చిత్తైకాగ్రము, ఆహారవిహార నియమము
చిత్తైకాగ్రము, ఆహారవిహార నియమము, ప్రాణా యామాఖ్యాసము, వేద శాస్త్రములు నేర్చుట స్వధర్మానుష్ఠానముచే నీదుర్గతిని తొలగింపజేసికొనగలము. మన వేధశాస్త్ర విహితమైన ధర్మాచరణముచే చిత్తమాలిన్యము తోలంగును. చిత్త సంస్కారమగు కొలది ధర్మాచరణము ప్రబలును తద్వారా జ్ఞాన వికాసాదులు గలుగగలవు. అందుచేతనే 'వేదోదితం స్వకంకర్మ నిత్యం కుర్యా దతంద్రితః తద్ధికుర్వన్ యధావక్తి ప్రాప్నోతి పరమాంగతి మే అని వ్యాసభగవానులు, వైదిక సాంప్రదాయ సిద్ధమైన, కర్మాచరణము ముఖ్యాతి ముఖ్యమని వచించెను. ఈ వేదోదితమైన కర్మాచరణముద్వారా ''పరమాంగతిం'' పొందనర్హులగునురని వ్యాసభగవానుల లోకహిత వచనములను బలపరుచుటకై ఆదిశంకర, భగవత్పూజ్య పాదులు సహితము 'వేదో నిత్యమధీయ తాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం|| అని, వేదాధ్యయనము వేదమున చెప్పిన కర్మానుష్ఠానము, ముఖ్యాతి ముఖ్యమని వచించెను. ఇన్ని తెలిసిననూ యిప్పుడు మనవల్ల నేమగునులే! యనిగాని, ఎవరో పండితులైనవారే యీ వైదిక కర్మానుష్ఠాన మాచరింపదగిన దనిగాని నిరుత్సాహబడదగదు అనుగన్తుం సతాంవర్త్మ కృత్స్నంయది నశక్యతే స్వల్పమవ్యనుగన్తవ్యం మార్గస్థోనావసీదతి|| అను నానుడి చొప్పున వేదచోదితములైన కర్మలను సంపూర్ణముగా...