ముల్లోకములు
ముల్లోకములకును భావాభావములను (ఔగాములను) దెలుపుచుందురు. సూర్యుడు చంద్రుడు మండల గ్రహములు. రాహువు ఛాయాగ్రహము. మిగిలినవి తారాగ్రహములు. తా|| నక్షత్రాధిపతి చంద్రుడు, గ్రహాధిపతి సూర్యుడు. సూర్యడగ్నియని, చంద్రుడు జలమనియు చెప్పబడును. అట్లే గ్రహములలో సూర్యుడు బ్రహ్మయనియు, చంద్రుడు విష్ణువనియు తక్కిన తారాగ్రహము(లు) రుద్రుడనియు తెలియవలెను. సూర్యుడు కశ్యపుని కుమారుడు, చంద్రుడు ధర్ముని కుమారుడు, గురుశుక్రులు మహాగ్రహములు. వీరిరువురు ప్రజాపతి కుమారులు. బుధుడు సోముని కొడుకు. శని సూర్యతనయుడు, రాహువు సింహికాపుత్రుడు. కేతువు బ్రహ్మకుమారుడు. గ్రహములన్నింటికి క్రింది భాగమున సూర్యుడు చరించుచుండును. చంద్రుని నక్షత్రమండలమచటి నుండి దూరముగనున్నది. నక్షత్రముల కన్న కుజబుధులు, వారికన్నను శుక్రుడు దూరముననున్నారు. అంతకంటెను తారాగ్రహమండలము పైన గలదు. దాని పైన బృహస్పతి. అంతకు పై భాగమున శని, అంతకు పైన రావుహుగలరు, వీరిక్రమమిట్లు చెప్పబడినది. స్వర్గము ద్రవాసక్తమై యుండును. ఆదిత్యునాశ్రయించి రాహువుండును. ఎల్లప్పుడు చరించుచుండును. శుక్రుని వైశాల్యము తొమ్మిదివేల యోజనములు, సూర్యుని విస్తీర్ణము కంటే శనైశ్చరుని విస్తీర్ణము రెండింత...