Posts

Showing posts from March, 2024

గ్రామ_దేవతల_పేర్లు*

🍁 *గ్రామ_దేవతల_పేర్లు* *విజయవాడ దుర్గమ్మ తల్లి సాక్షిగా...!!!!* గ్రామదేవతలు 101 మంది అక్కాచెల్లెళ్ల పేర్లు :- పార్వతి అమ్మోరు (అమ్మవారు )గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం . ఈ అమ్మోరు మొత్తం 101 మంది అక్కాచెల్లెళ్లు అని వీరందరికి ఒకేఒక్క తమ్ముడు పోతురాజు అని అంటారు .వారిలో కొందరు . 1.పాగేలమ్మ 2.ముత్యాలమ్మ 3 .గంగమ్మ 4.గంగానమ్మ 5.బంగారమ్మ 6.గొంతెమ్మ 7.సత్తెమ్మ 8.తాళమ్మ 9.చింతాలమ్మ 10.చిత్తారమ్మ 11.పోలేరమ్మ 12.మావుళ్లమ్మ 13.మారెమ్మ 14.బంగారు బాపనమ్మ 15.పుట్టానమ్మ 16.దాక్షాయణమ్మ 17.పేరంటాలమ్మ 18.రావులమ్మ 19.గండిపోచమ్మ 20.మేగదారమ్మ 21.ఈరినమ్మ 22.దుర్గమ్మ 23.మొదుగులమ్మ 24.నూకాలమ్మ 25.మరిడమ్మ 26.నేరెళ్లమ్మ 27.పుంతలో ముసలమ్మ 28.మాచరమ్మోరు 29.మద్ది ఆనాపా అమ్మోరు 30.సొమాలమ్మ 31.పెద్దయింట్లమ్మ 32.గుర్రాలక్క 33 .అంబికాలమ్మ 34.ధనమ్మ 35.మాలక్షమ్మ 36.ఇటకాలమ్మ 37.దానాలమ్మ 38.రాట్నాలమ్మ 39.తలుపులమ్మ 40.పెన్నేరమ్మ 41.వెంకాయమ్మ 42.గుణాళమ్మ 43.ఎల్లమ్మ  44.పెద్దమ్మ 45.మాంటాలమ్మ 46.గంటాలమ్మ 47.సుంకులమ్మ 48.జంబులమ్మ 49.పెరంటాలమ్మ 50.కంటికలమ్మ 51.వణువులమ్మ 52.సు...

retrograde planets

IN Vedic astrology, retrograde planets are considered significant celestial entities whose influence within a birth chart carries particular nuances and implications. When a planet is retrograde, it appears to move backward through the zodiac from the perspective of Earth, symbolizing a unique dynamic in the individual's life journey. Retrograde planets are believed to internalize their energies, prompting a more introspective and subjective experience of their significations. This internalization often manifests as a heightened awareness of the planet's themes within the individual's psyche, leading to introspection, self-analysis, and a deepening of the internal dialogue. Retrograde planets may also symbolize karmic influences, suggesting unresolved issues from past lives that require attention and resolution in the present incarnation. Consequently, individuals with retrograde planets in their birth chart may find themselves revisiting past experiences or encountering r...

జన్మరాశి మొదలు చంద్రుడు

జన్మానల ఋతౌ సప్తదశమైకాదశేశుభః చతుర్ద ద్వాదశే కృష్ణే ద్వినవపంచమే యధామాతా సుతాన్ రక్ష తధారక్షతు చంద్రమాః జన్మరాశి మొదలు చంద్రుడు రాశి వరకు లెక్కించిన శుక్ల పక్షములో 2,5,9 స్థానములందు కృష్ణపక్షంలో 4 8 12 స్థానాల్లోనూ ఉభయపక్షములలో 1 3 6 7 10 11 స్థానాల్లో చంద్రుడు శుభకరుడు, శుక్లపక్షమునందువృద్ధిచంద్రుడు అగుటవలన తారకు బలము లేనందున చంద్ర బలము ,కృష్ణపక్షమున క్షీణ చంద్రుటవుట వలన చంద్రుడు బలహీనమగుటవలన తారాబలం ముఖ్యమనిరి చంద్రుడు రాశిబలం కంటే తారాబలంలో శభుడు.చంద్ర బలం కంటే రవి బలం అధికం రవి బలం కంటే కుజాదుల బలం ఉన్న అధిక ఫల పదం ఈ బలములు గృహ నిర్మాణం మొదలైన వాస్తు కర్మల యందు ఇతర శుభకర్మల యందు విచారించుట ముఖ్యము

రాహువు ఆసక్తికరమైన విషయాలు.

రాహువు ఆసక్తికరమైన విషయాలు.  1- రాహువు పురాణ రాక్షసుడు.  2- కాలసర్పానికి రాహువు అధిపతి.  3- జ్యోతిష్య శాస్త్రంలో రాహువును పాముగా పరిగణిస్తారు.  4- రాహువు ప్రభావానికి వ్యతిరేక మందు ఎరుపు రంగు.  5- మా దుర్గా ఉపాసన రాహువు యొక్క చెడు ప్రభావాలను నియంత్రిస్తుంది, ఆమె ముఖ్యమైన రంగు ఎరుపు.  6- ఈ విషయం నాకు క్లారిటీ లేదు, కానీ నేను ప్రెడేటర్ స్నేక్స్ గురించి ఒక ఆంగ్ల సినిమా చూశాను, దాడి చేసే పాములకు ప్రతి వస్తువు ఎర్రగా కనిపించింది. ఇది ఎంత శాస్త్రీయమో చెప్పలేం. కేవలం ప్రస్తావన.  7- ఫోటోల ప్రతికూలతను అభివృద్ధి చేయడానికి అభివృద్ధి చెందుతున్న గది లేదా చీకటి గది ఆ గదిలో రెడ్ లైట్ ఉపయోగించబడుతుంది.  8-. లోతైన డిప్రెషన్‌తో ఉన్న వ్యక్తి (తరచుగా రాహువు ఫలితం) మసక ఎరుపు దీపాలతో చీకటి గదిలో కూర్చోవడానికి ఇష్టపడతాడు.  9- దశ లేదా సంచార సమయంలో రాహువు యొక్క చెడు ప్రభావం ఉన్న వ్యక్తి ఎరుపు రంగును ద్వేషిస్తాడు. వారు టొమాటో సలాడ్ (వండిన టొమాటోలు మరియు సాస్ మినహాయించబడినవి) తినడానికి ఇష్టపడరు.  10- యుగయుగాల పురాణం (మళ్లీ శాస్త్రీయ రుజువు లేదు, కానీ వేల సంవత్స...

Rahu interesting facts.

Rahu interesting facts. 1- Rahu is the mythological demon. 2- Rahu is the head of Kaalsarp. 3- Rahu is considered snake in astrology. 4- The anti dote to Rahu effect is red color. 5- Ma Durga's upasana controls bad effects of Rahu ,Her significant color is red. 6- This point I am not having clarity, but i saw an English movie about predator snakes, every thing looked red to the attacking snakes. How scientific is this ,can't say. Just mentioning. 7- A developing room or dark room to develop negatives of photos red light is used in that room. 8-. A person with deep depression ( result of Rahu often) likes to sit in a dark room with dim red lights on. 9- A person under bad effect of Rahu during dasha or transit hates red color. They hate to eat even tomato salad ( cooked tomatoes n sauce excluded). 10- An ages old myth( again no scientific proof, but I believe everything that has travelled thousands of years to billions of people has some truth in it, may be scientists have not b...

అన్నానికి దోషం

అన్నానికి దోషం అంటడమంటే ఏమిటి? అదెలా పోగొట్టుకోవాలి? ఎడమ చేతితో తినే తిండికి, నిలబడి తినే తిండికి రాక్షస శక్తులు వస్తాయి. ఒకరి ఎంగిలి ఒకరు పంచుకు తింటే అది కూడా దోషాన్నమే. అన్నానికి జాతి దోషం, ఆశ్రయ దోషం, నిమిత్త దోషం అని మూడు రకాల దోషాలుంటాయి.  జాతి దోషం అంటే సహజంగానే ఆ పదార్థానికి ఉన్న దోషము. అవి ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి లాంటివి. వీటిలో తామస గుణములు ఉంటాయి కనుక ఇవి వర్జనీయములు. సాత్త్విక సాధన చేసి భగవంతుడు కావాలి అనుకునే వారు వీటిని వదిలేయాలి.  ఆశ్రయ దోషం అంటే పాత్రను బట్టి దోషము. పాలు శ్రేష్టమైనవి. కాని అవి రాగి పాత్రలో పోసి భగవంతునికి నివేదిస్తే అవి కల్లుతో సమానం. అది పాత్ర దోషం.  నిమిత్త దోషం అంటే అవి పుట్టే చోటు బాగుండాలి. మారేడు దళాలు శివునికి ప్రీతి. కాని ఆ చెట్టు శ్మశానంలో ఉంటే అది దోషం. అంటే దుష్టమైన ప్రాంతంలో పెరిగినా దోషమే. కాకి, పిల్లి, కుక్క మొదలైనవి ముట్టుకున్న భోజనము కూడా దోషమే.  మనము బయట నుంచి తెచ్చిన వస్తువులు ఎలా పండిస్తున్నారో, ఎక్కడ నుంచి తెస్తున్నారో తెలీదు. అందుకని భగవంతునికి నివేదించి భోజనం చెయ్యాలి. మన దగ్గరకు రాక మునుపు అవి ఏమైనా మన దాకా ...

మాడ వీధి

మాడ వీధి అంటే ఏమిటి ?  తిరుమల మాడ వీధుల యొక్క పూర్తి వివరాలు.  తమిళంలో ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్ళున్న వీధులను పవిత్రంగా భావించి 'మాడాం' అని పిలుస్తారు. అదే మాడవీధులుగా మారింది ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామి వారు వాహనంలో ఊరేగటానికి గాను సరియైన వీధులుండేవి కావు. అంచేత బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ ఇక్కడ చేసినా మిగతా కార్యక్రమాలు, ఊరేగింపులు తిరుచానూరులో జరిపేవారు శ్రీరామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధుల నేర్పరిచి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగేందుకు ఏర్పాట్లు చేశారు. తదనంతరం తి.తి.దే. మాస్టర్ ప్లాన్ లో భాగంగా వీధుల్ని మరింత వెడల్పు చేసి సుందరంగా తీర్చిదిద్దారు.  తిరుమల ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధులున్నాయి. వీటిని నాలుగు వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు. 1.తూర్పు మాడ వీధి. ఆలయం తూర్పు ముఖంగా ఉంది ఎదురుగా ఉన్నదే తూర్పు మాడవీధి. శ్రీవారి ఆలయం ముందు నుండి పుష్కరిణి వరకుండే వీధిని తూర్పు మాడ వీధి అంటారు. ఒకప్పుడు పుష్కరిణి గట్టు పైన కూడా ఇళ్ళుండేవి. ఈ వీధిలోనే శ్రీవారి కొయ్య రథం ఉండేది శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న (ఉండే) వీధిని సన్నిధి వీధి అంటారు ఒకప్పుడు సన్నిధి వీధి, వేయిక...

గర్భిణీ స్త్రీల ఆహార నియమావళి

గర్భిణీ స్త్రీల ఆహార నియమావళి..  మాతృమూర్తులగు స్త్రీల కొరకు..  లలితా సహస్ర నామం నందు వరుసగా 98 వ శ్లోకం నుండి 110 వ శ్లోకం వరకు ఎటువంటి ఆహరం తీసుకోవాలో చక్కగా తెలపబడింది. వాటిని ఓసారి పరిశీలిద్దాం. విశుద్ధి చక్రనిలయా,‌ రక్తవర్ణా, త్రిలోచనా  ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా 98  పాయసాన్నప్రియా, త్వక్‍స్థా, పశులోక భయంకరీ  అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ 99  అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా  దంష్ట్రోజ్జ్వలా,‌உక్షమాలాధిధరా, రుధిర సంస్థితా 100  కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా  మహావీరేంద్ర వరదా, రాకిన్యంబా స్వరూపిణీ 101  మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా  వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా 102  రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా  సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ 103  స్వాధిష్ఠానాంబు జగతా, చతుర్వక్త్ర మనోహరా  శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,‌உతిగర్వితా 104  మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా  దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ 105  మూలా ధారాంబుజారూఢా, పం...

గర్భములో శిశువు పిండ రూపంలో భగవంతుని ప్రార్థిస్తాడా? ఎలా?:*

*గర్భములో శిశువు పిండ రూపంలో భగవంతుని ప్రార్థిస్తాడా? ఎలా?:*   ➖➖➖🍒🍌🍎🌻🪻🍋🌺🍅🌸🍈🍊 స్త్రీ గర్భములోనే శేషన దుఃఖముతో జీవుడు ప్రవేశిస్తాడు. ఫలదీకరణము జరిగిన తరువాత శిశువు పరిణామక్రమము... *ఒక రోజుకు ఖలిలమౌతాడు. *ఐదు రోజులకు బుద్భుదాకారము పొందుతుంది. *పది రోజులకు బదరీఫలములాగా కఠినమైన మాంసపు ముద్దగా తయారవుతాడు. *ఒక నెలకు శిరస్సు ఏర్పడుతుంది. *రెండు నెలలకు బాహువులు తదితర అవయవాలు ఏర్పడుతాయి. *మూడు నెలలకు గోళ్లు, రోమాలు, చర్మము, లింగము, నవరంధ్రములు ఏర్పడుతాయి. *నాలుగు నెలలకు సప్త ధాతువులు ఉద్భవిస్తాయి. *ఐదు నెలలకు ఆకలి దప్పికలు ఏర్పడుతాయి. *ఆరు నెలలకు జఠాయువు, మావిచేకప్పబడి గర్భంలో దక్షిణాన తిరుగుతుంటాడు. మాతృ భుక్తాన్న పానీయాలచే క్రమక్రమంగా వృద్ది చెందుతూ దుర్గంధ భూయిష్టమైన మల మూత్రాల గుంటలో ఉన్న పురుగులు, సుకుమారమైన శరీరాన్ని కరుస్తూ ఉండగా, ఆ బాధకు తట్టుకోలేక మాటిమాటికి మూర్చబోతాడు. నరకయాతన, నరకానుభవము జీవుడు మాతృ గర్భంలోనే అనుభవించడం ప్రారంభమవుతుంది.   తల్లి తీసుకునే ఆహారములోని, దుస్సాహాలైన కట్వాములు(ఉప్పు) లవణాది పదార్థముల వలన సర్వాంగాల యందు వేదన కలుగుతూ ఉంటుంది. మావి చే...

భార్యగర్భవతిగా ఉండిన వాస్తు కర్మలకు దోషకాలము

భార్యగర్భవతిగా ఉండిన వాస్తు కర్మలకు దోషకాలము శ్లోకము:- కర్తృర్భార్యా గర్భిణీ చే ద్వాస్తు కర్మోప నాయకమ్! షాణ్మాసాత్పరతస్సోపి,నకుర్యాదితి శౌనక:!! గర్భిణీయది పత్నీచ్చేన్న కుర్యాద్గృహ కర్మణీ! యది కుర్యాద్గర్భహాని:!గృహహాని ర్నశం శయ:! పంచ మాస మితం కార్యం అత: ఊర్ద్వం నకారయేత్!! తాత్పర్యం:- భార్య గర్భవతిగా ఉన్నప్పుడు అయిదవ మాసం పూర్తి అగువరకు గృహారంభ జరుపుటకు దోషము లేదు ఆరవ మాసం వచ్చిన తదుపరి గృహారంభ వాస్తు కర్మలు ప్రారంభించిన వాని భార్యకు గర్భ హాని కలుగును ఆరు మాసాల లోపు ఈ దోషము ఉండదు. శ్లోకము:- మాసేతు నవమేప్రాప్తే పూర్వపక్షే శుభేదినే! ప్రసూతి సంభవేకాలే గృహారంభణమిష్యతే!!(విశ్వకర్మప్రకాశిక) తాత్పర్యం:- స్త్రీ గర్భవతి అయ్యి ప్రసవ కాలము సమీపించినప్పుడు అనగా తొమ్మిదవ మాసం లో పూర్వార్ధ భాగమునందు శుభ దినమున ప్రసూతి నిమిత్తము గృహము(సూతికా గృహము) నిర్మించివచ్చునని విశేష వచనము గా విశ్వకర్మ ప్రకాశిక యందు తెలుపబడినది!!

అగస్త్య కృత లక్ష్మీ స్తోత్రం

💐💐💐అగస్త్య కృత లక్ష్మీ స్తోత్రం💐💐💐 అప్పుల బాధలు తీర్చే అగస్త్య కృత లక్ష్మీ స్తోత్రం 1::మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమల వాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ  లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే! 2::త్వం శ్రీ రుపేంద్ర సదనే మదనైకమాతః జ్యోత్స్నాసి చంద్రమసి చంద్ర మనోహరాస్యే సూర్యే ప్రభాసి చ జగత్త్రితయే ప్రభాసి  లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే! 3::త్వం జాతవేదసి సదా దహనాత్మ శక్తిః వేధా స్త్వయా జగదిదం వివిధం విదధ్యాత్ విశ్వంభరోపి భిభ్రుభయాదఖిలం భవత్యా లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే! 4::త్వత్త్యక్తమేతదమలే హరతే హరోపి త్వంపాసి హంసి విదధాసి పరావరాసి ఈడ్యో బభూవ హరిరప్యమలే త్వదాప్త్యా లక్ష్మీ ప్రసీద సతతం నమతా శరణ్యే!! 5::శూరః శ ఏవ శ గుణీ శ బుధః శ ధన్యో మాన్యః శ ఏవ కులశీల కళాకలాపైః ఏకః శుచిః స హి పుమాన్ సకలేపి లోకే యత్రాపతేత్తవ శుభే కరుణా కటాక్షః! 6::యస్మిన్ వసేః క్షణమహో పురుషే గజేశ్వే స్త్రైణే తృణే సరసి దేవకులే గృహేన్నే రత్నే పతత్త్రిణి పశౌ శయనే ధరాయాం శ శ్రీకమేవ సకలే తదిహాస్తి నాన్యత్! 7::త్వ త్స్ప్రుష్టమేవ శకలం శుచితాం లభేత త్వత్త్యక్త మేవ శకలం త్వశుచీహ లక్ష్మి ...

వ్యాసుడు ఇచ్చిన వరం

మహాభారతంలో చాలామందికి తెలియని ఒక విచిత్రఘట్టం ఉంది. అది వ్యాసప్రసాదితమై ఈ విధంగా ఉంది. కురుక్షేత్రంలో జరిగిన భీకరసంగ్రామంలో 18 అక్షౌహిణుల సైన్యం 18 రోజుల్లో నాశనం అయింది. కలుగులోని ఎలుకలా దాక్కున్న దుర్యోధనుడిని బయటకు లాగి చంపేశారు. అనంతరం మృతులకు పూర్వక్రియలు, ఔర్థ్వక్రియలు చేయడానికి అంతా గంగా నది చెంతకు చేరుకున్నారు. ఆ సమయంలో అంతఃపుర కాంతలు అందరితో ధృతరాష్ట్రుడు కూడా వచ్చాడు. వచ్చిన వారి ఏడుపులతో ఆ ప్రాంతం హృదయవిదారకంగా తయారైంది. అప్పుడు అది చూసిన వ్యాసుడు వారికి ఒక వరం ఇచ్చాడు. చనిపోయిన వారిలో ఎవరిని చూడాలనుకుంటే వారిని చూసే వరం అక్కడకు వచ్చిన వారికి ఇచ్చాడు. దాంతో అంతా తాము చూడాలనుకుంటున్న వారిని స్మరించారు. వారు కోరుకున్న వారంతా అక్కడకు ప్రత్యక్షం అయ్యారు. సంతోషంగా తమ ఇష్టులతో వారు గడిపిన కాసేపు అయిన తరువాత చనిపోయిన వారు వెళిపోయే సమయం వచ్చింది. అప్పుడు వ్యాసుడు ''చనిపోయిన వారితో ఎవరైనా వెళ్ళదిలస్తే వారు కూడా వెళ్ళవచ్చు'' అని మరో వరం ఇచ్చాడు. కొంతమంది తమ ప్రియాతి ప్రియమైన వారి ప్రేతాత్మతో కలసి వెళిపోయారు. ఇది చాలా అరుదైన వరం. చనిపోయిన వారిని చూడవచ్చా? అంటే చర్మచక్షు...

దరిద్ర యోగం అంటే...

జ్యోతిష్యంలో దరిద్ర యోగం అంటే ఏమిటి?*మ 2వ మరియు 11వ గృహాలకు లేదా రెండింటికి అధిపతులు బలహీనతలో లేదా 6వ, 8వ లేదా 12వ గృహాలలో ఉన్నప్పుడు దరిద్ర యోగం ఏర్పడుతుంది.  2వ ఇల్లు వ్యక్తిగత ఆదాయం, సంపద, ఆస్తులు మరియు ద్రవ్య అవకాశాలతో ముడిపడి ఉంది. 11వ ఇల్లు ఆదాయం, శ్రేయస్సు, లాభాలు, లాభం, స్నేహితులు, అన్నయ్య లేదా సోదరి, ఆశలు మరియు ఆకాంక్షలు మరియు వాటి నెరవేర్పుతో వ్యవహరిస్తుంది.  అయితే జ్యోతిషశాస్త్రంలో 6వ, 8వ లేదా 12వ ఇంటిని త్రిక స్థానాలుగా పరిగణిస్తారు. ఈ ఇళ్లలో గ్రహాల స్థానం చెడు లేదా బలహీనంగా పరిగణించబడుతుంది. అందువల్ల 2వ మరియు 11వ గృహాల అధిపతి ఈ గృహాలలో ఉంచబడినప్పుడు స్థానికులకు ఆర్థిక సంబంధిత విషయాలలో మంచి ఫలితాలను ఇవ్వలేరు. దరిద్ర అంటే పేదవాడు లేదా బిచ్చగాడు కాబట్టి ఇది దురదృష్టకరమైన లేదా అశుభ యోగంగా చెప్పబడింది. అయితే ఇందులో ఒక విషయం తెలుసుకోవాలి. రెండవ ఇంటి అధిపతి రాశిలో 6 వ స్ధానం లో ఉన్నను నవాంశ లో ఉచ్చ నొందిన చో జాతకునికి దరిద్రం యోగం వర్తించదు.... దీనికి ఉదాహరణ జాతకం పెడుతున్నాను.అందరూ పరిశీలన చేయగలరు...

దరిద్ర యోగా యొక్క ప్రభావాలు

కుండ్లిలో దరిద్ర యోగా యొక్క ప్రభావాలు యోగా వల్ల స్థానికులకు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, సంపద నష్టం, ఉద్యోగం, ప్రతిష్ట, కష్టాలు ఉంటాయి. ఎందుకంటే 2వ ఇల్లు ఆదాయం, సంపద మరియు ఆస్తులను సూచిస్తుంది. మరియు 11వ ఇల్లు అన్ని రకాల లాభాలు మరియు లాభాలను సూచిస్తుంది. ఈ గృహాల అధిపతులు బలహీనతలో లేదా 6, 8 లేదా 12 వ ఇంట్లో ఉన్నప్పుడు దరిద్ర యోగం ఏర్పడటానికి దారితీస్తుంది. మీ జన్మ చార్ట్‌లో గ్రహాల స్థానం దద్రిద్ర యోగాన్ని లేదా ఇతర శుభ లేదా అశుభ యోగాలను ఏర్పరుస్తుందో తెలుసుకోవడానికి మీ వ్యక్తిగతీకరించిన జనంపత్రిని చూడండి. అలాగే, స్థానికులు కూడబెట్టిన డబ్బును పొందడంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. స్థానికుడు బిచ్చగాడు అవుతాడనే సూచనను యోగా ఇవ్వదు. ఇది కేవలం స్థానికులు డబ్బును కూడబెట్టుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారని సూచిస్తుంది. డబ్బు సంపాదించడం మరియు పొదుపు చేయడం విషయానికి వస్తే వారు సవాలు పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు. స్థానికులు వ్యాపారంలో భారీ నష్టాలు లేదా జీవితంలో కొన్ని పెద్ద ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటారు. వారు డబ్బుకు సంబంధించి న్యాయపరమైన వివాదాలను ఎదుర్కోవచ్చు. డబ్బు కోసం ఎవరైనా మోస...

Parijat yoga

What is Parijat yoga in astrology? Understanding Parijata Yoga in Vedic Astrology When the disposition of the lord of the ascendant and dispositor of the Navamsa lord both are in exaltation either in quadrants or in trines then Parijata yoga sets to get formed. Disposition means house lord of that planet house which is house lord of the other. If suppose Sun is the dispositor planet of Jupiter and Moon is the Navamsa dispositor planet of Mars and Sun is placed in Aries in 1st house and Moon is placed in 4th house in exalted state then:- - One will have a positive outlook for life and will work with dedication and energy. - One will be mentally stronger. - One will be luckier. - One relation with mother will be good and will get good support from mother - One will acquire a house. In this way placement of planets in different houses tends to give different kinds of results. Strength of Parijata yoga Strength of this yoga lies in the fact that if these planets receive malefic aspects the...

శ్రీ ముత్తుస్వామి దీక్షితులు

నేడు శ్రీ ముత్తుస్వామి దీక్షితులు వారి పుట్టిన రోజు (ఆంగ్లం).  సంగీతరంగంలో భారతదేశంలో ఉపాసకులు, యోగులు, ఆధ్యాత్మిక తత్త్వవేత్తలు ఉంటూ సువర్ణమయం చేశారు. కేవలం ఒక వినోదవిద్యగానో, లేదా ఒక కళారూపంగానో మాత్రమే కాకుండా ఒక యోగరూపంగా సంగీతం భారతీయ సనాతనధర్మంలో తీర్చిదిద్దబడినది.  ఒక త్యాగరాజస్వామి వారిని తలంచుకున్నా అదేవిధంగా శ్యామశాస్త్రిగారు ఇలాంటి వారిని మనం స్మరించితే వారు కేవలం చక్కటి సంగీతకారులు మాత్రమే కాకుండా గొప్ప యోగులు, సంగీతాన్ని యోగంగా మార్చుకొని పరమాత్మని అనుభవానికి తెచ్చుకొని ముక్తిపొందిన వారు అని తెలుస్తోంది. త్యాగరాజస్వామి వారు, శామశాస్త్రిగారితో పాటు సమాకాలికులైనటువంటి శ్రీ ముత్తుస్వామి దీక్షితులు కూడా అటువంటి కోవకే చెందినటువంటి వారు. ఇందులో ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి గారు – వీరిద్దరి ప్రత్యేకత ఏమిటంటే వీరు అమ్మవారి ఉపాసకులు. శ్రీవిద్యా ఉపాసకులు. త్యాగరాజ స్వామి వారు రామతారక మంత్ర సిద్ధులు. ఆ రహస్యాలన్నీ తన కీర్తనలలో తెలియజేశారాయన. తేటతెలుగులో అద్భుతంగా రచించారు. శ్యామశాస్త్రి గారు కూడా తెలుగులోనే కృతులు రచించారు.  అయితే ముత్తుస్వామి దీక్షితుల యొక్క ...

వెన్నెల పారాయణ

వెన్నెల పారాయణ ..ఈరోజు రాత్రి పౌర్ణమి ఘడియలు ఉన్న సందర్భంగా రాత్రి వెన్నెల పారాయణ చేస్తే అమ్మవారి విశేష అనుగ్రహం కలుగుతుంది. అతి శీఘ్రముగా అభీష్టాలు నెరవేర్చు సాధన.   మీరు శ్రమ అనుకోకుండా ఓపిక ఉంటే కాచిన పాలల్లో ఏలకులు, పటికబెల్లం కలిపి వెన్నలలో కూర్చుని చంద్రుణ్ణి చూస్తూ 9 సార్లు లలితా సహస్రనామ పారాయణం చేయండి. ఎంతటి ఘోరమైన సమస్య అయినా శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి చల్లని వెన్నెల చూపుల వలన అత్యంత శీఘ్రముగా తిరిపోతుంది, ఇది సత్యము నమ్మండి. 9 సార్లు అనే సరికి అమ్మో ఇన్ని సార్లా అని ఆనుకుంటారేమో, కానీ పౌర్ణమి చాలా చాలా విశేషం, ఇలా భక్తిశ్రద్ధలతో, పరిపూర్ణ విశ్వాసంతో చేసిన ఎందరో భక్తులకు కోరిన కోరికలు తీరిన అనుభవాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. మీకు ఎటువంటి సమస్య అయినా పరిస్కారం తప్పకుండా లభిస్తుంది. ప్రతి సత్సంకల్పం సిద్ధిస్తుంది. ఇలా ఎవరైనా వారి తీవ్రమైన సమస్య కోసం, లేదా అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కోసం చేయవచ్చు తర్వాత ఆ పాలు ఇంట్లో వారు తాగాలి.   లలితా సహస్త్రనామం పూర్తిగా ఒక్కసారి చదివితే చదివిన వారి దేహం చుట్టూ శ్రీ చక్ర ఆకారం ఏర్పడుతుంది, అలా 9 సార్లు పూర్తి అయిన సమయం వరకు...

అమల కీర్తి యోగం

అమల కీర్తి యోగం. చంద్రుడికి 10వ కేంద్రంలో లగ్నాధిపతి ఉన్నట్లయితే దానిని చంద్రకళా యోగంగా చెప్పొచ్చు అమల కీర్తి యోగం గాను చెప్పవచ్చు. అమలు కీర్తి యోగం అనేటువంటిది ఇటువంటి ఫలితాలు ఇస్తుంది. అలాగే దుస్థానంలో ఉన్నప్పుడు శకట యోగము వీటిని కూడా గమనించినట్లయితే మరి కొన్ని విశేషాలు అర్థమవుతాయి. ఇదే కోవలో పర్వత యోగము. చంద్ర బలాన్ని అనుసరించి చెప్పేటువంటి యోగం  బృహత్ పరాశర హోరా శాస్త్రంలో చంద్ర బలమును అనుసరించి మాత్రమే యోగం యొక్క ఫలితాన్ని చెప్పాలి యోగాన్ని మొదటిగా చూసినట్లయితే చంద్ర యోగాన్ని చూడాలి అనే పరాశరుడు ఒక నియమాన్ని చెప్పి ఉంచారు. దాని ప్రకారం చంద్రశీల అధ్యాయము ఎంతో ప్రశస్తి చెందినది. అలాగే జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు దేశ కాల ప్రాంత్రమును అనుసరించి చెప్పాలి అని చెబుతారు. రెండు రకాలుగా చెప్పబడుతుంది. ఒకటి ప్రాంతము మరి ఒక్కటి శారీరక ధర్మము (అంగసాముద్రికమును అనుసరించి అని చెప్పబడి ఉన్నది.) ఈ విషయాన్ని సాధికారికంగా అంగసాముద్రిక అధ్యాయాన్ని పరారుడు చెప్పడం జరిగింది.

గర్భములో శిశువు

హరిఓం , - - *గర్భములో శిశువు పిండ రూపంలో భగవంతుని ప్రార్థిస్తాడా? ఎలా?:* స్త్రీ గర్భములోనే శేషన దు:ఖముతో జీవుడు ప్రవేశిస్తాడు. ఫలదీకరణము జరిగిన తరువాత శిశువు పరిణామక్రమము. ఒక రోజుకు ఖలిలమౌతాడు. ఐదు రోజులకు బుద్భుదాకారము పొందుతుంది. పది రోజులకు బదరీఫలములాగా కఠినమైన మాంసపు ముద్దగా తయారవుతాడు. ఒక నెలకు శిరస్సు ఏర్పడుతుంది. రెండు నెలలకు బాహువులు తదితర అవయవాలు ఏర్పడుతాయి. మూడు నెలలకు గోళ్లు, రోమాలు, చర్మము, లింగము, నవరంధ్రములు ఏర్పడుతాయి. నాలుగు నెలలకు సప్త ధాతువులు ఉద్భవిస్తాయి. ఐదు నెలలకు ఆకలి దప్పికలు ఏర్పడుతాయి. ఆరు నెలలకు జరాయువు, మావిచేకప్పబడి గర్భంలో దక్షిణాన తిరుగుతుంటాడు. మాతృ భుక్తాన్న పానీయాలచే క్రమక్రమంగా వృద్ది చెందుతూ దుర్గంధ భూయిష్టమైన మల మూత్రాల గుంటలో ఉన్న పురుగులు, సుకుమారమైన శరీరాన్ని కరుస్తూ ఉండగా, ఆ బాధకు తట్టుకోలేక మాటిమాటికి మూర్చబోతాడు. నరకయాతన, నరకాను భవము జీవుడు మాతృ గర్భంలోనే అనుభవించడం ప్రారంభమవుతుంది. తల్లి తీసుకునే ఆహారములోని, దుస్సాహాలైన కట్వాములు (ఉప్పు) లవణాది పదా...

Jupiter in Taurus:

Jupiter in Taurus: A Comprehensive Understanding from Vedic Astrology Introduction In the celestial theater of Vedic Astrology, each planet and sign plays a unique role, contributing their distinctive energies and influences. Among them, Jupiter, the planet of wisdom and expansion, when in Taurus, the sign of Earthly pleasures and stability, creates a unique blend of influences. Jupiter: The Planet of Wisdom and Expansion In Vedic Astrology, Jupiter, also known as Guru or Brihaspati, is considered the teacher of the Gods. It represents wisdom, spirituality, optimism, and the pursuit of knowledge. Jupiter's transit in different zodiac signs influences the expansion and growth of the areas ruled by those signs. Taurus: The Sign of Earthly Pleasures and Stability Taurus, ruled by Venus, is a fixed earth sign symbolizing practicality, materialistic comfort, pleasure, and stability. When a planet transits through Taurus, it is influenced by these qualities, leading to a more grounded an...

🕉️శ్రీ మహాలక్ష్మీష్టకం :

🕉️శ్రీ మహాలక్ష్మీష్టకం : ఇంద్ర ఉవాచ – నమస్తే‌உస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే | శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమో‌உస్తు తే || 1 || నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి | సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || 2 || సర్వఙ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి | సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || 3 || సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని | మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || 4 || ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి | యోగఙ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమో‌உస్తు తే || 5 || స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే | మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || 6 || పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి | పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమో‌உస్తు తే || 7 || శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే | జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమో‌உస్తు తే || 8 || మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః | సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా || ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ | ద్వికాల్ం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః || త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ | మహాలక్ష్మీ ర్...

Venus in different house

Venus in house In First House : You are likely physically attractive , magnetic and attract others easily  In 2nd House : You want a partner who makes you safe and secure  In 3rd House : You need a partner who can mentally simulate you In 4th House: You show your love and affection through nurturing others  In 5th House : You are in love with love and may always have a new crush  In 6th House : You show your love in a helpful and practical way. In 7th House: You likely live and breathe for your partner and give your all when in love  In 8th House: You don't like casual relationships and seek A Intense and meaningful connection  in 9th House : You need a certain amount of freedom & independence in your relationship. In 10th House : You likely want the authority in your relationship    In 11th House : you like to build friendship before pursuing a relationship In 12th House : You likely idealize your partner and put them on a pedestal. Where i...

బృహస్పతి చంద్ర సంయోగం...

బృహస్పతి చంద్ర సంయోగం...  "గజ్ కేసరి యోగం" అనేది బృహస్పతి మరియు చంద్రులు ఒకే ఇంటిలో లేదా చంద్రుని నుండి బృహస్పతి కేంద్రంలో ఉన్నప్పుడు ఏర్పడిన శుభ మరియు శక్తివంతమైన కలయిక. ఈ యోగంతో జన్మించిన వ్యక్తులు తెలివైనవారు, ఆధ్యాత్మికం, ఆర్థికంగా దృఢంగా ఉంటారు మరియు తమకు మరియు వారి తండ్రికి అదృష్టo తెస్తుంది. ఈ కలయిక ఆర్థిక లాభాలు, కెరీర్‌లో విజయం, ఆధ్యాత్మిక వృద్ధి, అంతర్ దృష్టి మరియు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువును తెస్తుందని నమ్ముతారు. గజ్ కేసరి రాజయోగ సమృద్ధి, విజయం మరియు సానుకూల ఆలోచనను ప్రోత్సహిస్తుంది.  ఇది వేద జ్యోతిషశాస్త్రంలో శుభప్రదమైన మరియు శక్తివంతమైన సంయోగం. ప్రతికూల లక్షణాల కంటే మంచిని ఎంచుకోవడం ద్వారా సానుకూల భావోద్వేగాలతో ప్రతి ఒక్కరినీ చూసుకునే సామర్థ్యాన్ని ఆశీర్వదిస్తుంది. చంద్రుడు మరియు బృహస్పతి బలంగా మరియు శుభ రాశులలో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ ఫలితాలు కనిపిస్తయి . ప్రతికూల ( పాప ) గ్రహ ప్రభావం శుభప్రదమైన ఫలితాలు, ప్రభావాలను తగ్గిస్తుంది. బలహీనమైన బృహస్పతితో కలిసి చంద్రుని యొక్క బలహీనమైన లేదా హానికరమైన స్థానం. పాప గ్రహాలతో కలసిన చంద్రుడు అస్థిరమైన భావోద్వే...

biological phenomenon

*What is the biological phenomenon that appears in humans' gradual loss of muscle mass, strength, and function when they are growing older*? This is known as ‘Sarcopenia’ which is a gradual loss of muscle mass, strength, and function... the loss of skeletal muscle mass and strength as a result of aging... The situation may be terrible, depending on the individual. Let's analyze to prevent “sarcopenia” thus: 1. Develop the habit, if you're able to stand... just don't sit, and don't lie down if you can sit! 2. Whenever an elderly person falls ill and gets admitted to the hospital, do not ask him/her for more rest, or to lie down, relax, and/or not get out of bed... It's not helpful. Help them take a walk... Except if they lost the stamina to do so. Lying down for a week causes a loss of at least 5% of muscle mass! And unfortunately, the elderly can't recover the lost muscles!   Usually, most elderly people hire assistants, lose muscle faster than the active on...

If signs afflicted - Results

If most or all of your watery signs are afflicted then the suffering will be emotional and psychological. If most or all of your earthy signs are afflicted then the suffering will be financial and mind will be selfish.  If most or all of your airy signs are afflicted then suffering will be in overall progress of life and narrow mindedness.  If most or all of your fiery signs are afflicted then you will struggle to reach in power and suffering will be physical.

గృహప్రవేశమునకు

*గృహప్రవేశమునకు సాముదాయకముగా శుభాశుభములు* శుభ తిథులు : శుక్ల పక్షమున తదియ,పంచమి,సప్తమి,దశమి,ఏకాదశి,త్రయెాదశి,పూర్ణిమ తిథులును,బహుళపక్షమున పాడ్యమి,విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి,తిథులు. *శుభ వారములు*: సోమ,బుధ,గురు,శుక్రవారములు. *శుభ నక్షత్రములు*:రోహిణి,మృగశిర,ఉత్తర,ఉత్తరాషాఢ,చిత్త,అనూరాధ,ధనిష్ఠ,శతభిషం,రేవతి. *శుభ లగ్నములు*:వృషభ,మిథున,సింహ,కన్య,వృశ్చిక,ధనస్సు,కుంభం,మీనం. *విశేషములు* అష్టమశుద్ది,చతుర్దశుద్ది,కలిశ చక్రశుద్ది కలిగియుండ వలయును.వృషభచక్ర శుద్ది కూడా చూచుట మంచిది.  *నూతన గృహరంభ గృహప్రవేశ విషయమై వృషభచక్రశుద్ధి* రవి యున్న నక్షత్రాదిగా ఫలితములు చూచుకోవాలి.రవి అనూరాధ నక్షత్రములో యున్న అనూరాధ మెుదలు 3 నక్షత్రములు అంటే 1.అనూరాధ 2.జ్యేష్ఠ,3.మూల నక్షత్రములలో ఒకటి అయిన దుర్దశగను,తరువాత 4 పూర్వాషాఢ,5.ఉత్తరాషాఢ,6.శ్రవణ,7.ధనిష్ఠ నక్షత్రములైన దురవస్తగా స్వీకరించాలి.కానీ పాఠకులు ఈ శ్రమకు వెనుతగ్గి గృహస్థులకు తగిన న్యాయము జరుపుట లేనందున పాఠకులకు ఇసుమంత శ్రమలేకుండా రవియున్న నక్షత్రమున కెదురు వృషభచక్రశుద్ధి కలిగిన నక్షత్రముల పట్టిక తెలుపుచున్నాను.ముఖ్యము గృహారంభమునకు వృహభచక్రశుద్దిని,గృహప్ర...

Jupiter (Beliefs )Vs. Mars (Action )

Jupiter (Beliefs )Vs. Mars (Action ) Your beliefs, opinions, and ethics don't matter to anyone. Nobody cares about your morality or philosophy. What matters to others is what you can do for them, what you can offer. In essence, "I can get this done" adds more value to this world than "I am a nice person", that is why Mars gets exalted in the sign of capricorn.

ఉమామహేశ్వర స్తోత్రమ్

ఉమామహేశ్వర స్తోత్రమ్ నమశ్శివాభ్యాం నమయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్థరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమోనమశ్శంకర పార్వతీభ్యామ్ ! 1 నమశ్శివాభ్యాం సరసోత్సవాభ్యాం నమస్కృతాభీష్ట వగప్రదాభ్యామ్ నారాయణే నార్చిత పాదుకాభ్యాం నమోనమశ్శంకర పార్వతీభ్యామ్ ! 2 నమశ్శివాభ్యాం వృష వాహనాభ్యాం విరించి విష్ణ్పిం ద్ర సుపూజితాభ్యామ్ విభూతిపాటీర విలేపనాభ్యాం నమోనమశ్శంకర పార్వతీభ్యామ్ ! 3 నమశ్శివాభ్యాం జగదీశ్వరాభ్యాం జగత్పతిభ్యాం జయనిగ్రహాభ్యామ్ జంభారిముఖ్త్యై రభివందితాభ్యాం నమోనమశ్శంకర పార్వతీభ్యామ్ ! 4 నమశ్శివాభ్యాం పరమౌషధాభ్యాం పంచాక్షరీ పంజర రంజితాభ్యామ్ ప్రపంచ సృష్టి స్థితి సంహ్రుతాభ్యాం నమోనమశ్శంకర పార్వతీభ్యామ్ ! 5 నమశ్శివాభ్యా మతిసుందరాభ్యాం అత్యంత మాసక్తహృదయంబుజాభ్యామ్ అశేష లోకైక హితంకరాభ్యాం నమోనమశ్శంకర పార్వతీభ్యామ్ ! 6 నమశ్శివాభ్యాం కలినాశనాభ్యాం కంకాళా కళ్యాణ వపుర్థరాభ్యామ్ కైలాసశైల స్థిత దేవతాభ్యాం నమోనమశ్శంకర పార్వతీభ్యామ్ ! 7 నమశ్శివాభ్యా మశుభాపహాభ్యాం అశేషలోకైక విశేషతాభ్యామ్  అకుంఠితాభ్యాం స్మృతిసంభ్రుతాభ్యాం నమోనమశ్శంకర పార్వతీభ్యామ్ ! 8 నమశ్శివాభ్యాం రథవాహనాభ్యాం రవీందు వైశ్వానరలోచనభ...

వాగ్భూషణం

వాక్కు: వాగ్భూషణం.. భూషణం.. ***** ★★★మాట తెచ్చే సమస్యల మూట★★★ అకారణంగా ఒక్కొక్కసారి మిత్రులు కూడా శతృవులవుతారు....         అంతకుముందు వరకూ మనల్ని గౌరవిస్తూ వచ్చిన వ్యక్తులు ఒక్కసారిగా దూరంగా వెళ్ళిపోతారు... సహోద్యోగులు, బంధువులు కూడా దూరదూరంగా తప్పించుకుని తిరగాలనుకుంటారు...! "          ఎందుకిలా జరుగుతోందీ అని ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు అనేక సందర్భాలలో సులభంగా అర్థమవుతుంది. మన వాగ్ధోరణే మన మానవ సంబంధాల్ని దెబ్బతీస్తోందని.          మాట్లాడడం అనేది జీవనకళలో ప్రధానమైనది. భావవ్యక్తీకరణ సాధనం వాక్కు - అన్నది నిజమే అయినా, సందర్భానుగుణంగా దానిని వినియోగించడంలోనే జీవితంలోని మానవ సంబంధాలు, కార్యసాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉన్నాయి.           "వాగ్ఘి సర్వస్య కారణమ్" అంటోంది శాస్త్రం,            ఒకేభావాన్ని రకరకాల మాటలతో చెప్పవచ్చు. కుండబద్దలు కొట్టినట్టో, బుజ్జగింపు ధోరణిలోనో, నచ్చజెప్పే విధంగానో, కఠినంగానో, కోమలంగానో ఒకే భావాన్ని పలురీతులలో వ్యక్తపరచవచ్చు.      ...

SATURN+ MARS /

SATURN+ MARS / SATURN ASPECTING MARS(mostly when both saturn and mars are in kendra house ) these individuals are ambitious  and have a strong determination these people have a great tolerating capacity, but once it crosses the limit that's the end .  These people can do well in army ,  surgery  and  are great at risk taking  They are loyal , honest , childish natured as well as  mature and courageous when required.  they don't actually bother to loose their energy at places not required..

శని దేవుని భార్యలు

శని దేవుని భార్యలు :--  *శని దేవునికి వరుసగా, ద్వాజిని,  దామిని,  కంకాలి,  కలహప్రియ,  కంటకి,  తురంగి,  మహిషి మరియు  అజా అనే ఎనిమిది మంది భార్యలు ఉన్నారని చెప్పబడింది*.  శని దేవుని పూజించే ముందుగా అతని భార్యల పేర్లను కూడా శాంతింపచేయవలసి ఉంటుంది. శనివారం వారి పేర్లమీద పూజలు చేయడం అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని తెలుపబడింది.  శని దేవుని దృష్టి హానికరమైనదిగా భావించడానికి, అతని భార్య దామినీతో జరిగిన సంఘటనతో సంబంధం కలిగి ఉందని కథనం. శని దేవుడు, కృష్ణుడి భక్తుడు : సూర్య దేవుడు మరియు అతని భార్య ఛాయాదేవి దంపతుల కుమారుడు శని దేవుడు. చీకటి రంగుతో మరియు ఇనుముతో చేసిన రథాన్ని నడుపుతూ, రాబందు వాహనదారుడై ఉంటాడని చెప్పబడింది. తన చిన్ననాటి నుండి శని దేవుడు, శ్రీకృష్ణునికి ఉత్తమ భక్తుని వలె ఉన్నాడు. కృష్ణుని ఆశీస్సుల కొరకు, అధిక కాలం పాటు తపస్సును, ధ్యానాన్ని అనుసరించాడు కూడా. తనతో పాటు, కృష్ణుడిపై ఉన్న ప్రేమ కూడా అంచలంచెలుగా పెరిగింది. పెద్దవాడైన తరువాత, అతను *చిత్రరథుని కుమార్తె దామినిని వివాహం చేసుకున్నాడు*. ఆమె దైవిక శక్తులు ఉన్న స్త్రీగా చెప్పబడింది. అందం...

horoscopes successful people.

In the horoscopes of many successful people.... the *eighth lord has been related to the fifth house or ascendant.* People with such yoga definitely have *some art or the other which they receive as a gift from God.*  In the horoscope, the eighth house is called the house of death. Apart from being the house of death, this house is also called the house of *esoteric knowledge and sudden gain of wealth.* Apart from this, the eighth house determines *the age, cause of death, residence in an inaccessible place, crisis, loss of previously acquired wealth, receipt of property after the death of a person, property received from ancestors, mental anguish, mental distress, death. Difficulty in life, proficiency in secret knowledge and traditional knowledge, sudden gain of wealth, long journeys, job in a foreign country, acquisition of treasure, death due to falling in a well* etc. are also considered. The relationship of the triangle with the eighth house is good. When the *eighth house is...

ఫాల్గుణ మాస ప్రాశస్త్యం:

⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥సర్వదేవతావ్రత సమాహారం!.. #శఫాల్గుణం ఫాల్గుణ మాస ప్రాశస్త్యం: పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తర ఫల్గుణి నక్షత్రయుక్తుడై ఉదయించే మాసం ఫాల్గుణ మాసం. సంవత్సరంలో చివరి మాసం అయినప్పటికీ అధిక ప్రత్యేకతలు కలిగిన మాసం. సంవత్సరంలో మిగిలిన పదకొండు నెలలలో చేసిన పూజలు, పండుగలూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంక్షిప్తరూపం ఈ మాసం. ఫాల్గుణం ..విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం. ఈ మాసాధిపతి గోవిందుడు కావున, ఈ మాసంలో విశేషించి విష్ణుమూర్తి ఆరాధన చేయడం శ్రేయస్కరం. గోః – వేదాలు, గోవులు విందః – రక్షించేవాడు గోవిందుడు, అంటే ఈ సమస్త జీవకోటికీ పూజనీయమైన వేదాలను, గోవులను రక్షించేవాడు అంతేగాకుండా మనలని రక్షించి ఆత్మతత్త్వాన్ని తెలియచేసేవాడు. ఈ మాసంలో అచ్యుత, అనంత, గోవింద అనే నామస్మరణ ఎంతో శుభఫలితాన్ని ఇస్తుంది. వసంతఋతువు ఆగమనానికి ముందు వచ్చే ఈ మాసంలో ప్రతీ దినమూ ప్రత్యేకమే. ఈ మాసంలో ఆచరించే కొన్ని ప్రత్యేకమైన వ్రతాలు, పర్వదినాలూ, విశేషమైన రోజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 💥ఫాల్గుణ శుద్ధ పాడ్యమి.. మొదలు ఫాల్గుణ శుద్ధ ద్వాదశి వరకూ పయో వ్రతం ఆచరిస్తారు. భాగవతం అష్టమ స్కందం ప్రకారం, బలిచక్రవర్త...