Posts

Showing posts from August, 2022

108 రూపాలలో శ్రీ గణపతి

నమామి గణనాయక: (108 రూపాలలో శ్రీ గణపతి) 1. ఏకాక్షర గణపతి ప్రాతర్భజామ్య్భయదం ఖలు భక్త శోక దావానలం గణ్విభుం వరకుంజరాస్యమ్ అజ్ఞాన కానన వినాశన హవ్యవాహం ఉత్సాహ వర్ధనమహం సుతమీశ్వరస్య 2. మహా గణపతి భిభ్రాణోబ్జక బీజాపూరక కదా దంతేక్షు బాణైస్సమం భిభ్రాణో మణికుంభశాలి కణిశం పాశంచ వక్ర్తాంచితం గౌరంగ్యారుచి రారవిందయుతయా దేవ్యాసనాధాంతిక: శోణాంగ శ్శుభమాతనోతుభవతాం నిత్యం గణేశో మహాన్ 3. బాల గణపతి కరస్ధ కదళీచూత పనసేక్షు కపిత్ధకం బాలసూర్యప్రభందేవం వందే బాలగణాధిపం 4. తరుణ గణపతి పాశాంకుశాపూస కపిత్ధ జంబూ ఫలం తిలాం చేక్షు మపిసవ హసై: ధత్తే సదాయ స్తరుణారుణాంభ: పాయాత్సయుష్మాన్ తరుణో గణేశ: 5. విఘ్నరాజ గణపతి విఘ్నరాజావతారశ్చ శేషవాహన ఉచ్చతే  మమతాసుర సంహర్తా విష్ణు బ్రహ్మేతివాచక: 6. సిద్ది గణపతి ఏకదంతం చతుర్హస్తం పాశాంకుశ ధారిణమ్ అభయంచవరదం హసైర్ద దానమూషకధ్వజమ్ 7. బుద్ధి గణపతి త్రయీమయాఖిలం బుద్ధిధాత్రే బుద్ధి ప్రదీపాయ సురాధిపాయ | నిత్యాయ సత్యాయచ నిత్యబుద్ధే నిత్యం నిరీహాయ నమోస్తు నిత్యమ్ || 8. లక్ష్మీ గణపతి బిభ్రాణశ్శుక బీజపూర కమలం మాణిక్య కుంభాంకుశాన్ పాశం కల్పలతాంచ బాణకలికా ప్రోత్సస్సరో నిస్సర: శ్యామో రక్త సరోరు...

"అభిరామి అమ్మవారు"

🌹ఎన్నిసార్లు ఈ కధ విన్నా, తమిళ్ లో ఎన్ని సార్లు ఈ సినిమా చూసిన భక్తితో భావోద్వేగంతో నిండిపోతుంది.  ఎంత కరుణ ఆ తల్లిది అమాయకులు అయిన తన బిడ్డలను రక్షించుకోవడానికి, భక్తుడు చెప్పిన మాటను నిజం చేయడానికి అమావాస్యని పౌర్ణమిగా మార్చేసిన మహతల్లి..  భక్తులకు అమావాస్య ఏంటి పొర్ణమి ఏంటి భక్తుల హృదయాల్లో నిండు చందమామ లాగా నిలచి పోయిన అమ్మ రూపానికి తిధులతో పనేముంది 🙏🏻 🙏తిరుకడైవూర్  నిజంగా జరిగిన ఒకయదార్థసంఘటన 🙏 తనని నమ్మిన భక్తులని కాచి రక్షించెందుకు ఆ పరమేశ్వరి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది.. అలా ఎన్నో సంఘటనలు జరిగాయి వాటిలో ఇదొకటి... తిరుకడైవూర్ క్షేత్రంలొ "అభిరామి అమ్మవారు" సాత్విక రూపంలో వెలిసి ఉన్నారు. అదే క్షేత్ర పరిధిలో అభిరామ భట్టు అనే భక్తుడు కూడా ఉండేవాడు. ఈయన ప్రతి రోజు అమ్మవారి ఆలయంలో ధ్యానంలోనే ఎక్కువ సమయం ఉండేవాడు. ఆయన ధ్యానస్థితిలో ఉండగా అమ్మవారు ఆయనకి తరచూ దర్శనం ఇచ్చేది. ఒకనాడు ఆలయంలో ఆయన ధ్యానం చేసే సమయంలో తంజావూరు చక్రవర్తి అయిన తుందిరా మహారాజు అమ్మవారి దర్శనానికి వచ్చాడు. అందరు లేచి నిలబడి స్వాగతం పలికారు. ఒక్క అభిరామ భట్టు తప్ప, అయన మౌనంగా లోపలకి వెళ్లిపోయాడు. పూ...

శ్రీవారి ఆలయ నిర్మాణం..

శ్రీవారి ఆలయ నిర్మాణం.. క్రీ.పూ.12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో శ్రీవారి ఆలయం నిర్మితమైంది. శ్రీవారి ఆలయంలో మొత్తం మూడు ప్రాకారాలున్నాయి. ఆలయం గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు, పవిత్రమైన వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరుచు కోవడానికి వేర్వేరుగా గదులున్నాయి. వీటితోపాటు లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంట గదులున్నాయి. ఆలయంలోని నిర్మాణాలు ఇలా ఉంటాయి 1 వ ప్రాకారం :- మహాద్వార గోపురం :- (ఇత్తడి వాకిలి)* శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించడానికి శ్రీవారి ఆలయంలో ప్రవేశించే .... ప్రధాన ప్రవేశద్వార గోపురమే ఈ మహాద్వార గోపురం. *పడికావలి, సింహద్వారం, ముఖద్వారం* అని ఈ ద్వారానికి వేర్వేరు పేర్లు ఉన్నాయి.  దీనినే తమిళంలో *”పెరియ తిరువాశల్‌”* అని కూడా అంటారు. *అనగా *పెద్దవాకిలి అని అర్థం.* ఈ ప్రధాన ద్వార గోపురంతో అనుసంధింపబడుతూ నిర్మించిన ప్రాకారమే మహాప్రాకారం. వైకుంఠం క్యూకాంప్లెక్సుల ద్వారా వచ్చిన భక్తులు ఈ మహాద్వార మార్గంలో మాత్రమే వెళ్లి స్వామివారిని దర్శించవలసి ఉంటుంది. ఇక్కడ...

రాజయెాగములు

రాజయెాగములు కారకాంశము, జన్మలగ్నము రెంటి నుండి రాజయెాగకారక స్ఫుటగ్రహములనుబట్టి యెాగవిచారణ చేయవలేను. ఆత్మకారక పుత్రకారకులవలన ఒకటి, లగ్నపంచమాధిపతులవలన రెండు, యెాగములు కలుగును. వీరి పరస్పర సంబంధము బలానుసారముగా పూర్ణము, అర్థ, (1/2) పాద (1/4) యెాగము కలుగును.  మహరాజయెాగము లగ్నాధిపతి పంచమమున, పంచమాధిపతి లగ్నమున ఉండుట, ఆత్మకారక పుత్రకారక గ్రహములు లగ్న, పంచమ, స్వక్షేత్ర, నవాంశ, ఉచ్ఛరాశులందుండుట; శుభగ్రహములచే చూడబడుట మహరాజయెాగము. దీనిలో పుట్టిన జాతకుడు ప్రసిద్ధుడు, సుఖవంతుడు అగును. భాగ్యాధిపతి ఆత్మకారకగ్రహమున్న, లగ్న, పంచమ, సప్తమములందుండి శుభగ్రహ దృష్టిఉన్న రాజయెాగ కారకులగుదురు. కారకుని నుండి కాని,లగ్నాధిపతి నుండి కాని, 2, 4, 5, స్థానములందు శుభగ్రహములున్న తప్పక మహారాజగును. వారినుండి 3, 6 స్థానములందు కేవల పాపగ్రహములున్నా, చూచినా, రాజగును. శుభ పాప మిశ్ర దృష్టియున్న ధనవంతుడగును.

దశావతారం గీతగోవిందం

దశావతారం గీతగోవిందం శ్రీ గోపాల విలాసినీ వలయస రత్నాధి ముగ్ధా కృతే శ్రీ రాధా పతి పాద పద్మ భజన నందర్తి మగ్నోనిశం లోకే సత్ కవిరాజ రాజ ఇతియహ ఖ్యాతోదయాం భో నిధిహి తం వందే జయదేవ సద్గురుమహం పద్మావతీ వల్లభం ప్రళయ పయోధి జలే కేశవా ధృతవానసి వేదం కేశవా ప్రళయ పయోధి జలే విహిత విహిత్ర చరిత్రమ ఖేదం కేశావాధృత మీన శరీరా జయజగదీశ హరే! కేశవా! జయజగదీశ హరే! క్షితిరతి విపులతరే కేశవా తవ తిష్ఠతి పృష్టే ధరణి ధరణ కిణ చక్ర గరిష్ఠే కేశావాధృత కఛ్చపరూపా జయజగదీశ హరే! కేశవా! జయజగదీశ హరే! వసతి దశన శిఖరే కేశవా ధరణీ తవలగ్నా: శశిని కళంక కలేవ నిమగ్నా :* కేశావా ధృత సూకర రూపా!! జయజగదీశ హరే! కేశవా! జయజగదీశ హరే! తవ కర కమలవనే కేశవా నఖ మద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తను భృంగం కేశావా ధృత నరహరి రూప! జయజగదీశ హరే! కేశవా! జయజగదీశ హరే! ఛలయసి విక్రమణే కేశవా బలిం అద్భుత వామన పద నఖ నీర జనిత జన పావన కేశవా ధృత వామనరూప జయజగదీశ హరే! కేశవా! జయజగదీశ హరే! క్షత్రియ రుధిరమయే కేశవ జగతపగత పాపం కేశవా స్నాపయసి పయసి శమిత భవ తాపం కేశావా ధృత భృగుపతి రూప జయజగదీశ హరే! కేశవా! జయజగదీశ హరే! వితరసి దీక్షురణే కేశవా దిక్ పతి కమనీయం కేశవా దశముఖ మౌళి బలిం రమణీయం కేశ...

శ్రీ లలితా పంచరత్నం

శ్రీ లలితా పంచరత్నం ప్రాతః స్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ | ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్ || ౧ || ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం రక్తాంగుళీయలసదంగుళిపల్లవాఢ్యామ్ | మాణిక్యహేమవలయాంగదశోభమానాం పుండ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్ || ౨ || ప్రాతర్నమామి లలితాచరణారవిందం భక్తేష్టదాననిరతం భవసింధుపోతమ్ | పద్మాసనాదిసురనాయకపూజనీయం పద్మాంకుశధ్వజసుదర్శనలాంఛనాఢ్యమ్ || ౩ || ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం త్రయ్యంతవేద్యవిభవాం కరుణానవద్యామ్ | విశ్వస్య సృష్టవిలయస్థితిహేతుభూతాం విద్యేశ్వరీం నిగమవాఙ్మమనసాతిదూరామ్ || ౪ || ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి | శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి || ౫ || యః శ్లోకపంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే | తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా విద్యాం శ్రియం విమలసౌఖ్యమనంతకీర్తిమ్ || 🕉🕉🕉🕉🕉🕉

గండ భేరుండ నరసింహ మహా మంత్రం

మహాశక్తివంతమైన గండ భేరుండ నరసింహ మహా మంత్రం.  అరుదైన ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఒక రక్షణ వలయం ఏర్పడి సర్వ వేళల్లో రక్షిస్తూ శత్రువులు నుండి సకల సమస్యల నుండి విముక్తి చేస్తూ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. గండ భేరుండ నరసింహ మహా మంత్రం ఓం ఘ్రాం క్రౌం హౌం క్లీం హ్రూం క్ష్మీం ఫ్రోం ఘ్రాం హ్రీం అష్టముఖ గండ భేరుండ జ్వాలానారసింహాయ హుంహుం జ్వలజ్వల సర్వ శత్రూన్ ఛింది ఛింది భింది భింది అంధి అంధి కట్ కట్ హుం ఫట్ స్వాహా.

మహా ప్రజ్ఞ-మహాకరుణ🌸

🌸మహా ప్రజ్ఞ-మహాకరుణ🌸                    ఒక యువకుడు గురువు గారి దగ్గరకి వచ్చాడు…"నాకు చిన్న ఉద్యోగం ఇవ్వండి, కాసింత కూడు పెట్టండి... "ఏదో దేవుడిని తలచుకుంటూ, మీ సేవ చేసుకుంటూ బతుకుతాను." అని అడిగాడు. "నీకేం వచ్చోయ్?" అని ప్రశ్నించారు గురువుగారు. "నాకేమీ రాదండీ. చదువుకోలేదు.            ఏ విద్యా నేర్చుకోలేదు. కప్పులు కడగడం, ఇల్లు ఊడ్వడం వంటి పనులు వచ్చు. అంతే నండీ" అన్నాడు యువకుడు. "ఇంకే పనీ రాదా?" "అంటే... చదరంగం కొద్దిగా వచ్చు." అప్పటికప్పుడు చదరంగాన్ని తెప్పించారు గురువుగారు. "ఆటాడుదాం, ఒకటే పందెం! ఇదిగో ఈ కత్తిని చూశావా? ఓడిన వాడి ముక్కు తెగ కోయాలి. ఒప్పుకుంటావా?" యువకుడికి ఉద్యోగం కావాలి. ఇంకో మార్గం లేదు. ఒప్పుకున్నాడు. ఆట మొదలైంది. యువకుడు మొదట్లో కొన్ని తప్పులు చేశాడు. ఆటలో వెనకబడ్డాడు. అతని దృష్టి పొడవాటి కత్తిపై పడింది. చేత్తో ముక్కును తడుముకున్నాడు. మొత్తం దృష్టినంతా కేంద్రీకరించాడు. ఏకాగ్రతతో పావులు కదిపాడు. యువకుడిదే పైచేయి అయింది, ఇంకో రెండు మూడు ఎత్తులతో గురువుగారిని చిత్తు చేసే స్థితికి వచ్చాడ...

పితృదేవతలు ఎవరు?: ఎక్కడుంటారు ?

పితృదేవతలు ఎవరు?: ఎక్కడుంటారు ? తండ్రి, తాత, ముత్తాతలకు పితరులు' అనే శబ్దం వాడతాం. వారి అధిష్టాన దేవతలైన వసు, రుద్ర, ఆదిత్యులను కూడా పితృదేవతలు అంటాం. వీరిలో అనేకరకాలు - అంగిరసులు, వైరూపులు, అథర్వణులు, భృగువులు, నవగ్వులు, దశగ్యులుగా ఋగ్వేదంలో చెప్పబడ్డారు. బ్రాహ్మణుల యొక్క పితరులు అగ్నిష్వాత్తులని, క్షత్రియల యొక్క పితరులు బర్దిషదులని, వైశ్యుల యొక్క పితరులు కావ్యలని, శూద్రుల యొక్క పితరులు సుకాలినులు అని నంది పురాణంలో హేమాద్రి పేర్కొన్నాడు.  శాతాతసృతి 12 పితృవర్గాలను వివరిస్తుంది. విష్ణు ధర్మోత్తరాన్ని బట్టి కొంతమంది పితృదేవతలు మూర్తి లేక ఉంటారట. కొంతమంది మూర్తి కలిగి ఉంటారట. ఋషుల నుండి పితృదేవతలు, వారినుండి దేవతలు, వారినుండి మానవులు పుట్టినట్లు మనువు చెప్పాడు. దేవతలు తూర్పుకు, పితృదేవతలు దక్షిణపు దిక్కుకు, మానవులు పశ్చిమ దిక్కుకు, రుద్రులు ఉత్తరపు దిక్కుకు చెందిన వారని తైత్తిరీయ సంహిత" అంటుంది. దేవతలకు స్వహావషట్కారాలతో, పితృదేవతలకు స్వధానమస్కారాలతో పూజ జరుగుతుంది. వీరెక్కడ ఉంటారు? భూలోకం పైన అంతరిక్షం, ఆపైన పితృలోకం ఉంటుందని తైత్తిరీయ బ్రాహ్మణం చెబుతుంది. "విధూర్ధ్వలోకే పి...

హోమాలు వాటి ప్రయోజనాలు

హోమాలు అంటే ఏంటీ? ముఖ్య హోమాలు వాటి ప్రయోజనాలు ..... గణపతి హోమం :- విఘ్నాలను తొలగించే విఘ్ననాయకుడు గణపతి. మానవులు ప్రారంభించే ప్రతి కార్యాంలోనూ మొదటగా గణపతిని పూజించడం జరుగుతుంది. ప్రారంభించిన కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుతూ వినాయకుడిని పూజిస్తారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ప్రతికూల అంశాలను తొలగించడానికి వినాయకుడికి గణపతి హోమం నిర్వహిస్తాము. ఈ గణపతి హోమం చేయడం వలన విజయము, ఆరోగ్యము, సంపద కార్యసిద్ధి కలుగుతాయి. హిందూ ధర్మం ప్రకారం ఏ శుభకార్యం చేయాలన్నా మొదటగా గణపతి హోమం తోనే ప్రారంభించడం జరుగుతుంది. ఈ గణపతి హోమానికి అష్ట ద్రవ్యలు/ 8 రకాలు. దర్భ మొదలగునవి ఉపయోగించడం జరుగుతుంది రుద్ర హోమం:- పురాణ కథలను అనుసరించి రుద్ర అనునది శివునికి మరొక నామము. శివుడు లేదా రుద్రుని అనుగ్రహం కొరకు చేసే హోమాన్ని రుద్రహోమము అంటారు. ఈ హోమం చేయుట వలన శివుని అనుగ్రహం పొంది తద్వారా అపమృత్యు భయాలు తొలగింపబడి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొంది శక్తి సంపన్నులు అవుతారు. దీర్ఘాయుష్షుని పొందడం జరుగుతుంది. మృత్యువు మీద విజయాన్ని సాధించడానికి కూడా ఈ రుద్ర హోమం చేస్తారు. ఏ వ్యక్తి అయ...

శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀                  శ్రీ మహాభారతం                     ➖➖➖✍️                    95వ భాగము     శ్రీ మహాభారతంలో చిన్ని కథలు                 *కలియుగ ధర్మం:*                       ▪️〰️▪️ ధర్మరాజు కలియుగంలో కలిగే ధర్మహాని గురించి వివరించమని మార్కండేయ మహర్షిని అడిగాడు. మార్కండేయ మహర్షి.. ”ధర్మనందనా! కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది, త్రేతాయుగంలో మూడుపాదాలతో నడుస్తుంది, ద్వాపరయుగంలో రెండు పాదాలతో నడుస్తుంది. కలియుగంలో ఒక్క పాదంతో నడుస్తుంది. ధర్మం క్షీణిస్తుంది. అధర్మం రాజ్యమేలుతుంది. నరులు సత్యం చెప్పరు. మానవుల ఆయుష్షు క్షీణిస్తుంది, విద్యలు క్షీణిస్తాయి. విద్యా హీనత వలన మోహం కలుగుతుంది. మోహము వలన లోభము, లోభము వలన కామము, కామము వలన క్రోధం, క్రోధం వలన వైరం ఇలా ఒక దాని వెంట ఒకటి వస్తుంది. వైరం వలన వర్ణ బేధం కలుగుతుంది. వర్...

బాలారిష్టములు

బాలారిష్టములు    శ్లో) భౌమాంశకస్థితేమందే భౌమేనైవనిరీక్షితే,      రాహుదృష్టియుతేవాపి వర్షమేకంసజీవతి.       శుక్రాంశకస్థితేమందే శుక్రేణైవనిరీక్షితే,       కేతుదృష్టియుతేవాపి త్రివర్షంతస్యజీవితమ్,      సౌమ్యాంశకస్థితేమందే సౌమ్యేనైవనిరీక్షితే,      సూర్యదృష్టియుతేవాపి త్రివర్షంతస్యజీవితం.      అర్కాంశకస్థితేమందే అర్కేణైవనిరీక్షితే,      కావ్యదృష్టియుతేవాపి చాతుర్వర్షంచజీవతి,      చంద్రాంశకస్థితేమందే చంద్రేణైవనిరీక్షితే,      దేహాధిపేనసందృష్టే షడ్వర్షంతస్యజీవితమ్,      అధవాచాష్టమేవర్షే నజీవతినసంశయః,      జీవాంశకస్థితేమందే జీవేనైవనిరీక్షితే,      చంద్రదృష్టియుతేవాపి చాతుర్వర్షంసజీవతి. తా) జనన కాల మందు శని అంగారక అంశము నందుండి అంగారకునిచే చూడబడిననూ లేక రాహువుచే చూడబడిననూ ఆశిశు 1 సంవత్సరం జీవించి యుండును,  మరియు శని శుక్రాంశమునందుండి శుక్రునిచే చూడబడిననూ లేక కేతువుచే చూడబడిననూ 3 సంవత్సర...

నృసింహ స్మరణం,

🌷శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు🌷 🌷- నృసింహ స్మరణం, సర్వ ముక్తి దాయకం🌷 ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్ మృత్యుం నమామ్యహం ... నరసింహ స్వామి కేవలం అవతారమూర్తి మాత్రమే కాదు, ఆ స్వామి మంత్రమూర్తి, వేదాంతాలుగా భాసిల్లే ఉపనిషత్తులలో నరసింహ తత్వం వర్ణించబడి వుంది... స్వామి నామ మంత్రాన్ని ఒకసారి పరిశీలిస్తే తన భక్తులకు అభయమిచ్చే అంతరార్ధం అందులో నిబిడీకృతమై వున్నట్లు తెలుస్తుంది...   పైన తెలుపబడింది నృశింహ మంత్రం... ఇందులో వున్న ఒక్కొక్క నామం నృశింహుని ఒక్కో తత్త్వాన్ని తెలియజేస్తుంది... ఉగ్రం అంటే... నృశింహుడు ఉగ్రమూర్తి, నరసింహుని హుంకారాన్ని విన్నంత మాత్రంలోనే అంతర్గత, బహిర్గత శత్రునాశనం జరుగుతుంది... వీరం అంటే.. సకల కార్యకారణాలకు మూలంగా వున్న శక్తినే వీరం అంటారు... నరసింహుడు వీరమూర్తి, కనుక సకల కార్యకారణ స్వరూపుడు ఆయనే... మహావిష్ణుం అంటే... అన్ని లోకాల్లో అంతటా వుండే నరసింహ తత్వానికి ఈ నామం ప్రతీక.  సకల జీవరాశులన్నిటిలోనూ తానే వ్యక్తంగానూ, అవ్యక్తంగానూ పరమాత్మ భాసిస్తాడు.  జ్వలంతం అంటే... సకల లోకాల్లో, సర్వాత్మల్లో తన తేజస్సును ప్రక...

సౌందర్య లహరి

శంకరాచార్యుల అనేక స్తోత్రాలలో శివస్తోత్రంగా శివానందలహరి, దేవీస్తోత్రంగా "సౌందర్యలహరి" చాలా ప్రసిద్ధాలు.  త్రిపుర సుందరి అమ్మవారిని స్తుతించే స్తోత్రం గనుక ఇది సౌందర్యలహరి అనబడింది. ఈ స్తోత్రం "శిఖరిణీవృత్తం" అనే ఛందస్సులో ఉంది. సౌందర్యలహరిలో నాలుగు ప్రధానమైన లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇది అసామాన్యమైన వర్ణనా చాతుర్యంతో కూడిన కావ్యం. ఇది ఒక దివ్య మహిమాన్విత స్తోత్రం.  ఉపాసకులు దేవిని ఆరాధించడానికి ఉపయోగకరమైన అనేక మంత్రాలు నిక్షిప్తమైన మంత్రమాల.  ఈ మంత్రాలకు ఫలసిద్ధులను వ్యాఖ్యాతలు తెలియబరచారు. ఆగమ తంత్రాలను విశదీకరించే, శ్రీవిద్యను వివరించే తంత్ర గ్రంథం. ఇందులో మొదటి 41 శ్లోకాలు శ్రీవిద్యను వివరిస్తాయి. సౌందర్య లహరి స్తోత్రావిర్భావం గురించి ఒక గాథ ప్రచారంలో ఉంది. ఆదిశంకరులు ఒకమారు స్వయంగా కైలాసం వెళ్ళారట.  అక్కడ వ్రాసి ఉన్న ఈ శ్లోకాన్ని చదువుతుండగా వినాయకుడు దానిని క్రిందినుండి చెరిపేశాడట. ఎందుకంటే అది మానవులకు అందరాని అత్యంతగుహ్య విద్య గనుక. అలా శంకరులు మొదటి 40 శ్లోకాలు మాత్రమే చదివినారు. వాటికి తోడు మరొక 60 శ్లోకాలు శంకరాచార్యులు రచించారు.  ఆ వంద శ్లోకాల...

అయిదు అలంకారాలు ఉన్న స్త్రీని ముత్తైదువ అంటారు.

*🙏👌✍️  హిందూ మహిళలకు మాత్రమే ముత్తయిదువ లక్షణాలు. మొత్తం అయిదు అలంకారాలు ఉన్న స్త్రీని ముత్తైదువ అంటారు. అవి కాళ్ళకిపట్టీలు, మెట్టెలు, చేతులకి గాజులు, మెడలో మంగళసూత్రం, తలలో పువ్వులు, చివరగా నొసటన అంటే కనుబొమ్మల మధ్య సింధూరం కానీ కుంకుమకానీ. మొదటగా కాళ్ళకు పట్టిలుమెట్టెలు ఎందుకో చూద్దాం:- కాళ్ళలో ఉండే సయాటికా నెర్వ్ మోకాళ్ళ దగ్గర నుంచి కింది వైపుకి టిబియా లేదా టైబియా అని పిలవబడుతుంది. ఇది తిరిగి పాదపు గుత్తి వరకు వచ్చిన తర్వాత రెండు రకాలైనటువంటి బ్రాంచెస్ గా విడిపోతుంది. ఒక శాఖ వేళ్ళ చివరి వరకు వెళ్లి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనకాల మడమ వరకు వెళ్లి అక్కడ అంతమవుతుంది. అంటే వేళ్ళ చివరలో ఇంకా మడమల చివర్లో టిబియా శాఖ తాలూకు నాడీ అంత్యాలు ఉంటాయి. ఈనాడి నేరుగా కటివలయం దగ్గర ఉన్న గర్భాశయ మరియు మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంది. అంటే స్త్రీలలో వారు ధరించేటువంటి పట్టీలు ఇంకా కాలి మెట్టెలు ఇవన్నీ కూడా ఈ టిబియా నాడిని రాపిడి లేదా ఒత్తిడి ద్వారా ప్రేరేపించి తద్వారా మూత్రాశయ నాడులను గర్భాశయ నాడులను కూడా ప్రేరేపిస్తాయి. ఫలితంగా వారిలో గర్భాశయ మరియు మూత్రాశయ పనితీరు అనేది...

దీపం జ్యోతిః పరబ్రహ్మా*

🍀🌷🍀🌷🍀🌷🍀🌷🍀🌷🍀🌷 👌 *ఏష ధర్మః సనాతనః*👌        *36. దీపం జ్యోతిః పరబ్రహ్మా* ✍️ పూజ్యగురువులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు. 🌹💫🌈💫🌈🕉️🕉️💫🌈💫🌈🌹 🪔 *దీపం జ్యోతిః పరబ్రహ్మా* 🪔 🪔 జ్యోతిని పరబ్రహ్మగా ఉపాసించే సంస్కృతి మనది. అందుకే,  'దీపారాధన' అనే మంచి ఆచారాన్ని అత్యంత ప్రాచీనకాలం నుంచీ పాటిస్తున్నాం. 💫 ఈ సదాచారంలో చక్కని సూక్ష్మ విజ్ఞానం, సంస్కా రవంతమైన సద్భావన ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 💫 ఉభయ సంధ్యలలో ప్రతి ఇంటా దీపం వెలిగించాలని మనవారి నియమం. పూజలో ఒక భాగంగా దీపాన్ని వెలిగించడమే కాదు. దీపమే దేవత అని భావించి పూజించే సంప్రదాయం మనది. 🙏 *దీపజ్యోతి సాక్షాత్తు పరంజ్యోతి.* 🙏 💫 ఆదిత్య చన్ద్రాగ్నులకు సైతం మూలమైన పరమేశ్వరుని జ్యోతిగా ఆరాధిస్తాం. జ్యోతి అన్ని దిక్కుల్నీ ఎలా చూస్తుందో, విశ్వాన్నంతటినీ అలాగే పరిశీలిస్తూ, తన 'శక్తి' అనే వెలుగుతో నింపే పరాత్పరుడు సర్వజ్ఞశక్తిని చాటే శాశ్వత జ్యోతి.  ✅👉 *దీపాలలో కూడా అనేక పద్ధతు లున్నాయి.* 💫 పత్తితో చేసిన వత్తిని ఆవునెయ్యి, నువ్వులనూనె, ఆవనూనె, కొబ్బరినూనె వంటి దీపపు ఇంధనాలతో వెలిగిస్తారు. తామరతూడుల దారం...

గుంటూరు జిల్లా : బాపట్ల

గుంటూరు జిల్లా : బాపట్ల 👉 శ్రీ భావనారాయన స్వామి ఆలయం : బాపట్ల 💠శైవమునకు పంచారామక్షేత్రాలు ఉన్నట్టుగానే వైష్ణవమునకు కూడా పంచభావన్నారాయణ క్షేత్రాలు ఉన్నాయి.  అవి  బాపట్ల (భావపురి),  పొన్నూరు (స్వర్ణపురి),  భావదేవరపల్లి (కృష్ణా జిల్లా),  సర్పవరం (నేడు కాకినాడలో అంతర్భాగం), పట్టిసం.  వీనిలో ప్రకాశం జిల్లాలోని పెదగంజాం కూడా ఉంది అని చెప్తారు.  💠ఆంధ్రప్రదేశ్లో ఉన్న పంచ భావనారాయణ క్షేత్రాలలో ప్రధానమైన క్షేత్రం బాపట్లలో వెలసిన భావనారాయణ ఆలయం. 💠 ఇక్కడ నెలకొని ఉన్న భావనారాయణ స్వామి పేరిట ఈ ఊరికి భావపురి అనే పేరు వచ్చింది. కాలాంతరాన ఆ పేరు రూపాంతరం చెంది భావపట్లగా, బాపట్లగా మారింది. 💠ఇది ప్రాచీన ఆలయము. ఈ ఆలయము శాలివాహం శకం 515 లో (క్రీ.శ. 594 లో) ప్రమాదీ నామసంవత్సర ఫాల్గుణ శుద్ధ పూర్ణిమనాడు ప్రతిష్ఠింప బడినదని చరిత్రకారులు తెలియజేయుచున్నారు. 💠కాని స్థలపురాణం మాత్రం, కృత, త్రేతా, ద్వాపర యుగాలలో ఇచట బ్రహ్మర్షులు సమావేశమగు చుండేవారని, వారచట ఒక యాగకుండమును ఏర్పాటు చేసి అచట నారాయణుని స్మరించుచూ హోమం చేయుచుండేవారని అప్పుడు నారాయణుడు ఆయా యుగ ధర్మముననుసరించి, వేర్వ...

క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది.

__________________________________ __________________________________     ICBS జనరల్ హాస్పిటల్ ప్రొఫెసర్ డాక్టర్ గిల్బర్ట్ ఎ.       పైనాపిల్ వేడి నీరు మీ జీవితాన్ని కాపాడుతుంది     వేడి పైనాపిల్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది.     ఒక కప్పులో 2 నుండి 3 పైనాపిల్ ముక్కలను సన్నగా కోసి వేడి నీళ్ళు పోస్తే "ఆల్కలీన్ వాటర్" అవుతుంది, రోజూ తాగితే అందరికీ మంచిది.     వేడి పైనాపిల్ క్యాన్సర్ నిరోధక పదార్థాలను విడుదల చేస్తుంది, సమర్థవంతమైన క్యాన్సర్ చికిత్స కోసం ఔషధం యొక్క తాజా పురోగతి.     పైనాపిల్ యొక్క వెచ్చని పండు తిత్తులు మరియు కణితులను చంపే ప్రభావాన్ని కలిగి ఉంటుంది.  ఇది అన్ని రకాల క్యాన్సర్లను నయం చేస్తుందని నిరూపించబడింది.     పైనాపిల్ వేడి నీరు అలెర్జీలు/అలర్జీల వల్ల శరీరంలోని అన్ని సూక్ష్మక్రిములు మరియు టాక్సిన్‌లను తొలగిస్తుంది.     పైనాపిల్ రసం నుండి తీసుకోబడిన ఔషధం *హింసాత్మక కణాలను* మాత్రమే నాశనం చేస్తుంది మరియు ఆరోగ్యకరమైన కణాలను ప్రభావితం చేయదు.     అలాగే పైనాపిల్ జ్యూస్‌లో ఉం...

శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం

🕉 మన గుడి : నెం 177 🔆 కృష్ణా జిల్లా : " మాచవరం" 👉 శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం  💠 విజయవాడలోనే కాక రాష్ట్రంలోని నలుమూలల నుండి భక్తులు అమితంగా కొలిచే దేవాలయాల్లో మాచవరంలోని దాసాంజనేయ స్వామి ఆలయం ప్రముఖంగా పేర్కొనవచ్చు.  💠 700 ఏళ్ళ చరిత్ర కలిగిన గొప్ప దేవాలయం . విజయ నగర సామ్రాజ్యాన్ని పాలించిన సాలువ ,తులువ వంశ రాజులకు పూజనీయ, గురు స్థానంలో ఉన్న వ్యాస రాయలవారు (వ్యాస తీర్ధులు )ప్రతిష్ట చేసి,నిర్మించిన ప్రసిద్ధ దేవాలయం. 💠 పూర్వం వ్యాసరాయలనే హనుమద్భక్తుడు పాదచారిగా పర్యటిస్తూ తాను బసచేసిన ఊళ్ళలో హనుమంతుని విగ్రహాలను ప్రతిష్టించే వాడని, ఆ పర్యటనలో విజయవాడ చేరుకొని ఆంజనేయ స్వామి ప్రేరణపై ప్రస్తుతం వున్న ఆంజనేయస్వామి ఆలయ ప్రాంతానికి వచ్చి అక్కడ శంఖు - చక్రాదులతో తనకి లభించిన స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించి శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. 💠 క్రీ.శ. 1509 లో వ్యాస తీర్ధ మహాశయులు పాద చారియై దేశాటనం సాగిస్తూ భగవద్ భక్తీని ప్రబోధించారు .ఆ యాత్రలో విజయవాడ వేంచేసి ఇంద్ర కీలాద్రి వేంచేసి ఉన్న శ్రీ కనక దుర్గమ్మ అమ్మ వారిని దర్శించారు . అప్పుడు...