మానవ జీవితం పైన గ్రహాల ప్రభావం
మానవ జీవితం పైన గ్రహాల ప్రభావం...........!! మనిషి ఆకారాన్ని బట్టి, మాట్లాడే తీరును బట్టి, ప్రవర్తించే తీరుని బట్టి ఏ గ్రహం ఆ సమయంలో అతనిపైన పనిచేస్తోందో తెలుసుకోవచ్చు. అలాగే జాతకంలోని బలీయమైన గ్రహాన్ని కూడా వెంటనే తెలుసుకోవచ్చు. తరువాత జాతకాన్ని పరిశీలిస్తే ఇది నిజం కావటం జరుగుతుంది. దీని ద్వారా కొన్ని ఆశ్చర్య పరిచే విషయాలు తెలుస్తాయి. గ్రహాల ప్రభావాలు స్థూలం గా ఇక్కడ ఇస్తున్నాను. ఇవన్నీ జ్యోతిష గ్రందాలనుంచి సేకరించబడినవి, మరియు నా అనుభవంలో అనేకసార్లు నిజాలుగా రుజువు అయినవి. సూర్యుడు - అధికారం చెలాయించటం, ఉన్నతులమని భావించటం మాత్రమె కాక అలాగే ప్రవర్తించటం, నాయకత్వ లక్షణాలు, పదిమందిలో తేలికగా గుర్తింపు ఉంటే వారు సూర్యుని ప్రభావం లో వారు. >పూర్ణ చంద్రుడు- మృదు స్వభావం, జాలిపడే తత్త్వం, సహాయ పడే తత్వం, మానవ సంబంధాలు. >క్షీణ చంద్రుడు-ఏదీ తేల్చుకోలేని ఊగిసలాట ధోరణి, బలహీన మనస్తత్వం, పిచ్చి ధోరణి, విపరీత ఆలోచనలు. >బుధుడు-తెలివి తేటలు, బహుముఖ ప్రజ్న,హాస్య చతురత, కలుపుగోలు తనం. >కుజుడు-ధైర్యం, దురుసుతనం, కయ్యానికి కాలుదువ్వటం,సాహసం, మొండి పట్టుదల. >గురువు- ధార్మిక మనస్తత్వం...