Posts

Showing posts from March, 2025

వసంత నవరాత్రులు

వసంత నవరాత్రులలో అమ్మవారిని పూజించడం వల్ల ప్రయోజనం ఏంటి? వసంత నవరాత్రులు ఎందుకు అమ్మవారికి ఇష్టం అంటే దేవి భాగవతం లో " శ్రీ రామో లలితాంబికా , శ్రీ కృష్ణో శ్యామలంబ " అంటారు, అంటే శ్రీ రాముడు ఎవరో కాదు లలితా పరమేశ్వరే ,లలితా స్వరూపం రాముడు. శ్రీ రాముడికి పూజ చేసిన అమ్మవారికి పూజ చేసినట్టే. అందుకనే శ్రీ రామ నవరాత్రులలో కూడా అమ్మవారికి పూజ చేస్తారు.శ్రీ రామచంద్రుల వారు సీతా సమేతంగా వసంత నవరాత్రి పూజను ఆచరించేవారంట.సీతమ్మ తల్లి అమ్మవారి ఉపాసన చేసేవారు. బ్రహ్మాండాలను సృష్టించిన ఆ పరాశక్తికి ఎన్నో రూపాలు ఎన్నో పేర్లు ఎ పేరుతో పిలిచిన చటుక్కున పలుకుతుంది.భక్తితో అమ్మ అని పిలిస్తే తల్లిలా మన వెన్నంటే వుండి మనల్ని నడిపిస్తుంది. అమ్మ సర్వాంతర్యామి ఒకటి అని కాదు అమ్మవారు సకల వ్యాప్తం అయి ఉంది . *ద్వాఋతూ యమదంష్ట్రాఖ్యౌ నృణాం రోగకరావుభౌ|* *శరద్వసంత నామానౌ తస్మాత్‌ దేవీం ప్రపూజయేత్‌||* సంవత్సర చక్రంలో వసంత, శరదృతువులు రెండూ ప్రాణులకు రోగకారకమైనవి. కోరలతో భయంకరంగా ఉన్న తన నోరు తెరుచుకొని వికటాట్టాహాసం చేస్తూ , ప్రాణులను మృత్యుదేవత కబళించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా మృత్యుముఖంలో పడకుండా త...

జ్యోతిషశాస్త్రం గుణాత్మకమైన విషయం

జ్యోతిషశాస్త్రం గుణాత్మకమైన విషయం, కానీ పరిమాణాత్మకమైనది కాదు. ఎక్కువగా కళాత్మకమైనది కానీ ర్యాంకింగ్ మరియు అన్నింటికీ గణిత సహాయకుడు కూడా అవసరం.  సంపదను ఉత్పత్తి చేసే శక్తి ద్వారా ఇళ్ల ర్యాంకింగ్ ఈ క్రింది ర్యాంకింగ్ జనన చార్టులో ప్రతి ఇంటి సంపదను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది, స్కోర్‌లు 0 నుండి 10 వరకు ఉంటాయి. 1. *9వ ఇల్లు: అదృష్టం మరియు శ్రేయస్సు* (9.5/10) అదృష్టం, అదృష్టం, ఉన్నత విద్య మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలతో అనుబంధించబడిన 9వ ఇల్లు గణనీయమైన సంపదను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2. *11వ ఇల్లు: లాభాలు మరియు లాభాలు* (9.2/10) లాభాలు, లాభాలు, స్నేహాలు మరియు అసాధారణ ఆదాయ వనరులతో ముడిపడి ఉన్న 11వ ఇల్లు సంపద సృష్టికి గణనీయమైన అవకాశాలను అందిస్తుంది.  3. *5వ ఇల్లు: సృజనాత్మక లక్ష్యాలు మరియు పెట్టుబడులు* (8.8/10) సృజనాత్మక లక్ష్యాలు, పెట్టుబడులు, ఊహాజనిత వ్యాపారాలు మరియు వ్యవస్థాపక ప్రయత్నాలకు సంబంధించిన 5వ ఇల్లు సంపద ఉత్పత్తికి బలమైన పునాదిని అందిస్తుంది. 4. *2వ ఇల్లు: సంపద మరియు ఆర్థికాలు* (8.5/10) సంపద, ఆర్థిక, కుటుంబం మరియు సేకరించిన సంపదకు నిలయంగా, 2వ ...

Astrology is qualitative subject,

Astrology is qualitative subject, but not quantitative. Mostly art but also needed the mathematical assistant, for the reason of ranking and all.   Ranking of Houses by Wealth-Generating Power The following ranking assesses the wealth-generating potential of each house in a birth chart, with scores ranging from 0 to 10. 1. *9th House: Fortune and Prosperity* (9.5/10) Associated with fortune, luck, higher education, and spiritual pursuits, the 9th house holds significant wealth-generating potential. 2. *11th House: Gains and Profits* (9.2/10) Linked to gains, profits, friendships, and unconventional sources of income, the 11th house offers substantial opportunities for wealth creation. 3. *5th House: Creative Pursuits and Investments* (8.8/10) Connected to creative pursuits, investments, speculative ventures, and entrepreneurial endeavors, the 5th house provides a strong foundation for wealth generation. 4. *2nd House: Wealth and Finances* (8.5/10) As the house of wealth, finan...

వసంతకాలం

#వసంతకాలం వసంత సుఖం యథాతథా అస్నిన్నితి వసంతః వసంతంలో సర్వజనులు సుఖంగా ఉంటారు. పుష్పాణాం సమయః పుష్ప సమయః పుష్పాలు వికసించే కాలం వసంతం.    చిత్రామౌక్తి కమేకమ్‌ చిత్తా నక్షత్రం ముత్యపు కాంతిని పోలిన తెల్లని కాంతిలో మనసుసు చల్లబరుస్తుంది.  సరత్యా కరే ఇతి సూర్యః విశ్వాంతరాళంలో సంచరించే సూర్య కిరణాల చైతన్యం, షోడశకళా ప్రపూర్ణుడైన చంద్రుని వెన్నెల, అందుకే దీన్ని ‘‘మధు మాసం’’ అన్నారు. #చైత్ర_పౌర్ణమి  వసంత రుతువుతో ప్రారంభమైన ఈ మాసం ప్రకృతి శోభ పరిపూర్ణంగా ప్రకాశించేది ఈ చైత్ర పౌర్ణమి నాడే. అందుకే దీనిని ‘‘మహాచైత్రి’’ అన్నారు. ఈ సంవత్సరం తొలి పౌర్ణమి. ‘‘చైత్రః శ్రీమానయం మాసః’’ అని మహర్షి వాల్మీకి ఈ మాసాన్ని శ్రీమంతమైనదని వర్ణించారు. ‘‘కావ్యాభిఖ్యాతయో రాశీచ్ఛిత్రా చంద్రమసోరివా’’ అని మహాకవి కాళిదాసు తన ‘‘రఘువంశ’’ కావ్యంలో వర్ణించారు. ఇంద్రాది దేవతలు ఈశ్వర ప్రీతికై ‘దమన పూజను’ నిర్వహిస్తారు. శైవాగమంలోని శివునికి ఏకవీరాదేవి, భైరవ ఆరాధనలు చేస్తారు. ఈ దమన పూజ తర్వాత బహువర్ణ రంజితమైన చిత్రవస్త్రం దానం చేయడం వల్ల సర్వ సౌఖ్యాలు, సంపదలు కలుగుతాయని శాస్త్ర నిర్ణయం.

తెలుగు సంవత్సరాల పేర్లు..

*తెలుగు సంవత్సరాల పేర్లు... వాటి అర్థాలు* 1. ప్రభవ అంటే... ప్రభవించునది... అంటే... పుట్టుక. 2. విభవ - వైభవంగా ఉండేది. 3. శుక్ల... అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక. 4. ప్రమోదూత.... ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత. 5. ప్రజోత్పత్తి... ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి. 6. అంగీరస... అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం. 7. శ్రీముఖ... శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం. 8. భావ.... భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు. 9. యువ.... యువ అనేది బలానికి ప్రతీక. 10. ధాత... అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు. 11. ఈశ్వర... పరమేశ్వరుడు. 12. బహుధాన్య... సుభిక్షంగా ఉండటం. 13. ప్రమాది... ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు. 14. విక్రమ... విక్రమం కలిగిన వాడు. 15. వృష ... చర్మం. 16. చిత్రభాను... భానుడంటే ...

పుట్టినతిథిని బట్టి ఆయా తిథి దేవత ఆరాధన.

పుట్టినతిథిని బట్టి ఆయా తిథి దేవత ఆరాధన. చంద్రకళలను బట్టి నిత్య దేవతారాధన..............!! దక్ష ప్రజాపతి ఇరువై ఏడుగురు కుమార్తెలను పరిణయమాడిన చంద్రుడు రోహిణిపై ఎందుకో  మిక్కిలి ప్రేమ చూపెడివాడు,  ఈ విషయమై మందలించిన దక్షుని మాటను మన్నించని చంద్రుని దక్షుడు కోపగించి క్షయ వ్యాధితో బాధపడమని శపించగా, శాపవశాన చంద్రుడు క్షీణించసాగాడు. అమృత కిరణ స్పర్శలేక దేవతలకు అమృతం దొరకడం కష్టమైనది. ఓషదులన్ని క్షీణించినవి,  అంత ఇంద్రాది దేవతలు చంద్రుని తోడ్కొని బ్రహ్మదేవుని కడకేగి పరిష్కార మడిగారు.  అంత చతుర్ముఖుడు చంద్రునికి మృత్యుంజయ మహామంత్రాన్ని ఉపదేశించాడు.  ప్రభాస తీర్థమున పరమశివునికి దయగల్గి ప్రత్యక్షమవగా చంద్రుడు శాపవిముక్తికై ప్రార్థించెను.  అంత పరమేశ్వరుడు చంద్రుని అనుగ్రహించి.. కృష్ణపక్షాన కళలు క్షీణించి, శుక్లపక్షమున ప్రవర్ధమానమై పున్నమి నాటికి పూర్ణ కళతో భాసిల్లుమని వరమిచ్చాడు.  కళలు చంద్రునికి సూర్యునికి మధ్య దూరం మీద ఆధారపడి ఉంటుంది.  అత్యల్పదూరం అమావాస్య. అత్యధిక దూరం పౌర్ణమి.  చంద్రుడు భూమి చుట్టూ..భూమి సూర్యునిచుట్టూ పరిభ్రమిస్తూఉంటాయి.  16 ...

ఏలినాటి శని ప్రభావం తగ్గించుకోవటం ఎలా?

ఏలినాటి శని ప్రభావం తగ్గించుకోవటం ఎలా? మేష రాశి వారికి, అంటే అశ్వినీ, భరణి, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి మార్చి 29, 2025 నుంచి ప్రారంభం అయ్యే ఏలినాటి శని (ఏడున్నరేళ్ల శని) ప్రభావం ఎలా ఉంటుంది? ఆ ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలి? మేష రాశి జాతకులకు ఏలినాటి శని ప్రభావం మార్చి 29, 2025 నుంచి శని మీన రాశిలో సంచరిస్తాడు. ఈరోజు నుంచి మేష రాశిలో జన్మించిన వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది మరియు మకర రాశి వారికి పూర్తవుతుంది. మేష రాశి వారిపై ఏలినాటి శని ప్రభావం, ఎలా ఉంటుంది?. తన నీచ రాశి అయిన మేష రాశి వారిని శని ఇబ్బంది పెడతాడా? లేక అనుకూలిస్తాడా? మొదలైన ఎన్నో ప్రశ్నలకు ఈ వ్యాసం సమాధానం చెపుతుంది. చివరి వరకు పూర్తిగా చదవండి. అసలు ఏలినాటి శని అంటే ఏమిటి? గ్రహాలన్నింటిలోకి శని నెమ్మదిగా సంచరించే గ్రహం. శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తాడు. సహజంగా శని పాపగ్రహం అవటం మరియు ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహం అవటం వలన శనికి గోచారం విషయంలో మిగతా గ్రహాల గోచారం కన్నా ప్రాధాన్యత ఎక్కువ. శని మన రాశి నుంచి 12వ, ఒకటవ మరియు రెండవ ఇంటిలో సంచరించే ఏడున్నర సంవత్సరాల కాలాన్ని ఏలినాట...

హిందూ సాంప్రదాయంలో భోజన నియమాలు** 🌿

🌿 **హిందూ సాంప్రదాయంలో భోజన నియమాలు** 🌿 **🌟 భోజనం ముందు & తరువాత:** ✔️ చేతులు, కాళ్ళు కడుక్కోవాలి. ✔️ తడి కాళ్ళను తుడుచుకుని కూర్చోవాలి. **🌟 భోజనం చేసే దిశ:** ✔️ తూర్పు లేదా ఉత్తర దిశలో కూర్చొని భోజనం చేయడం శ్రేయస్సును ఇస్తుంది. **🌟 భోజన నియమాలు:** ✔️ ఆహారం తినే పళ్ళానికి తాకనీయకూడదు – ఎంగిలి అవుతుంది. ✔️ అన్నపు పాత్రలో నేతి గిన్నె పెట్టరాదు. ✔️ భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు. ✔️ ఎంగిలి చేతితో ఏ పదార్థాన్నీ తాకకూడదు. ✔️ ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకుంటే వెంటనే నీరు ముట్టుకోవాలి. ✔️ సొట్టలు ఉన్న, విరిగిన కంచాలు ఉపయోగించరాదు. ✔️ నిలబడి అన్నం తినకూడదు – ఇది దరిద్రతను తెస్తుందని భావిస్తారు. ✔️ భగవదార్పితం చేసి భోజనం చేయాలి. ✔️ వంట గురించి చెడు వ్యాఖ్యలు చేయరాదు. ✔️ భోజనం అయ్యాక క్షురకర్మ (వెంట్రుకలు కత్తిరించడం) చేయరాదు. **🌟 వడ్డన & ఆహార మర్యాదలు:** ✔️ పంక్తి భేదం చూపరాదు – అందరికీ సమానంగా వడ్డించాలి. ✔️ వడ్డించేటప్పుడు ఉప్పు అదనంగా వాడకూడదు. ✔️ గురువులకు లేదా మహాత్ములకు మిగిలిన అన్నం పెట్టకూడదు, వారికి ప్రత్యేకంగా వండాలి. ✔️ భోజనం అయ్యాక విస్తరిలో ఆవు నెయ్యి వేసుకుం...

MODIFYING INFLUENCES

MODIFYING INFLUENCES RULE 1 Planets perform well in their own house or a friend's house:   - Beneficial planets become more empowered   - Challenging planets become somewhat tempered RULE 2 Planets are constrained in enemy houses:   - Beneficial planets struggle to express positive qualities   - Challenging planets become more problematic RULE 3 Aspects have controlling effects:   - A beneficial planet's aspect on a challenging one creates reluctant benevolence   - A challenging planet's aspect on a beneficial one creates reluctant maleficence RULE 4 When planets form relationships (Sambandha) through:   - Exchange (parivartana)   - Mutual aspect   - Dispositor's aspect   - Conjunction   Their relative strength (Shadbala) determines which influence predominates RULE 5 House placement matters:   - Challenging planets in difficult houses (6, 8, 12) can be extremely problematic   - Their difficulty reduces in beneficial house...

Understanding Planetary Influences in Birth Chart A. Deciding Basic Planetary Nature from AscendantRULE 1:The Lagna lord and lords of the 5th and 9th houses (Kona or trinal houses) are always beneficialRULE 2Malefic planets (Koora Grahas) become beneficial when they rule the 4th, 7th, or 10th houses ( Kendra or quadrant houses).These include Saturn, Mars, Sun, Mercury (when with another malefic), and Moon when weak (within ±72° of Sun)In these cases, the 10th lord becomes most beneficial, followed by 7th lord, then 4th lord.RULE 3Benefic planets (Saumya Grahas) become challenging when ruling the 4th, 7th, or 10th houses.These include Jupiter, Venus, Mercury (when with another benefic), and Moon when strong (beyond ±72° from Sun).The 10th lord becomes most challenging, followed by 7th lord, then 4th lordSpecial note for Mercury and Jupiter ascendants: Since the ascendant lord also rules another angular house, aspects and conjunctions become crucial in assessment.RULE 4Lords of the 3rd, 6th, and 11th houses are challenging: - 3rd lord is least challenging - 11th lord is THE most challengingRULE 5The 8th lord is particularly challenging, except when it is the Sun, Moon, or ascendant lordThe malefic influence of the 8L decreases when it also owns a trine and is well-placedRULE 6The 2nd and 12th lords give results based on: - Their associations with other planets - Nature of other houses they own - Their placement

జ్ఞానప్రసూనాంబికా నవరత్న మాలికా స్తుతిః*

*శ్రీకాళహస్తి క్షేత్రస్థ జ్ఞానప్రసూనాంబికా నవరత్న మాలికా స్తుతిః* శ్రీ నరకంఠీరవ శాస్త్రి విరచితమ్ శ్రీనాకనాథముఖనానాసహస్రసురసేనాగ్రమౌలివలభీ- సూనావలీబహులలీనాలినీమధురగానాంచితాంఘ్రినలినా మానాతిలంఘిమహిమానాదిరానతజనానామనేకఫలదా జ్ఞానాoబికా భవతు దీనావనీ కుశలదానాయ మే భగవతీ  ll1ll రాకాశశాంకరుచిరాకారచారుపతదాకాశసింధులహరీ- నీకాశసూక్తిసరణీకారిణీ ప్రకృతిమూకాత్మనామపి నృణాం పాకాహితప్రముఖనాకాలయప్రకరశోకాపనోదనచణా శ్రీకాలహస్తినగరైకాయనావతు పినాకాయుధస్య దయితా ll2ll శ్రేణీభవద్దివిషదేణీదృగుల్లసితవేణీపినద్ధసుమనో- ద్రోణీమరందరసవేణీప్రసారభృశశోణీకృతాంఘ్రికమలా శ్రోణీనటత్సరకృపాణీమనోజ్ఞఘనవేణీ కృపార్ద్రహృదయా క్షోణీధరేంద్రతనయాణీయసీమపి చ వాణీం ప్రగల్భయతు మే ll3ll కేలీసమాకలితతాలీదలశ్రవణపాలీవిభూషణమణీ- పాలీ మదోద్ధతమరాలీగతిర్దింశతు నాలీకదీర్ఘనయనా . చూలీతలాభరణనాలీకవైరిశకలాలీభవత్సురవధూఃఽ కాలీ గిరం మృదు మృణాలీభుజా మమ మధూలీరసోర్మిమధురాం ll4ll హృద్యానవద్యతరగద్యానుబద్ధమృదుపద్యాభిరూపకవితాం దద్యాజ్జగన్మహితవిద్యాం త్రయీశిఖరవేద్యా హిమాద్రితనయా  ఆద్యా పరా మమ శరద్యామినీశభృదవిద్యావిలాసశమనీ విద్యాధరీ సమభివాద్యా జ్వలన్మణినిషద్యాయమా...

శివాష్టోత్తర శతనామములు*

*శివాష్టోత్తర శతనామములు* [ఫాల్గుణమాసం శివార్చనలో పఠించదగినవి..] *ఫాల్గుణమాసంలో శివార్చనకై శివ రహస్యాంతర్గత శివాష్టోత్తర శతనామములు* *నమః శివాయ శాంతాయ సహమానాయ శంభవే!* *స్తవమేతత్ ప్రయుఞ్జీత శర్వప్రీతికరం మమ!!* *భవాయ శివరూపాయ శతావర్తాయ వేధసే!* *దుందుభ్యాయ వరేణ్యాయ శరణ్యాయ పినాకినే!!* *యోగినే ధ్యానగమ్యాయ రమ్యాయ గురవే నమః!* *అవసాన్యాయ వన్యాయ ఆహనన్యాయ తే నమః!!* *కామనాశాయ వాసాయ హరణాయ విసారిణే!* *నమోస్తు తే మహేశాయ నమః శాంతతమాపతే!!* *ప్రధానపురుషేశాయ యోగాధిపతయే నమః!* *నమస్త్రికాగ్నికాలాయ త్ర్యంబకాయ పినాకినే!!* *నమః కాలాయ రుద్రాయ మహాసత్రాయ శూలినే!* *నమో ధూర్జటయే తుభ్యం జటిలాయ కృశాయ చ!!* *బ్రహ్మాధిపతయే తుభ్యం బ్రహ్మవిద్యాధిపాయ చ!* *విష్ణోశ్చ జనకాయాథ కామమాయాంతకాయ చ!!* *నమో వేదరహస్యాయ హర్షతర్షాయ తే నమః!* *వేదవేదాంత సారాయ సుపారాయ నమోనమః!!* *అతీతానాగతజ్ఞాయ వర్తమానాయ బృంహతే!* *మేరుకోదండహస్తాయ గంగామస్తాయ దారిణే!!* *నమో బుద్దాయ శుద్ధాయ మేధ్యాయ పరమాత్మనే!* *భూతనాథాయ భవ్యాయ హవ్యకవ్యభుజే నమః!!* *నమో దిగ్వాససే తుభ్యం దండినే ముండినే నమః!* *అనాదిమలహీనాయ జ్ఞానగమ్యాయ తే నమః!!* *ప్రధానపరమాణ్వాదిమూర్తయే అనంతశక్తయే!...

ఫాల్గుణం ప్రఖ్యాతం*

*ఫాల్గుణం ప్రఖ్యాతం*  సూర్యతేజస్సుతో ప్రభావితమైన ప్రకృతిలో కాలాలు. ఋతువులు, మాసాలు, తిథులు, అహోరాత్రములు మొదలగునవి ఏర్పడుతున్నాయి. ప్రకృతిలో ఆకురాలే కాలం. నిర్మలాకాశంలో చక్కటి శీతల పవనాలు, ఆహ్లాద వాతావరణం ఆరోగ్యపు సిరులు చిగురులు తొడిగే కాలం. వసంతం అంకురించే కాలము పచ్చదనము పరిమళించే కాలం ఆద్యంతమూ ఆనందభరితమైన, లౌకిక ఆధ్యాత్మిక సమ్మళితమైన అనుభూతులను పంచే కాలం అదే ఫాల్గుణ మాస శుభతరుణం షడృతువులలో అఖరిదైన శిశిర ఋతువులలో రెండవది, మాసాలలో చివరిది ఫాల్గుణం. ఈ మాసంలో రవి సాధారణంగా మీనరాశిలో ప్రవేశిస్తాడు. ఈ రాశిలో ఉన్న సూర్యరశ్ముల ఫలితంగా మానవుల మనస్సు సంకల్ప వికల్పాలపై పరిగెడుతుంది. కామోద్రేకం వలన మానసికానందం తగ్గి మానవుడు ఆవేశానికి లోనవుతాడు. ఆ సమయంలో మనో నిగ్రహం కావలి. దానిని అభ్యాస వైరాగ్యాలతో సాధించుటకు అనువైన మాసం ఫాల్గుణము. వినీలాకాశంలో శ్వేతవర్ణంతో దండాకారంగా ప్రకాశిస్తున్న రెండు నక్షత్రాలతో కూడిన మండలమే ఫల్గుణీ నక్షత్రం. అందు ప్రధమం పూర్వ పల్గుణీ (పుబ్బ) ద్వితీయం ఉత్తర ఫల్గుణీ (ఉత్తర) పాండవ మధ్యముడు అర్జునుడు ఈ నక్షత్రం నాడు జన్మించుట వలన ఫల్గుణుడయ్యాడు. పూర్ణిమ నాడు ఫల్గుణీ నక్షత్...

రాహు మరియు కేతు విషయమై వివరణ

రాహు మరియు కేతు విషయమై వివరణ • రాహువు శనిని వ్యతిరేకిస్తూ బహుళ కుజునిగా పనిచేస్తుంది. • కేతువు కుజునిని వ్యతిరేకిస్తూ బహుళ శనిగా పనిచేస్తుంది.  రాహు:  గత జన్మ ఆశయాలు – మనకు గతజన్మలో కలిగిన కోరికలు, తీరని ఆశలు రాహువుతో సంబంధం కలిగి ఉంటాయి. మనం ఎందుకు కృషి చేస్తామో రాహువు నిర్దేశిస్తుంది – ఇది మనలను ఏదో సాధించాలనే తాపత్రయంతో నడిపించే గ్రహం. భౌతిక వాదం (Materialism) – రాహువు సంపద, ప్రసిద్ధి, మాయాజాలం, వంచన వంటి భౌతిక వృత్తులను ప్రోత్సహిస్తుంది. శనితో విరుద్ధంగా పనిచేస్తుంది – శని నెమ్మదిగా, క్రమశిక్షణతో ఫలితాలను ఇస్తే, రాహువు అకస్మాత్తుగా, అనిరీక్షితంగా ఫలితాలను అందిస్తుంది. రాహు = బహుళ కుజుడు! – రాహువు శనికి భిన్నంగా వ్యవహరిస్తుంది, కానీ అది రెట్టింపు మంగళుడిగా (Multifold Mars) పనిచేస్తుంది. అంటే రాహువు దూకుడు, ఆతురత, ఆవేశాన్ని పెంచే శక్తిని కలిగి ఉంటుంది.  అస్థిరత మరియు లోతైన పరిశీలన – రాహువు అనేక రకాల అనిశ్చితిని కలిగించగలదు, కానీ ఇది లోతైన పరిశీలన చేసే గుణాన్ని కూడా అందిస్తుంది.  కేతు:   ఇప్పటికే అనుభవించిన విషయాలు – కేతువు గత జన్మలో మనం అనుభవించిన విషయాలను సూచ...