావం ఉండకుండా చేసిన మహానుభావుడు మహర్షి దధీచి మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేస్తున్నప్పుడు,ఆయన భార్య తన భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక, సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంద్రం లో తన 3 సంవత్సరాల బాలుడిని ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంది.  ఈ విధంగా మహర్షి దధీచి మరియు ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోయారు.కానీ రావి చెట్టు యొక్క రంద్రం లో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు.ఏమీ కనిపించకపోవడం,ఎవరూ లేకపోవడం తో, అతను ఆ రంద్రం లో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగాడు.  తరువాత,ఆ రావి ఆకులు మరియు పండ్లు తినడం ద్వారా, ఆ పిల్లవాడి జీవితం సురక్షితంగా ఉంది.     ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్ళాడు.  నారదుడు,రావి చెట్టు యొక్క కాండం భాగం లో ఉన్న పిల్లవాడిని చూసి, అతని పరిచయాన్ని అడిగాడు- నారదుడు- నువ్వు ఎవరు? అబ్బాయి: అదే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. నారదుడు- నీ తండ్రి ఎవరు? అబ్బాయి: అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.  అప్పుడు నారదుడు దివ్యదృష్టి తో చూసి ఆశ్చర్...

హిరణ్యాక్షుడు భూమిని భూమిపైనున్న సముద్రంలోనే దాచేసాడా?

ఏమిటేమిటీ? హిరణ్యాక్షుడు భూమిని భూమిపైనున్న సముద్రంలోనే దాచేసాడా? దృష్ట్వాథ దైత్యహతకేన రసాతలాన్తే సంవేశితాం ఝటితి కూటకిటిర్విభో! త్వమ్ । ఆపాతుకానవిగణయ్య సురారిఖేటాన్ దంష్ట్రాఙ్కురేణ వసుధామదధాః సలీలమ్ ॥ (నారాయణీయం) “పరమాత్మా! మాయా వరాహరూపమున నీవు భూమిని వెదకుచూ, రాక్షసాధముడైన హిరణ్యాక్షుడు భూమిని రసాతలము క్రింద దాచెను అని తెలుసుకొంటివి. వెంటనే భూమిని తెచ్చుటకు పోగా రాక్షసులందరూ నీ పైన పడిరి. వారెవరినీ ఏ మాత్రమూ లెక్క చేయక నీ కోర చివర ఈ భుమిని అవలీలగ ధరించి ఉద్ధరించితివి”. ఏమిటి? వరాహాస్వామి సముద్రంలో మునిగిపోయిన భూమిని పైకి ఎత్తి రక్షించాడా? అంటే హిరణ్యాక్షుడు భూమిని భూమి పైననే ఉన్న సముద్రంలో ముంచేసాడా? ఇది ఎలా సాధ్యం? ఇందులో ఏమైనా అర్థం వుందా అన్న అనుమానం చాలా మందికి రావచ్చు. ముఖ్యంగా హేతువాదులకి ఈ అనుమానం రావాలి కూడా. (హేతువాదులు అంటే మన మూర్ఖపు నాస్తికులు కాదు) కానీ ఇక్కడ చెప్పబడిన సముద్రం మనకు తెలిసిన సముద్రం కాదు అని ముందుగా తెలుసుకోవాలి. పురాణాలలో చెప్పే సముద్రాలకి అనేక అర్దాలు ఉంటాయి. అవి అన్నీ భూమి పైననే ఉండకపోవచ్చు. అవి కాస్త శోధించి పట్టుకుంటే కానీ సమాధానం దొరకకపోవచ్చు. పురాణా...

వెయ్యిన్ని ఎనిమిది రకాలు కూరలు

వెయ్యిన్ని ఎనిమిది రకాలు కూరలు ఉన్నాయా? అసలు మామూలు దినమైనా తినడానికి అన్ని రకాలు దొరుకుతాయా?  ఒక వేళ ఉన్నా ఎవరైనా అన్ని కూరలు వంటలో వాడుతారా? వడ్డిస్తారా? ఒక వేళ వడ్డించినా అన్ని ఎవరు తినగలరు?. ఒకసారి తమ పితరుల శ్రాద్ధము తిథి భోజనానికి భోక్తగా రమ్మని వశిష్ఠులు విశ్వామిత్రులను పిలిచినారు. దానికి విశ్వామిత్రులు దానికేమి వస్తాను కాని నాదొక నిబంధన మీరు ఒకవెయ్యి ఎనిమిది రకాల కూరగాయలతో వంట చేసి నాకు వడ్డించవలెను అన్నారు. మీరు అడిగిన వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు ఉపయోగించి వంట చేయమని అరుంధతికి చెబుతాను అన్నారు. శ్రాద్ధ దినము రానే వచ్చింది విశ్వామిత్రులు రానే వచ్చినారు.  వారికి అరటి ఆకు పరచి కాకర కాయకూర పనస పండు మరియు నల్లేరు తీగతో పచ్చడి చేసి ఇంకా కొన్ని కూరలు మాత్రము వాడి చేసిన వంటను అరుంధతి వడ్డించింది.  వెయ్యిన్ని ఎనిమిది కూరలు అయితే లేవు. దానికి విశ్వామిత్రులు కోపించి ఇదేమిది? ఈ ఆకులో వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు ఎక్కడున్నాయి ? అన్నారు. దానికి వశిష్ఠులు నేను తమ కోరికను అరుంధతి వద్ద ముందే చెప్పి ఉంచినాను. మీ కోరిక ప్రకారమే చేస్తాను అని చెప్పింది కూడా అడుగుతాను ఉండండి అన్నార...

భగినీహస్తభోజనం

Image
భగినీహస్తభోజనం కార్తీక శుద్ధ విదియ, యమద్వితీయ, భగినీహస్తభోజనం భగినీ అంటే తోబుట్టువైన స్త్రీ అంటే అక్క లేదా చెల్లి అని అర్ధం. సనత్కుమార సంహితలో ఈ యమ ద్వితీయ, భగినీహస్త భోజనం విశేషాలు చెప్పబడ్డాయి. సూర్యునికి ఇద్దరు భార్యలు ఛాయా, ఉష. సూర్యునకు ఛాయాదేవి వలన కలిగిన సంతానం యముడు, యమున. యముడి చెల్లెలు యమున. యమునా దేవి ప్రతిరోజు తన ఇంటికి వచ్చి విందు భోజనం చేసి వెళ్ళమని యముడిని ప్రార్ధిస్తూ ఉండేది. యముడికి తీరికలేక - ఎన్నోసార్లు వస్తానని చెప్పినా వెళ్ళలేదు. ఒకనాడు చెప్పకుండానే తన కుటుంబంతో కలిసి యమున ఇంటికి వెళ్తాడు. ఆ రోజే కార్తీక శుద్ధ ద్వితీయ. చెల్లులు మహానందంతో అన్నకు, ఆయన కుటుంబానికి రుచికరమైన విందుభోజనం పెట్టింది. సంతోషించిన యముడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. యమున "అన్నా! ప్రతిసంవత్సరం ఇదే విదియ నాడు నా ఇంటికి వచ్చి, నా చేతి వంటలు స్వీకరించి, నన్ను దీవించాలి. అంతేకాదు, ఈ కార్తీకశుద్ధవిదియ నాడు ఎవరు సోదరిహస్త భోజనం చేస్తారో వారు నరకాన్ని పొందకూడదు" అని అర్ధించింది. యముడు "తధాస్తు! శుభమస్తు!" అని అనుగ్రహిస్తూ "అమ్మా! ఈ దినం ఎవరు యమునా నదిలో స్నానం చేస...

నాగదేవి మనసాదేవి - సంతాన ప్రదాయని

Image
నాగదేవి మనసాదేవి - సంతాన ప్రదాయని  శ్లో || జరత్కారు జగద్గౌరీ మానసా  సిద్ధ యోగినీ |  వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తథా ||  జరత్కారు ప్రియాస్తీకమాతా విషహరేతిచ |  మహాజ్ఞానయుతా చైవసాదేవీ విశ్వపూజితా ||        పడగెత్తిన నాగమే ఆమెకి వాహనం. కాలకూట విషనాగులే ఆభరణాలు. పరవసించిన ప్రకృతే ఆ దేవి స్వరూపం. ఆమే నాగేశ్వరి, మనసాదేవి. పూర్వం భూమ్మీద మనుషుల కంటే అధికంగా పాములు ఉండేవట. అవి విచ్చలవిడిగా సంచరిస్తూ మానవాళిని భయభ్రాంతులకు గురిచేస్తుంటే కశ్యపముని తన మనసు నుంచి ఈ ఆది దేవతను సృష్టించాడు. ఈమె సర్పాలకు అధినేత్రి. మహాయోగేశ్వరి. కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితిగా పూజిస్తుంటాము. ఈ పర్వదినాన నాగమాత మనసాదేవిని ఆరాధించడం సర్వశుభప్రదం. సర్వమంగళదాయకం. సర్వ విషహరణం.   ఋగ్వేదంలోని సర్పసూక్తములు, యజుర్వేదములోని సర్ప మంత్రముల ద్వారా సర్పదేవతా ఉపాసన చెప్పబడుతోంది. దేవీభాగవతం మనసాదేవిని, దేవి ప్రధానాంశా స్వరూపాలలో ఒకరిగా పేర్కొంటోంది. కశ్యప ప్రజాపతి కూతురైన ఈమె, ఈశ్వరునికి ప్రియ శిష్యురాలు. ఈశ్వరుడే స్వయంగా మనసాదేవికి కృష్ణ ‘శ్రీం హ్ర...

పదునైన వ్యక్తిత్వానికి పదిహేడు సూత్రాలు...

💥💐🙏💥💐🙏💥💐🙏💥💐🙏 పదునైన వ్యక్తిత్వానికి పదిహేడు సూత్రాలు... 🌹1). విలువ లేని చోట మాట్లాడకు. .! 🌹2). గౌరవంలేని చోట నిలబడకు..! 🌹3). ప్రేమ లేని చోట ఆశ పడకు..! 🌹4). నీకు నచ్చని, ఇష్టంలేని విషయాలకి క్షమాపణ చెప్పకు..! 🌹5). నువ్వు మెచ్చని వాటికి సంజాయిషీలు ఇవ్వకు..! 🌹6). నిర్లక్ష్యంవున్న చోట ఎదురు చూడకు..! 🌹7). అలక్ష్యం వున్న చోట వ్యక్త పరచకు..! 🌹8). వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు..! 🌹9). ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకు..! 🌹10). చులకనగా చూసే చోట చొరవ చూపకు..! 🌹11). జాలి పడి ఇచ్చే పలకరింపులకి, ప్రేమకి జోలె పట్టకు..! 🌹12). భారం అనుకునే చోట భావాలు పంచుకోకు..! 🌹13). దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు..! 🌹14). నిజాయతీని గుర్తించని చోట నిముషం కూడా వృధా చేయకు..! 🌹15). ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి వుంటుందని భ్రమ పడకు..! 🌹16). ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు..! 🌹17). నీది కాని దేని మీదా నిన్ను తినేసేంత ప్రేమ, అభిమానం ఏదీ పెంచుకోకు.. 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

ది.8-11-2021 నాగుల చవితి

Image
రేపు ది.8-11-2021 నాగుల చవితి ఆశ్లేష , ఆరుద్ర, మూల, పూర్వాభాద్ర, పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు. సర్పము అనగా కదిలేది, పాకేది. నాగములో ‘న, అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది ‘కాలము’ కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా ‘కాలనాగు’ అని అంటారు.  జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి. జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా ‘నాగం’. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు. కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉదరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా ‘ఉరగముల’ మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం, సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది కార్తీకమాసములోనే. మన జీవనానికి కావాల్సిన ఉత్సాహం, ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు, అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య, శంకరునికి ఆభరణము కూడా సర్పమే. కా...

పిశాచ గ్రస్త యోగం

పిశాచ గ్రస్త యోగం వ్యక్తి పిచ్చివాడు కావటానికి లగ్నాత్తు పంచమంలో చంద్ర కేతు లేదా చంద్ర రాహుల కలయిక కారణం కాగలదు. వాటిపై కౄరగ్రహసంబంధం పిచ్చి/మతిభ్రమణాన్ని ఖాయం చేస్తుంది. మతిభ్రమణం/పిచ్చి రావటానికి కేతువు ప్రథాన గ్రహం. తేలికపాటి స్థాయిలో పిచ్చిలక్షణాలు ఉన్న వ్యక్తికి ఉలవల సంబంధమైన ఆహారం పెట్టరు. ఒకవేళ పెడితే పిచ్చి లక్షణాలు ఎక్కువ అవుతాయి. అలాగే తేలికపాటి పిచ్చిలక్షణాలు ఉన్నా, ఒకసారి పిచ్చి వచ్చి తగ్గిన వ్యక్తి ఉలవ చేలలోకి పోకూడదు. అలా వెళ్ళకుండా సమీపవ్యక్తులు జాగ్రత్తపడతారు. ఒకవేళ అటువంటి వ్యక్తులు ఉలవ చేలలోకి వెళ్ళినట్లైతే పిచ్చి తిరగబెడుతుంది. ఇక్కడ గమనించదగిన విషయమేమంటే..... పిచ్చికి కేతువు కారకుడు. పిచ్చి అనేది మనస్సుకు సంబంధించిన అంశం. అందువలన పిచ్చి విషయంలో కేతువు చంద్రులను ప్రథానగ్రహాలుగా తీసుటకోవలసి ఉంటుంది. ...... కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. పరమహంస రామకృష్ణ గారి పిచ్చి చేష్టలకి (సామాన్య మానవులకు అర్థం కాని రీతిలో, ఒక సైంటిస్ట్ అయినా సరే, వారి పిచ్చికి....... పిచ్చాసుపత్రిలో ఉన్నటువంటి వారి పిచ్చికి తేడాలు ఉంటాయి కదా...) సామాన్యులు యొక్క పిచ్చి చేస్...