Posts

Showing posts from September, 2023

Each House in Vedic Astrology

The Meaning of Each House in Vedic Astrology Birth Chart 👈 Aries= first house: Self (ruled by Mars) Taurus= second house: Material values and security (ruled by Venus) Genini= third house: Learning and communication (ruled by Mercury) Cancer= fourth house: Home life and the base of operations (ruled by the Moon) Leo= fifth house: Recreation, romance, and creativity (ruled by the Sun) Virgo= sixth house: The work environment, duties, and health (ruled by Mercury) Libra= seventh house: Relationships, partnerships, and marriage (ruled by Venus) Scorpio= eighth house: Meeting needs, life secrets, and joint resources (ruled by Pluto) Sagittarius= ninth house: Travel, higher learning, and philosophy of life (ruled by Jupiter) Capricorn= tenth house: The career, prestige, and reputation (ruled by Saturn) Aquarius= eleventh house: Friendships, associations, ideals, and causes (ruled by Uranus) Pisces= twelfth house: The subconscious, psychological issues, and secrets (ruled by Neptune)

జ్యోతిష్యము 💐

💐💐 జ్యోతిష్యము 💐💐 జ్యోతిష్యం లేదా భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం. ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము. జీవి జీవితంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేదీ జననకాల గ్రహస్థితి ప్రకారము, చెప్పబడుతుంది. ఆరు వేదాంగాలలో నేత్రస్థానం జ్యోతిషము. ఇప్పటికీ ఆదరణ పొందుతున్న ప్రాచీనశాస్త్రాలలో ఇది కూడా ఉంది. మొట్టమొదటిగా జ్యోతిష్య శాస్త్రాన్ని గ్రంధరూపంలో వరాహమిహిరుడు అందించాడు. హిందూ సాంప్రదాయాల మరియు విశ్వాసాలలో పునర్జన్మ సిద్దాంతం ఒకటి. పునర్జన్మసిద్దాంతం ప్రకారము పూర్వ జన్మ పాపపుణ్యాల ప్రభావం ప్రస్తుత జన్మలో ఉంటుంది. దానికి తగిన విధంగా, తగిన సమయంలోనే జీవి జననం ఈ జన్మలో జరుగుతుంది. అనగా అటువంటి గ్రహస్థితిలో జీవి జననం జరుగుతుంది. ఇది అంతా దైవలీలగా హిందువులు భావిస్తారు. కావున ప్రతి జీవి భూత భవిష్యత్ వర్థమాన కాలములు జననకాల గ్రహస్థితి ప్రకారము జరుగుతాయి. ఇది హిందువుల ప్రగాఢ విశ్వాసము.ప్రశ్న చెప్పడం వాడుకలో ఉంది. పురాణాలలో జ్యోతిష్యం శ్రీనివాసుడు పద్మావతిని చేపట్టడానికి సోది చెప్పే స్త్రీ రూపంలో వచ్చి తన ప్రణయ వృత్తాంతాన్ని ఆకాశరాజు దంపతులకు తెలిపి వారిలో తమ...

32నామాల దుర్గాదేవి ద్వాత్రింశన్నామావాళిని

# భయం కష్టాల్లో ఉన్నవారు దుర్గమ్మని ఈ 32 నామాలతో పూజించండి.. # అద్భుత ఫలితాలు పొందండి.. అర్ధంతో దుర్గాదేవి-ద్వాత్రింశన్నామావాళి.. # దుర్గా దుర్గార్తి శమణీ, దుర్గాపద్వినివారిణీ # దుర్గమచ్చేదినీ, దుర్గసాధినీ, దుర్గనాశినీ # దుర్గతోద్ధారిణీ, దుర్గనిహంత్రీ, దుర్గమాపహ # దుర్గమదేజ్ఞానదా, దుర్గ దైత్యలోకదవానలా # దుర్గమ, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణీ # దుర్గమార్గాప్రద, దుర్గమావిద్యా, దుర్గమాశ్రిత # దుర్గమజ్ఞానసంస్థాన, దుర్గమధ్యానభాసిని # దుర్గమోహ & దుర్గమగ, దుర్గమర్థస్వరూపిణీ # దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధదారిణీ # దుర్గమాంగీ, దుర్గమత, దుర్గమ్య, దుర్గమేశ్వరీ # దుర్గభీమా, దుర్గభామా, దుర్లభా, దుర్గధారిణీ..  # ఇవి దుర్గాదేవి 32 నామాలు. #32 నామాలకు అర్ధం: #1.దుర్గా: భక్తుల చుట్టూ ఒక కోటలా ఉండి కాపాడే తల్లి నీకు వందనం. #2.దుర్గార్తిశమణీ: కష్టాలను శమింపచేసేతల్లి నీకు వందనం. #3.దుర్గాపద్వినివారిణీ: ఆపదలను నివారించే తల్లీ నీకు వందనం. #4.దుర్గమచ్ఛేదినీ: కష్టాలను ఛేదించే తల్లీ నీకు వందనం. #5.దుర్గసాధినీ: దుర్గమమైనది సాధించే తల్లీ నీకు వందనం. #6.దుర్గనాశినీ: కష్టాలను నాశనం చేసే తల్లీ నీకు వందనం...

శ్రీఅహోబల_నృసింహస్తోత్రం ॥💥

॥ # శ్రీఅహోబల_నృసింహస్తోత్రం ॥💥 లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం పక్షీంద్రశైలభవనం భవనాశమీశం | గోక్షీరసార ఘనసారపటీరవర్ణం వందే కృపానిధిమహోబలనారసింహం || ౧ || ఆద్యంతశూన్యమజమవ్యయమప్రమేయం ఆదిత్యచంద్రశిఖిలోచనమాదిదేవం | అబ్జాముఖాబ్జమదలోలుపమత్తభృంగం వందే కృపానిధిమహోబలనారసింహం || ౨ || కోటీరకోటిఘటితోజ్జ్వలకాంతికాంతం కేయూరహారమణికుండలమండితాంగం | చూడాగ్రరంజితసుధాకరపూర్ణబింబం వందే కృపానిధిమహోబలనారసింహం || ౩ || వరాహవామననృసింహసుభాగ్యమీశం క్రీడావిలోలహృదయం విబుధేంద్రవంద్యం | హంసాత్మకం పరమహంసమనోవిహారం వందే కృపానిధిమహోబలనారసింహం || ౪ || మందాకినీజననహేతుపదారవిందం బృందారకాలయవినోదనముజ్జ్వలాంగం | మందారపుష్పతులసీరచితాంఘ్రిపద్మం వందే కృపానిధిమహోబలనారసింహం || ౫ || తారుణ్యకృష్ణతులసీదళధామరమ్యం ధాత్రీరమాభిరమణం మహనీయరూపం | మంత్రాధిరాజమథదానవమానభృంగం వందే కృపానిధిమహోబలనారసింహం || ౬ || ఇతి అహోబలనృసింహ స్తోతం || సేకరణ... 💐🙏 ⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము https://youtu.be/gaJnD3pyEvM?feature=shared పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోపవీతం) దరించవలెను. . ప్రార్థన: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం | ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే || . గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః | గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై: శ్రీ గురవే నమః || . అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాం గతో 2పివా | యస్మరేత్ పుండరీకాక్షం న బాహ్యాభ్యంతరశ్సుచి: || పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష! (అంటూ తల పైకి నీళ్ళు చల్లుకొనవలెను) . ఆచమన విధానం: ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని, 1. ఓం కేశవాయ స్వాహా, 2. ఓం నారాయణాయ స్వాహా, 3. ఓం మాధవాయ స్వాహా, అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను. 4. ఓం గోవిందాయనమః, 5. ఓం విష్ణవే నమః, 6. ఓం మధుసూదనాయనమః, 7. ఓం త్రివిక్రమాయనమః, 8. ఓం వామనాయనమః, 9. ఓం శ్రీధరాయనమః, 10. ఓం హృషీకేశాయనమః, 11. ఓం పద్మనాభాయనమః, 12. ఓం దామోదరాయనమః,...

మట్టిని ప్రసాదంగా ఇచ్చే సుబ్రమణ్యం స్వామి దేవాలయం

# మట్టిని ప్రసాదంగా ఇచ్చే సుబ్రమణ్యం స్వామి దేవాలయం  💞కుక్కే 💞 మృత్తికా_ప్రసాదం మట్టి_ప్రసాదం # మృత్తికా ప్రసాదం అంటే దేవాలయంల్లో ప్రసాదరూపంగా మట్టిని ఇస్తారు. దిన్ని వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. # అన్ని దేవాలయాల్లో ప్రసాదంగా భక్తులకు విభూది, కుంకుమ, చందనం తదితరాలను ఇస్తే నుదిటికి పెట్టుకోవచ్చు. # ఒక వేళా పండ్లు లేదా తినే పదార్ధాన్ని ఇస్తే తినవచ్చు. # అయితే ప్రసాద రూపంగా వచ్చే మన్ను ప్రసాదాన్ని తినేoదుకు అవకాశం లేకుండా ఉంటుంది. # అలా అని దాన్ని పడేసేందుకు మనస్సు ఒప్పుకోదు. # అటువంటి సందర్భంలో ఎం చేయాలో మనస్సుకు తోచదు. # మృత్తికా ప్రసాదంతో మనకు ప్రయోజనం ఏమ్మిటి. ఆ ప్రసాదాలను ఎం చేయాలి. ఇక్కడ చూద్దాం # మీరు ఎప్పుడైనా కుక్కే సుబ్రమణ్య దేవాలయానికి వెళ్ళితే అక్కడి అది సుబ్రమణ్య దేవాలయంలో భక్తులకు వల్మిక మృత్తికా అంటే పుట్ట మన్ను ప్రసాదరూపంలో అందిస్తారు. # ఉడిపి సమీపంలో ఉన్న నాగబనగహళ్లి అంటే శ్రీ సుబ్రమణ్య దేవాలయంలో కూడా మీకు పుట్ట మన్నును ప్రసాదరూపంలో ఇస్తారు. # ఈ ప్రసాదాలను ఏమి చేయాలో యోచించేంతలోనే చేసే పనులతో ఈ విషయాన్నీ మీరు మరచి పోతారు. # మృత్తికా ప్రసాదం వివరాలు..... 01. మృత్త...

రహస్య త్రయం‎*

*రహస్య త్రయం‎* *శిష్యుడంటే ఎట్లా ఉండాలి ?*   వినే శ్రద్ద దానితో పాటు మరికొన్ని యోగ్యతలు ఉంటే ఆ వ్యక్తికి ఉజ్జీవన తప్పనిసరి లభిస్తుంది అని అంటారు. మన పెద్దలు మన చెవులను మనం సవ్యంగా పని చేయించుకోగలిగితే భగవంతుడిని హృదయంలో నిశ్చలంగా నిలుపుకోవచ్చు అని ఒక సూత్రం చెప్పారు. భగవంతుడిని మనం తెల్సుకోవాలి అంటే ఒకరి ఉపదేశం ద్వారానే పొందాలి తప్ప మనంతట మనం ఆర్జించుకోవడం అనేది అసాధ్యం. ఉపదేశం చేసే వ్యక్తిని ఆచార్యుడు అని అంటారు, ఉపదేశం పొందే వ్యక్తిని శిష్యుడు అని అంటారు. ఆచార్యుడు ముందు దాన్ని గ్రహించిన మహనీయుడు కావాలి. శిష్యుడు దాన్ని పొందలనే జిజ్ఞాసతో పాటు సుశ్రూషుడు కావాలి. సుష్రూషు అంటే వినకోరే వాడై ఉండాలి. సుశ్రూష అంటే గురువుగారు చెప్పే వాటిని వినే కోరిక. అయితే వినాలని కోరితే సరిపోదు, అది లభించేవరకు వేచిచూడగలగాలి. భగవంతుడు భగవద్గీతలో గురువు ఏం చేస్తాడో చెప్పాడు. తాను చెప్పినది కేవలం ప్రేరేపణ కోసమే తప్ప అసలు చెప్పాల్సింది "ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వ దర్శిణః" తత్వ ద్రష్టలు అయిన జ్ఞానమును పొందిన మహనీయులు నీకు చెబుతారు అని చెప్పాడు. అయితే వారు చెప్పే ముందు నీవు చేయవల్సినవి కొన్ని...

పారిజాతాంశాది కేంద్రాధిపతి ఫలము

*పారిజాతాంశాది కేంద్రాధిపతి ఫలము* కేంద్రాధిపతి పారిజాతాంశయందున్న జాతకుడు దాతయగును. ఉత్తమాంశయందున్న విశేషదాతయు, గోపురాంశగతుడైన పౌరుషము కలవాడును, సింహాసనాంశయందున్న జనపూజితుడును, పారావతాంశయందున్న శూరుడును, దేవలోకాంశయందున్న సభాపతియు, ద్వితీయగతుడైన (బహ్మలోకగతుడు) మునియు, ఐరావతాంశయందున్న సర్వదాసంతుష్టుడు నగును. *పారిజాతాంశది పంచామాధి ఫలము* పంచామాధిపతి పారిజాతాంశగతుడైన కులోచితవిద్యయు, సింహాసనాంశయందున్న మంత్రిత్వమున, దేవలోకాంశయందున్న కర్మయెాగమును, బ్రహలోకాంశయందున్న దేవోపాసనము, ఐరావతాంశయందున్న ఈశ్వరభక్తియు కలుగును. *పారిజాతాంశాది భాగ్యాది ఫలములు* భాగ్యాధిపతి పారిజాతాంశయందున్న ఈ జన్మలో తీర్థయాత్రలు చేయును. ఉత్తమాంశగతుడైన పూర్వజన్మలో తీర్థయాత్రలు చేసినవాడు; గోపురాంశలో యాగకర్త, పూర్వజన్మలోను, ఇప్పుడుకూడ. సింహాసనాంశలో వీరుడు, సత్యవాది జితేంద్రియుడు, సర్వధర్మ పరిత్యాగి, పరమాత్మను మాత్రమే ఆశ్రయించినవాడగును. పారివతాంశలో ఈ జన్మలో పరమహంసుడగును. దేవలోకాంశలో బాల్యమునుండి, త్రిదండిగాని, దండిగాని, అగును. బ్రహ్మలోకాంశలో అశ్వమేధము చేసి ఇంద్రపదవి నందును. ఐరావతాంశలో స్వయముగా ధర్మావతారమే. శ్రీరామ, ధర్మరాజాదితుల్...

తోరణ గణపతి- శృంగేరి...!!

🎻🌹🙏,తోరణ గణపతి- శృంగేరి...!! 🌹శ్రీ చాగంటివారి ప్రవచనం నుండి. 🌿శృంగెరి పీఠానికి ఉగ్రనృసింహాభారతీ స్వామివారని ఒక మహానుభావుడు పీఠాధిపత్యం చేశారు.  🌸ఆయన ప్రతిరోజూ ఉదయం కేవలం కాకరాకులే తినేవారు. అలా తిని 24 గంటలలో 20 గంటలు తపస్సు చేస్తే అణిమాది సిద్దులన్నీ ఆయనకు వసమైపోయాయి.  🌿ఒక సందర్భంలో అమ్మవారి సంపదను కొల్లగొట్టడానికి శత్రుసైన్యం శృంగగిరి వచేస్తున్నారంటే ఆయన బయటకు వచ్చి ఒకచోట నిలబడి 'నేను సన్యాసినీ... నేనేమి యుద్ధం చేస్తాను... ఈయన చూసుకుంటారు' అని ఒక గడప దగ్గరికి వెళ్లి ఒక మంత్రాన్ని పఠించారు. .. 🌸వెంటనే దానిమీదకి గణపతి వచ్చి కూర్చున్నాడు.  🌿ఇప్పటికి ఆ గణపతిని 'తోరణ గణపతి' అంటారు.  🌸మీరు శృంగేరీ పీఠంలోకి అడుగు పెట్టాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి. అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి లోపలికి వెడతారు.  🌿బయటకు వెళ్లాలన్నా ఆయన అనుగ్రహం ఉండాలి. కొబ్బరికాయ కొట్టి బయటకు వెడతారు.  🌸ఆయన పైన కూర్చుని ఉండగా ఇన్నివేలమంది శత్రుసైన్యం శృంగేరిపీఠంలోకి వెళ్లలేకపోయింది 🌿సనాతన ధర్మంలో శక్తి అంటే ఏమిటో చూపించారు. ఉపాసన అంటే ఏమిటో, అనుష్ఠానం అంటే ఏమిటో చూపించారు.  🌸వాళ్ళ శక...

నక్షత్రములు-మారకదశలు

నక్షత్రములు-మారకదశలు    1.అశ్విని,మఖ,మూల నక్షత్ర జాతకులకు రాహు దశ మారకదశ . 2.భరణి వారికి రవిదశ,గురుదశ మారక దశ.  3.కృత్తికా నక్షత్ర జాతకులకు శనిదశ మారక దశ.  4.రోహిణి నక్షత్ర జాతకులకు బుధ మహర్దశ మారక దశ.  5.మృగశిర వారికి శనిదశ మారకము.  6.ఆరుద్ర నక్షత్ర జాతకులకు గురువు లేక శని దశలు మారకము. 7.పునర్వసు నక్షత్రం వారికి బుద లేక శుక్ర దశ మారక దశలు.  8.పుష్యమి నక్షత్ర జాతకులకు శుక్ర లేదా చంద్ర మారక దశలు.  9.ఆశ్లేష నక్షత్రం వారికి రాహు దశ మారకము. 10.పుబ్బ నక్షత్ర జాతకులకుశని యందు గురు లేక బుధ దశలు మారక దశలు. 11. ఉత్తర మొదటి పాదమైన శని దశ యందు రెండు,మూడు, నాలుగు పాదములు అయిన గురువు లేక బుధ దశల యందు మారక దశలు. 12.హస్తా నక్షత్ర జాతకులకు బుధ దశ  మృత్యు పదము. 13.చిత్తా నక్షత్రం గలవారికి గురువుగాని శనిగానీ లేక బుధుడు గాని దశలు వచ్చినప్పుడు మారకము ఇవ్వగలరు.  14.స్వాతి నక్షత్రం వారికి బుధ దశ మారక దశ తప్పినచో రవిదశ మారకము కలిగించును. 15. విశాఖ నక్షత్రం వారికి కేతు,శుక్ర దశలు  చివర యందు మారకము లేదా రవి దశలో మారకము వచ్చును.  16.అనురాధ నక్షత్ర వారిక...

శుభస్థానములు*

*శుభస్థానములు*  శ్లో:- స్వోచ్చస్థానగతో వివాహసమయే మూలత్రికోణస్థితః         స్వక్షేత్రే యది సంస్థితశ్చ బలవాన్ మిత్రాలయస్థోపివా         ద్యూనాఖ్యంచ విసృజ్య కేంద్రమితరత్కేంద్ర త్రికోణస్థిత         స్సౌమ్యోవాగురురేవవా సురగుర్హంత్యేవదోషార్బుదమ్ తాత్పర్యము:- బుధ, గురు, శుక్ర గ్రహములు స్వస్థానోచ్చలో నున్నప్పుడు, మూలత్రికోణములందున్నప్పుడు, మిత్రక్షేత్రములందున్నప్పుడు, స్వక్షేత్రములలోనున్నప్పుడు లగ్నమందుగాని, చతుర్థ, పంచమ, నవమ, దశమస్థానములందుగాని బుధ, గురు, శుక్రులలో యే యొక్కరైనగాని కొంతమందిగాని యున్నచో యెన్ని యితర దోషపరంపరలు 10 లక్షలనైననూ పారద్రోలి శుభములు గూర్చుననుటకు సందియము లేదు.  శ్లో:- క్రూరష్షష్ఠభవత్రిగోయది బలీ హంత్యాశు దోషాయుతం         లగ్నేశశ్చ బలీయథోక్త గృహగో లగ్నంచ పంచేష్టికమ్         రాత్రావేవ నిశాకరోయది బలీ చైకాదశస్థోపివా         లగ్నైకాదశగోరవిస్తుసకలాన్ దోషాన్ నిహంతిస్ఫుటమ్ తాత్పర్యము:- లగ్నమునకు తృతీయ, షష్ఠ, ఏకాదశస్థానములందు పాపగ్రహము బలవంతుడైయున్నగాని, ...

వివిధ రాశిచక్రాలలో సూర్యుడు

వివిధ రాశిచక్రాలలో సూర్యుడు * మేషం - విజయవంతమైన, తెలివైన, పోలీసు మరియు సైన్యంలో మరింత విజయవంతమవుతుంది. * వృషభం - వస్త్రాలు మరియు పరిమళ ద్రవ్యాల వ్యాపారంలో విజయం, స్త్రీల ప్రేమను కోల్పోతారు. * మిథునం - జ్యోతిష్యం అంటే ఇష్టం, ధనవంతుడు మరియు పండితుడు. * కర్కాటక రాశి - మానసిక శారీరక బాధ, సంపద పోగుపడదు.  * సింహం - తెలివైన మరియు ధైర్యవంతుడు. * కన్య - ముఖ్యంగా సాహిత్యం, కళ, చిత్రలేఖనం మరియు కవిత్వంలో విజయం, గణితశాస్త్రంలో ప్రావీణ్యం. * తులారాశి - డబ్బు సంపాదించడానికి నీచమైన పనులు చేయండి, * వృశ్చికం - మెడికల్ స్టోర్స్ మరియు ఫార్మాస్యూటికల్ పనుల నుండి డబ్బు సంపాదిస్తారు. ధైర్యవంతుడు మరియు ధైర్యవంతుడు. * ధనుస్సు - సమాజంలో గౌరవం పెరుగుతుంది, ఆటలంటే ఇష్టం, కోపం. * మకరం - చాలా మంచి వ్యాపారవేత్త, కష్టపడి ఇతరులకు ధనాన్ని ఇస్తుంది. * కుంభం - కొడుకులతో సంతోషం లేదు, గౌరవం లోపిస్తుంది, ప్రభుత్వ పనుల్లో ఇబ్బంది. * మీనం - ఓడల పని, సముద్ర ఉత్పత్తులు, విదేశాలతో వ్యాపారం మరియు స్త్రీల నుండి గౌరవం వంటి నీటికి సంబంధించిన విషయాలలో మీరు పురోగతిని పొందుతారు.

ధన యెాగాధ్యాయము

*ధన యెాగాధ్యాయము* ఏ యెాగమున పుట్టినవాడు నిస్సంశయముగా ధనవంతుడగునునో అట్టి ధనయెాగమును చెప్పుచున్నాను. వినుము. పంచమము శుక్రక్షేత్రమై (వృషభ, తులలు) దానియందు శక్రుడుండి, లాభమున బుధుడొక్కడుండి, లాభము చంద్ర కుజ గురులతో కూడియున్న బహువిత్తవంతుడగును. పంచమము రవిక్షేత్రమై (సిహము) రవి అక్కడుండి, లాభమందు శని చంద్ర గురులున్న మహాధనికుడగును. శనిక్షేత్రము (మకర, కుంభము) లందు శనియుండి లాభమున రవి చంద్రులున్న ధనవంతుడగును. పంచమము గురుక్షేత్రమై (ధనుర్మీనములు) లాభమున బుధుడున్న ధనవంతుడగును. పంచమము కుజక్షేత్రమై కుజుడక్కడనే యుండి, లాభమున శుక్రడున్నచో ధనవంతుడగును. పంచమము కర్కాటమై చంద్రుడుండి, లాభమున శనియున్న ధనికుడగును. సింహము లగ్నమై అక్కడ రవియుండి, కుజ గురు సంబంధమున్న ధనవంతుడగును. కర్కాటకము లగ్నమై చంద్రుడక్కడుండి, బుధ గురులతో కూడినా, చూడబడినా ధనవంతుడగును. కుజక్షేత్రము లగ్నమై అందు కుజుడుండి, బుధ రవి శుక్రుల సంబంధమున్న శ్రీమంతుడగును. కన్యామిథునములు లగ్నమై, బుధుడుండి, శనిగురుల సంబంధమున్న జాతకుడు ధనికుడగును. ధనుర్మీనములు లగ్నమై బుధకుజుల సంబంధమున్న జాతకుడు ధనికుడగును. తులావృషభములు లగ్నమై, శుక్రుడుండి, శని బుధుల సంబంధ...

తిరుమల - తిరుపతి - దేవస్థానాల_జాబితా

తిరుమల - తిరుపతి - దేవస్థానాల_జాబితా 🙏🌹🙏🌷🙏🌺🌷🙏🌹🙏🌷 (౧) తిరుమలలో శ్రీవేంకటేశ్వరాలయము. తిరుమలలోనే వున్న ఇతర దేవాలయాలు. (అ) వారాహి (ఆ) శ్రీభాష్యకారుల వారి దేవాలయం - 1 (ఇ) బేడి హనుమంతరాయ దేవాలయం (ఈ) క్షేత్రపాలకుల ఆలయం (ఉ) దేవభాష్యకారుల ఆలయము (ఊ) ఆంజనేయస్వామి ఆలయము (౨) తిరుపతిలో  (అ) సాలెనాంచారమ్మ గుడి (ఆ) చూడికోదత్త నాంచారమ్మగుడి       (అండాళమ్మ గుడి) (ఇ) మాడల అళ్వారు గుడి (ఈ) చక్రాత్ అళ్వారు గుడి (ఉ) మధురకవి అళ్వారు గుడి (ఊ) ధ్వజస్తంభము వద్ద ఆంజనేయస్వామి దేవాలయము (ఎ) పెద్దబుగ్గ వద్ద ఆంజనేయస్వామి దేవాలయము (ఏ) మనవల మహాముని గుడి (ఐ) నమ్మళ్వార్ గుడి ( ఒ) వేదాంతదేశికులవారి గుడి ( ఓ) ఊళు అళ్వారుల గుడి  (ఔ) తిరుమల నంబి గుడి (అం) భాష్యకారుల గుడి - 2 (ఆ:) తిరుమంగళ్ అళ్వారు గుడి (క) కురాతాళ్వారుల సన్నిధి (ఖ) సంజీవరాయ స్వామి దేవాలయం (గ) పార్థసారధి దేవాలయం (ఘ) వేంకటేశ్వరస్వామి గుడి (౩) తిరుపతిలో  (అ) కోదండరామాలయము (ఆ) కపిలేశ్వరస్వామి దేవాలయము    (౪ ) తిరుచానూరులో (అ)పద్మావతి దేవాలయము (ఆ) కృష్ణస్వామి (ఇ) సూర్యనారాయణస్వామి (ఈ) సుందరరాజస్వామి (౫ ) న...

విదేశీ ప్రయాణం

జ్యోతిష్య శాస్త్రం ద్వారా విదేశీ ప్రయాణం మరియు విదేశాలలో స్థిరనివాసం....✍️✍️ విదేశీ ప్రయాణం అనేది ప్రస్తుత భారత దేశంలో ఉన్న యువకులు అందరిలో ఒక కల లాగా ఉంటుంది కానీ ఆ కలలను నెరవేర్చుకోవడం కొంతమంది అదృష్టవంతులను మాత్రమే వరిస్తుంది కావున జ్యోతిష్య శాస్త్రం ద్వారా విదేశీయాన యోగం గురించి మరియు గ్రహాల కలయిక గురించి తెలుసుకోవడానికి కొంత ప్రయత్నం చేస్తున్నాను దయచేసి సహకరించగలరు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ పరంగా అనేక రంగాలకు సంబంధించిన ఇంజనీర్లు లేక డాక్టర్లు స్వల్పకాలిక వ్యవధిలోనే విదేశాలకు వెళుతున్నారు కానీ అందరూ విదేశాలలో స్థిరపడడం లేదు కొంతమంది ఒకటి లేక రెండు సంవత్సరాలలో తిరిగి వచ్చేస్తున్నారు కొంతమంది విదేశాల్లోనే స్థిరపడటం జరుగుతుంది కాబట్టి ఈరోజు విదేశాలలో స్థిర పడడానికి మరియు విదేశాలకు వెళ్ళడానికి కావలసిన గ్రహాలు మరియు యోగాలు గురించి తెలుసుకుందాం విదేశీ యోగం గురించి జ్యోతిషశాస్త్రంలో కొన్ని సూత్రాలు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ విదేశాల్లో ప్రయాణించడానికి అత్యంత ప్రభావవంతమైన మరియు ముఖ్యమైన జ్యోతిష్య శాస్త్ర సూత్రాలను మాత్రమే చర్చిస్తున్నాను జాతక చక్రం లో కొన్ని రకాల గ్రహాల కలయిక లు మరియు ...

||.శ్రీ నరసింహ కవచం.|

🙏🔥||.శ్రీ నరసింహ కవచం.||🔥🙏 ➖️☀️➖️☀️➖️☀️➖️☀️➖️☀️➖️ నృసింహకవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా । సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనమ్ ॥  సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకమ్ । ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితమ్ ॥  వివృతాస్యం త్రినయనం శరదిందుసమప్రభమ్ । లక్ష్మ్యాలింగితవామాంగం విభూతిభిరుపాశ్రితమ్ ॥  చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండలశోభితమ్ । సరోజశోభితోరస్కం రత్నకేయూరముద్రితమ్ ॥ [రత్నకేయూరశోభితం] తప్తకాంచనసంకాశం పీతనిర్మలవాసనమ్ । ఇంద్రాదిసురమౌళిస్థస్ఫురన్మాణిక్యదీప్తిభిః ॥  విరాజితపదద్వంద్వం శంఖచక్రాదిహేతిభిః । గరుత్మతా సవినయం స్తూయమానం ముదాన్వితమ్ స్వహృత్కమలసంవాసం కృత్వా తు కవచం పఠేత్ । నృసింహో మే శిరః పాతు లోకరక్షాత్మసంభవః ॥  సర్వగోఽపి స్తంభవాసః ఫాలం మే రక్షతు ధ్వనిమ్ । నృసింహో మే దృశౌ పాతు సోమసూర్యాగ్నిలోచనః ॥ కిమత్ర బహునోక్తేన నృసింహసదృశో భవేత్ । మనసా చింతితం యత్తు సతచ్చాప్నోత్యసంశయo॥ 💐🔻💐🔻💐🔻💐🔻💐🔻💐🔻💐🔻💐 🍁🔥🍁🔥🍁🔥🍁🔥🍁🔥🍁🔥🍁🔥🍁

శ్రీ హనుమాన్ స్తోత్రం ॥*

🌷🙏తీవ్రమైన మనోవేదన నుండి రక్షించే హనుమంతుడి స్త్రోత్రం🙏🌷 *|| ఓం శ్రీ ఆంజనేయాయ నమః ||* *॥ శ్రీ హనుమాన్ స్తోత్రం ॥* *అక్షాది రాక్షస హరం దశకంఠ దర్ప నిర్మూలనం రాఘువ రాంఘి సరోజ భక్తం |* *సీతా విషహ్యఘన దుఃఖ నివారకం తం వాయోః సుతం గిలిత భానుమహం నమామి ॥ 1* *మాం పశ్య పశ్య హనుమన్ నిజ దృష్టి పాతైః మాం రక్ష రక్ష పరితో రిపు దుఃఖ గర్వాత్ |* *వశ్యాం కురు త్రిజగతీం వసుధాధి పానాం మే దేహి దేహి మహతీం వసుధాం శ్రియం చ ||2* *ఆపభ్యో రక్ష సర్వత్ర ఆంజనేయ నమోస్తు తే | బంధనం ఛిందిమే నిత్యం కపివీర్య నమోస్తుతే ||3* *దేహి మే సమృదో నిత్యం త్రిలోచన నమోస్తు తే | దుష్టరోగాన్ హన హన రామదూత నమోస్తుతే ||4* *ఉచ్చాటయ రిపూన్ సర్వాన్ మోహనం కురు భూభుజాం |* *విద్వేషిణో మారయ త్వం* *త్రిమూర్త్యాత్మక సర్వదా ||5* *సంజీవ పర్వతోద్ధార* *మమ దుఃఖం నివారయ |* *ఘోరాను పద్రవాన్ సర్వాన్* *నాశయాక్షా సురాంతక ||6* *ఏవం స్తుత్వా హనుమంతం నరః శ్రద్ధాసమన్వితః | పుత్ర పౌత్రాది సహితః* *సర్వసౌఖ్యమవాప్నుయాత్ ||7* *శ్రీ ఆంజనేయాయ నమః* *|| ఇతి శ్రీ హనుమాన్ స్తోత్రం సంపూర్ణం ॥* 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

మోక్ష కారకుడు కేతువు.

ఓం శ్రీమాత్రే నమః  మోక్ష కారకుడు కేతువు.   చిన్నప్పుడు సామాన్య శాస్త్రం లో మనం చదువుకున్న చిన్న పాఠం .మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ జరిగినప్పుడు పత్రహరితం ప్రాముఖ్యత వహిస్తుంది. అనగా ఆకుల లోని ఆకుపచ్చరంగు సూర్యరశ్మిలోని కాంతిని శోషించి పోషణ పదార్థాన్ని తయారు చేస్తుంది. కొత్త ఆకులు వచ్చినప్పుడు పాత ఆకులు ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి .  ఇది కేతు గ్రహానికి, మానవజీవితానికి మధ్య అన్వయించి చూడాలి. ప్రతి మానవునికి చిత్రవిచిత్రమైన కోరికలు వయసుతోపాటు వస్తూనే ఉంటాయి. వాటికి అంతు ఉండదు. భగవానుడు కోరికలే దుఃఖానికి మూలం అని అన్నారు. అదేవిధంగా దుఃఖమే కోరికలు అని కూడా ప్రస్తావిస్తారు. కోరికలన్నింటిలోకి శృంగార వాంఛ అతి ముఖ్యమైనది. ఈ వాంఛను అధిగమిస్తే ముక్తి లభిస్తుంది.అది లభించడానికి కావలసిన అనుగ్రహం కేతువు. మోహములు తీర్చడం, అకస్మాత్తుగా వ్యామోహములు తీరి ఆధ్యాత్మిక చింతన బాట పట్టేలా చూడగలిగేది కూడా కేతు దశలోనే.   వివాహం చేసుకుని సంసారం చేసేది వంశాభివృద్ధి కొరకు అనగా సంతానం కోసం మాత్రమే అని ధర్మశాస్త్రములు చెప్తున్నాయి.   అశ్విని మఖ మూల కేతు నక్షత్రములు అగ్నితత్వ ...

యక్షుడి ప్రశ్న. '

'ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఆశ్చర్యకరమైనదేది?' అన్నది యక్షుడి ప్రశ్న. 'నిత్యం అనేకమంది తన కళ్ళముందే చనిపోతున్నా తాను మాత్రం చిరంజీవినని అనుకుంటూంటాడు మనిషి. ఇంతకన్న ఆశ్చర్యం ఇంకేముంటుంది?' బదులిస్తాడు యుధిష్ఠిరుడు.          ప్రతి మనిషికీ మరణం తప్పదు. అయినా తాను మాత్రం శాశ్వతంగా బతకబోతున్నట్టు ప్రవర్తిస్తుంటాడు. తనకేదో రోజున హఠాత్తుగా రాబోయే మరణం గురించి తెలుసుకోవటానికి మనిషికి క్షణం కూడా తీరికలేదు.                   మనిషికి తన పుట్టుక గురించి తెలుసు. కాని, మరణం గురించి బొత్తిగా తెలియదు. దాన్నించి తప్పించుకోవటం అసంభవమనీ తలంచడు. చనిపోయాక ఏమవుతుంది? మరణం తరవాత మనిషి ఎక్కడికి వెడతాడు? అసలు మానవ జన్మకు ప్రయోజనమేమిటి? ఆత్మ అన్నది ఉన్నదా? శరీరాన్ని వదిలేశాక ఆత్మ ఎక్కడికి వెడుతుంది?         జీవితం మీద జిజ్ఞాస ఉన్న ప్రతి మనిషికీ ఎదురయ్యే ప్రశ్నలివి. జీవించటంలో మునిగిపోయి ఈ ప్రశ్నలకు జవాబుల గురించి అన్వేషించడు. చివరికి ప్రాణాంతకమైన జబ్బుచేసినా, ఆఖరి క్షణాలు ఆసన్నమవుతున్నా- ఇంకా జీవితాన్ని ఎలా పొడిగించాలా అన్న...

మహాలయ పక్షాల ప్రాధాన్యత*

.*మహాలయ పక్షాల ప్రాధాన్యత*   మహాలయ పక్షారంభం(25/9/2018 నుండి 9/10/2018 వరకు) భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న పదునైదు దినములనూ *‘మహాలయ పక్షములు*’ అంటారు. మరణించిన మన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ, తర్పణ, పిండప్రదానాది పితృయఙ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశిచబడిన ఈ పదునైదు రోజులనే ‘మహాలయ పక్షాలు’ అంటారు. వీటినే ‘పితృపక్షము’లనీ.., ‘అపరపక్షము’లనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశ్యము. *పితృదేవతలకు ... ఆకలా?* అనే సందేహం మీకు కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ‘ఆకలి’ అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.                  *అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః                 యఙ్ఞాద్భవతి పర్జన్యో - యఙ్ఞః కర్మ సముద్భవః అన్నము వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షము వలన అన్నము లభిస్తుంది. యఙ్ఞము వలన వర్షము కురుస్తుంది. ఆ యఙ్ఞము కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే....అ...

కృష్ణుని మిత్రుడు మాలికుడు🚩🚩

🚩🚩 కృష్ణుని మిత్రుడు మాలికుడు 🚩🚩 యదుకులనాయకుడైన కృష్ణుని మిత్రడు మాలికుడు. మిత్రనికి సకల శాస్త్రాలు, విద్యలు నేర్పాడు కృష్ణుడు. శ్రీ కృష్ణుని వద్ద విద్యలు అభ్యసించి అత్యంత శక్తి ని పొందానన్నగర్వం మాలికుని ఆడించింది. ఒకసారి కృష్ణుని చక్రాయుధ ప్రయోగాన్ని నేర్పమని కోరాడు మాలికుడు. " అది చాలా అపాయకరమైనదని , అటువంటి ఆశ వద్దు అని మాలికునికి"  బుధ్ధిమతి చెప్పాడు కృష్ణుడు. కృష్ణుని బోధ మాలికుని చెవికి ఎక్కలేదు. వేరు మార్గం లేక చక్రయుధాన్ని ప్రయోగించడం నేర్పడానికి ఒప్పుకున్నాడు  కృష్ణుడు. ఱచక్రాయుధాన్ని వ్రేలికి ధరించిన  కృష్ణుడు తన వ్రేలితో ఒక చుట్టు త్రిప్పి  లక్ష్యం పై ప్రయోగించాడు కృష్ణుడు. చక్రం లక్ష్యాన్ని ఛేదించి తిరిగి వ్రేలికి వచ్చి చేరుకుంది. పిదప మాలికుడు ప్రయోగించాలి. కృష్ణుడు యిచ్చిన చక్రాయుధాన్ని వ్రేలికి ధరించి ఒక త్రిప్పు త్రిప్పాడు. ఆకాశం వైపుకి వెళ్ళింది చక్రం. కుతూహలంగా చూశాడు మాలికన్ "ఆహా..సాధించాను. ఇంక ఇద్దరు కృష్ణులు..యాదవకులాన్ని నేనే రక్షిస్తాను." అని గర్వంగా అరిచాడు. అరవడమే కాదు తిరిగి వచ్చే చక్రాయుధానికి వ్రేలు సిధ్ధంగా వుంచవలసిన వాడు, తన వ్...

కృష్ణాష్టమి నాడు చేయవలసిన స్తోత్రమ్🙏

కృష్ణాష్టమి నాడు చేయవలసిన స్తోత్రమ్🙏 అనంతం వామనం శౌరిం వైకుంఠం పురుషోత్తమం! వాసుదేవం హృషీకేశం మాధవం మధుసూదనం!! వరాహం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం! దామోదరం పద్మనాభం కేశవం గరుడధ్వజం!! గోవిందమచ్యుతం దేవమనంతమపరాజితం! అదోక్షజం జగద్బీజం సర్గః స్థిత్యంత కారణం!! అనాదినిధనం విష్ణుం త్రిలోకేశం త్రివిక్రమం! నారాయణం చతుర్బాహుం శంఖ చక్ర గదాధరం!! పీతాంబరధరం దివ్యం వనమాలా విభూషితం! శ్రీ వత్సాంకం జగద్ధామ శ్రీపతిం శ్రీధరం హరిం!! యం దేవం దేవకీ దేవీ వసుదేవానదీ జనత్! గోపస్య బ్రహ్మణో గుప్త్యై తస్మై బ్రహ్మాత్మనే నమః!

కాలమానం

100 త్రుటి = 1 తత్పర 30 తత్పర = 1 నిమేష 18 నిమేషాలు = 1 కాష్ఠ 30 కాష్ఠాలు = 1 కలా 30 కలలు = 1 ఘటిక 2 ఘటికలు = 1 క్షణ 30 క్షణాలు = 1 అహోరాత్రము  రోజులో 2916000000వ వంతు త్రుటి. అలాగే, ఆధునిక లెక్కల ప్రకారం త్రుటి సెకండులో 33750వ వంతు. అయితే, భాస్కరుని 12వ శతాబ్దం దాకా ఈ రకమైన విభజన లేదని మనం అనుకోవడానికి వీలులేదు. 4వ శతాబ్దం తరువాత వచ్చిన భాగవత పురాణం లోనూ, విష్ణుపురాణం లోనూ ఈ విధమైన సూక్ష్మ కాలచర్చ కనిపిస్తుంది. ఉదాహరణకు, భాగవత పురాణంలో విపులంగా వివరించిన ఈ విభజన చూడండి: అణుర్ ద్వౌ పరమాణూ స్యాత్  త్రసరేణుస్ త్రయః స్మృతః జాలార్కరశ్మ్యవగతః  ఖం ఏవానుపతన్నగాత్                 (3.11.5) రెండు పరమాణువులు ఒక అణువుగా, మూడు అణువులు ఒక త్రసరేణువుగా భావిస్తారు. ఈ త్రసరేణు కిటికీ గుండా ప్రసరించే సూర్యరశ్మిలో ఆకాశం (ఖం) వైపు పైకి పయనిస్తూ మనం గమనించవచ్చు. త్రసరేణు-త్రికం భుంక్తే  యః కాలః స త్రుటిః స్మృతః శత-భాగస్తు *వేధః* స్యాత్  తైస్ త్రిభిస్ తు లవః స్మృతః                       ...