కాన్సర్
శ్రీ గురుభ్యోన్నమః మానవ శరీరం ఎన్నో కణాలు సముదాయాలతో నిర్మితమవుతుంది సాధారణంగా కణజాలాలు పెరిగి విభజన చెందుతాయి. ఆ విభజన కణాల వృద్ధి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటం అవసరం. కొన్నిసార్లు ఈ క్రమబద్దీకరణ అదుపు తప్పుతుంది శరీరానికి అవసరం లేకపోయినా కొత్త కణాలు ఏర్పడతాయి. పాప కణాలు క్షీణించవలసిన సమయంలో క్షీణించవు. ఈ విధంగా కణాల సముదాయం కంతి లాగా లేక గడ్డలాగా ఏర్పడతాయి. దీనినే కాన్సర్ అంటారు. మరణ కంతి అని కూడా అంటారు. కొన్ని గడ్డలు అపాయ కరమైనవి కాదు. వీటిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించవచ్చు. అపాయకరమైన కంతుల విషయానికొస్తే వీటిలోని కణాలు అసాధారణంగా విభజన చెందుతూ పోతాయి. ఇవి తమ చుట్టూ ఉన్న కణజాలంలోకి చొచ్చుకుపోతాయి. వాటిని విచ్ఛిన్నం చేస్తాయి. ఈ క్యాన్సర్ కణాలు కంతుల నుండి విడిపోయి దూరంగా రక్తస్రావంలోకి లేదా శోషరస వ్యవస్థలోకి చేరుతాయి. ఈ క్యాన్సర్ వ్యాధి ఆకస్మికంగా వచ్చే వ్యాధి. ఇది ప్రాణాంతకమైనది. మరణానికి దారితీస్తుంది. వీటికి జ్యోతిష కారణాలు యోగాలు పరిశీలిస్తే రాహు లగ్నంలో గానీ చంద్రుడు తో గానీ స్థితి నొందితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆరో భావాధిపతి లగ్నంలో గానీ 8 వ భావంలో గానీ 12 వ భావంలో గానీ...