వివాహంలో "బ్రహ్మముడి" ని ఎందుకు వేస్తారు..?
వివాహంలో "బ్రహ్మముడి" ని ఎందుకు వేస్తారు..? మన శరీరంలో మూలాధార చక్రానికీ, స్వాధిష్టాన చక్రానికీ, మధ్యలో ‘బ్రహ్మ గ్రంధి’ ఉంటుంది. ఇది ప్రత్యుత్పత్తి కి సంబంధించిన రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. పురోహితుని రూపంలో ఉన్న సాక్షాత్తూ బ్రహ్మ దేవుడు వేసే ముడులే, బ్రహ్మ ముడులనీ, బ్రహ్మ గ్రంధులను కలపడానికి వేసే ముడులు కాబట్టి బ్రహ్మ ముడులు అని పెద్దలు చెబుతారు. వధూవరులు ఇద్దరినీ రెండు దేహాలూ, ఒకటే ఆత్మ, ఒకటే ప్రాణంగా చేసే ప్రక్రియే, బ్రహ్మ ముడి! కంద పిలక, తమలపాకు, వక్క, పసుపు కొమ్ము, ఖర్జూరపుకాయ, చిల్లరనాణెం కలిపి , వధూవరుల కొంగుకు కట్టి, ఇద్దరి కొంగులను కలిపి ముడి వేస్తారు. కంద ఒకచోట పాతితే దిన దినమూ వృద్ధి చెందుతూ, ఎకరం ఎకరముల వరకూ వ్యాపిస్తూ పోతుంది. కందలాగా అనుదినమూ వారి బంధము వృద్ధి చెందుతూ, వంశవృద్ధిని చెయ్యాలని కందను కడతారు. క్షయం లేనిది ఖర్జూరపుకాయ. దంపతుల బంధమూ, వంశమూ, క్షయం లేకుండా ఉండాలని ఖర్జూరపుకాయను కడతారు. అందాన్ని, ఆరోగ్యాన్ని, పవిత్రతనూ, పెంపొందించే ఔషధం పసుపు. ఆయురారోగ్యములతో, పవిత్రంగా ఉండాలని పసుపుకొమ్ములను కడతారు. ఇకపోతే, ఆకు-వక్క అనేది విడివిడిగా ఉన్నా, కలిస్తే ఎర...