Posts

Showing posts from February, 2024

జాతకంలో పితృ దోషం

జాతకంలో పితృ దోషం ఏర్పడటాన్ని ప్రతిబింబించే సంకేతాలు పితృ దోషానికి సూచికలలో ఐదవ ఇల్లు ఒకటి. ఈ ఇంటి అధిపతి బలహీనంగా ఉన్నప్పుడు లేదా కేతువు లేదా రాహువు వంటి దుష్ట గ్రహాల ఇంట్లో ఉన్నప్పుడు లేదా వారితో సంబంధం కలిగి ఉన్నప్పుడు అది పితృ దోషాన్ని ఏర్పరుస్తుంది. జాతకంలో ఐదవ ఇంట్లో బలహీన గ్రహం ఉంటే, ఇది పితృ దోషాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఐదవ ఇంటి అధిపతి 88 విభాగాలలో లేదా 22వ నక్షత్రంలో స్వదేశీ జన్మ చార్ట్‌లో సంచరిస్తున్నప్పుడు, అది మళ్లీ ఈ దోషాన్ని సూచిస్తుంది. తొమ్మిదవ ఇల్లు పూర్వీకుల ఇల్లు. ఈ విధంగా, ఈ ఇల్లు మళ్లీ జన్మ చార్ట్‌లో పితృ దోషం ఏర్పడటానికి ప్రధాన సూచికలలో ఒకటి.  ఈ ఇంటి ప్రభువు కేతువు మరియు రాహు గ్రహాల కలయికలో ఉన్నప్పుడు, ఇది పితృ దోషాన్ని ఏర్పరుస్తుంది. ఒక వ్యక్తి యొక్క లగ్నం రాహువు మరియు లగ్నానికి అధిపతి ఆరవ, ఎనిమిదవ లేదా పన్నెండవ ఇంట్లో ఉంటే, అది ఈ దోషాన్ని సూచిస్తుంది. తండ్రిని సూచించే సూర్యుడు లేదా గురు గ్రహం లేదా రెండు గ్రహాలు రాహు లేదా కేతు గ్రహంతో కలిసి ఉన్నప్పుడు, అవి పితృ దోషాన్ని కూడా ఏర్పరుస్తాయి. శని లేదా రాహువుతో పాటు సూర్యుడు మొదటి, రెండవ, నాల్గవ, ఏడవ, తొమ్మిదవ...

సంతానం గురించి పంచమ స్థానం

జ్యోతిషశాస్త్ర రీత్యా సంతానం గురించి పంచమ స్థానం చెపుతుంది.పంచమాధిపతి రాశి, నవాంశ లలో ఉచ్చ, స్వక్షేత్ర, మిత్ర స్ధానాలలో ఉన్న లేదా ఆధిపత్య శుభులతో కలిసిన లగ్నాత్తు కేంద్ర కోణములలో లేదా లాభ స్థానము లలో ఉన్న పితృ ఋణం తీర్చే సంతానం కలుగుతుంది. అదే దానికి వ్యతిరేకంగా ఉన్న అంటే పంచమాధిపతి నీచ,శతృ స్థానములలో రాశి నవాంశ లలో ఉంటే పగసాధించే సంతానం తల్లిదండ్రులను బాధించే సంతానం కలుగుతుంది.ప్రస్తుతం చాలా మంది 3,4 పిల్లలు ఉండి కూడా అనాధ ఆశ్రమంలో జీవిస్తున్నారు.ఇలాంటి సంతానం పూర్వజన్మలో వీరి మీద ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశం తోనే పుట్టినవారు... వీరు... పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు.........!! 1) పూర్వ జన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి, అది తీసుకోకుండానే మరణించిన వాడు, తాను దాచిన సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లో పుత్రుడుగా జన్మిస్తాడు. 2) తాను పూర్వ జన్మయందు బాకీపడిన అప్పును (ఋణాన్ని) చెల్లించుటకు పుత్రుడుగా జన్మిస్తాడు. 3) పూర్వ జన్మలోని శత్రుత్వం తీర్చుకోవడానికి ఈ జన్మలో పుత్రునిగా జన్మిస్తాడు. 4) పూర్వ జన్మలో తనకు ఒకడు అపకారం చేసాడు. దానికి ప్రతీకారం తీర్చుకోలేదు. ఈ జన్మలో ప్రతీకారం తీర్...

మహాదశలు- వాటి వివరణ*

*మహాదశలు- వాటి వివరణ* *సూర్యుడు - 6 సంవత్సరాలు.* సూర్యుడు బలంగా ఉండి, అనుకూలంగా ఉంటే ఆత్మ బలపడుతుంది, స్వీయ-సాక్షాత్కారం కోసం ప్రయత్నాలు చేయవచ్చు, అద్భుతంగా జీవించవచ్చు, చాలా దూరం ప్రయాణించవచ్చు, కలహాలు లేదా శత్రుత్వంలో పాల్గొనవచ్చు, అది మంచి డివిడెండ్, స్థానం మరియు స్థితి పెరగడం, వ్యాపారం ద్వారా లాభాలు పొందవచ్చు. , మరియు తండ్రి లేదా తండ్రి నుండి ప్రయోజనాలు ప్రయోజనం పొందుతాయి. సూర్యుడు బలహీనంగా మరియు బాధతో ఉంటే అంతర్గత బలహీనత, శారీరక మరియు మానసిక శక్తి క్షీణత, ఆరోగ్య సమస్యలు, హోదా మరియు హోదాలో తగ్గుదల, ప్రభుత్వ అసంతృప్తి, వ్యాపార నష్టాలు మరియు తండ్రి లేదా అతని తండ్రి చేతిలో అనారోగ్యంతో బాధపడవచ్చు. - ఆరోగ్యం లేదా మరణం. *చంద్రుడు - 10 సంవత్సరాలు.* చంద్రుడు బలవంతంగా మరియు అనుకూలంగా ఉంటే, ఉల్లాసమైన హృదయం, సంతోషకరమైన మరియు శక్తివంతమైన మనస్సు, ముఖ మెరుపు పెరుగుతుంది, సూక్ష్మమైన ఆనందాలను మరియు సుఖాలను అనుభవిస్తుంది, మంచి ఉద్యోగం లేదా హోదాను పొందుతుంది, డబ్బు మరియు అనుగ్రహం మరియు దేవతలను ఆరాధించవచ్చు. . చంద్రుడు బలహీనంగా మరియు బాధతో ఉంటే అనారోగ్యం, నీరసం మరియు ఉదాసీనత, ఉద్యోగం కోల్పోవడం లేదా ప...

ఉత్తమాద్యంశములు

ఉత్తమాద్యంశములు 1 పారిజాతాంశ 2 ఉత్తమాంశ 3 గోపురాంశ 4 సింహాసనాంశ   5 పారావతాంశ 6 దేవలోకాంశ.  రేండు వర్గములకు ఐక్యము కలిగెనేను పారిజాతాంశ మనియు, 3 వర్గములకు ఐక్యము గలిగిన యత్తమాంశనియు, 4 వర్గములు ఐక్యము గలిగిన గోవురాంశయనియు, 5 వర్గములు ఐక్యముగలిగిన సింహాసనాన్ని యనియు, 6 వర్గములకు ఐక్యము కలిగిన పారావతాంశ యనియు, 7 వర్గములు ఐక్యము గలిగిన దేవలోకాంశ అనబడును.  *వర్గయోగ ఫలము*. స్వాంశ యందున్న గ్రహముతెలివి, కీర్తి, సుఖమును, యుత్తమాంశయందున్న గ్రహము సకల సంపత్తులను, గోపురాంశ యందున్న గ్రహము నిత్యము ధనవిద్యలను, సింహసనాంశ యందున్న గ్రహము భూసంపత్తిని గలుగజేసి మహానుభావునిగాను, పారావతాంశయందున్న గ్రహము వైభవము, సర్వశాస్త్రములును, దేవలోకాంశయందున్న గ్రహము రాజ్యము, భూములను, దానములు చేయించుటయును జేయును. వర్గోత్తమాంశ యందున్న గ్రహము భావమునకు గ్రహమునకు యెక్కువ బలము గలిగించి భావ కారక విషయములలో విశేష శుభఫలదాయి యగును. లగ్నమున సప్తవర్గములు సాధించి యందు అయాగ్రహములకు శుభవర్గైక్యము, పాపవర్గైక్యము జేసికొని శుభాధిక్యమైన శుభఫలము, తాపాధిక్యమైన పాపఫలము కల్పించవలెను. గ్రహములకుస్వవర్గ, మిత్రవర్గు, శుభగ్రహ వర్గ...

ప్రవేశ లగ్నము

అష్టమాత్పంపంచమా ద్విత్తాల్లా భాత్పంచమస్తితే రవౌ పూర్వాది దిజ్ఞ్మకం జ్ఞేయం విశేద్వామో భవేద్యతః ప్రవేశ లగ్నము నుండి 8వ 5వ రెండవ పదకొండవ స్థానములు నుంచి ఐదవ స్థానములలో ఉన్న రవి ఉన్నచో వామ రవి, దక్షిణ ముఖ ద్వారం కల గృహమునకు పంచమము నుండి 5వ స్థానంలో రవి ఉంటే వామరవి పశ్చిమ ముఖ ద్వారం గల గృహమునకు ద్వితీయము నుండి ఐదవ స్థానములలో రవి ఉంటే వామ రవి ఉత్తర ముఖ ద్వారము గల ఇంటికి ఏకాదశము నుండి ఐదవ స్థానములలో రవి ఉంటే వామ రవి అని అంటారు గృహప్రవేశం చేయుట ఉత్తమము

పగటి ముహూర్తమునకు

 పగటి ముహూర్తమునకు రవి లాభస్ధానంలో అలాగే రాత్రిపూట ముహూర్తమునకు చంద్రుడు లాభస్ధానంలో ఉన్నచో అగ్ని దూదిని దహించు చందమున ముహూర్త దోషములను రవి, చంద్రులు దహించివేతురు*....

కారకాంశ

శ్రీ గురుభ్యోన్నమః   జైమిని ప్రకారం కారకాంశ అధిపతికి  అష్టమరాశి మృత్యువు ఏ రూపంలో వస్తుందో తెలుస్తుంది కారకాంశ అంటే ఎక్కువ భాగాలు నడిచిన గ్రహం నవాంశలో ఎక్కడ ఉంటుందో అది కారకాంశ అవుతుంది  ఉదాహరణకు నా జాతకంలో కారకాంశ మీనం లో పడింది అధిపతి గురువయ్యాడు ఆ గురువు సింహంల్లో ఉన్నాడు అక్కడినుండి అష్టమం మీనమైంది మీనం అయితే శాంతిగా మరణం కలుగుతుందని చెప్పబడింది అదేవిధంగా మేషాది రాశులకు మేషం అయితే సహజ మరణం వృషభం దెబ్బలు గాయాల వల్ల మరణం మిధునం  ఫుడ్ పాయిజనింగ్ లేదా ఇన్ఫెక్షన్ వల్ల మరణం సింహం అయితే శత్రువుల ద్వారా గాని ఆయుధాల వల్ల గాని మరణం ఇక్కడ ఆయుధాలు అంటే ఆపరేషన్ కూడా అనుకోవచ్చు కన్య అయితే ఎముకలు రోగాలు వెన్నుపూస నడుము వీటికి సంబంధించిన రోగాల వల్ల అలాగే తుల అయితే చర్మ రోగాల వల్ల వృశ్చిక రాశి అయితే గుహ్య స్థానాల రోగాల వల్ల ప్రో స్టేటు లాంటి సీక్రెట్ రోగాలవల్ల ధనస్సు అయితే దెబ్బలు గాయాల వల్ల ఎత్తునుంచి పడిపోవడం మొత్తం మీద హింసాత్మక మరణం కుంభం అయితే పక్షవాతం లేదా నరాల వ్యాధి వల్ల  మీనం అయితే ఇంతకుముందు చెప్పబడింది

గ్రహాల కలయికలు....

జ్యోతిష్య శాస్త్రం ద్వారా వైద్యుడు అవ్వటానికి కావలసిన గ్రహాల కలయికలు.... వ్యక్తికి సమాజంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి కెరీర్ అనేది ప్రత్యేకమైనది అని మనందరికీ తెలిసిన విషయమే.. కావున జ్యోతిష్య శాస్త్రం ద్వారా వ్యక్తి జాతకంలోని గ్రహాల కలయిక లు మరియు వాటి స్థితి ద్వారా వ్యక్తి ఏ రంగంలో మంచి స్థితిని పొందుతాడో మనం తెలుసుకోవచ్చు. అలాంటి రంగాలలో ఒక రంగమైన వైద్యరంగం గురించి ఈ రోజు మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైద్యరంగం అనేది దేశంలోనే ప్రతిష్టాత్మకమైన వృత్తులలో అగ్రశ్రేణికి చెందినది గా ఉంది. వైద్య రంగం అనేది వ్యక్తికి ఆర్థిక లాభాలతో పాటు సమాజంలో మంచి గుర్తింపును మరియు గౌరవాన్ని కూడా ఇస్తుంది. కావున వ్యక్తి జాతకంలో వైద్యుడు కావటానికి కొన్ని గ్రహాల కలయికను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి సహకరించగలరు జ్యోతిష్య శాస్త్రం ద్వారా వైద్యుడు కావటానికి పరిశీలించవలసిన గ్రహాలు... వైద్యుడి యొక్క జాతకం లో ముఖ్యంగా రవి,చంద్ర, గురు గ్రహాలు ముఖ్య పాత్రను పోషిస్తాయి అలాగే వైద్య వృత్తి కోసం శుక్రుడు మరియు సర్జన్ కోసం కుజ గ్రహాన్ని కూడా మనం పరిశీలించవలసి ఉంటుంది. గురు గ్రహం వ్యక్తి...

ధన యెాగాధ్యాయము*

*ధన యెాగాధ్యాయము* ఏ యెాగమున పుట్టినవాడు నిస్సంశయముగాధనవంతుడగునునో అట్టి ధనయెాగమును తెలుసు కొనుము.పంచమము శుక్రక్షేత్రమై (వృషభ, తులలు)దనియందు శక్రుడుండి, లాభమున బుధుడక్కడుండి, లాభము చంద్రకుజగురులతో కూడియున్న బహువిత్తవంతు డగును. పంచమము రవిక్షేత్రమై (సిహము)రవి అక్కడుండి, లాభమందు శని చంద్రగురులున్న మహాధనికుడగును. శనిక్షేత్రము (మకర,కుంభము)లందు శనియుండి లాభమున రవిచంద్రులున్న ధనవంతుడగును. పంచమము గురుక్షేత్రమై (ధనుర్మీనములు)లాభమున బుధుడున్న ధనవంతుడగును. పంచమము కుజక్షేత్రమై కుజుడక్కడనే యుండి, లాభమున శుక్రడున్న చో ధనవంతుడగును. పంచమము కర్కాటమై చంద్రుడుండి, లాభమున శనియున్న ధనికుడగును. సింహము లగ్నమై అక్కడ రవియుండి, కుజగురు సంబంధమున్న ధనవంతుడగును. కర్కాటకము లగ్నమై చంద్రుడక్కడుండి, బుధగురులతో కూడినా, చూడబడినా ధనవంతుడగును. కుజక్షేత్రము లగ్నమై అందుకుజుడుండి, బుధ రవిశుక్రుల సంబంధమున్న శ్రీమంతుడగును. కన్యామిథునములు లగ్నమై,బుధుడుండి,శనిగురుల సంబంధమున్న జాతకుడు ధనికుడగును. ధనుర్మీనములు లగ్నమై బుధకుజులు సంబంధమున్న జాతకుడు ధనికుడగును. తులావృషభములు లగ్నమై,శుక్రుడుండి,శని బుధుల సంబంధమున్న ధనవంతుడగును. మకర కుంభ...

వివిధ లగ్నములకు యెాగకారక గ్రహములు*

*వివిధ లగ్నములకు యెాగకారక గ్రహములు* *మేషలగ్నము* మేషలగ్న జాతకునకు రవి లగ్నమునందుగాని,కర్కాటకమందుగాని,సింహమునందుగాని ధనస్సుయందుగాని ఉన్న యెడల బాగుగా యెాగించును. చంద్రుడు మేషములగాయతు 1,2,4,5,9,10,11 ఈ స్థానములందున్న యెడల బాగుగా యెాగించును. కుజుడు మేషములగాయతు 1,3,5,6,9,10,11 ఈ స్థానములందున్న యెడల బాగుగా యెాగించును. బుధుడు మేషము లగాయుతు 3,6,8,11,12, ఈ స్థానములయందున్న యెడల బాగుగా యెాగించును. గురుడు 1,4,5,7,9 ఈ స్థానములయందున్న యెడల బాగుగా యెాగించును. శుక్రుడు 1,2,4,5,7,9,10,11,12 ఈ స్థానములయందున్న యెడల బాగుగా యెాగించును. శని 3,4,6,7,10,11 ఈ స్థానములయందున్న యెడల బాగుగా యెాగించును. రాహువు వృషభమందును మిధునమందును సింహమందును కన్యయందును ధనస్సు యందును వున్న యెడల యెాగించును. కేతువు కూడ రాహువువలెనే యెాగించును. ఈ మేషలగ్నజాతకునకు రవి చంద్రులు మేషము లగాయతు 1,4,5,9, స్థానముల యందు కలసియున్న యెడల ఈ దశలలో వాని జాతకము యెాగించును. రవికుజులు లగ్నము లగాయతు1,5,6,8, స్థానములందున్న యెడల ఈ దశలు బాగుగా యెాగుంచును. రవిబుధులు 1,5,6,9, ఈ స్థానములయందున్న యెడల బాగుగా యెాగించును. రవిగురులు 1,4,5,9 ఈ స్థానములయందున్న యెడల బ...

చతురధికమ్ శతమష్టగుణమ్

ఒక వృత్తం యొక్క పరిధి దాని వ్యాసానికి π రెట్లుగా ఉంటుందని అందరికీ నేడు తెలిసినదే. ఆర్యభట π విలువను గురించి ఇలా చెప్పాడు.         చతురధికమ్ శతమష్టగుణమ్ ద్వాషష్టి స్తథా సహస్రాణామ్         ఆయుత ద్వయ విష్కంభస్యాసన్నోవృత్తపరిణాహః వందకు నాలుగు కలిపి యెనిమిది చేత గుణించి 62000 కలపండి. ఇది 20000 వ్యాసంగా కల వృత్తం యొక్క పరిధికి  చాలా చేరువగా ఉంటుంది. అంటే ((4 + 100) × 8 + 62000)/20000 =  62832/20000 = 3.1416 ఈ విలువ నాలుగు దశాంశ స్థానాల వరకు π విలువను తెలియ జేస్తోంది. ముఖ్యంగా గమనించవలసిన విషయం యేమిటంటే 'ఆసన్న' అనే పదం వాడటం ద్వారా π విలువ యెన్నో కొన్ని స్థానాలకు తెగేది కాదని ఆనాడే ఆర్యభట్టు గ్రహించి చెప్పటం.  పాశ్చాత్యులకైతే ఇది 1761 లో లాంబర్టు చెప్పాక గాని తెలియరాలేదు. సంఖ్య లేదా అంకె కావాలో దానికి తగిన పదాన్ని యెన్నుకుని వాడటమే. పెద్దపెద్ద సంఖ్యలను చెప్పటానికి ఒకటి కంటె హెచ్చు పదాలను సమాసంచేసి వాడతారు.  దానికేమీ అర్థం ఉండదు - ఇష్ట సంఖ్యను చెప్పటం తప్ప. ఉదాహరణకు వరాహమిహిరుడు ఒక చోట 'ఏకర్తుమను' అన్న మాట వాడతాడొక శ్లోకంలో .  అంటే...

దశా/అంతర్దశా క్రమము

1. " ఇన శశి కుజ..." అని సూర్యుడి మొదలు దశా క్రమము చెప్పబడినది. ఇన శశి కుజ రాహుః  జీవ మందజ్ఞ కేతుః    భృగుజ ఇతి నవానాం  కృత్తికాది క్రమేణ 2. దశా/అంతర్దశా క్రమము: రవి, చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ, కేతు, శుక్ర. 3. చంద్ర సంచార నక్షత్రము(దిన నక్షత్ర) ఏ గ్రహముదో ఆయా గ్రహ దశా కాలము నుండి దశలు లెక్క ప్రారంభము అవుతుంది. 4. దశా సంవత్సరములు మరియు క్రమము : రవి - 6 సం. చంద్ర - 10 సం. కుజ - 7 సం. రాహు - 18 సం. గురు - 16 సం. శని -19 సం. బుధ - 17 సం. కేతు - 7 సం. శుక్ర - 20 సం. 4. ప్రతీ గ్రహముయొక్క పూర్తి దశా కాలము 9 గ్రహాల అంతర్దశా కాల పాలన వచ్చును. ఒక్కో అంతర దశానాథునికి కొంత పాలనా కాలము ఇచ్చినారు. అంతర్దశలు ఆయా దశానాథుని నుండి మొదలవుతాయి. 1.ఉదా: రవి దశ (దశానాథుడు / అంతర్దశానాథుడు) రవి / రవి రవి / చంద్ర రవి / కుజ రవి / రాహు రవి / గురు రవి / శని రవి / బుధ రవి / కేతు రవి / శుక్ర 2. ఉదా: శని దశ శని / శని శని / బుధ శని / కేతు శని / శుక్ర ( శుక్రుడి తరువాత రవితో ప్రారంభము) శని / రవి శని / చంద్ర శని / కుజ శని / రాహు శని / గురు పై విధముగా ప్రతీ గ్రహ దశా కాలములో అంతర్దశలు ఆయా దశానాథు...

విదేశాలకు వెళ్లే జాతకాలను పరిశీలించే విధానం

విదేశాలకు వెళ్లే జాతకాలను పరిశీలించే విధానం నాలుగో స్థానం, లగ్నం నుండి నాలుగో అధిపతి పాడైతే నాలుగో స్థానానికి రాహువు మరియు కేతువు లేదా నక్షత్రాధిపతి పరివర్తన ఎలాగైనా నాలుగో స్థానానికి సంబంధించి ఉండాలి. నాలుగో స్థానాధిపతి దుస్థానాలైన 6,8,12 స్థానాలలో ఉంటే అతను కచ్చితంగా స్వదేశం వీడి విదేశాల్లో సెటిల్ అవుతాడు. ఈసూత్రాలు లగ్నం నుండి చంద్రుడి నుండి మరియు నవాంశ,చతుర్ధాంశను వీక్షించాలి. తొమ్మిదవ అధిపతి పన్నెండు అధిపతి, చరరాశులలో యుండి జలరాశులై ఉంటే విదేశీ యానం ఉంటుంది. ఉదాహరణకు తొమ్మిదవ అధిపతి పన్నెండు అధిపతి జాతకంలో చరరాశిలో ఉండి జలరాశిలో ఉంటే ఉన్నత చదువులకు విదేశీ యానం ఉంటుంది. నాలుగవ అధిపతి 12 లో ఉంటే జాతకుడు స్వదేశం కంటే విదేశాలలో ఉండాలనే అభిలాష ఉంటుంది. 5,9,12 అధిపతులు దశాంశ లో కలసి ఉంటే వృత్తి సంబంధంగా విదేశాల్లో నివసిస్తారు. ఇటువంటి వారు సైంటిస్టులు గానూ ప్రొఫెసర్లుగాను ఉంటారు. ముఖ్యంగా రాహువు తొమ్మిదవ అధిపతి తో కలిసి 12వ స్థానంలో జలరాశిలో ఉంటే విదేశాల్లో స్థిర నివాసం ఉంటుంది. వివాహ స్థానమైన సప్తమ స్థానంలో మరియూ 8,9, 12 స్థానాల్లో ఉన్నాలేదా స్థానాధిపతులతో కలిసి ఉన్నా వివాహం తర్వాత ...

వయోభేదం ఉండటం

వయోభేదం ఉండటం లేదండి.  కుజశుక్రులు కలిసిన వారు తమ యథార్థవయసుకన్నా తక్కువ వయసువారిగా కనిపిస్తున్నారు.  కుజుడు నవయౌవనుడు కనుక ఆ లక్షణాన్ని చూపిస్తున్నాడు. కుజ శుక్రులు కలవకపోయినా... కుజుడు శుక్రుని ఇంట్లో ఉన్నా, శుక్రుడు కుజుడు శుక్రుని ఇంట్లో ఉన్నా కూడా ఆ జాతకులు యథార్థవయసుకన్నా చిన్నవారుగా కనిపిస్తున్నారు.

విదేశీ స్థిరనివాసం మరియు ప్రయాణం

విదేశీ స్థిరనివాసం మరియు ప్రయాణం నేటి ప్రపంచంలో ముఖ్యంగా నేటి యువతలో ఎక్కువగా కోరుకునే వాటిలో ఒకటి. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం మెరుగైన ఆర్థిక అవకాశాలు, విద్యా ప్రయోజనం మరియు మెరుగైన జీవన పరిస్థితులు మరియు మెరుగైన అవకాశాలు. అయితే మీరు ఫారిన్ ల్యాండ్‌కి వెళ్లి అక్కడ సెటిల్ అవ్వడం అనేది ఈ రోజుల్లో ముఖ్యంగా USA, యూరప్, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్, న్యూజిలాండ్ మొదలైన దేశాలకు వెళ్లడం అంత తేలికైన పని కాదు. మీకు అవసరమైతే మీ జాతకంలో మంచి యోగాలు ఉండాలి. విదేశాలకు వెళ్లండి లేదా స్థిరపడండి, లేకపోతే మీరు చాలా డబ్బు మరియు సమయాన్ని వృధా చేస్తారు మరియు ఇప్పటికీ వెళ్లలేరు మరియు తత్ఫలితంగా మీరు వెనుకబడి నిరాశకు గురవుతారు. చాలా మంది ప్రజలు విదేశాల్లో స్థిరపడేందుకు ఇష్టపడుతున్నారు, ముఖ్యంగా మన దేశంలోని యువ తరం వారు తమను తాము అన్వేషించడానికి, ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి, మంచి మొత్తంలో డబ్బు సంపాదించడానికి మరియు సురక్షితమైన భవిష్యత్తు కోసం విదేశాలలో ఎక్కువ అవకాశాలు ఉంటాయని భావించారు. ఇది ఎవరికీ అంత తేలికైన పని కాదు. స్వదేశీ దేశస్థుడు విదేశాలలో స్థిరపడతాడో లేదో అంచనా వేయడానికి జ్యోతిష్యుడు. ఇప్పటికీ లోతై...

Foreign settlement and travel

Foreign settlement and travel is one of the most sought after in today’s world particularly among the youth of today. the main reason behind this is mostly for better financial prospects , educational purpose and better living conditions and better opportunities. but mind you going to foreign land and settling there is not an easy task in today’s time particularly going to countries like USA , Europe , Canada , Australia , Dubai , Newzealand etc. you have to have a good yogas in your horoscope if you need to travel abroad or settle their otherwise you will waste a lot of money and time in fulfilling conditions and would still not be able to go and consequently you will lag behind and feel depressed. So many people are willing to settle abroad especially young generation of our country as they think they will have more chances abroad to explore themselves, having ravishing life, earn good amount of money and for having safe future.This is not an easy task for any astrologer to predict a...

బుధుడికి అష్టమాధిపత్యం

బుధుడికి అష్టమాధిపత్యం వచ్చినా... బుధుడు అష్టమంలో ఉన్నా మంచిది అంటారు. కానీ... బుధుడి శుభకారకత్వాలు ఫట్. అందులో ముఖ్యంగా మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్,మీన లగ్నముల వారికి 8 లో ఎక్కువగా యోగాన్ని ఇస్తాడు కదా?

కాలభైరవ అష్టకం*

*శివాయ నమః ||కాలభైరవ అష్టకం* దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం  । నారదాది యోగివృంద వందితం దిగంబరం కాశికా పురాధినాథ కాలభైరవం భజే॥ 1॥ భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠం ఈప్సితార్థ దాయకం త్రిలోచనం । కాలకాలం అంబుజాక్షం అక్షశూలం అక్షరం కాశికా పురాధినాథ కాలభైరవం భజే॥2॥ శూలటంక పాశదండ పాణిమాది కారణం శ్యామకాయం ఆదిదేవం అక్షరం నిరామయం । భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥3॥భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహం । వినిక్వణన్ మనోజ్ఞహేమకింకిణీ లసత్కటిం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥4॥ ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశ మోచకం సుశర్మదాయకం విభుం । స్వర్ణవర్ణశేషపాశ శోభితాంగమండలం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥ 5॥ రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్యం అద్వితీయం ఇష్టదైవతం నిరంజనం । మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥6॥ అట్టహాస భిన్నపద్మజాండకోశ సంతతిం దృష్టిపాతనష్టపాప జాలముగ్రశాసనం । అష్టసిద్ధిదాయకం కపాల మాలికంధరం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ॥7॥భూతసంఘనాయకం వ...

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం ఈరోజు పుష్య పౌర్ణమి సందర్భంగా శ్రీ లలితా సహస్రనామ పారాయణం (వెన్నెల పారాయణం) చేయాలి. ఓమ్ ॥ అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః, అనుష్టుప్ ఛందః, శ్రీ లలితా పరాభట్టారికా మహా త్రిపుర సుందరీ దేవతా, ఐం బీజం, క్లీం శక్తిః, సౌః కీలకం, మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థే లలితా త్రిపురసుందరీ పరాభట్టారికా సహస్ర నామ జపే వినియోగః కరన్యాసః ఐం అంగుష్టాభ్యాం నమః, క్లీం తర్జనీభ్యాం నమః, సౌః మధ్యమాభ్యాం నమః, సౌః అనామికాభ్యాం నమః, క్లీం కనిష్ఠికాభ్యాం నమః, ఐం కరతల కరపృష్ఠాభ్యాం నమః అంగన్యాసః ఐం హృదయాయ నమః, క్లీం శిరసే స్వాహా, సౌః శిఖాయై వషట్, సౌః కవచాయ హుం, క్లీం నేత్రత్రయాయ వౌషట్, ఐం అస్త్రాయఫట్, భూర్భువస్సువరోమితి దిగ్బంధః ధ్యానం అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్ । అణిమాదిభి రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్ ॥ 1 ॥ ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మ పత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసమద్ధేమపద్మాం వరాంగీమ్ । సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం ...