Posts

Showing posts from June, 2022

వారాహి దేవి అష్టోత్తర శతనామావళి

వారాహి దేవి అష్టోత్తర శతనామావళి ఓం ఐం గ్లౌం నమో వరాహవదనాయై నమః | ఓం ఐం గ్లౌం నమో వారాహ్యై నమః | ఓం ఐం గ్లౌం వరరూపిణ్యై నమః | ఓం ఐం గ్లౌం క్రోడాననాయై నమః | ఓం ఐం గ్లౌం కోలముఖ్యై నమః | ఓం ఐం గ్లౌం జగదంబాయై నమః | ఓం ఐం గ్లౌం తరుణ్యై నమః | ఓం ఐం గ్లౌం విశ్వేశ్వర్యై నమః | ఓం ఐం గ్లౌం శంఖిన్యై నమః | ఓం ఐం గ్లౌం చక్రిణ్యై నమః | ఓం ఐం గ్లౌం ఖడ్గశూలగదాహస్తాయై నమః | ఓం ఐం గ్లౌం ముసలధారిణ్యై నమః | ఓం ఐం గ్లౌం హలసకాది సమాయుక్తాయై  నమః | ఓం ఐం గ్లౌం భక్తానామభయప్రదాయై నమః | ఓం ఐం గ్లౌం ఇష్టార్థదాయిన్యై నమః | ఓం ఐం గ్లౌం ఘోరాయై నమః | ఓం ఐం గ్లౌం మహాఘోరాయై నమః | ఓం ఐం గ్లౌం మహామాయాయై నమః  ఓం ఐం గ్లౌం వార్తాల్యై నమః | ఓం ఐం గ్లౌం జగదీశ్వర్యై నమః | ఓం ఐం గ్లౌం అంధే అంధిన్యై నమః | ఓం ఐం గ్లౌం రుంధే రుంధిన్యై నమః | ఓం ఐం గ్లౌం జంభే జంభిన్యై నమః | ఓం ఐం గ్లౌం మోహే మోహిన్యై నమః | ఓం ఐం గ్లౌం స్తంభే స్తంభిన్యై నమః | ఓం ఐం గ్లౌం దేవేశ్యై నమః | ఓం ఐం గ్లౌం శత్రునాశిన్యై నమః ఓం ఐం గ్లౌం అష్టభుజాయై నమః | ఓం ఐం గ్లౌం చతుర్హస్తాయై నమః | ఓం ఐం గ్లౌం ఉన్మత్తభైరవాంకస్థాయై నమః |...

Benefits of Sleeping on Your Left Side.*

*Benefits of Sleeping on Your Left Side.*  *In Ayurveda it is called Vamkushi..* 1. Prevents snoring 2. Helps in better blood circulation 3. Helps in proper digestion after meals 4. Gives relief to people having back and neck pain 5. Helps in filtering and purifying toxins, lymph fluids and wastes 6. Prevents serious illness as accumulated toxins are flushed out easily 7. Liver and kidneys work better 8. Helps in smooth bowel movements 9. Reduces workload on heart and its proper functioning 10. Prevents acidity and heartburn 11. Prevents fatigue during morning 12. Fats gets digested easily 13. Positive impact on brain 14. It delays onset of Parkinsons and Alzheimers 15. It is also considered to be the best sleeping position according to Ayurveda.

బ్రహ్మ కపాలం !!

బ్రహ్మ కపాలం !! 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 "శివపార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు పురోహితుడైన బ్రహ్మ పంచముఖుడు. నాలుగు ముఖాలతో మంత్రోఛ్ఛారణ చేస్తున్నాడు కానీ, ఆయన ఊర్ధ్వ ముఖం పార్వతీదేవీ సౌందర్యానికి మోహపరవశమై చేష్టలుడిగి చూస్తుండిపోయింది. ఇది గమనించిన పరమశివుడికి కోపం వచ్చింది. బ్రహ్మకు బుధ్ధి చెప్పాలని చేయిచాచి ఒక దెబ్బ వేశాడు. మహేశ్వరుడి చేతి దెబ్బ సాధారణమైంది కాదు కదా.! దాని ప్రభావనికి బ్రహ్మ ఊర్ద్వముఖం తెగిపోయింది. కానీ కిందపడలేదు, శివుడి అరచేతికి అతుక్కుపోయింది. అది ఎంత విదిలించినా అది ఆయన చేతిని వదలలేదు. క్రమక్రమంగా ఎండి, చివరికది కపాలంగా మారిపోయింది. బ్రహ్మ అపరాధం చేశాడు. దానికి ఆదిదేవుడు శిక్ష వేయాల్సి వచ్చింది. అయితే, అది సరాసరి బ్రహ్మ హత్యగా పరిణమించి, ఆ పాపం అంతటి మహాదేవుడుకీ అంటింది. జగద్గురువు , మహాతపస్వి ఆయనకూ ఆ పాప ఫలం తప్పలేదు. దేవతలందరినీ పిలిచి నిస్సంకోచంగా జరిగింది చెప్పి, తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గమేమిటో సూచించమన్నాడు. 'దేవాదిదేవా ! పరమజ్ఞామివి. నీకు తెలియని ధర్మం లేదు. ఈ జగత్తును నడిపిస్తున్నవాడివి . శాసించగలవాడివి. అయినా, మాపై క్రుపతో ఒక సలహా ఇవ్వమని కోర...

⚜️కోపం ఎలా ఉండాలి⚜️

   ⚜️కోపం ఎలా ఉండాలి⚜️        ఎప్పుడూ కోపంతో ఊగిపోయేవాడి దగ్గరకు వెళ్ళడానికి, స్నేహంగా మెలగడానికి, ఆత్మీయతను పంచుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఆయనో ఉన్నతాధికారి, ఉపకారం కూడా చెయ్య గలడు. కానీ చాలా కోపిష్టి, ఎప్పుడు కోప్పడతాడో తెలియదు. ఎందుకొచ్చిన గొడవ మరో దారి చూసుకుందాం అనుకుంటారు. కట్టుకున్న భార్య కూడా భయపడు తుంటుంది. తోబుట్టువులు, స్నేహితులు కూడా ఆయనతో అంతంత మాత్రంగానే ఉంటారు. అది చాలా ప్రమాద కర లక్షణం 'ధన్యాస్తే పురుష శ్రేష్టా యే బుధ్యా కోప -ముత్రితమ్ నిరుంధంతి మహాత్మానో దీపమ గ్నిమివాంభ సా'.... అంటారు. అగ్ని అంటుకున్న తరువాత మంట పైకి లేస్తుంది. చుట్టూ ఉన్న వస్తువులన్నింటినీ కాల్చేస్తుంది. అప్పుడు నీళ్ళలాగానే ఉంది కదా అని నెయ్యి పోసారనుకోండి. మంట మరింత పెరిగి పోతుంది.  కోపమూ అంతే.. అప్పుడు దాన్ని ఎలా అణచాలి. ఎలా అదుపు చేసుకోవాలి. అంటే.. యధోరగ స్వచం జీర్ణాం స వై పురు షముచ్యతే.’..  పాము ఒంటికి కుబుసం పట్టు కుంటుంది. కుబుసం ఉన్న పాము చాలా కోపంతో ఉంటుంది.  సరిగా కళ్లు కనపడవు. ఒంటికి తొడుగు ఉంటుంది కాబట్టి దానికి రక్షణ ఉంటుంది. కానీ పాము దాన్ని...

కురుక్షేత్ర యుద్ధం రహస్యం*

*కురుక్షేత్ర యుద్ధం రహస్యం* *కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. దుర్యోధనుడు భంగమైన ఊరువులతో తన మృత్యువుకై ఎదురుచూస్తున్నాడు. పాండవులు దుర్సోధనుణ్ణి ఆ తటాకంవద్దే వదిలిపెట్టి తమ తమ రథాలపై తిరుగు ప్రయాణమయ్యారు. బలరాముడు అక్కడ జరిగిన అధర్మ గదాయుద్ధాన్ని ఖండిస్తూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు. కురుక్షేత్రం మొత్తం రక్తంతో తడిసిపోయినట్లుందక్కడ. కనుచూపుమేరలో అన్నీ శవాలే కనిపిస్తున్నాయి. ఎన్నో అక్షౌహిణీల సైన్యం, అశ్వాలు, రథాలు, గజములు.. అంతా విగతమై పడివున్నాయి. ఆ రోజే మరణించిన శకుని శల్యాదుల శవాలను తీసుకెళ్ళేవారులేక అనాధల్లా పడున్నాయి. అవన్నీ చూస్తుంటే అర్జునుడి మనసు విజయోత్సాహంతో ఉప్పొంగుతోంది. అప్రయత్నంగా తన మీసాలమీద చెయ్యివేసి, "బావా చూసావా కౌరవులు ఎలా నశించారో?" అని అన్నాడు. శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వాడు. అర్జునుడు తన గాండివాన్ని ఒక్కసారి తడుముకున్నాడు. ఒక్కసారి భీష్మ, ద్రోణ, కర్ణాది మహావీరులూ, శత్రువులంతా ఎలా తన అస్త్రశస్త్రాలకి బలైంది తనకళ్ళకు కనపడినది. తను జయించాడు...కర్ణ వధానంతరం ఇక తనని ఎదిరించగలిగిన మేటి విలుకాడే ఈ భూమి మీదే లేకుండాపోయాడు. అన్ని రథాలు రణరంగం మధ్యలో ఉన్న భీష్ముడి అంపశయ్...

శ్రీ వారాహి నవరాత్రి...

శ్రీ వారాహి నవరాత్రి... ఆషాఢమాసం – శ్రీ వారాహి నవరాత్రి మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి…అందుకే ఆవిడను దండనాథ అన్నారు… అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల(నాగలి),ముసల(రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది…ఇది మహావారాహి(బృహద్వారాహి) యొక్క స్వరూపం…ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది. వారాహి అనగా భూదేవి, ధాన్యలక్ష్మి…ఆవిడ తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది…వీటిల్లోని ఆంతర్యం ఏంటంటే…రోకలి ధాన్యం నించి పొట్టు వేరు చేయడానికి వాడుతారు…అలగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది…నాగలిి భూమిని విత్తనం వేసేముందు తయారు చేయడానికి వాడతాం..అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామకర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుంది…. పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే, ఉగ్రం వారాహి…శ్రీ విద్యా గద్యంలో “అహంకార స్వరూప దం...

వివాహవేడుక, పెళ్లి తంతు

ధర్మ సింధు హిందూ సంప్రదాయ వివాహం : వివాహవేడుక, పెళ్లి తంతు 1. కన్యావరణం: 2. పెళ్ళి చూపులు 3. నిశ్చితార్థం: 4. అంకురార్పణం: 5. స్నాతకం: 6. సమావర్తనం: 7. కాశీయాత్ర: 8. మంగళస్నానాలు: 9. ఎదురుకోలు: 10. వరపూజ: 11. గౌరీపూజ: 12. పుణ్యాహవాచనం: 13. విఘ్నేశ్వరపూజ: 14. రక్షా బంధనం: 15. కొత్త జంధ్యం వేయడం: 16. గౌరీ కంకణ దేవతాపూజ: 17. కౌతుక ధారణ: 18. కంకణ ధారణ: 19. మధుపర్కము: 20. వధువును గంపలో తెచ్చుట: 21. తెరచాపు 22. మహా సంకల్పం: 23. కన్యాదానం: 24. వధూవరుల ప్రమాణములు: 25.సుముహూర్తం-జీలకర్ర-బెల్లం: 26. స్వర్ణ జలాభిషేకం: 27. చూర్ణిక: 28. వధూవర సంకల్పం: 29. యోక్త్రధారణం: 30. మాంగల్య పూజ: 31. మాంగల్య ధారణ: 32. అక్షతలు-తలంబ్రాలు: 33. బ్రహ్మముడి: 34. సన్నికల్లు తొక్కడం: 35. కాళ్లు తొక్కించడం: 36. పాణి గ్రహణం: 37. సప్తపది: 38. లాజహోమం: 39. యోక్త్రవిమోచనం: 40. స్థాలీపాకం: 41. ఉంగరాలు తీయడం: 42. బొమ్మని అప్పగింత: 43. నాగవల్లి: 44. ధ్రువనక్షత్రం: 45. అరుంధతి నక్షత్ర దర్శనం: 46. అప్పగింతలు: 47. అత్తమామలకు వధువు పూజ: 48. ఫలప్రదానం: 49. పానుపు: 50. మహదాశీర్వచనం: 51. వధువు గృహప్రవేశం: 52. కంకణ విమోచన: 53. గర్భా...

వధూవరుల ఏక నక్షత్ర ప్రభావాలు

వధూవరుల ఏక నక్షత్ర ప్రభావాలు రోహిణి, ఆరుద్ర, మఘ, హస్త, విశాఖ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రాలు పాద భేదం ఉన్నప్పుడూ వధూవరులకు ఒకే నక్షత్రమైన వివాహం చేయవచ్చును. అశ్వని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, పుబ్బ, ఉత్తర, చిత్త, అనూరాధ, పూర్వాషాడ, ఉత్తరాషాడ నక్షత్రాలు పాద భేదం ఉన్నప్పుడు వధూవరులకు ఒకే నక్షత్రమైన వివాహం చేయటం మధ్యమం. భరణి, ఆశ్లేష, స్వాతి, జ్యేష్ఠ, మూల, ధనిష్ఠ, శతభిషం, పూర్వాభాద్ర నక్షత్రాలు వధూవరులకు ఒకే నక్షత్రమైనప్పుడు వివాహం చేయరాదు. రెండు రాశులలోను ఒకే నక్షత్రం వధూవరులదైనప్పుడు ముందు రాశి పురుషునిది, తరువాతి రాశి స్త్రీది కావటం మంచిది. భిన్న నక్షత్రాలై ఒకే రాశి అయినప్పుడు మొదట పురుష నక్షత్రం, తరువాత స్త్రీ నక్షత్రం కావటం మంచిది. ఒకే రాశి యందు జన్మించినప్పుడు భరణి, కృత్తిక, ధనిష్ఠ, శతభిషం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో జన్మించినప్పుడు వివాహానికి పనికి రాదు. కృత్తిక – ఆశ్లేష; ఆశ్లేష –స్వాతి; చిత్ర – పూర్వాషాడ; అనురాధ –ధనిష్ఠ; ధనిష్ఠ – భరణి; శతభిషం – కృత్తిక నక్షత్రాలలో మొదటిది స్త్రీ నక్షత్రం అయి, రెండవది పురుష నక్షత్రమైన వధూవరులకు వివాహం చేయరాదు. జ్యేష్ఠ – శతభిష నక్షత్...

సీమంతము

3. సీమంతము (సీమంతోన్నయనం) సీమంతస్య - కేశరచనా విశేషస్య, ఉన్నయనం - ఉత్తొలనం ఆత్రేతి - సీమన్తోన్నయనం ఇతి గర్బ సంస్కార భేదః కేశరచనా విశేషముచే  సీమంతము (పాపట తీయుట) సమానముగ నెత్తియెత్తుచు చేయు నొక గర్భ సంస్కారమునకు సీమంతోన్న యనిగాని లేక సీమంతమనిగాని వ్యవహారము. షష్ఠే చతుర్ధేష్టమే ఏతేషా మన్యత మేమాసి సీమంతోన్న యనాఖ్య కర్మకుర్యాత్‌'' అనువిధి ననుసరించి, గర్బము థరించిన దాది, నాలుగవమాసమునగాని, ఆరవమాసమునగాని, అష్టమమాసమునగాని, సీమంతోన్న యనాఖ్య గర్బసంస్కారక కర్మ చేయదగినది. ప్రధమే గర్బే చతుర్ధేమాసి షష్ఠే೭ ష్టమేవా శుభే೭హని దంపతీమంగళస్నాతే భూత్వా. ''జనిష్యమాణ సర్వగర్బాణాంబీజ గర్బసముద్బవైనోని బర్హణ ద్వారా ప్రతిగర్బ సంస్కారాతిశయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, సీమంతోన్నయనం కర్మ కరిష్యేయని సంకల్పింతురు. తోలిగర్బముల, నాలుగు. ఆరు, ఎనిమిది మాసములలో నీ సీమంత మాచరింతురు. ఈసీమంతముచే, గర్బ బీజ దోషశాంతులు గల్గును. అనంతర గర్బములకు నీ సంస్కారబలముచే శుద్ధిగల్గును. పురుష జననమునకు కారణమగును. కాన సూత్రకారులీ సీమంత సంస్కారమునకు ప్రాముఖ్య మొసంగిరి.  ఉ సంస్కారము సహితము తిది వార నక్షత్ర లగ్నములనెరింగి, శుభ...

దోషశేషము ముహూర్తము

దోషశేషము ముహూర్తము  శ్లో:- పూర్వేద్యుశ్చ పరేహని వ్రతదినాత్త స్మాచ్చతుర్థేదినే         నధ్యాయశ్చ రజస్వలా స్వజననీ గర్భాన్వితావాశిశోః         ప్రితోశ్చక్షయవత్సరోయది గురో స్సంథ్యాభిజి త్సద్మవా         బాలోవాయదికర్ణవేథరహితో నైతేషు కార్యం వ్రతమ్ తాత్పర్యము:- ఉపనయన మహూర్తమునకు 4రోజులు వెనుకముందు అనధ్యాయ దినములు కాకూడదు. తల్లి నాందీకర్మమునకు ముందు వెలుపలయుండరాదు. గర్భిణీగా 6మాసము లుండరాదు. తల్లి తండ్రు లిద్దరుగాని యే యొక్కరుగాని మరణించిన సంవత్సరమునకు రవిస్థిత లగ్నమునకు యెనిమిదింట చెవులు కుట్టించరాదు. ఉపనయనము చేయరాదు.   *నక్షత్ర స్వరూపములు*  శ్లో:- జన్మర్ క్షం జననోడుకర్మదశమం సాంఘాతికం షోడశం         వైనాశాఖ్య మథత్రివింశమపిభం తత్పంచవింశం యది         ఋక్షం మానసంజ్ఞికం ద్వినవమం తత్సాముదాయాభిదం         త్యాజం సప్తమభంతు నైధనమిదం సర్వేషుకర్మస్వపి తాత్పర్యము:- నక్షత్రములు కొన్ని గుర్తులు గలవు. కర్మ, సాంఘాతికము, వైనాశము, సాముదాయకము,నైధనమను పేర్లు వాటికున్నవి. జన్మ నక్షత్ర...

విష్ణుమూర్తికి 24 పేర్లు

విష్ణుమూర్తికి 24 పేర్లున్నాయి. వాటిని కేశవనామాలంటారని మనకు తెలుసు. ఇవి 24 మాత్రమే ఎందుకు ఉన్నాయి? వీటికి కాలచక్రానికి, గణితానికి ఏమైనా సంబంధం వున్నదా? ఈ *24 కు గణిత పరమైన భూమిక ఏమిటి*? చూద్దాం. విష్ణుమూర్తిని చతుర్భుజుడు అంటాం. అంటే నాలుగు చేతులు గలవాడని కదా? ఈ నాలుగు చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మాలను ధరించి మనకు దర్శనమిస్తాడు. నిశితంగా పరిశీలిస్తే, ఈ నాలుగు ఆయుధాల యొక్క అమరికలలో వచ్చే మార్పుల వల్ల ఖచ్చితంగా 24 వేరువేరు రూపాలు విష్ణువునకు ఏర్పడతాయి.  ఈ 24 రూపాలనే కేశవనామాలంటారు. *1.కేశవ నామాలలో మొదటి నామం కేశవ.* కేశవ రూపంలో స్వామి కుడివైపు ఉన్న రెండు చేతులతో  *పద్మము, శంఖము* ధరించి ఎడమ వైపు ఉన్న రెండు చేతులతో  *గద, చక్రం*  ధరించి ఉంటాడు.  *2.విష్ణువు యొక్క మరొక నామము మాధవ.* ఈ రూపంలో కుడి వైపు రెండు చేతులతో *గద, చక్రం* ధరించి, ఎడమవైపు ఉన్న రెండు చేతులతో *పద్మము, శంఖము* ధరించి ఉంటాడు. *3.మధుసూధన రూపంలో*  కుడివైపు చేతులతో *చక్రం, శంఖము*  మరియు ఎడమవైపు చేతులతో *గద, పద్మము* ధరించి ఉంటాడు. *ఈవిధంగా ప్రతి పదిహేను రోజులకు*(పక్షానికొకసారి)  *పౌర్ణమికి, అ...

గ్రహస్తితి జ్యోతిష్య శాస్త్రం

ఏ గ్రహస్తితి జ్యోతిష్య శాస్త్రం నేర్చుకునే వారికి, నేర్చుకున్నవారికి, నేర్చుకోవాలి అనికుంటున్న వారికి ఉంటుంది? బుధ, గురులు బలంగా ఉండాలి... బుధ, గురు, శుక్రు లలో ఆధిపత్య శుభులు అయిన వారు కేంద్ర కోణాల్లో ఉండాలి. దశమాధిపతి శుభగ్రహమై కేంద్ర కోణాల్లో, లగ్నాధిపతి తో కలిసి ఉండాలి. రాశి నవాంశ లలో ఆధిపత్య శుభులు  (బు, గు,శు, చ) బలంగా ఉండాలి... ... జ్యోతిష్కుడికి కి ముఖ్యమైన కాంబినేషన్స్ మామూలుగా ఫిఫ్త్ లార్డ్ ఫిఫ్త్ హౌస్ పాయింట్ నెంబర్ వన్.  శని అకల్ట్ సైన్స్ అంటే జ్యోతిషం, హస్త రేఖలు . ఫిఫ్త్ లార్డ్ రవి సైన్సు. శని పౌరాణికం. జ్యోతిషం పౌరాణికం రవి శనికి కనెక్షన్ రావాలి. నేర్చుకోవాలంటే 4, 8 లేదా 9, 8 ఒక లింకు కావాలి. 8 హౌస్ అకల్టు సైన్స్. 5వ స్థానం అనేది మిస్టికల్. ఫోర్త్ కంటే నైన్ తో చాలా మంచిది. జాతకం వివరించాలంటే బుధ కుజ ఏ రాశి అయిన పర్వాలేదు. వీళ్ళిద్దరికీ ఒక లింకు కావాలి కుజుడు బుధుడు పరివర్తన లో గాని లింక్ ట్రైన్ అయినా కానీ లేదా రాహుకేతువులు ద్వారా ఒక లింకు కావాలి. తొమ్మిదవ స్థానానికి బుదుడు గాని గురువు గాని కనెక్షన్ ఉండాలి. రెండవ హౌస్ కు గురు కనెక్షన్ ఉంటే బ్రాహ్మణుడు కదా న...

చంద్రబలము – వృద్దిక్షయములు.

5. చంద్రబలము – వృద్దిక్షయములు.   శ్లో:- అష్టమ్యోరుభయోశ్చ మధ్యమగతశ్శుక్లాన్యయోర్వ్యత్యయే         పూర్ణః క్షీణ ఇతిక్రమాచ్ఛశథరః పూర్ణశ్శుభేమంగళే         కృష్ణాదౌదినపంచకం శుభకరం తన్మథ్యమం మధ్యమం         తస్యాంత్యం త్వధామాభిథం శశివశాచ్ఛుక్లేతు తద్వ్యత్యయమ్ తాత్పర్యము:- శుక్లపక్ష మందలి అష్టమి తిథి నుండి బహుళ పక్షమందలి అష్టమి తిథి వరకూ గల్గు చంద్రుని పూర్ణ చంద్రునిగా చెప్పుదురు. తక్కిన పదిహేను దినములులో వచ్చు చంద్రుడు క్షీణ చంద్రునిగా తెలుసుకొనవలెను. విపులముగా చెప్పవలెనన్నచో అమావాస్య మొదలిడి శుక్లపక్షములోని పంచమీతిథివరకూ క్షీణచంద్రుడు. శుక్లపక్ష షష్ఠితిథి నుండి దశమి నాటి వరకూ పూర్ణ చంద్రుడు. ఏకాదశి నుండి పౌర్ణమి వరకు పూర్ణ చంద్రుడు. పౌర్ణమి మొదలుకొని కృష్ణపక్ష పంచమి వరకూ పూర్ణ చంద్రుడు. కృష్ణపక్ష షష్ఠి నుండి దశమి వరకు మధ్యముడు. ఏకాదశి నుండి అమావాస్య వరకూ క్షీణుడు. క్షీణ చంద్రుడు క్షీణ ఫలమునూ మధ్యమ చంద్రుడు మధ్యమ ఫలమునూ పూర్ణ చంద్రుడు పూర్ణ ఫలమునూ అతి పూర్ణచంద్రుడు అతిమిక్కిలి శుభ ఫలములనూ ఇచ్చునని తెలుసుకొనవలెను.  6. ప్రథ...

ద్వార లక్ష్మీ పూజ (గడప పూజ).

ద్వార లక్ష్మీ పూజ (గడప పూజ)..........!! ఒక కుటుంబం క్షేమంగా ఉండటానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఒకటి ఇలవేలుపిని కొలుచుకోవడం, రెండు ఇంటి గడపకు పూజ చేయడం... ఇంటి గడపను సింహద్వారమని, లక్ష్మీ ద్వారమని, ద్వార లక్ష్మి అని కూడా అంటారు.. ఈ గడపకు, ఎర్రమన్ను, పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టడం వరకు చాలా మందికి తెలిసినదే‌. ఎందుకు చేయాలో తెలియక పోయినా పెద్దవారి నుండి సంప్రదాయంగా ఆచరిస్తున్నారు. గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖసంతోషాలకు దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం. ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని హెచ్చరించడం.. ఇప్పుడు ఈ గడప పూజతో కొన్ని సమస్యలకు పరిస్కారం తెలుసుకుందాం.. పెళ్లి కాని అమ్మాయిలు, ఎన్ని సంబంధాలు చూసిన కుదరక, జాతకం దగ్గర, కానుకల విషయంలోనో ఎదో ఒక ఆటంకంతో ఆలస్యం అవుతున్న అమ్మాయిలు.. 16 రోజులు ఈ గడపకు పూజ చేయాలి.. పూజ విధానం : 1. ఉదయం 3 గంటలకు ఈ పూజ చేయాలి 16 రోజులు పాటు ఆటంకం లేకుండా ఇదే సమయంలో చేయాలి. 2. మొదట గడపను నీటితో మూడు సార్లు కడగాలి, తర్వాత పాలుపోసి కడగాలి. అంటే అభిషేకం చేసే విధంగా కొద్ది కొద్దిగా పాలు పోస...

మొట్టమొదట భూమి గుండ్రంగా ఉన్నదని మొట్టమొదట చెప్పినది ఎవరు..?

మొట్టమొదట భూమి గుండ్రంగా ఉన్నదని మొట్టమొదట చెప్పినది ఎవరు..? మనం చదువుకున్న చరిత్ర ప్రకారం 16,17 శతాబ్దాలకు చెందిన కెప్లర్, కోపర్నికస్, గెలీలియోలని. కాని ఋగ్వేదం లోని క్రింది మంత్రం గమనించండి. 'చక్రాణాసః పరీణహం పృథివ్యా...."అర్థం " అంటే భూమి యొక్క వృత్తపు అంచున ఉన్నవారు..." అతిప్రాచీన గ్రంథం అయిన " సూర్యసిద్దాంతం " 12వ అధ్యాయం, 32వ శ్లోకంలో "మధ్యే సమంతాదణ్ణస్య భూగోళో వ్యోమ్ని తిష్టతి" "బ్రహ్మాండం మద్యలో భూగోళం ఆకాశంలో నిలిచిఉంది"... అని దాని ఆర్యభట్టు రచించిన "ఆర్యభట్టీయం" గ్రంథంలోని గోళపాద అధ్యాయంలో 6వ శ్లోకం ' భూగోళః సర్వతో వృత్తః" ..అంటే భూమి వృతాకారంలో ఉన్నదని అర్థం. క్రీ.శ. 505 లో వరాహమిహిరుడు పంచ మహాభూతమయస్తారా గణ పంజరే మహీ గోళః.. (13-1)" అంటే .... పంచ భూతాత్మకమైన గుండ్రని భూమి, పంజరం లో వేలాడే ఇనుప బంతిలా, ఖగోళంలో తారల మధ్య నిలిచిఉంది" అన్నాడు. " లీలావతి " గ్రంథం లో భాస్కరాచార్యుడు. " నీవు చూసేదంతా నిజం కాదు. ఎందుకంటే నీవు ఒక పెద్ద వృత్తం గీసి అందులో నాల్గవ భాగం చూస్తే అది మనకు ఒక సరళరేఖ...

33 కోట్ల దేవతలు ఎవరు?

33 కోట్ల దేవతలు ఎవరు? వేదపురాణములు తెలుపునట్టి త్రయత్రింశతి కోటి (33కోటి) దేవతలు మరియు వారి పేర్లు మరియు హిందూ ధార్మిక సాహిత్య మందు ఉల్లేఖించబడిన 33కోటి దేవతలు ఎవరు వారి పేర్లు ఏమి అని తెలుసా? హిందూ ధర్మ - సంస్క్రృతియందు 33కోటి దేవతల ఉల్లేఖన ఉంది. వాస్తవముగా ఈ 'కోటి' సంఖ్యను సూచించే కోటి కాదు.  సంస్క్రృతములో 'కోటి' అనగా 'విధము' 'వర్గము' (type) అని అర్ధమూ ఉంది. ఉదా: ఉచ్చకోటి. దీని అర్థం ఉచ్ఛమైన వర్గమునకు చేరిన వారు అని అర్థం.  అలాగే మరియు ఉదాహరణము: సప్త కోటి బుద్దులు. దీని అర్థం ఏడు ప్రధాన బుద్దులు. ... యజుర్వేద, అథర్వణ వేద, శతపథ బ్రాహ్మణులు మొదలైన ప్రాచీన కృతులందు 33 విధముల దేవతలను ఉల్లేఖించారు. వీరే కోటి (33కోటి దేవతలు. త్రయత్రింశతి హిందూ గ్రంధములేకాదు బౌద్ధ, పార్శీ మొదలైనవి కూడ 33 దేవవర్గముల గురించి తెలుపుతాయి. బౌద్ధుల దివ్యవాదము మరియు సువర్ణప్రభాస సూత్రములందు వీటి ఉల్లేఖన ఉన్నది. ఇపుడు దేవతల ఈ 33వర్గములనూ, అందులో వచ్చు దేవతల పేర్లనూ చూద్దాము: 12 ఆదిత్యులు (ద్వాదశాదిత్యులు) : 1. త్వష్ట, 2. పూష. 3. వివస్వాన్ 4. మిత్ర 5. ధాతా 6. విష్ణు 7. భగ. 8. వరుణ 9. ...

ఋగ్వేదం విజ్ఞానం

ఋగ్వేదం విజ్ఞానం ఋగ్వేదంలోని ప్రథమ మండలంలోని అశ్వినీసూక్తంలో అశ్వినీ దేవతలు చేసిన చికిత్సలు వర్ణించబడ్డాయి...  ఖేలుడు అనే రాజు భార్య, యుద్ధంలో రెండు కాళ్ళు కోల్పోగా అగస్త్యముని సలహాతో వారు అశ్వినీ దేవతలను స్తుతిచేయగా వారు ఆమెకు ఇనుప కాళ్ళను అమర్చినట్లు వర్ణించబడింది.  దధీచి మహర్షికి ఇంద్రునిచే ఉపదేశింపబడిన మంత్రాన్ని తెలుసుకోవడానికి అశ్వినీ దేవతలు ఆయనకు ముందుగా తల తీసి జంతువు తలను అతికించి అతని నుండి 'ప్రవర్ణ' అనే మంత్రాన్ని గ్రహించగానే ఇంద్రుడు దధీచి ముని తల నరకగానే అశ్వినీ దేవతలు వెంటనే దధీచి ముని తలను తిరిగి అతికించినట్లు వర్ణించబడింది.  ఇలాంటి అతిసూక్ష్మాతి సూక్ష్మమైన శస్త్ర చికిత్సలు ఋగ్వేదంలో వర్ణించబడ్డాయి. ఋగ్వేదంలో అగ్నిసూక్తంలో విద్యుత్‌ను పోలిన వర్ణన ఉంది. శుదర్ణలో శబ్ద ప్రయోగం ద్వారా ధ్వని తరంగాల ప్రసారం గురించి వర్ణించబడింది.  ఋగ్వేదంలో శ్రుధి శ్రుత్కర్ణ వహ్నిభిఃలో సంకేత పదరూపంలో నేటి టెలిఫోను ఆధారిత వర్ణన ఉంది.  మేఘాలు రూపాన్ని సంతరించుకోవడం, వర్షించడం లాంటి వృష్టి సంబంధిత జ్ఞానం ఋగ్వేదంలో ఉంది.  క ఇమంవో నిణ్యమా చికేత, గర్భో యో అపాం గర్బో వనా...

నక్షత్రములకు క్షిప్రమృద్వాది సంజ్ఞలు

3. నక్షత్రములకు క్షిప్రమృద్వాది సంజ్ఞలు:  శ్లో:- క్షిప్రందస్రరవీజ్య మాసురశివజ్యేష్టో: రగందారుణం              చిత్రాం త్యేందుభమైత్రభం మృదుభవేద్ర్బ్రాహ్మ్యోత్తరాభం స్థిరమ్                    ఉగ్రంకాలమఖాత్రి పూర్వమనలేంద్రాగ్నీతు సాధారణం              స్వాత్యాదిత్యహరిత్రయం చరమిదందద్యాత్స్వ సంజ్ఞాఫలమ్ తాత్పర్యము:- నక్షత్రముల ద్వారమున కలుగు ఫలములను బట్టి వాటిని ఆరు వర్గములుగా విభజించి ఉన్నారు. అందులో   అశ్వని హస్త పుష్యమి అను మూడు నక్షత్రములునూ అత్యంత శ్రీఘ్రముగా ఫలములొన గూర్చునవగుటచే వీనిని క్షిప్రతారలు అని అందురు.   అతి సున్నితములుగా ఫలించు తారలను మృదుతార లందురు. చిత్తా రేవతి మృగశిర అనురాధ యను ఈ నాలుగు తారలును మృదుతారలు.  రోహిణి ఉత్తర ఉత్తరాషాడ ఉత్తరాభాద్ర అను నాలుగు తారలును స్థిరనక్షత్రములు. ఇవి సుస్థిరములగు ఫలముల నిచ్చును.   భరణీ మఖ పూర్వఫల్గుణి పూర్వాషాడ పూర్వాభాద్ర 5ను ఉగ్రతారలు ఉగ్రఫలముల నోసంగును.  కృతిక విశాఖ ఈ...

శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చిన చివ్వరి సందేశం...*

*ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసిపోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు*  *శ్రీ కృష్ణుడు బలరాముడితో “అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచి పెట్టెయ్యండి” అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు.* *ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు.* *ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి “కృష్ణా! మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేక పోతున్నాను. నిన్ను విడిచి నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరమూ నీతో ఉండేటట్లు నాకేదయినా ఉపదేశం చెయ్యి” అన్నాడు.* *అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమయిన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేశాడు.* *ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం.* *దీని తర్వాత కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పాడు.* *“ఉద్ధవా! నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుం...

కార్తెల పరిజ్ఞానం..*

*కార్తెల పరిజ్ఞానం..* ఉపగ్రహ సమాచారం అందుబాటులో లేని కాలంలోనే నిత్యపరిశీలనతో వాతావరణాన్ని అంచనావేస్తూ వ్యవసాయం చేశారు రైతులు. ఏడాది 27 నక్షత్రాలను 27 కార్తెలుగా (ఒక కార్తె సుమారు 14రోజులు ఉంటుంది) విభజించి ఆయా కార్తెల్లో వాతావరణం తీరు, దానికనుగుణంగా చేయాల్సిన, చేయకూడని పనులను సామెతలుగా చెప్పారు. ఈ కార్తెలలోని వర్షపాతాన్ని బట్టి ఆ ఏడు అతివృష్టా, అనావృష్టా లేక సామాన్యమా చెప్పగలిగేవారు.  తొలకరి వానలు ఆషాఢంలో మృగశిరకార్తె (సుమారు జూన్‌ 8- 21)లో ప్రవేశిస్తాయి. *‘మృగశిర కురిస్తే ముంగిళ్లు చల్లబడతాయి,* *మృగశిర చిందిస్తే మిగిలిన కార్తులు కురుస్తాయి,* *మృగశిర వర్షిస్తే మఖ గర్జిస్తుంది, మృగశిరలో తొలకరి వర్షిస్తేనే మఖలో వర్షాలు పడతాయి,* *మృగశిర చిందిస్తే ముసలెద్దు రంకె వేస్తుంది,* *మృగశిరలో వేసిన పైరు మేలు చేస్తుంది’* తదితర సామెతలు సేద్యంలో మృగశిర ప్రాధాన్యాన్ని చెబుతాయి.        ఆరుద్ర (జూన్‌ 22- జూలై 5) కార్తెలో వర్షాలు ఎక్కువ పడడం పంటకు చాలా అవసరం. ఆ అవసరాన్ని తెలిపేవే *‘ఆరుద్ర వాన అదను వాన,* *ఆరుద్ర కురిస్తే దారిద్య్రం ఉండదు,* *ఆరుద్రకార్తె విత్తనానికి- అన్నం పెట్టిన ఇ...

ఆయుష్మాన్‌ భవ

💐ఆయుష్మాన్‌ భవ💐    *పెద్దలు వస్తుండగా లేచి వెళ్ళి నమస్కరించడం మంచి సంప్రదాయం. దాన్ని అభ్యుత్థానమని, అభివాదనమని అంటారు. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు సిద్ధిస్తాయని స్మృతులు చెబుతున్నాయి. నమస్కారాల్లో సాష్టాంగ ప్రణామం ఉత్తమం. దానికే ప్రణతి అని పేరు. అంటే గొప్పదైన నమస్కారమని అర్థం. సంప్రదాయం తెలిసిన పెద్దలకు నమస్కరించినప్పుడు ‘ఆయుష్మాన్‌ భవ’ అని దీవిస్తారు. చాలాసార్లు ఆ మాట విని ఉండటంవల్ల వారేదో అలవాటుగా ఆశీర్వదించారని మనం అనుకొంటాం. నిజానికది అద్భుతమైన ఆకాంక్ష. చాలా విలువైన దీవెన. ఆ ఆశీస్సులో రెండు గొప్ప పదాలున్నాయి. వాటిలో ఆయుష్మాన్‌ అనేది యోగాల్లో మూడోది. భవ అనేది కరణాల్లో మొదటిది. మన అందరికీ పంచాంగం ద్వారా ఎన్నో విశేషాలు తెలుస్తున్నా- తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదూ దానిలో ప్రధానమైన అంగాలు. అవి వరసగా శ్రేయస్సు, ఆయువు, పాపవిముక్తి, రోగ నివారణ, కార్యసిద్ధికి సంబంధించినవి. ఆ అయిదింటి శుభ అశుభ ఫలితాలను పంచాగం వెల్లడిస్తుంది. నిత్యం పూజావిధిలో ఆ అయిదు అంగాలనూ సంకల్పంలో చెబుతారు. తెలుగువారి పంచాంగాలకు చాంద్రమానం ఆధారం. చంద్రుడి నడకనే చాంద్రమానం అంటారు. భూమి చుట్టూ తిరిగే చ...

పంచరత్న స్తోత్రం

*శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రం* *౧. ప్రాతస్స్మరామి పరమేశ్వర వక్త్రపద్మం ఫాలాక్షి కీల పరిశోషిత పంచబాణమ్|* *భస్మ త్రిపుండ్ర రచితం ఫణికుండ లాఢ్యం కుందేందు చందన సుధారస మందహాసమ్ ||* *౨. ప్రాతర్భజామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగ శూల హరిణాః పినాకయుక్తాన్|* *గౌరీ కపోల కుచరంజిత పత్రరేఖాన్ సౌవర్ణ కంకణ మణిద్యుతి భాసమానామ్ ||* *౩. ప్రాతర్నమామి పరమేశ్వర పాదపద్మం పద్మోద్భవామర మునీంద్ర మనోనివాసమ్|* *పద్మాక్షనేత్ర సరసీరుహ పూజనీయం పద్మాంకుశ ధ్వజ సరోరుహ లాంఛనాఢ్యమ్ ||* *౪. ప్రాతస్స్మరామి పరమేశ్వర పుణ్యమూర్తిం కర్పూర కుంద ధవళం గజచర్మ చేలమ్|* *గంగాధరం ఘనకపర్ది విభాసమానం కాత్యాయనీ తను విభూషిత వామభాగమ్ ||* *౫. ప్రాతస్స్మరామి పరమేశ్వర పుణ్యనామ శ్రేయఃప్రదం సకల దుఃఖ వినాశ హేతుమ్|* *సంసారతాపశమనం కలికల్మషఘ్నం గో కోటిదాన ఫలదం స్మరణేన పుంసామ్ ఓం ||* 🕉🕉🕉🕉🕉🕉

యోగవాశిష్ట సారము

శ్రీరామ        (మనోవ్యధలే వ్యాధులుగా పరిణమిస్తాయి) శ్లో// యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ / విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే// (ఎవరిని స్మరించినంత మాత్రాన మనము జన్మ, జరా, విపత్తి, మరణములనే సంసార బంధముల నుండి విముక్తుల మవుతామో, సర్వ సమర్ధుడైన ఆ మహావిష్ణువునకు నమస్కారము).                           -------------------- ప్రస్తుత జీవన విధానం చాలా కృత్రిమంగానూ, యాంత్రికంగానూ ఉంటున్నది. కష్ట,సుఖాలు పంచుకోవడానికి, మనస్సు విప్పి మాట్లాడటానికి ప్రతి వ్యక్తికీ ఆత్మీయులనే వారే కరువయ్యారు. "చిక్కడు, దొరకడు" అన్నట్లు ఉంటున్నాయి మన సంభాషణలు.  "స్వార్థం" రాజ్యమేలుతోంది. అందరూ ఏదో గుట్టుగా కాలక్షేపం చేస్తున్నారు.   తీవ్రమైన మనో వ్యధలను ఆత్మీయులతో పంచుకోక పోతే గొప్ప అనర్ధం సంభవిస్తుందన్న విషయం చాలామందికి తెలియదు. మనోవ్యధలు క్రమ క్రమంగా తీవ్రమైన వ్యాధులుగా పరిణమిస్తాయి. ఆత్మీయుల మరణం, అవమానాలు, దారిద్ర్యం మొదలైనవి మనోవ్యధలకు కారణం. ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నవారిని బంధు, మితృలు ఓదార్చి, ...

నూరేళ్లూ బతకాలి

*‘జీవేమ శరదశ్శతమ్‌’* (నూరేళ్లూ బతకాలి), *'నందామ శరదశ్శతమ్‌’* (నూరేళ్లూ ఆనందించాలి), *‘అజీతాః స్యామ శరదశ్శతమ్‌’* (నూరేళ్లూ విజయాలను సాధిస్తూనే ఉండాలి) అనే వేదవాక్కులు మనిషిలోని ఆశావాదానికి అనువాదాలైన రుక్కులే! గతించిన బాల్యం, గడచిన కౌమారం, ఆనందవాహినిలో తేలిపోయిన యౌవనం... ఎవరికైనా తీపి గుర్తులుగా మిగిలిపోతాయి. సుదూర గతం, సమీప గతం అన్న తేడా లేకుండా అన్నింటినీ కాలం క్రమంగా సౌధంలా పేర్చి సుందర భవనంలా నిలుపుతుంది. గతం కొందరికి మృతం అయితే మరికొందరికి అమృతం అవుతుంది. మేధకు అందినంత దూరం గతాన్ని మనిషి గుర్తుచేసుకుంటాడు. స్ఫూర్తిగా రాసుకుంటాడు. అరచేతిలో ఉన్న అక్షయపాత్ర వర్తమానం. అందులోనుంచి ఎంతైనా అమృతాన్ని తోడుకోవచ్చు. మనిషి కృషికి, సంకల్పశక్తికి పరీక్ష పెడుతుంది వర్తమానం. తలుపు తట్టే లక్ష్మీదేవిని తలుపు తెరిచి ఇంటిలోకి ఆహ్వానిస్తే ఎంతటి సిరి సొంతమవుతుందో అంతటి లాభాన్ని అందించేది వర్త మానం. వర్తమానాన్ని గుర్తించకపోతే భవిష్యత్తు శూన్యం. నేడు నాటిన విత్తనమే కదా రేపటి రోజున కొమ్మగా విస్తరించి- రెమ్మలు తొడిగి పూలు, కాయలు, పండ్లను ప్రసాదించేది. అందుకే వర్తమానం నిత్యం ఒక కొత్త విత్తును నాటమని బోధి...

మృదంగ శైలేశ్వరి ఆలయం బాధల పాలైన దొంగలు

Image
కేరళ లోని ఈ ఆలయంలో విగ్రహాన్ని దొంగతనం చేసిన ప్రతిసారి ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్లలేక దొంగలు మళ్ళీ వదిలి వెళ్ళటం ఇలా 3సార్లు జరిగింది... "మృదంగ శైలేశ్వరి ఆలయం"  అనేది దక్షిణ కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లా, ముజక్కున్ను వద్ద ఉన్న ఒక పురాతన దేవాలయం. ఋషి పరశురామునిచే స్థాపించబడిన 108 దేవాలయాలలో ఇది ఒకటిగా చెప్పబడుతోంది. కేరళ శాస్త్రీయ నృత్యం "కథాకళి" ఇక్కడే ఉద్భవించింది. దీనిని జ్ఞానానికి సంబంధించిన ఒక తాంత్రిక శక్తి పీఠంగా చెప్తారు. ఇక్కడ ప్రధాన దేవి దుర్గను "మిఝావిల్ భగవతి"  అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి "మృదంగ శైలేశ్వరి" అని పేరు రావడం వెనుక ఒక కథ ఉంది.  ఈ ప్రదేశంలో మృదంగ ఆకారంలో ఉన్న ఒక శిల స్వర్గం నుండి పడిపోయింది అని చెప్తారు. ఇక్కడే శక్తి లేదా దేవి యొక్క ఉనికిని కనుగొన్న పరశురాముడు ఆమెను విగ్రహం లోకి ఆహ్వానించి ఆమె కోసం ఆలయాన్ని స్థాపించాడు అని స్థలపురాణం.   ఈ ఆలయంలో కొద్ది దశాబ్దాలుగా జరుగుతున్న అద్భుతం ఏమిటంటే, నాలుగుసార్లు, దొంగలు ఈ ఆలయ విగ్రహాన్ని దొంగిలించారు, కానీ వారు దానితో ఎక్కువ దూరం వెళ్ళలేకపోవడంతో దానిని వెనక్కి తి...

ఎవరితో వివాదపడరాదు

శ్లో!!ఋత్వి క్పురోహితాచార్యై ర్మాతు లాతిథి సంస్థితైః! బాల వృద్ధాతురై ర్వైద్యైః జ్ఞాతిసంబంధి బాంధవైః!! మాతాపితృభ్యాం జామాభిర్భ్రాత్రా పుత్రేణ భార్యయా! దుహిత్రా దాసవర్గేణ వివాదం న  సమాచరేత్!! తా!! ఎవరితోనూ వివాదపడరాదు. కానీ ముఖ్యముగా వివాదకారణ మున్నను ఈ క్రిందివారితో వివాదము పెట్టకొనరాదు. ఋత్విక్కు, పురోహితుడు, ఆచార్యుడు, మేనమామ, ఇంటికి వచ్చిన అతిథి, బాలుడు, వృద్ధుడు, రోగి, వైద్యుడు, జ్ఞాతి, వియ్యంకుడు, బంధువు, తల్లిదండ్రులు, అక్కచెల్లెల్లు, అన్నదమ్ములు, పుత్రుడు, కుమార్తే, భార్య, సేవకుడు.🙏