వంధ్యత్వం
ఎటువంటి నిరోధకపద్ధతులను పాటించకుండా ఒక్క సంతానమే కలిగిన వారిని కాకవంధ్య అంటారు. పురుషసంతానం కలుగకుండా స్త్రీసంతానమే కలిగినా కూడా అదొక వంధ్యత్వం అని చెప్పబడినది. నాకు తెలిసిన ఒక తృతీయప్రకృతి (థర్డ్ జండర్) కు చెందిన ఒక వ్యక్తి ఉండేవాడు. నడక, మాట, శరీరవిన్యాసం అంతా కూడా అతడు థర్డ్ జండర్ అని చూచేవారికి తెలిసిపోతుంది. కానీ అతనిక ఒక ఆడపిల్ల పుట్టినది. ఇది ఎటువంటి నపుంసకత్వమో.... మరొక వ్యక్తి తన జీవితంలో సుమారు 40 దాటేవరకు నపుంసక శారీరక లక్షణాలతో ఉండేవాడు. మాటతీరు, నడక అన్నీ కూడా థర్డ్ జండర్ అనే అనేవారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో క్లర్క్ ఉద్యోగం చేరారు. గమ్మత్తంమిటంటే..... ఆయనకు ముగ్గురు మగపిల్లలు సంతానం. 45 వయసు దాటాక ఆయన శారీరకలక్షణాలు పూర్తిగా పురుషలక్షణాలుగా మారిపోయాయి.