మణి ద్వీప వర్ణన - 15*_
_*మణి ద్వీప వర్ణన - 15*_ 🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸 *ఓం శ్రీ గణేశాయ నమః ,* *ఓం శ్రీ గురుభ్యో నమః* *ఓం శ్రీ పరామ్బికాయై నమః* అపారమైన పరమ జ్యోతి అమ్మ భువనేశ్వరీ తమ మధుర మైన వాక్కు తో పలుకాగానే , వీణా నాదాన్ని సహితము వెల-వెల పోయింది . ఆమె పలుకులు వీణా నాదము కన్న మిన్నగా ఉన్నయ్యి . ఆమెకు ఎందఱో సఖులు, దాసీలు. దేవతాస్త్రీలు. అఖిల దేవతల బృందము ఆమెను చుట్టు ముట్టి ఉన్నారు, అందరు ఆమె ఆజ్ఙ కొరకు వేచి ఉన్నారు. ఆ తల్లి ఇచ్చా శక్తి , జ్ఞాన శక్తి , క్రియా శక్తి చే సంపన్నురాలు. లజ్జ, తుష్టి, పుష్టి , కీర్తి , కాంతి, కీర్తి , క్షమా దయా, బుద్ధి మేధా,, ఇవన్ని మూర్తిభవించి అందరు అమ్మచెంత చేరాయి. జయా, విజయా, అజితా, అపరాజితా, నిత్యా , విలాసిని, దోగ్ధ్రీ అఘోరా, అమంగాళా ఇవి తొమ్మిది శక్తులు, భగవతి పరామ్బిక సేవ లో తత్పరులైయ్యి ఉంటారు . శంఖ నిధి, పద్మ నిధీ భగవతి కి పార్శ్వ భాగాన ఉన్నారు. పద్మ నిధి నవరత్న వహా, కాంచనసహత్ర ,సప్త దాతువహా, సంఘ్యక్, నదులు, ఈ ధాతువులనుండి ప్రవహిస్తాయి . ఇవన్ని వెళ్లి సుదాసగారములో కలుస్తాయి. ఈ విధముగా సమస్త శక్తులు కలిగి ఉన్నట్టి భువనేశ్వరీ దేవి , భువనేశ్వరుని తో కూడి ఉన్నది.” సర్వే...